మంచమ్మాయ్ – ఆనందావేశాయోమయాల మధ్య నా ఊగిసలాట.

మరో రెండు ఎపిసోడ్లు చూశాక, మంచమ్మాయ్ నిజంగానే తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందా? నిజంగానే తెలుగు అంటే ఇష్టమా?? అన్న సందేహాలు కూడా కలిగేస్తున్నాయ్. ఇది అభిమానం వల్ల కలిగే సైకిక్ వైబ్రేషనులలో మొదటిది అని గమనించగలరు.

ఇవ్వాళ్టి ఎపిసోడ్ రిపోర్టులు: పరుచూరి సోదరులు, రానా.

పరుచూరి సోదరుల ఎపిసోడ్లో ఓవర్ యాక్షన్ సిగ్గుపడిపోయి, టేబుల్ కింద తల దాచుకుంటుందేమో అనుకున్నా కానీ, అసలు సీనులో పెద్దగా కనబడనే లేదు. ఈ ఎపిసోడ్ మామూలుగా ఉండింది (మామూలుగా అంటే, లచ్చిమి జిమ్మిక్కులు ఎక్కువగా లేకపోవడం… అవతలి వ్యక్తుల నటనాభివేశ దర్శనభాగ్యం కూడా అంతగా కలగకపోవడం అనమాట). బహూశా, ఎస్పీబీ, చిరు గట్రా షో-మెన్ లేకపోతే మామూలుగానే ఉంటాయి కాబోలు ఈ ఎపిసోడ్లు! కానీ, ప.గోపాలకృష్ణ గారు అంత నింపాదిగా, ఎక్కడా హద్దు దాటకుండా జవాబులు చెప్పడం నాకు కాస్త ఆశ్చర్యమే! మాటలకోటకి తాళం పెట్టి వచ్చేశారు కాబోలు!

ఇక, రానా కథ:
ఏమైనానూ, రానా చాలా ఇంగ్లీషు వాడితే వాడాడు గాక. తెలుగు మాట్లాడినప్పుడు మాత్రం చక్కగా మాట్లాడుతున్నాడు (అసలు, ఆ ఇంగ్లీషు వాడకం నా తరంలో అందరికీ అనేక కారణాల వల్ల సహజమే. అది మా తప్పు కాదు..నిఝంగా!!). అన్నట్లు, రానా చేతులు ఊపుతూ ఉంటే, నాకు‌ శేఖర్ కమ్ముల గుర్తొచ్చాడు🙂. వీళ్ళిద్దరూ సినిమా నిర్మాణం గురించి ముచ్చటించుకుంటూ ఉంటే (లచ్చుమమ్మ బాగా ఫీల్ అయిపోయి, మొహంలో కనబడని, మాటల్లో మాత్రమే తెలిసే భావోద్వేగాల మధ్య బాధ వెళ్లబోసుకుంది అసలే) బాగుండింది. ఈ ఎపిసోడ్లో లక్సుమమ్మ కూడా సడెన్ గా మామూలుగా, మామూలు యాంకర్ గా అనిపించింది. షో నిజంగానే బాగుంటోంది కాబోలు అని కూడా సందేహం కలిగింది. కానీ, సైకిక్ వైబ్రేషన్ లో ఉన్నా అని గమనించగలరు.

“నేను పెరిగింది మద్రాస్ అండ్ హైదరాబాద్. కనుక, తెలుగు బానే వచ్చు నాకు” అని రానా అన్నప్పుడు నవ్వి నవ్వి చచ్చిపోయా…. లచ్చుమమ్మ ముఖారవిందంలో మాత్రం ఎలాంటి భావం తెలియలేదు. అలాగే, అతను తెలుగు నేర్చుకోడానికి చేసిన కృషి గురించి చెప్పాడు – కొంతవరకూ లచ్చుమమ్మ అతిగా వర్ణించి ఉండొచ్చు కానీ, ముచ్చటేసింది. బాగా మాట్లాడుతున్నాడు. అంతా చూస్తున్నప్పుడు, లాక్స్మి తన స్టాండర్డ్ మొహం పెట్టుకుని చూస్తోంది కానీ, ఆమెకి రావాల్సిన సిగ్గు కాస్తా తానే సిగ్గుపడిపోయి లచ్చుమమ్మ వెనుక వైపు తలవంచుకుని నిలబడ్డదేమో అని అనుమానం వచ్చింది.

అన్నింటికంటే నాకు రానా లో నచ్చిన విషయం – తెలుగు కాదు. అతనికి కుక్కలంటే భయం ఉండటం. అక్కడే, నేను అతనితో కనెక్ట్ అయిపోయా!🙂 (రాజ్కుమార్ నీలం గారి అభిప్రాయాలే నావీనూ ఈ విషయంలో!). రానా బాబుకి ఫ్యాన్ అయిపోయా ఈ ఎపిసోడ్ తో.

చైతు బాబు ఎంట్రీ కోసం, అతని అద్భుతమైన తెలుగు భాషకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉండగా, వేంచేశాడు! లచ్చిమి పిలవడం: “చే” అంట.. ఇతగాడేదో చే గెవారాకి వారసుడు అయినట్లు! చే ఏమిటో అయినా. అంటే చై అనాలి గానీ.కానీ, చై అంటే, కుక్కని తరిమినట్లు అనిపిస్తుంది అని చే అనుకుంటున్నారేమో మరి!

౧) “ఈ ఏసీ ఫ్లోరుల్లో కూడా చెవట్ట్లు తప్పట్లేదు ఈ సర్పైజులకి” -లక్స్మి. హమ్మయ్య! ఓవర్ యాక్షన్ దాక్కున్న ప్లేస్ నుంచి వచ్చేసిందోచ్!!
౨) వాళ్ళేదో మాట్లాడుతూంటే ఆపేసి, విజువల్స్ ప్లే చేస్తున్నాం అని ప్లే చేసారు. దానికి నేపథ్య సంగీతం వచ్చింది చూడండీ….నేను అక్కడ ఏదో జరగబోతున్నదేమో అనుకున్నా. ఆ ఫొటోలేంటో…వాటికి ఆ సంగీతం ఏమిటో…ఏమిటో, పిచ్చి కల!
౩) చే బాబు వచ్చాక, లచ్చుమమ్మ పాత లచ్చిమి అయిఫోయింది… ఆ హొయలు, ఆ పులకింతాభినయమూ, దాని తాలూకా లయ, వాటికి తోడై ఆ సదరు చార్మింగ్ నవ్వూ, అన్నీ వచ్చేసాయి. లచ్చిమీ ఈజ్ బ్యాక్!
౪) “మీ అడ్వైజ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్?” అంట. వీళ్ళనంతా రాళ్ళపల్లి దగ్గరికి ట్రెయినింగ్ కి పంపాలి… బహుభాషా సంభాషణ చేయడం ఎలా అన్న విషయం గురించి (టీక: చూడుడు, రెండు రెళ్ళ ఆరు సినిమా) :))
౫) ఝుమ్మంది నాదం సినిమా గురించి ఏం చెప్పిందో అసలు! ఆ సినిమా చూడకుండా నేనేదో కోల్పోయాను అన్న భావన కలిగించింది.
౬) షో చేసినప్పుడు తానెంత టెంషన్ పడుతుంది, అయితే, అంతిమ ఫలితంగా షో ఎంత పాపులర్ అయ్యిందీ లక్సమ్మ భావోద్వేగంతో చెబుతున్నప్పుడు మళ్ళీ‌ కళ్ళు చెమర్చాయి.
౭) దీనికి నేపథ్య సంగీతం కూర్చే వాళ్ళు ఎవరో కానీ, వాళ్ళని చూస్తే, “బాబూ చిట్టీ…” అనాలనిపిస్తోంది నాకు. ఇప్పటికిప్పుడు అనలేను కనుక… “వర్షించే మేఘంలా నేనున్నా….”

ఇక, ఈ‌టపా టైటిల్ గురించి:
౧. రానా తెలుగు భాషా పటిమ గురించి కాస్త ఎక్కువగానే చెప్పారు ఇక్కడ. మరి, నిజంగా అలా ఉందో, లేక ఎప్పట్లాగే లచ్చిమి మాయో అని అయోమయం. అయోమయం ఇంకా చాలా విషయాల గురించి ఉంది లెండి …ఇదొకటి.
౨. ఈ రెండు ఎపిసోడ్లు చూశాక, నార్మల్ టాక్ షోలా ఉంది కనుకా, మంచమ్మాయ్ చాలాచోట్ల కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించింది కనుకా, ఆనందం
౩. నిజంగానే మంచమ్మాయ్ నా మదిన్ జొచ్చి, నన్ను ప్రభావితం చేస్తోందేమో అన్న అనుమానం వల్ల కలిగిన ఆవేశం.
-వీటి మధ్య ఊగిసలాడుతున్నా అనమాట.

అర్జెంటుగా కవర్ చేయాల్సిన మరో రెండు: అల్లు అర్జున్ తో, ప్రభాస్ తో. వీళ్ళందరి భాషతో నా గదిలోని ఆకుపచ్చ అడవంతా ఎరుపు చేసే దాకా (రక్తాశ్రువుల వర్షంతో)… ఈ పయనం ఆగదూ…ఆగదూ……!

Published in: on July 30, 2011 at 12:17 pm  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/30/manchammai-paruchuri-rana/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

  1. సరే గానీ, రానాదీ మీదీ ఒకే తరమా !!!!!!!!!😉

    • మీరు నా గురించి ఏం ఊహిస్తున్నారో నాకు తెలీదు కానీ, ఇద్దరం ఒకే ఈడు వారం, వికీ ని బట్టి చూస్తే🙂

  2. ఊప్స్.. సౌమ్య పేర్ల విషయంలో పొరబడ్డాను. క్షమించండి.
    మీ బ్లాగు చాలా బావుంది.

  3. >>చై అంటే, కుక్కని తరిమినట్లు<<
    ’చె’ అని పిలిచిందంటారా. నాకు చై అన్నట్లే వినిపించింది.. నేను కుక్కను తరిమినట్లు అదేం పిలుపు అనుకున్నా🙂

  4. అన్నట్లు మీ పుణ్యమా అని నేను కూడా ఇదే పనిమీద ఉన్నా ప్రస్తుతం.. కొన్ని ఎపిసోడ్స్ చూశాక నాకు ఆవిడ భాషతప్ప ఈ షోస్ లో మిగిలిన విషయాలన్నీ బాగా మ్యానేజ్ చేస్తుంది అనిపిస్తుంది… ఓ సారి కుదిరితే నా బజ్ వైపో లుక్కేయండి..

  5. మీ పుణ్యమా అని నేను కూడా ఇదే పనిమీద ఉన్నా ప్రస్తుతం. మీ రానా బాబు ఏం చెప్పాడో విన్నారా? “అమెరికా నించి వచ్చిన వాళ్ళంతా తెలుగు బాగా మాట్లాడతారు, మీరు (లక్సుమి) కూడా.”

    అతను చెప్పిన కర్ణ డవిలాగు విని నేను కూడా ఫాన్ అయిపోయాను.

  6. ఒక ఓంకార్ ,ఒక సుమన్, ఒక మంచమ్మాయి,…..తెలుగు టి.వి ప్రేక్షకుల పాలిట వరాలు ( పాప ఫలాలు )
    సరే కానీ , మంచమ్మాయ్ రానాకి అంకుల్ అనీ ,చే ని అన్నయ్యా అని అనుండాలే !


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: