వీర శాకాహారిత్వం?

ఇక్కడ, మా ఊర్లో ఒక వెజిటేరియన్ సూపర్ మార్కెట్ ఉంది. నేనెప్పుడూ పోలేదు. ఆర్గానిక్ అనీ, అదనీ, ఇదనీ ఏదో చెప్పి, బయటికంటే ఒక రెండుమూడింతలు ఖరీదు ఉంటుందని విని ఉండటం చేతా, మామూలు మార్కెట్లో నాకు కావాల్సినవి బానే దొరుకుతున్నాయి కనుకా. విధి వక్రించి నిన్న ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే, అది కనిపించి, వెళ్ళాను.

కాసేపు తిరుగుతున్నానా… “వెజిటేరియన్ సలామీ”, “వెజిటేరియన్ సాసేజ్”, “వెజిటేరియన్ హాం” ఇలా ఏవేవో కనిపించాయి. వీళ్ళ శ్రాద్ధం…శాకాహార మాంసం ఏమిటి? అనుకుంటూ ఉండగా, ప్రతిదాని పైనా, తాటికాయంత అక్షరాలతో, “100% వెజిటేరియన్” అన్న అక్షరాలూ. అవి చూడ్డానికైతే మరి మాంసం లాగానే ఉన్నాయి. అయితే, శాకాహారులౌతున్న మాంసాహారులకు ఆ రుచులు పూర్తిగా వదల్లేకపోతే, ఇది ఆప్షన్ అనమాట…అనుకున్నాను. అనుకున్నదాన్ని ఊరుకోక, అలా తిరుగుతూ ఉండగా, ఒకటి కనిపించింది. చూడ్డానికి మామూలు ఆలూ కట్లెట్ తరహాలో ఉండింది. మళ్ళీ వందశాతం వెజిటేరియన్ అన్న తాటికాయ అక్షరాలూ…. వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ చూస్తే, అన్నీ మామూలు కూరగాయలూ గట్రా నే ఉన్నాయి. బొమ్మని చూస్తే, ఎక్కడో చూసినట్లు ఉందే…అనిపించింది కానీ, ఏమిటో అర్థం కాలేదు. అది ఆలూ కట్లెట్ కాదు కానీ, ఏది? అన్నది అర్థం కాలేదు. సరేలే, వచ్చాను కదా అనేసి, దాన్ని తీస్కున్నా.

ఇవ్వాళ పొద్దున్న దాన్ని తినబోతున్నప్పుడు తట్టింది – నాకు అనిపించిన ఆ vague familiarity మెస్సు లో చూస్తున్న ఫిష్ ఫిలేట్ ల వల్ల అని! అంటే, నేను కొన్నది కూడా, మాంసాహారులు మిస్సవకూడదు అని తయారు చేసిన శాకాహార వంటకమే అనమాట! ఏదో ఒకట్లే, అనుకుని తినబోయానా…. చాలా చాలా కస్టపడి ఒకటి తినగలిగాను. నాకేమిటో చేప నా ముందు గిలగిలలాడుతున్న భావన కలిగింది! అది చేప కాదు… మామూలు శాకాహారమే… అని తెలిసినా కూడా, తినలేకపోయాను :((

ఓర్నాయనో…మానసికంగా నేనింత వీర శాకాహారిని అని నాకూ ఇన్నాళ్ళ జీవితంలో ఎప్పుడూ అర్థం కాలేదు!!!!
నేనేదో – నాకు తినాలని లేదు కనుక, ఎప్పుడూ తినే ప్రయత్నం చేయలేదు…లేకుంటే చేసి ఉందును…అనుకునేదాన్ని.
పక్క వాడు ఏ జీవి తిన్నా ఇబ్బందికి గురి కాకుండా కూర్చునే ఉంటా కదా… నాకేం సైకలాజికల్ గా అవర్షన్ లేదు….అనుకునేదాన్ని.
కానీ, ఈ విధంగా మానసికంగా తీవ్రంగా శాకాహారానికి ఫిక్సయ్యా అని ఇవ్వాలే అర్థమైంది!!
నవ్వొచ్చు…ఏడవనూ వచ్చు. మా అమ్మ మాత్రం చాలా సంతోషించవచ్చు!! 🙂

Advertisements
Published in: on July 5, 2011 at 3:03 pm  Comments (18)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/05/veeraveggie/trackback/

RSS feed for comments on this post.

18 CommentsLeave a comment

 1. Aprachyapu chestalu nuvvu !
  Ee sari hyderabad ki vache mundu .. ganga lo muudu munakalu vesi ra !

  😀

 2. maanasikamaina bhavana mukyamandi . chaina vadu paamu kudaa tintaadu. mana mamsahaarulu tinaru chinnappatinundi alavaatu anedi maanasikangaa prabhavam chuputundi

 3. హ్హహ్హ… పైన Halley చెప్పినట్లు నేను కొరియాలో పొరపాటున కూడా ఏమీ తినలేదు మొఱ్ఱో అని చెప్పినా, మా బామ్మ ఇలానే అంది 😛

 4. ఇన్నాళ్ళకి శాఖాహారం అనకుండా శాకాహారం అన్నందుకు, నా కడుపు నిండి పోయింది ( శాకాహారం తో నే లెండి)
  శాఖము: కొమ్మ

  శాకము : కూరగాయ

 5. నేను అప్పుడు కూడా ఇదే చెప్పాను – తెలుగునాట షాపుల పైన శాఖాహారమనే రాస్తారు, అలాగే నేను నేర్చుకున్నాను అని. మీకు నేనొక్కదాన్నే ప్రపంచంలో అలా రాస్తున్నట్లు కనిపిస్తున్నా కాబోలు…గూగుల్ సర్చ్ చేయండి….శాఖాహారం కి 294000+ ఫలితాలొస్తే, శాకాహారం కి 6000 లోపే. కనుక, మీరు నా బ్లాగు పరిధి దాటి, ఆంధ్రజాతి మొత్తానికి ఈ విషయం చెబితే, మీకు జీవితాంతం కడుపు నిండుతూనే ఉంటుందిక!!

  శాఖానికి, శాకానికి తేడా వివరించినందుకు ధన్యవాదాలు.

 6. :)))))కడుపు నిండా నవ్వుకున్నాను.

 7. అదంతే. నా కూతురుంగార్ పక్కా వెజిటేరియన్ పుట్టినప్పటినుంచి, కాని అమ్మా నాన్నా, ఇంటికొచ్చిన వాళ్ళూ అందరూ చక్కగా లొట్టలేసుకుంటూ చికెన్, మటన్ ముక్కలూ తింటూండటం తన కలవాటే, కాని కొంచెం తెలివొచ్చాక ఆరేళ్ళప్పుడు, నాన్నా you get to eat chicken, but not me..it’s unfair అంది. నిజమే కదా.
  అందుకని తనని పక్కన కూర్చోపెట్టి, ప్లేట్లో రెండు చికెన్ ముక్కలు పెట్టి తినిపించా.

  అమ్మతోడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ చికెన్ తింటాను అని అనలేదు. తెలీకుండా ఎవర్షన్ డెవలప్ అయిపోతుందేమోనని నా అనుమానమ్ కూడానూ:-)

 8. నిజమే. ఇక్కడ కూడా మొదట్లో మాంసాహార రూపంలో ఉండే శాకాహారపు దినుసుల్ని చూసి ఇదేం పోయేకాలం వీళ్ళకి అనుకునేవాణ్ణి. ఐతే పాశ్చాత్య శాకాహారుల కష్టాలు – మాంసంతో పుట్టిపెరిగి, ఏదో ఒక కారణంతో శాకాహారులవడంవల్ల, ఐనా ఇంకా ఆ రుచి కోరుకునేవారికోసం అన్నమాట.
  @Halley – గంగదాకా ఎందుకు, ఒక దర్భకాల్చి నాలిక మీద వాతపెడితే సరి, ప్రాయశ్చిత్తం సంపూర్ణం. 🙂

 9. అంటే ఏంటండీ కొత్త పాళీ గారూ ఒక చికెన్ ముక్క, ఒక దర్భ పక్కనుంచుకుని శాకాహారులు మాంసాహారం తినేయచ్చా? హన్నా.

 10. >> మాంసంతో పుట్టిపెరిగి, ఏదో ఒక కారణంతో శాకాహారులవడంవల్ల, ఐనా ఇంకా ఆ రుచి కోరుకునేవారికోసం అన్నమాట.

  Yes .. thats true. ఈ కేటాగిరిలో నాకు బాగా ఉపయోగపడుతుంది

 11. మాకూ దాదాపు ఇదే అనుభవం! అడిలైడ్ లో ఒక రెస్టారెంటులో “శాకాహారం తో కూడా ఆరోగ్యంగా తినొచ్చు” అని నిరూపించటానికి టోఫూతో శాకాహార పదార్థాలు చేసి వాటికి మాంసాహార పేర్లు పెడతారు. (చికెన్ సిక్స్టీ ఫైవ్ టోఫూ తో చేస్తారన్నమాట.) ఎంత ప్రయత్నించినా నేనూ, మురళీ ఒక్క ముద్ద కూడా మింగలేకపోయాం. వార్నీ! మనం ఇంత మొండి వాళ్ళమన్నమాట, అనుకుని నవ్వుకున్నాం!
  శారద

 12. మంచి వారే! పోర్క్ రిండ్స్ ని తినమని మావారిని వారి బాసు (చైనీయురాలు)తెగ బలవంతం చేసేదిట.” It’s not meat. It’s just skin.”అంటూ! పెప్పరోనీ పిజ్జా తెప్పించి “పెప్పరోనీ తీసేసి తిను పోనీ” అని కళ్ళమ్మట నీళ్ళు వచ్చేవరకు హింసించేదిట. కొన్ని అర్ధమయ్యేలా చెప్పేసరికి మనపై మనకే విసుగొస్తుంది. కొంచెం గర్వం గా కూడా ఉంటుంది. “అహా.. ఎంత మొండి వాళ్ళం మనం “అని.
  దర్భ తో వాత కంటే గంగలో మునకలు సులువు. దర్భే గా అనుకోకండి. అమెరికాలో పిల్లాడిని కని ఇండియా వెళ్తే గోపంచకం పుచ్చుకోవాలిట. సముద్రం దాటితేనే, దర్భతో నాలిక మీద వాత పెట్టి శుధ్ధి చెయ్యాలిట. ఇక అవీ, ఇవీ తింటే వారికి ప్రాయశ్చిత్తం తక్కువదేం ఉండి ఉండదు. 🙂

 13. కెవ్వ్వ్! ఇక్కడ మీరు పెట్టిన టైటిల్ సార్ధకమయ్యే సలహాలు ఇస్తున్నారుగా!!!! దర్భతో నాలిక మీద వాత పెట్టాలా? వామ్మో! దీనికన్నా ఆ చెత్త తినకపోతే నయమేమో! నావరకు నాకు వాసన రాకపోతే పక్కవాళ్ళు తిన్నా పట్టించుకోను….కాని వాసన వచ్చిందా…ఇక నోరు ఆగదు…కడుపులో సుడిగుండాలు ఏర్పడి బాగా తిప్పేసి నానా భీబత్సం జరుగుతుంది :))) అందుకే సిగ్గులేకుండా…నోటికి కనీసం చున్ని అయినా అడ్డుపెట్టుకుంటా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో! :))

 14. అప్పుడెప్పుడో నేను అమెరికాలో నివశించినపుడు మా పక్కింట్లో ఉండేవాడొకరోజు వచ్చి cheese grater ఉంటే ఇమ్మన్నాడు. ఇచ్చాను. తర్వాత తెచ్చిస్తూ ఒక ప్లేట్లో ఏదో పెట్టి ఇచ్చాడు. అదేమిటని అడిగితే Tuna salad అని కొనసాగింపుగా “శాకాహారమే, తిను, ఫిష్షేగా” అన్నాడు. “ఫిష్ శాకాహారమేమిటి నీ బొంద!” అంటే చేపలు స్వచ్ఛమైన శాకాహారమే ననీ, అందులోనూ ట్యూనా ఫిష్ మరీ దోసకాయ లాంటిదనీ ఒప్పించ జూశాడు. అతడు వెళ్ళాక ఆ తురుం పట్టే దానితో ఏమి తురుం పట్టి ఉంటాడో ఊహించలేక “నా దగ్గర ఇంకోటి ఉందిలే, నా గుర్తుగా నువ్వుంచుకో” అని అతనికే దాన్ని ఇచ్చేశా, అచ్చంగా, ఎప్పటికీ!

  శాకాహారులకు కష్టాలే చాలా చోట్ల! ఒకసారి గోవాలో ఎవరో తెలుగు వాళ్ళు కనపడి కాస్త స్నేహితులై, మేము డిన్నర్ చేస్తుండగా వచ్చి “కూచోవచ్చా మీ పక్కన “అంటే మర్యాద పాటించి “అయ్యో దానికేం, కూచోండి” అన్నాం! ఇహ చూస్కోండి, గోవాలో దొరికే సీ ఫుడ్ అంతా తెప్పించారు. ఆ వాసనలు నన్ను ట్రిప్ అంతా అయి తిరిగొచ్చాక కూడా వెంటాడాయి!

  ఇందు….,దర్భ కాల్చి వాత పెడితే కాలదులే! శాస్త్రార్థం పెడతారు.దర్భ వెంటనే అంటుకుని వెంటనే ఆరిపోతుంది. ఆరిన దాన్నే అలా నాలుక మీద ఆనుస్తారు. :-))

  మా పిన్ని,బాబాయి అమెరికా వెళ్ళొచ్చాక సముద్రాలు దాటి ప్రయాణం చేసినందుకు,అమెరికా వాడి ఆహారం తిన్నందుకు (మెక్ డొనాల్డ్స్ లో కూడా తిన్నారు హాయిగా)మఠాధిపతి వద్దకు వెళ్ళి చక్రాంకితాలు వేయించుకుని, దర్భతో నాలుక మీద వాతలు వేయించుకున్నారు!

 15. శాకాహారులకి కష్టమంటారు కానీ..నాకేమీ అలా అనిపించదు. కనీసం అమెరికాలో.ఒకే ఒక్కసారి హాంకాంగ్ airport lO కేవలం నట్స్ తిని ఉండాల్సొచ్చింది. కాకపోతే అవి నాకిష్టమే కాబట్టి అంతా కష్టమనిపించలేదు. కొంచెం flexible (అంటే గింజలు, ఆకులు,అలములు, ఫల పుష్పాదులు లాంటివి జై మంతెన గారు అనుకోని ఎంజాయ్ చెయ్యటం) గా వుంటే చాలు.

 16. మీరుండండీ సుజాత గారూ! “దర్భ కాలదు. ఉత్తుత్తినే. అలా అంటించి ఇలా తీసేస్తారు” అని చెప్పేస్తే జనాలకి బెదురు పుట్టద్దూ! నేనింకా చక్రాంకితాలు నాలుక మీద వేస్తారని చెప్దామనుకున్నాను. జన్మతః మాంసాహారం తినే వారి సంగతి మనకొద్దు కానీ, ఫేషన్ కో, ప్రోటీన్ పేరు చెప్పో కొత్త అలవాటు చేసుకొని, లెక్చర్లు ఇచ్చే వాళ్ళను చూస్తేనే బాధ గా ఉంటుంది. “జాన్ అబ్రహం, బాబ్ హార్పర్, నటాలీ పోర్ట్ మన్ శాకాహారులు తెలుసా!” అని చెప్పాలనిపిస్తుంది నాకయితే.

 17. @కొత్తావకాయ : ఎవరి ఇష్టం వారిది లెండీ… మనకెందుకు పోనిస్తూ… అనుకుని వదిలేద్దాం‌ 😉
  పాపం, వాళ్ళకి నచ్చేస్తే అదృష్టవంతులు, ఎక్కడికెళ్ళినా ఆహారసమస్యల్లేకుండా బ్రతగ్గలరు.

  @పావని: అలా నెలలూ, సంవత్సరాలు బ్రతకడం కష్టమేమో! అయినా, కనీసం, జర్మనీలో ఇబ్బందేమీ లేదు. రకరకాల మార్గాలు ఉన్నాయి. మన తరహా వంటలు కావాలంటేనే ఇబ్బంది.

 18. కొత్తావకాయ గారూ,
  ట్రైన్ ని కండబలంతో ఆపిన కోడి రామ్మూర్తి నాయుడు కూడా శాకాహారేనండీ, ఆయన గురువులు అపరభీములనిపించుకున్న కోటం రాజు బైరాగి పంతులు గారు కూడా శాకాహారే, ఇంక ఇవి కూడా కలిపి చెప్పండి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: