మంచమ్మాయ్ నోట్లో విశ్వరూప దర్శనం

విషయం: మంచమ్మాయితో మోహనమురళి గారి ఇంటర్వ్యూ (టోరీ ఛానెల్ లో)

మంచమ్మాయి – ఇంటర్వ్యూ చేసే మనిషిగానైనా, చేయబడే మనిషిగానైనా, తనకు తానే సాటి అని నిరూపించుకున్న దృష్టాంతాలు ఒకట్రెండు ఉన్నాయి. మంచమ్మాయి అభిమానులు మిస్సవ్వకుండా చూడాల్సినవి. అందులో ఇదొకటి. కొత్త అభిమానిని కనుక, ఇప్పుడు చూస్తున్నా కానీ, ఈసరికి అందరూ వీటి గురించి తెలుసుకునే ఉంటారు.

మొదట మోహన మురళి గారితో షో లో కొన్ని నవరసగుళికలు:
౧) సాధారణంగా, ఫలనా సినిమా ఫలానా ఆయన తీశాడు అంటే, ఆ ఫలానా ఆయన దర్శకుడో, నిర్మాతో అయ్యి ఉంటాడు. ఉదాహరణకి, బద్రీనాథ్ (సందర్భాన్ని బట్టి) అల్లు అరవింద్ తీశాడని కానీ, వినాయక్ తీశాడని కానీ అంటాము కానీ, చిన్నికృష్ణ తీశాడు అని మనం‌ ఎవ్వరం అనం. కానీ, ఈ టాక్ షోలో, మోహనమురళి గారు “జంధ్యాల ఆదిత్య ౩౬౯ ఫలానా బ్యాక్ టు ది ఫ్యూచర్ ఆధారంగా తీశాడు” అనడమూ, మంచమ్మాయి షరా మామూలుగా జంధ్యాల అంకుల్ అందో లేదో గుర్తు లేదు కానీ, జంధ్యాల తీశారు అనే కంటిన్యూ కావడం చూసి, “ఔరా! కథకు పట్టం కట్టడం అంటే ఏమిటో అనుకున్నాను. ఈ స్థాయిలో కడుతున్నారా!” అనేసి ముక్కున వేలేసుకున్నాను.
-ఈ కొత్త భాష్యం చెబుతున్నప్పుడు వారు గీతాకారులు, నేను అర్జునుడినీ అయినట్లు చిత్త భ్రాంతి కలిగింది.

౨) మంచమ్మాయి పైరసీ గురించి మాట్లాడుతూ – “డ్రగ్స్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి అందరూ తీసుకోరు కదా…….. I don’t think piracy is any different” అంటుంది.
-ఇక్కడే తను ఓ స్థాయికి ఎదిగిపోవడం మొదలైంది. నేను బలి చక్రవర్తినై, తను వామనుడిగా ఎదగడం కనిపించింది నాకు. అలా, వామనావతార సందర్శనం అయ్యింది.

౩) “మెరిల్ స్టీప్ ఒకసారి ఇలా అన్నారు… I don’t know if you know her.. She is a…”
“ఆ తెల్సు తెల్సు..ఐ నో ది హోల్ ఆఫ్ హాలీవుడ్”
-ఆ సంభాషణలో ఏకకాలంలో నేనే కృష్ణున్నీ, యశోదనీ అయ్యాను… ఆ… అంటూ తెరిచిన నా నోటిని అద్దంలో నేనే చూడబోయి.

౪) మంచమ్మాయ్ తన చిన్నతనపు ఆలోచనల గురించి చెబుతూ… “నాకే ఎందుకు ఇవన్నీ ఉండాలి? అందరికీ ఎందుకు లేవు?” ఎందుకు కొంతమంది కష్టాలు పడతారు… వగైరా ఆలోచనలు తనని వేధించాయి అన్నప్పుడు – నాకు మరో బుద్ధావతారం ఇన్ మేకింగ్ అనిపించింది.

౫) మంచమ్మాయ్ మురళిగారి షోలో యాస గురించీ, సెల్ఫ్ డబ్బా గురించీ‌(అన్నట్లు, ఇక్కడ కూడా ఎవరో నాలా ఆలోచించి ఆవు కథ ఉపమానం వాడారు!) ఎవరో అడిగితే, ఇచ్చిన జవాబుంది చూశారూ…అది భగవద్గీతలో అర్జునుడికి కనబడ్డ విరాట్ స్వరూపం. శ్రవణానికి రెండు చెవులు చాలవు. కళ్ళు కూడా చెవులైపోయి వినాల్సి వచ్చింది. ఇదొక్కటి చాలు మంచమ్మాయికి అభిమానులు కాని వారి జన్మ ఎంత వృథానో చెప్పేందుకు.

-ఇలా నాకు మంచమ్మాయ్ వాక్కుల ద్వారా, మోహనమురళి గారి సహకారంతో, నాకు విశ్వరూప దర్శనం అయ్యిందన్నమాట. తక్కిన అవతారాలు ఆర్కే గారి సంభాషణలో కనిపిస్తాయి కాబోలు… మనుషుల్లో దేవుళ్ళు ఉంటారంటే ఏంటో‌ అనుకునేదాన్ని. ఇదేనన్నమాట.

తెలుగుని తెలుగులా, ఇంగ్లీషుని ఎవరితో మాట్లాడ్తున్నాం అనే దాన్ని బట్టి సహజంగానే అమెరికన్ యాస-యాస లేని మామూలు ఇంగ్లీషులా మాట్లాడే వాళ్ళని చూసాను. లేదంటే, తెలుగు తెలుగులా, ఇంగ్లీషు అమెరికన్ ఇంగ్లీషులా మాట్లాడేవాళ్ళని చూశాను. అమెరికన్ యాసలో తెలుగు మాట్లాడే వాళ్ళని చూశాను. కానీ, అమెరికన్ యాసలో తెలుగు యాస మాట్లాడేవాళ్ళని మాత్రం ఒకే ఒక్కసారి చూశాను. అది ఎక్కడో మీకు తెలుసు అని నాకు తెలుసు. అన్నట్లు, మంచమ్మాయ్ యాస గురించి పరిశోధన చేస్తూ, రెండు యాసల్తో మాట్లాడే మనుషుల గురించి చదివాను ఇక్కడ. అంతా చదివాక, మంచమ్మాయ్ ది ఒక ప్రత్యేకమైన రెండు యాసల ధోరణనీ, దాని మూలాలు శోధించడం దండుగనీ, ఎందుకంటే, ప్రపంచంలో వేరెవరూ అలాంటి వారు ఉండరనీ అర్థమైంది. (Can you be bi-accented? అన్న చర్చ ఇక్కడ చూడవచ్చు, ఆసక్తి ఉంటే.)
– మంచమ్మాయ్ మీద బోలెడంత గౌరవం పెరిగిపోయింది ఇది చదివాక…ప్రపంచంలో ఇంత యునీక్ యాస మరెవ్వరికీ లేదని తనకి తెలిసినా కూడా, నేలకి, భూమికి అంటుకుని, కరుచుకుని ఉంటోందని!

మంచమ్మాయి వెబ్సైటు లో అబౌట్ పేజీ ఇలా మొదలవుతుంది: “LAKSHMI MANCHU. One of India and Americas most striking leading ladies,…” నిజమే కాబోలనిపిస్తోంది …రెండో‌ సైకిక్ వైబ్రేషన్ పుట్టేసినట్లు ఉంది నాకు!!!! “Having a second child is a sign of bad memory” అని ఈ మధ్య ఒక స్నేహితుడు అన్నాడు. కానీ, రెండో సైకిక్ వైబ్రేషన్, మూడో సైకిక్ వైబ్రేషన్ కి సూచన కాబోలు…అని నాకనిపిస్తోంది ఇప్పుడు.

కాసేపట్లో చూడబోయేది: ఆర్కేతో మంచమ్మాయ్.

Advertisements
Published in: on July 31, 2011 at 3:34 pm  Comments (6)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/31/manchammai-doubled-love/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. mamchi mature to vraasina vimarsa chaala bagumdi

 2. మంచమ్మాయ్ మీద కత్తిగాని కట్టితిరా ఏమి??? :))))))

 3. @indu: అంతేనండీ…నిష్కల్మషమైన అభిమానానికి రోజులు కావు. ఇలాగే అంటారు గట్టిగా పొగిడితే!

 4. మంచమ్మాయి విశ్వరూపం ఏమో గానీ సౌమ్య గారూ మీరు మాత్రం తన మీద పోస్టుల్లో మీ విశ్వరూపం చూపిస్తున్నారు 🙂 అన్నట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ RK Open Heart with Manchu Lakshmi Prasanna లో లక్ష్మీ ప్రసన్న తో ఒక రేంజ్ లో ఆటాడుకున్నాడు. మొదటి లింక్ ఇస్తున్నాను మిగిలిన లింకులు యూ ట్యూబ్ లో ఫాలో అయిపోండి http://youtu.be/1uDEWqnWgGQ

 5. సౌమ్యా ఎందుకమ్మా మేము ఆ ప్రోగ్లాములు చూడకుండా తప్పించుకుంటుంటే నువ్వు ఇలా రోజు రాసి మమ్మల్ని వేధిస్తున్నావు.

 6. LAKSHMI MANCHU. One of India and Americas most striking leading ladies,…. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ 😉
  సూపరండీ.. హిహిహిహి 😉
  ఛాలా భాగా ఱాశాఱు.. షౌమ్య ఘారూ..
  ప్రీఈఈమ తో మీ లాక్ స్మీ దురాభిమాని.. 😉 😉


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: