నిన్న ఒక ఇళయరాజా తమిళ పాట పరిచయమై వదలకుండా వెంటాడింది. ఇప్పుడు కూడా ఇది రాస్తూ ఆ పాటే వింటున్నా. అవినేని భాస్కర్ గారి పుణ్యమా అని, పాట అర్థం కూడా తెలిసింది. అర్థం బాగా అర్థమయ్యాక, పాట ఇంకా నచ్చడం మొదలుపెట్టింది. విచిత్రం ఏమిటో గానీ, ఈ పాట వింటున్నంతసేపూ నాకో ఒక తెలుగు పాట కూడా గుర్తొస్తూ ఉండింది ఎందుకో గానీ! ఆ రెంటి గురించే ఈ టపా!
ఇంతకీ, తమిళ పాట: “సెంగాత్తు భూమియిలే” అన్న సినిమాలోది. ఇళయరాజా సంగీతం. గానం: రీటా అని రాసి ఉంది రాగా.కాం లో. పాటని ఇక్కడ వినొచ్చు.
భాస్కర్ గారి అనువాదం…
ఎన్ ఉసురు ఎన్న విట్టుప్ పోనాలుం – ఉన్న విట్టుప్ పోగాదు
నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళినా – నిన్ను వదిలి వెళ్ళదు
తీయిలదాన్ ఎన్ ఉడంబు వెందాలుం – ఉన్ నెనప్పు వేగాదు
అగ్గిలో నా తనవు కాలినా – నీ తలపు కాలదు.
ఎన్నోడ నెంజుక్కుళ్ళ ఎన్న ఇరుందదున్ను ఇప్పో పురింజాలే పోదుం.
నా ఎదలో ఏముండేదో అని ఇప్పుడు అర్థమైతే చాలు.
చరణం:
పూముడిక్క కాత్తిరుందేన్ – పళి(zhi)ముడిక్క పోనాయే
వరించుదామని వేచియుంటిని – నువ్వు పగతీర్చుకోడానికి వెళ్ళావు.
వాళ్వు(zh) తర కేట్టిరుందేన్ – సాగడిచ్చు పార్తాయే
బ్రతుకునిమ్మని కోరియుంటిని – చావునిచ్చావు
నమ్మోడ ఊర్గోలం పార్కామ నాన్ పోనేన్; ఎన్నోడ ఊర్గోలం నీ పార్పియా?
మన (పెళ్ళి) ఊరేగింపు చూడకుండ నేను పోయాను నా (మరణ) ఊరేగింపు నువ్వు చూస్తావా?
ఊర్మాల ఎన్నెన్న పారు – ఉన్ మాల ఎన్మేల పోడు
ఊరిదండ ఏమిటో చూడు – నీ దండ నామీద వెయ్యి
(ఈ చివ్వరి వాక్యం ఏమిటో, నాకర్థం కాలేదు. పైగా, సినిమా చూడలేదు కనుక, అసలర్థం కాలేదు!)
-ఇంత వివరంగా ఇక్కడ రాసాక, పాట నన్ను వెంటాడుతూ ఉందో అర్థమైందనుకుంటాను. ఒక పక్క లయరాజు సంగీతం నన్ను ఆ మూడ్ లోకి లాగేసింది. గాయని గొంతుక కూడా బాగుందనిపించింది. చాలా గాఢమైన భావాలు ఉన్నట్లు అనిపించింది.
అగ్గిలో నా తనవు కాలినా – నీ తలపు కాలదు.
నా ఎదలో ఏముండేదో అని ఇప్పుడు అర్థమైతే చాలు.
-నాకసలు ఆ సినిమా ఏమిటో, దాని కథేమిటో తెలీదు కానీ, ఈ రెండు లైన్లు మాత్రం వేధించడం మొదలుపెట్టాయి నన్ను 😦
పొద్దున్న మొదలై, రాత్రి పడుకునేటప్పుడు కూడా వింటూ పడుకుని, లేవగానే మళ్ళీ వింటున్నానూ అంటే….ఏం చెప్పేది నా అవస్థ!
ఇక రెండో పాట – “గాయం 2” సినిమాలో “కలగనే కన్నుల్లో, కరగకే కన్నీరా” పాట. ఇదీ ఇళయరాజా పాటే. ఎందుకోగానీ మొదటి పాట వింటున్నంతసేపూ ఇదే గుర్తొచ్చింది.
“కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా”
– అంటూ సాగే ఈ పాట ఇళయరాజా గారే పాడారు కూడానూ. ఇక్కడ సాహిత్యం చదవొచ్చు, పాట వినొచ్చు.
ఆ పాట వింటూంటే ఎందుకు ఈ పాట గుర్తొచ్చిందంటే చెప్పలేను మరి! “మూడ్” అలాంటిది అయినందుకు కాబోలు, రెండింటిలోనూ!
అసలిదంతా రాయడం మొదలుపెట్టాక, మూడో పాట గుర్తొచ్చింది. అది “సూరీడు పువ్వా…”, అంతఃపురం సినిమా నుండి.
మొత్తానికి అన్నీ ఇళయరాజా స్వరపరచిన పాటలే కావడం ఇక్కడ విశేషం 🙂
సౌమ్యగారు,
చాలా మంచి పాట పరిచయము చేశారు. కొన్ని పాటలు వింటే చాలు ఆ సినిమా చూసి తీరాలనిపిస్తుంది. ఈ పాటకు ఆ స్థాయి ఉందనిపిస్తోంది. సినిమా ఎలా ఉందనే సంగతి వేరే విషయము. “తీయిలదాన్ ఎన్ ఉడంబు వెందాలుం – ఉన్ నెనప్పు వేగాదు” ఈ లైన్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు.
ఇక మిగిలిన రెండు పాటలు ముందే విన్నవే!
paatalu baagynnaayi. sooreedu puvvaa.. s.janaki gaari galam ventaade..vyadha.