మంచమ్మాయ్ నాచేత వంట చేయించిన విధానం…

అబ్బే, టైటిల్ కీ, టపాకి ఉండే సంబంధం లవలేశమాత్రమే… లక్సమ్మ చెప్పే మాటల మధ్య ఉన్న సంబంధాల లాగే. సాధారణంగా నేను ఈ దేశం వచ్చాక వంట చేయడం చాలా తక్కువ.‌ ఏదో బ్రెడ్డు, పెరుగు, ఫ్రూట్సు ఇలాంటివి తింటూ‌ గడిపేస్తూ ఉంటా, వర్కింగ్ అవర్స్ లో ఎలాగో మా కెఫేటేరియాలో తినేస్తా అనమాట. ఆ ఎవడు చేస్తాళ్ళేవో! అనుకుంటూ. అలాంటి నేను, ఒక సూపు, దాని తర్వాత ఒక మెయిన్ కోర్సు, దానికి రెండు రకాల సాసులు, దాని తర్వాత పెరుగు దానిలో ఫ్రూట్సూ వేసుకుని తయారుచేసి, బైట వర్షం పడుతూ ఉంటే, పెద్ద కిటికీ బారున తెరిచి సూపు సేవిస్తూ డిన్నర్ మొదలుపెట్టానంటే, దానికి కారణం ఎవరు?? మంచు లక్సుమే!!!

ఈ నా బడుగు, అనాసక్త జీవితంలో జీవం తెచ్చి, నాలాంటి మనిషికి ఉత్సాహంగా వండుకుని (వంట తయారుచేసుకుని), దాన్ని మళ్ళీ టేబుల్ మీద చక్కగా అరేంజ్ చేసుకుని తినేంత ఉత్సాహం కలిగించింది ఎవరు? లక్సుమమ్మే! అందుకే, ఆవిడకి ఈనా డిన్నర్ అంకితమిస్తూ, ఎస్పీబీతో ఆవిడ చేసిన ఎపిసోడ్ ను చూస్తూ, తిన్నా! ఇంతకన్న వేరే ఆనందమేమున్నది? ఇంతకన్న చూసారా అభిమాన గుణము??

ఈ ఎపిసోడ్ విశేషాలు:

౧) ఆ పిల్లలెవరో వచ్చి పాటలు పాడుతూ ఉంటే, వాళ్ళ పాటలో రెండు ఉచ్ఛారణ దోషాలు ఉన్నాయని ఎస్పీబీ చెప్పడం విన్నాక, కిందపడి దొర్లడం కూడా చాలా చిన్న మాట అనిపించింది. లక్సుమిని పట్టుకుని ఈవిడ తెలుగును మాత్రం ఒక్క మాటైనా అనలేదు ఇంకా!!!

౨)”కమల్ హాసన్ కి ఏం జేసేటోళ్ళు మీరు?” ఈ ప్రశ్నకు సమాధానం బ్రేక్ తర్వాత. (తెలుగు రాదు మనకి. తెలుగు యాస మాత్రం వచ్చు)

౩) “అంకుల్…అంకుల్….అంకుల్”…. ఏమి వయ్యారంగా అంటుందో. నేనూ అలా అందామని ప్రయత్నించా కానీ, ఇక్కడ కింద ఒక ముసలాయన దిగాడు. ఏమైనా అయ్యిందని పరిగెత్తి పైకొస్తాడేమో అని భయమేసి, ఊరుకున్నా. “అంకుల్…..నో అంకుల్…. నథింగ్ హ్యాపెండ్ అంకుల్…” అనాల్సి వస్తుంది కదా అప్పుడు మళ్ళీ…వయ్యారం లేకుండా!

౪) మోహన్ బాబు మూడున్నరగంటలకి లేచే కథ వింటే, అబ్బా! మీ నాన్న ఎన్.టీ.ఆర్ లాగా డిసిప్లిండ్ అనమాటా – అని ఎస్పీబీ అనలేదని మంచమ్మాయ్ చెడ్డమ్మాయ్గా మారదాం అనుకుని, మళ్ళీ ఈయన ఆయన్ని పొగిడేసరికి సర్దుకుని మంచై కరిగిపోయిందని నాకనిపించింది.

౫) “ఇది నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్” అన్నప్పుడు ఎస్పీబీ కూడా మహానటుడిలా, “ఇది చిన్న గిఫ్ట్ కాదమ్మా. చాలా పెద్దది” అని ఏదో చెప్పబోతూ ఉంటే, లచ్చమ్మ టంగ్ స్లిప్పై, నాలుక తప్పిపోయి… “ఐ నో!” అనేసింది. భలే నవ్వించింది. ఆసరికి తినడం ఆపా కనుక సరిపోయింది కానీ, లేదంటే పొలమారి ఉండేది నా నవ్వుకి. అదే, నా నవ్వు వల్ల నాకు..

౬) పాపం, కూడా…అనేందుకు ఈవిడ ఖోడా అంటుంది. పక్కన్నుంచి గగన్ ఖోడా లైంలైట్ లోకి మళ్ళీ రావొచ్చనుకుని పరుగెత్తుకుంటూ‌ వచ్చేయొచ్చేమో. అంటే, తన యూత్ లో, (ఖోడా యూత్ లో కూడా) తనకి ఖోడా అభిమాన ఆటగాడనీ, అతన్ని తొక్కేసిన క్రికెట్ బోర్డులకి, తన షో పాపులారిటీ‌ ద్వారా బుద్ధి చెప్పాలనే ఈ షో ప్రొపోజల్ తెచ్చిందని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

౭) లచ్చిమీ లచ్చిమీ లచ్చిమీ… ఆమె చిత్రవిచిత్ర ఫోజుల్లో నవ్విన నవ్వుల పువ్వులతో నా గదంతా నిండిపోయింది. పూల పానుపు అంటే ఇప్పుడు నేనున్నదే అనుకుంటా.

౮) మంచమ్మాయ్ సిగ్గులు ఒలకపోయడంలో కూడా బాగా ఆరితేరిపోయింది. ఆ సిగ్గుల మొగ్గలన్నీ చెట్లై, నా గదిలో తక్కిన ఖాళీలన్నీ దానితో నిండిపోయాయి. అలా, ఈ పూలూ, చెట్లు…నా గది అంతా అడవైపోయింది… మంచమ్మాయ్ మనసంత దట్టంగా మిగిలిపోయింది.

౯) ప్రతి ఒక్కరూ స్టాలిన్ తరహాలో కనీసం ముగ్గుర్ని తెగ పొగడాలని సినీపరిశ్రమలో, లచ్చుమి శ్రేయోభిలాషులు అనుకుంటున్నారో ఏమిటో… ఈ తెరలో కనిపిస్తున్న టీవీల్లో ఆ ఎడతెగని పొగడ్తలేమిటో. మంచమ్మాయ్ ఇంతమందికీ కలిసి, కాశీ విశాలాక్షి అందరిపైనా సమంగా కరుణాకటాక్షాలు కురిపించినట్లు, అందర్నీ ఒకేలా….పొగుడుతూ ఉంటుందన్నమాట. ఏమైనా, నాకు భట్రాజుగిరీ కెరీర్పాత్ గా తీసుకోవాలి అనిపించిన నాడు, ఈ‌టాక్ షోలో కాఫీ‌టీలు అందించడానికన్నా చేరిపోడానికి రెడీ. అలా అందిస్తూ, అందిస్తూ, అందుకుంటా వీళ్ళ “పొగుడుబోతు”తనాన్ని.

౧౦) “ఈ అమ్మాయికి తెలుగుమీద చాలా ఇష్టమండి. తప్పు మాట్లాడినా అందంగా ఉంటుందండి” – అని మంచమ్మాయ్ గురించి మాటల సందర్భంలో తన శ్రీమతి అన్నదని బాలు అంటూ ఉంటే, ఏడుపాగలేదు నాకు. అలాగే, మంచమ్మాయ్ చివ్వర్లో కళ్ళనీళ్ళాభినయం చేసిందే…అప్పుడు కూడా నాకు ఏడుపాగలేదు.

నాకెందుకో, ఇక్కడ మాటల సందర్భంలో ఒక చోట, ఇహ ఎప్పుడో లయరాజు కూడా వచ్చేస్తాడేమో ఈ షోకి అని భయం పట్టుకుంది. ఆయనొస్తే, చూస్తూ చూస్తూ మంచులచ్చిమికి కూడా నేను నమస్కారం పెట్టాల్సి వస్తుంది :((

అలా, ఎన్నైనా చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ గురించి.

ఏమైనానూ, ఈ ఎపిసోడ్ కొన్ని చోట్ల చాలా బాగుంది. బాలు గారు రాకింగ్…విల్ బి రాకింగ్.మంచులక్ష్మి ని పొగిడినా కూడా బాలు గారు రాకింగే. మంచమ్మాయ్ తెలుగుని వదిలేసి, ఆ పిల్లల హిందీలో ఈకలేరినా కూడా బాలు గారు రాకింగే. మంచమ్మాయ్ కూడా కాస్త హెడ్డులో తలకాయ ఉంచుకుంది.. తన మార్కు మేనరిజంస్ గురించి మనమేం‌ చేయలేం‌ అనుకోండి. ఈ షో తో కలిపి నా డిన్నర్ ని మంచమ్మాయ్ ఇవ్విధముగా మరపురాని రాత్రి చేసిందన్నమాట. అందుకనే, మంచమ్మాయ్ నా ఇలవేల్పు అనమాట ఇకపై. గత కొద్ది నెలల్లో జీవితంలో ఏం‌ కోల్పోయానో చెప్పింది కదా మరి. చెప్పి వదిలేయకుండా, నాలో జీవం నింపడంలేదూ!

ఇక, పరుచూరి సోదరుల ఎపిసోడ్ కోసం వెదుకుతున్నాను.

Advertisements
Published in: on July 30, 2011 at 1:24 am  Comments (15)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/30/manchammai-vanta/trackback/

RSS feed for comments on this post.

15 CommentsLeave a comment

 1. HILARIOUS – I saw this episode. Enjoyed each of your quips thoroughly. Right on!
  ఒకటి – మంచి మంచి చీరలు కడుతోంది.

 2. హ హ హ హ 🙂
  పరుచూరి గారి ఎపిసోడ్ ఇదిగోండి.. పండగ చేస్కోండి 🙂

 3. మీ దురదృష్టం సౌమ్య.. మోహన్ బాబుతో చేసిన లక్స్ మి ఠాక్ షో వీడియోలు యూట్యూబ్ ఎకౌంట్ డిలీట్ కావడం వలన అందుబాటులో లేవు..
  ప్రస్తుతం ఈటీవీ షోస్ ఇక్కడ http://meetelugu.com/movies/movies/card/Prematho%20Mee%20Lakshmi%20All%20Episodes%20Online.html
  ఇది వరకు చేసిన షోస్ ఇక్కడా చూసి తరించవచ్చు 🙂
  http://meetelugu.com/movies/movies/card/Lakshmi%20Talk%20Show%20All%20Episodes.html
  ఈ లింక్ లు ఇచ్చినందుకు నాపై దండెత్తరని తలుస్తాను 🙂

 4. @Venu Srikanth: మీరు భలే వారే. నా జీవితంలో మీరంతా పూనుకుని ఇంత వెలుగు తెప్పిస్తూ ఉంటే, ఆ పక్క గదివాళ్ళు గుడ్డి వాళ్ళైపోయి కంప్లైంటు చేస్తే, నేను మీ పేరు చెబుతా కనుక, ఓపికుంటే వాళ్ళు దేశాలు దాటొచ్చి దండెత్తుతారు కానీ, నేనెందుకు వస్తా చెప్పండి??

 5. హహహ. బావుంది. నేనూ బాధితురాలినే. కాకపోతే నేను కొని తెచ్చుకున్న బాధ. గట్టిగా ఎవర్నీ అనను కూడా అనలేను. 😦 మంచి మంచు కాదని తెలిసి కూడా ప్రోగ్రాం చూడటం కొనితెచ్చుకోవటం కాక మరేవిటి. 😦 ఏదో బాలుది కదా కొత్త విశేషాలు తెలుస్తాయేమో అని భ్రమపడ్డాను. దెబ్బకి రెండో భాగం చూసే ధైర్యం చెయ్యలేదు.

  ఇంక పాపమా నలుగురు పిల్లల ఉచ్చారణా దోషాలని ఎత్తిపట్టుకోవడం, ఈ పిల్లది వదిలెయ్యటం అంటారా, ఈ పిల్ల జొలికి వెళ్తే మోహనమురళీధర్ గారిని ఏకినట్టే తననీ ఏకుతుందేమో అని భయం వేసిందేమో బాలుకి పాపం.

 6. You can see all episodes here
  http://www.lakshmitalkshow.com/watchepisodes.html

  Enjoy ….

  You better call your buddies before watching any episode and ask them to check after an hour. [to check your status … :)]

 7. Now.. I wanna post on RK (of ABN fame) interviewing her.. that was at some heights too..

  Btw.. ki.pa.do.na here.. both V. and me.

 8. సౌమ్య గారు

  లాక్ష్ మీ – అనూష్కా ని ఇంటర్వ్యూ చేసిందోసారి. అరుంధతి – గురించి తను యూ ఎస్ నుంచీ వచ్చినఫుడు విందంట. ఏంఠి అంథా ఇంథగా అంఠున్నారు అంఠే – అంధరూ అన్నారంఠ – ఈ ఖారక్ఠర్ నువ్వు చెయ్యాల్సిందని ! నిజంగానే చేసుండాల్సింది. ఈటీవీ సృష్టించిన సెలెబ్రిటీలలో సుమన్ పెద్ద స్టార్, తరవాత లాక్ష్ మీ,

  బాలూ – చాలా మంచిగా పొగుడుతారు. బాలూ కి బోల్డంత మాటకారితనం వుంది. నాకూ పిల్లల పాటల్లో తప్పులు వెదకడం నచ్చలేదు గానీ, తన అసహనాన్ని వెళ్ళగక్కడానికి అదో వెంటు.

 9. I also didn’t like how she didn’t accomodate for a sofa and did not bother to apologize to the gals

 10. అసహనం అంటే, లాక్ష్ మీ నీ, ఆవిడ ‘థెలుగు’ నీ ఏమీ అన్లేక… అలా …. అని , ఒక బాలూ అభిమానిగా నా అనుమానం.

 11. కేబుల్ కనెక్షన్ లేకపోవటం వల్ల ఇలాంటి మహానందాలు ఎన్నికోల్పోతున్నానో కదా!

 12. వేణూ గారు మీరెంటండీ , మంచమ్మాయిని మరీ భుజాలమీద మోసేస్తున్నారు. ఇంత అభిమానం ఏ ఎపిసోడ్ లో పుట్టిందో!

 13. సౌమ్య గారూ,

  మిగతా వాటికి తరువాత కామెంటుతా కానీ, అర్జెంటు గా కీరవాణి ఎపిసోడ్ చూసి టపా రాయండి ప్లీజ్. మీకు లక్స్మి లో ఇంకొక కల( అదెనండీ కళ) తెలుస్తుంది.

 14. బాలు కాబట్టి ఎంజాయ్ చేసా….కానీ “ఈ అమ్మయికి తెలుగంటే చాలా అభిమానమండీ” అని నా శ్రీమతి అన్నాది అని చెప్పినప్పుడు మాత్రం నాకు ఏడుపే ఏడుపు…ధారాపాతంగా ఏడ్చేసాను…ఓ తువ్వాలు, ఓ బకెట్ పక్కన పెట్టుకున్నాను కూడా.

 15. అన్నట్టు తెలుగు యాస బ్రహ్మాండంగా వచ్చు. అమ్రికా వెళ్ళినా యాస ఎందుకు మారలేదో మరి! “ఉప్పుడు, చేస్తా ఉన్నాను, తెలుస్తంది” లాంటివన్నీ బాగా పలుకుతాయి 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: