నార్వేలో రెండో పగలు

ఇవ్వాళ్టికి రాయనేమో అనుకున్నా కానీ, మళ్ళీ కొన్ని కనిపెట్టా…అందుకని…ఇవ్వాళ ట్రాజెడీ కథలే :(.

1. మా వర్క్‌షాపులో – చైనీసువాడి ల్యాప్టాప్ చైనీసులో ఉంది. నార్వే మనిషిది నార్వేగియన్ భాషలో…స్లొవేనియన్ ఆవిడది ఆ భాషలో…జర్మన్ ది జర్మన్ లో….ఇటాలియన్ ది ఇటాలియన్ లో…. ఇలా ఉన్నాయి. నాది మాత్రం చక్కగా స్వచ్చమైన ఇంగ్లీషులో ఉంది. అసలుకి సిగ్గుతో చావాల్సిన సంఘటన ఏమిటంటే – “ఓహ్…నువ్వు చైనీస్ లో వాడతావా కంప్యూటర్ని?” అంటే “అఫ్కోర్స్! ఇంకెందులో వాడతా?” అన్నాడు నా స్నేహితుడు! అది భాషాభిమానం/దురభిమానం కాదు. వారికి సహజంగా అబ్బిన గుణం అని నా అభిప్రాయం. ఇవ్వాళ్టి నుంచి ఏదో ఒకటి చేసి నేనూ తెలుగుకి మారిపోదాం అనుకుంటున్నా. అదివరలో ఒకట్రెండుసార్లు మారి అలవాటు పడక రెండ్రోజుల్లో తీసేసా. ఈసారి మాత్రం కొంచెం ధృఢంగా ప్రయత్నించాలి. (సహజంగా అబ్బాల్సిన దానికి… ఇలా అనుకోవాల్సి రావడం ఎంత ట్రాజెడీనో కదా!! తెలుగుపదం గ్రూపు వారికి ఒక పెద్ద నమస్కారం. ఒక పక్క వ్యతిరేక వ్యాఖ్యలు వస్తూ ఉన్నా ముందుకు పోతున్నందుకు. ఇలాగే, “వర్షుకాభ్రముల ప్రళయఘోషవలే ఫెళ ఫెళ విరుచుకు పడండి!!” అన్న శ్రీశ్రీని తల్చుకుని ముందుకుసాగ్గలరు!)

2. ఊళ్ళో నడుస్తూ నడుస్తూ, ఇండియన్,చైనీస్, థాయ్, జపనీస్, టర్కిష్ – రెస్టారెంట్లు కనిపెట్టాము. ఇక్కడేదన్నా ప్రపంచంలో ఎక్కడితో పోల్చినా కనీసం డబల్ రేట్లు ఉండేలా ఉంది కనుక, తక్కిన రోజులకి జేబుకి క్షవరసేవతో, మాకు ఉదరసేవ మాత్రం లోటులేకుండా జరుగుతుంది అని మాత్రం అర్థమైంది. ఒక చైనీస్ రెస్టారెంటులో ఉండగా – మెనూ – నార్వేగియన్, చైనీస్, ఆంగ్ల భాషల్లో ఉంది. నేను ఆశ్చర్యపోవడం చూసి, నా స్నేహితుడు (అతను చైనీస్ అబ్బాయి)…”నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా ఒక చైనీస్ మెనూ పెట్టి ఉంటారు” అన్నాడు.

3. చైనాలో ఇంగ్లీషు మీడియంలో చదువుతారా? అని అడిగా. బహుశా ఏ 0.01% మందో చైనీస్ కాని మీడియంలో చదువుతారేమో. మాకు ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్ గా ఉంటుందంతే! అన్నాడు. నేను ఇంగ్లీషు మీడియంలో చదివాననీ… మన దేశంలో స్థానిక భాషా విద్యకి వెళ్ళడం నామోషీ అని చెప్పాలా వద్దా అని తటపటాయించి… మొదటి సగం మాత్రం చెప్పాను!

4. ఊరు మాత్రం నడిచేందుకు అద్భుతంగా ఉంది. అయితే, ఊర్లో ఎక్కడికక్కడ కనిపించే విగ్రహాలు అవీ ఏమిటో, ఎవరివో… ఇలాంటీవి మాత్రం అర్థమే కాలేదు. ఏ ప్యారిస్ లోనో, బెర్లిన్ లోనో చూసినప్పుడు ఆ పేర్లు తెలిసినవో, విన్నవో ఉన్నాయి – కొన్నైనా! కనీసం, మనకి తెలీకున్నా, అక్కడ రాసినదాన్ని బట్టి ఏదో ఒకటి అర్థమయ్యేది ఇక్కడ ఒక్కటి కూడా తెలిసిన పేరు లేదు. వీళ్ళేమో పేర్లు తప్ప వేరే ఏమీ రాయలేదు. రాసిన ఒకట్రెండు చోట్లా, వీళ్ళ భాషలో రాసారు.. :((

5. హోటలెదురుగ్గా హార్బరు 🙂

6.ఏమి రిసర్చో…ఎందుకు చేయాలో…చేసేం చెయ్యాలో…చెయ్యకేం చేయాలో – అనుకున్నా కొందరి టాక్స్ వింటూ….. 😛

(కొసమెరుపు: “మనంత సిగ్గులేని వాళ్ళం మనమే ఏమో” అన్నది ఒక స్నేహితురాలి నిట్టూర్పు, నేను ఆ కంప్యూటర్లలో వాళ్ళ భాషలు వాడ్డం గురించి చెప్పినప్పుడు.)

Advertisements
Published in: on June 21, 2011 at 2:35 am  Comments (11)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/21/norway-day-2/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. /వర్షుకాభ్రముల ప్రళయఘోషవలే ఫెళ ఫెళ విరుచుకు పడండి!!” అన్న శ్రీశ్రీని తల్చుకుని ముందుకుసాగ గలరు/
  మీ దీవెన ఫలించాలని కోరుకుంటున్నాను.

 2. Reason1 .. 200yrs british valla paalana valla oka baanisa manstatvam vachesindi .. english mana bhasha kakapoina pakka rashtram vadi hindi lo matladatam kante english lo matladatam manchidi anna bhavana kuda vachindi

  Reason2 .. telugu lo type cheyatam telugu lo rayatam mana existing world lo aithe kashtam 🙂 .. unless most of your friends also speak telugu. if i do that when i am on campus .. or at work .. lets say i fb in telugu i blog in telugu. then barely 10% of people around me would be able to read it :). if you are a chinese writing something chinese .. hi probability that everyone around you will understand it :).

  Inkonni reasons ilantivi unnai .. malli matladukundam 😛

  • @Halley: That is true…though..your Reason 2. Chinese have one language…and that perhaps helped. 😦
   But, even without teaching computers our language, we are still not as much passionate about our language as… other Indian states…don’t you think so?
   For us, “telugu abhimanam” means, craving for the next movie of our hero to release…I guess 😛

 3. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. తెలుగు లో మాట్లాడితేనే నామోషీ లా ఉంది ఈ మధ్య ఆఫీసుల్లో..
  అప్పర్ మిడిల్ క్లాస్ లో చాలా వరకు 50-60 ఏళ్ల వాళ్ల తో మాట్లాడినా.. ఇంగ్లిష్ లోనే సమాధానాలు చెప్తున్నారు.
  తమ పిల్లలకి ఒక్క సబ్జెక్ట్ గా తెలుగు నేర్పటానికి కూడా ఇష్టపదట్లేదు. దాని బదులు ఫ్రెంచ్ నేర్పిద్దామన్న ‘దూరాలోచన’!!

  ఇంక మనమింతే…

 4. భాష విషయంలో మనం second hand మనుషులం అంతే. ఇప్పట్లో తెలుగు మీద ప్రేమ ఉంటే లాభం లేదు. ఉన్మాదం కావాలనుకుంటా.

 5. కొసమెరుపు చదివి నిస్సిగ్గుగా సిగ్గు పడ్డాను. (అది సరిపోదని తెలిసీ కూడా.) రవి గారు చెప్పినట్టు ఇదో ఉన్మాదం కావాలేమో. పోరాటం సరిపోదు. ఇందాకే రాజ్ కుమార్ గారి బ్లాగ్ లో శ్రీ ఫెర్రర్ గారి మాటలు విని అనిపించింది. మనం ఆలోచిస్తున్న తెలుగులోనే రాతకోతలు, లావాదేవీలు జరపడం సంగతి ఎలా ఉన్నా, పిల్లలకు కనీసం మూడో భాషో, అయిదో భాషగానో అయినా తెలుగు ని ఇవ్వగలనా? అని. 😦

 6. […] కాంటెక్స్టు ఏమిటంటే తనే రాసిన టపా చూఢండి ఇక్కడ. ఇప్పుడు అసలు కథకొస్తాను. […]

 7. […] ఈనవల మూడో భాగంలో ఉన్నాను. సౌమ్య చాటులోకి వచ్చి ఈమధ్య తన అనుభవం ఒకటి చెప్పింది భాష గురించే. జర్మనీలో ఓ మనవాళ్ళ హోటలుకి వెళ్ళి, అక్కడ ఇంగ్లీషులో మాటాడుతున్న మనవాళ్ళు కనిపిస్తే, తను హిందీలో పలకరించిందిట. వాళ్ళు ఇంగ్లీషులో మాటాడేరు. దీనికి కాంటెక్స్టు ఏమిటంటే తనే రాసిన టపా చూఢండి ఇక్కడ. […]

 8. ఒకప్పుడు ఆంగ్లం ఇంత విరివిగా వాడుకలో లేని కాలం..యన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న సమయంలో అన్ని ప్రభుత్వ కార్యలయాలలో అన్ని విధానాలు తెలుగు బాషలోనే కొనసాగాలి అని ఉత్తర్వులు ఇచ్చారు..దానికి వ్యతిరేకంగా చాలా సినిమాలలోను..కథలలోను వ్యంగంగా తెలుగు భాషను అవమాన పరుస్తూ కథలు రాయడం.. సినిమాలు తీయడం చేశారు..అప్పట్లో ప్రజలు కూడ వాటిని బాగా ఆనందించారు..కాని అప్పుడూ రాబోయే ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టలేదు.

 9. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చాక కాని మనోళ్ళు ఆకులు పట్టుకొంటున్నారు..! యూరప్ దేశాలలోని ప్రజలెవ్వరూ ఆంగ్లం మాట్లాడడానికి ఆసక్తి చూపరు..అసలు ఆంగ్ల బాషని పరిగణలోకే తీసుకోరు..! మనమే వెన్నముక లేని మనుషుల్లా..మన ఆర్థికావసరాల కోసం మనల్ని మనం కోల్పోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తాము..దానిని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడుతూ వుంటాము.

 10. […] వెళ్ళారు. అక్కడ  ఏం జరిగిందో తన మాటల్లోనే వినండి – మా వర్క్‌షాపులో – […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: