నార్వే – ఇంకో రెండ్రోజులు

ఈ రెండ్రోజుల్లోనూ భిన్న సంస్కృతుల వాళ్ళతో మాటలెక్కువైపోయి, దేశాటన బాగా తగ్గిపోయింది. 😦
కొంచెం చెప్పుకోవాలి అనిపీంచిన విశేషాలు ఏమిటంటే…

1. నిన్న మాకు వర్క్‌షాప్ తాలూకా డిన్నర్ ఉండింది. అది సముద్రమట్టానికి మూడొందల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న Fløyen mountain అన్న కొండపై ఉన్న ఒక రెస్టారెంటు వేదిక. ఈ బెర్గెన్ నగరాన్ని కూడా రోం లా, తిరుపతి లా – ఏడు కొండల నగరం అని అంటారంట. వాటిల్లో ఇది అన్నింటికంటే పర్యాట-కులంలో ప్రసిద్ధి చెందినదట. కిందనుంచి పైకి Fløibanen అన్న ట్రెయిను తిరుగుతూ ఉంటుంది. సొరంగంలా ఉంది..దానిలో ట్రెయిను వెళ్ళడం అంతకుముందు సముద్ర తీరంలో నడుస్తూ చూశాను. కానీ, మేము పైకి నడిచెళ్ళాము. అలసట పుట్టించేదే అయినా కూడా, అద్భుతమైన, అందమైన దారి.

2. ఇక్కడికి వచ్చేముందే బెర్గెన్ నగరం నార్వేలో రెండో అతి పెద్ద నగరం – అని విన్నప్పుడూ, చదివినప్పుడు, నాకు కొన్ని అంచనాలు కలిగాయి. కానీ, ఇక్కడికొచ్చాక, రెండ్రోజులు తిరిగేసరికి – “ఓస్! ఇంతేనా! ఇదా రెండో పెద్ద నగరం! మన కర్నూల్లా ఉందిగా!” అనుకున్నా. ఈ కొండ ఎక్కి కిందకి చూస్తే గానీ అర్థం కాలేదు. నగర కేంద్రం మాకు దగ్గరలో ఉందనీ…చుట్టు పక్కల చాలా దూరం ఆ నగరం పరుచుకుని ఉందనీ! విశాలమైన సముద్రం, నేలా కౌగిలించుకోబోతూ ఉన్నట్లు ఉంది బెర్గెన్ నగరం పైన్నుంచి చూస్తే 😛

3. డిన్నర్ – ఒక మూడున్నర గంటలు సాగింది. అలాగని ఏవో పది రకాలు తిన్నామని కాదు. ఒక సలాడ్, మెయిన్ కోర్స్ వంటకం, కేకు -అనమాట. ముందసలు నాకు నచ్చినదేమిటంటే – ముందే శాకాహారుల విషయం కనుక్కుని ప్రత్యేకం వేరే వంటకం తయారుచేయించడం (అది అంత బాలేకపోయినా, ఆలోచించారు కదా!!). ఇక, అందరూ గ్లాసులకు గ్లాసులు భలే తాగారు. నాకు భలే వింతగా అనిపించింది 🙂 ఇరవై మందిలో ఒకరిద్దరు మాత్రం తాగింది ఎక్కేసి, కాసేపు నాన్సెన్సు మాట్లాడి (నవ్వుతో పాటు) చిరాకు తెప్పించారు …అది వేరే విషయం. ప్రతి విడతకూ గ్లాసులు నింపే వెయిటర్ నాకు మళ్ళీ మళ్ళీ యాపిల్ జ్యూసు నింపుతూ ఉంటే, ఇంక నేను తాగలేను బాబూ, మంచి నీళ్ళు తాగుతాలే అని చెప్పేసా 😛 మళ్ళీ ఒక రౌండు ఇండియా – కులమతాలు – భాషా బోధన – రిజర్వేషన్లు – రాజకీయాలు – శాకాహారులు : ఈ విషయాల గురించి ప్రశ్నలకి జవాబివ్వక తప్పలేదు 🙂

4. ఇరవై మందిలో పదమూడు భాషల వాళ్ళం ఉన్నాం. 14 దేశాల వాళ్ళం ఉన్నాము. చివర్లో – Thanks for your company అని ఎవరి భాషలో వాళ్ళని చెప్పమన్నారు. కాసేపు ఆలోచించి, “ఇంతసేపూ సరదాగా గడిపినందుకు ధన్యవాదాలు” అని చెప్పాను. ఆపై, నా పక్కన కూర్చున్న నార్వేగియన్ ప్రొఫెసర్ తో – “అన్నదాతా సుఖీభవ” అని అంటారు ఒక్కోసారి..అలాంటిది మీ భాషలో ఉందా? అని అడిగితే, లేదన్నారు. “భుక్తాయాసం” కూడా లేదంట! 🙂

5. లింగ్విస్టులకి సాంకేతికాంశాల గురించి వివరించడం నా వల్ల కాలేదు ఇవ్వాళ 😦 నిన్నా, మొన్నా జరిగిన టాకుల్లో ఇలా కంప్యూటర్లు జొరబడ్డ సందర్భాలు తక్కువ కావడంతో తెలీలేదు కానీ, ఇవ్వాళ మొత్తం మషీన్ల మయం కావడంతో, ఆడియన్స్ లో ఉన్న తేడాలు బాగా కనబడ్డాయ్ నాకు!!

6. గూగుల్ ట్రాన్స్లేట్ – తెలుగు,ఇంగ్లీషు కి కూడా వచ్చింది (ఇతర దక్షినాది భాషల్తో సహా). అబ్బో!!!! ఒక రేంజిలో ఉంది. ఆ ఉదాహరణలతో త్వరలో మళ్ళీ ఒక టపా రాస్తా. కానీ, ఇవ్వాళ మధ్యలో బోరు కొట్టిన ఒక టాకులో నాకు కాలక్షేపం దానితో ప్రయోగాలే!!

7. నగర సంచారంలో భాగంగా సాయంత్రం – రేవు వద్ద చాలా సేపు నడిచా. రేవునానుకునే ఇళ్ళున్నాయ్ ఒక పక్క. అసలు జర్మనీలో నదిని ఆనుకునీ, ఇక్కడ ఇలా…చూస్తూ ఉంటే నాఖు అర్థమే కాదు. అంత హాయిగా ఇళ్ళెలా కట్టేస్కుంటున్నారు? భయం ఉండదా? అని.

8. ఇవ్వాళిక్కడ బోలెడంత మంది ఇండియన్లని చూశా 🙂

9. నార్వేలో టర్కిష్ వాడి ఫలాఫెల్…జర్మనీ లో టర్కిష్ వాడి ఫలాఫెల్ తో పోలిస్తే రుచి వేరేలా ఉంది. అయినా రెండూ నచ్చాయ్ నాకు 🙂

10. నిన్న రాత్రి పన్నెండైనా సూర్యుడు అస్తమించలేదు. పైగా, దాదాపు పదకొండింటికి కూడా ఎండ మొహం మీద కొట్టింది!!

-ఇవ్వాళ్టికి బులెటిన్ ఇంతే!

Advertisements
Published in: on June 23, 2011 at 1:41 am  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/23/2moredaysnorway/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. 😀 😀

 2. veelite norwigian culture pics.. timing issues gurinchi raayandi..thanks..

 3. Nice.. ఇంక రేపటి బులెటన్ కోసం ఎదురు చూస్తున్నాను.

 4. తెలుగుని భ్రష్టు పట్టించడానికి Google Translate కంకణం కట్టుకుంది. How old are you? అడిగితే “ఎలా పాత మీరు?” అని చెప్పింది.

 5. తెలుగుని భ్రష్టు పట్టించడానికి Google Translate కంకణం కట్టుకుంది. How old are you? అడిగితే “ఎలా పాత మీరు?” అని తర్జుమా చేసి చెప్పింది.

 6. Hi,
  If you are still in Norway and near Bergen, here is an interesting piece of information for you.
  Wittgenstein did some of his work there at a retreat.
  …Wittgenstein set preparations in motion for settling in Norway. He wanted to escape what in his eyes was the atmosphere of superficial intellectualising in Cambridge. At the end of October he took a room in a guest-house in Skjolden, a small remote place northeast of Bergen, where he intended to spend the winter in lonely contemplation of questions of logic…
  From this:
  http://www.wittgen-cam.ac.uk/biogre4.html
  If you find time and the place is nearby , make a “pilgrimage” to that place and let us know your experiences.

 7. Telugu in google translate. nice. looked for it last week to know the meaning of ‘eetha pandu’. it wasn’t there then. i looked it now and translating as ‘swim fruit’ :). what is it in english for ‘eetha pandu’?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: