తలిశెట్టి రామారావు గారిపై ఆరుద్ర : కొన్ని సందేహాలు

“తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు” అన్న పేరుతో,తొలినాళ్ళ తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారి కార్టూనుల సంకలనం ఒకటి ఇటీవలికాలంలోనే వచ్చింది. నేను దాన్ని చూస్తూ, బొమ్మలు కొన్నింటిని చూసి మురుస్తూ, అసలీయనెవరో – ఎనభై‌ఏళ్ళనాడు గీసిన బొమ్మలు ఇంకా ఇప్పటికీ సరిపోతున్నాయే! అని ఆశ్చర్యపోతూ ఉండగా, పుస్తకం చివర్లో ఆరుద్ర రాసిన కూనలమ్మ పదం కనిపించింది. (పుస్తకం గురించి తరువాత వివరంగా పుస్తకం.నెట్లో రాస్తాను). ఇందులో, ఆరుద్ర కొంతమంది తొలి తరం కార్టూనిస్టుల పేర్లు ప్రస్తావించారు. వాళ్ళెవరో అర్థం కాక, ఇలా ఒక టపా రాస్తే, ఎవరన్నా చెబుతారేమో అని…రాస్తున్నా…

ఆ పదం:

చిలిపి కుంచెను పట్టి
శ్రీకారమును చుట్టి
నవ్వించే తలిశెట్టి
ఓ కూనలమ్మా!

అది కార్టూనిస్టు
అనుచు తలచుచు ఫస్టు
కీర్తించుటే బెస్టు
ఓ కూనలమ్మా!

హాస్య చిత్రములందు
అతడు చేసిన విందు
ఇంకనూ తినుచుండు
ఓ కూనలమ్మా!

తలిశెట్టి తొలిసెట్టి
దండ మతనికి పెట్టి
ఇంద రెక్కిరి ఉట్టి
ఓ కూనలమ్మా!

అతని పిమ్మటి వారు
ఆహా! పంచుకుంటారు
కీర్తి లోపల షేరు
ఓ కూనలమ్మా!

యస్.బ్రహ్మ ‘యో’ వ.పా.
గీయ ఒక్కొక్క తఫా
ప్రతి మనిషి బేవఫా
ఓ కూనలమ్మా!

గుర్తేనఝ “కే యస్సు”
గుర్తుంది ఓయస్సు
అతడో? ఒయాసిస్సు
ఓ కూనలమ్మా!

చేట్టాను ఊమెన్ను
శ్రీభరుండు రవన్ను
తెలుగు ఫన్నీ మెన్ను
ఓ కూనలమ్మా!

అపుడు వచ్చిన బాపు
హాస్య కళకే ప్రాపు
నిజముగా కానోపు
ఓ కూనలమ్మా!

నాకు తెలిసిన వరకు
నవ్వు బొమ్మల సరుకు
ఇక మీదనూ దొరుకు
ఓ కూనలమ్మా!

పింజయినచో పువ్వు
రంజించితే నవ్వు
అనుభవించుమా నువ్వు
ఓ కూనలమ్మా!

– వ.పా అంటే వడ్డాది పాపయ్య గారు అని అనుకుంటున్నా. ఇక నా సందేహాలు:
౧) ఎస్.బ్రహ్మ ఎవరు?
౨) గుర్తేనఝ “కే యస్సు” గుర్తుంది ఓయస్సు – అంటే ఏమిటి?
౩) చేట్టాను ఊమెన్ను – అంటే‌ ఏమిటి/ఎవరు?
౪) శ్రీభరుండు రవన్ను – అంటే ఏమిటి/ఎవరు?

మధ్యాహ్నం నుంచి గిలగిల్లాడుతున్నాను. కాస్త ఎవరన్నా వీళ్ళెవరో చెప్పి సాయం చేద్దురూ!

(అన్నట్లు, గత శనివారంతో ఈ బ్లాగులో తొలిటపా రాసి ఐదేళ్ళైందోచ్!!)

Advertisements
Published in: on July 20, 2011 at 2:02 am  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/20/talisettiramaraoarudra/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. వ పా వడ్డాది పాపయ్య గారు.కరక్టే. ఆయన అప్పుడప్పుడూ యువలో కార్టూన్లు వేసేవారు. యువ వచ్చినన్నాల్లూ ఆయన వేసిన ముఖ చిత్రంతోనే వచ్చింది.

  ఊమెన్ కేరళకు చెందిన కార్టూనిస్ట్. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో కార్టూన్లు వేసేవారు. డైలీలో కూడా ఆయన కార్టూన్లు ఉండేవి తెలుగువారికి రాజకీయ కార్టూన్లు అందించినవారు. ఆయనకు తెలుగు రాదు. ఆయన వేసిన కార్టూన్లలో కాప్షన్ కాళీగా ఉంచి పంపి, కాప్షన్ ఆంగ్లంలో విడిగా పంపితే, పత్రిక వారు ఆ ఆంగ్లాన్ని తెలుగు చేసి వేసేవారు. ఈయన గురించి మునుపు నా బ్లాగులో వ్రాశాను

  http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_02.html

  మిగిలిన వాళ్ళెవరో తెలియదు

 2. ఈ పుస్తకానికి నాకూ ఉన్నబాదరాయణ బంధమేంటో తెలియాలంటే మలి ప్రచురణవరకూ ఆగాలి.

 3. similar quest!
  http://janatenugu.blogspot.com/2011/07/blog-post_20.html

 4. Sowmya – just saw your email. Fear to say – no idea on the names you are looking for. But wait, all hope is NOT lost – I sent your email to the people at this website –

  http://www.telugucartoon.com/telugu-cartoonist-directory.php

  Hopefully they will get back….If they do I will let you know…:)

  In case you come to know of the names, pls post them here…

 5. Or you can try sending emails to some of the “living” cartoonists listed in that page and get the answers….Click on the names and it will pop up the details of the cartoonist. And in there, (for some of them) email addresses are listed…..So….May be – they will hopefully end your quest….

 6. “..చేట్టాను ఊమెన్ను – అంటే‌ ఏమిటి/ఎవరు?..”

  Oomen’s full names is V G Oomen and he was the first ever Political Cartoonist in Telugu. He was publishing his cartoons in Andhra Patrika Sachitra Vara patrika till his death in July, 1984. I started a new blog in his memory, which you can see with the following link:

  http://oomencartoons.blogspot.in/

  Details regarding Shri Oomen are scanty but whatever I could glean from net and other Cartoonists, especially from Shri Jayadev I shared with all in my above blog. Any details I get, I believe in sharing with everybody not just keeping it to myself.

  • శివరామప్రసాద్ గారికి: మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: