నార్వే – మొదటిరోజు, రెండో రాత్రీ!

ఇదొక వ్యసనం – డైరీ రాయడం. ట్రావెలాగుడు కనుక, అంత సీక్రెట్ సమాచారం ఏమీ లేదు కనుకా, బ్లాగులో డైరీ రాస్తున్నా ప్రస్తుతానికి. ఇవ్వాళ పొద్దున్నే బయటపడి, పన్నెండౌతూండగా ఇల్లు చేరుతూ, కింద రోడ్డులో వస్తున్నప్పుడు అనుకున్నా – వెళ్ళగానే నిద్రపోవాలి అని. ఇదిగో, ఇలా..ఇప్పుడు… 🙂

1. బెర్గెన్ నుంచి ఫ్లాం అన్న పల్లెటూరుకి ఐదున్నర గంటల ఫెర్రీ ప్రయాణం పొద్దున్నే. ఒక పక్క అతి చల్లని గాలి. నోర్మూసుకుని ఫెర్రీలోపల కూర్చోక, బయట తిరుగుతూ గడిపేసరికి – చివరికొచ్చేసరికి – నా ఊపిరిలో కూడా ఉప్పువాసనా, చేపల కంపూ వస్తున్నాయేమో అని అనుమానం కలిగింది. ఏమైనా కూడా, అద్భుతమైన ప్రయాణం. అంతసేపు చుట్టూ నీళ్ళూ, కొండలూ, మంచూ తప్ప ఏమీ లేకపోవడం నామట్టుకు నాకు అద్భుతమైన అనుభవం. (వివరాలన్నీ తర్వాత తీరిగ్గా రాయబడును!)

2. ఫ్లాం పరమ చిన్న పల్లె. చుట్టూ హైకింగ్ కి మాత్రం చాలా బాగుంది. మేమో రెండు మూడు గంటలు నడకలో గడిపాము. అక్కడ పైకి ఎక్కే కొద్దీ, అద్భుతంగా ఉండింది వ్యూ!

3. బట్ ఐ హేట్ ఫ్లాం – అని చెప్పా కసిగా ఒకడితో. ఇవ్వాళ నాకు ఆహారం అందక సోషొచ్చి పడిపోవాల్సింది అసలుకి (అలా ఉంది శాఖాహారులకి పరిస్థితి!). నేనేదో ముందుచూపుతో కాసిని బిస్కట్లూ, ఫ్రూట్ జ్యూసూ పట్టుకెళ్ళా కనుక సరిపోయింది. స్ట్రాబెర్రీ కేక్ నాకు లంచ్ అయింది 🙂 దానితో త్వరగా ఆకలేసి, వెదుకుతూ ఉంటే, ఒక షాపులో చిప్స్ కనబడ్డాయ్. పొటాటో చిప్స్ కాదేమో అనుకుని, షాపు వాడిని అడిగితే – “సంథింగ్ లైక్ పొటాటో ఐ థింక్” అన్నాడు. “డస్ ఇట్ హావ్ మీట్?” అంటే, నో అన్నాడు. తీస్కున్నా (అబ్బో! ధర పేలింది!). నాకు తెరవడం రాక, నా ఫ్రెండుని అడిగితే, అతను తెరిచి…ఇది సీఫుడ్ వాసనొస్తోంది. నువ్వు కొన్నావేంటి? అన్నాడు. వెంటనే, నేను దాన్ని పట్టుకెళ్ళి షాపు వాడిని అడిగా – “అదేంటి? నువ్వు మీట్ లేదన్నావ్?” అని. “అవును. సీ ఫుడ్ మీట్ కాదుగా” అన్నాడు. అతనికి పక్కనే ఒకామె వత్తాసొచ్చింది. వాళ్ళ షాపులోనే అమ్ముతున్న వైకింగ్ కొమ్ముల కిరీటం ఒకటి వాడి తలపై పెట్టి, సుత్తేసి కొట్టాలనిపించింది. :P… కానీ, వాడినే చెత్తబుట్ట ఎక్కడుందో చెప్పు అని అడిగి, తెలీకపోతే నోర్మూసుకుని ఉండక, సంథింగ్ లైక్ పొటేటో అనడం దేనికి? అనేసి, చెత్తబుట్టలో పడేశా ఆ పేకెట్ ని. పడేసి, వాడితో అలా అన్నా…ఐ హేట్ ఫ్లాం అని! (No offense meant to anyone!)..అయినా, ఊరు చాలా బాగుంది. మిగితా వాళ్ళు మంచోళ్ళే!

4. ఫ్లాం నుంచి మిర్డాల్ స్టేషన్ కు చేసిన ముప్పావు గంట ట్రెయిను ప్రయాణం జేబుకి పెట్టిన పెద్ద సైజు చిల్లు ని… ఆ ప్రయాణానుభవం మాఫీ చేసేసింది. ఈ ప్రయాణాంలో చూసింది ఒక ఎత్తు, Myrdal చేరే ముందు చూసిన Kjosfossen జలపాతం ఒక ఎత్తు. నిజానికి, అసలీ ప్రయాణం లో అటు లోయా, ఇటు కొండలూ, మధ్యలో నదీ… కొండల పైన మంచూ, glaciers… అద్భుతంగా ఉండింది. (మళ్ళీ రాస్తా…మళ్ళీ రాస్తా! ఇది డైరీ ఎంట్రీ!)

5. మిర్డాల్ నుంచి బెర్గెన్ వెనక్కి రావడానికి ఎక్కే చోట, స్టేషన్ లో స్టాఫ్ కి నా గోడు వెళ్ళబోసుకున్నా – తిండిలేక శుష్కిస్తున్నా పొద్దున్నుంచి అని. ఒక మఫిన్, మామూలు చిప్స్, కాఫీ – కొనుక్కోగలిగా వాళ్ళ పుణ్యమా అని :)) ఈసరికే నేను తూలడం మొదలుపెట్టా. ట్రెయినుకేదో సమస్య వచ్చి Voss
అన్న ఊరిలో ఆగిపోయింది. అక్కణ్ణుంచి బస్సు. మళ్ళీ నదీ తీరం వెంబడి ప్రయాణం. నిద్ర నదిలో మునిగిపోయింది 🙂

6. ఊళ్ళో దిగాక, బస్సు వేరే చోట ఆపాడు కనుక, మా హోటెల్ దగ్గర్లో లోకల్ గా ఫేమస్ అయిన ఫిష్ మార్కెట్ ఉంది కనుకా – బస్సు డ్రైవర్ ని ఫిష్ మార్కెట్ కి దారి చెప్పమని అడిగాం. అప్పుడు సమయం పదకొండు గంటలు – రాత్రి. “ఇప్పుడు ఫిష్ మార్కెట్ కి వెళ్తారా?” అన్నాడు.. బహుశా మనసులో “క్రేజీ టూరిస్ట్స్” అనుకుని ఉండొచ్చు.

7. కొన్నేళ్ళ క్రితం ఒకానొక రోజు, ఇద్దరు మేధావుల (అయ్యో, ఇద్దరూ పీహెచ్డీ పట్టాలు గల వారు. అందుకే మేధావులు అంటున్నా. వ్యంగ్యం ఏమాత్రం లేదు!) మధ్య జరిగిన సంభాషణ గుర్తొస్తోంది.
“బస్ స్టేషన్ కు, బస్ స్టాండ్ బస్టాప్ కు తేడా ఏమిటి?”
“బస్ స్టేషన్ అంటే బస్సులు ఆగుతాయి..మనం వెళ్ళి ఎక్కుతాము. బస్టాప్ అంటే మనం వెళ్ళి ఆగుతాము. బస్సులే మన దగ్గరికి వస్తాయి”
-అన్న సంభాషణ విని దిగ్భ్రమతో గుడ్లు తేలేసిన విషయం గుర్తొస్తోంది ఇప్పుడు – పోయిన్సారి ఇలాంటి ఒక వర్క్షాపులోనే ఆ చర్చ ఒక గంట సాగింది – పదాలు, వాటి సెమాంటిక్స్, ఆపై వాటి sense disambiguation గురించి చర్చిస్తూ. దానితో, భయం… కుతూహలం రెండూ తన్నుకొస్తూ ఉండగా….. ఇవ్వాళ్టికి దుకాణం కట్టేస్తున్నా!

Advertisements
Published in: on June 20, 2011 at 3:54 am  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/20/norway-day-1/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. >>>>
  అయ్యో, ఇద్దరూ పీహెచ్డీ పట్టాలు గల వారు. అందుకే మేధావులు అంటున్నా. వ్యంగ్యం ఏమాత్రం లేదు >>>>

  నేనింకా ఇద్దరు మేధావులంటే.. ఒకరు పిహెడి పట్టా అల్రేడీ తీసుకున్నవారు.. ఇంకొకరు త్వరలొ తీసుకొబొతున్న వారు అనుకున్నా 🙂

 2. bus stop ante ? 😛

  • Oops sorry. What I wrote as “bus stand” was infact “busstop”. Bus stand and Bus station were interchangeable according to them. I confused bus-stand with bus-stop! 😛

 3. :)) @ potato biscuits. Place ni batti Meat /Non-Veg artham maripothundhi. Specific gaa “Does it have pork or beef or …. ” ani adagatam better!

 4. బావుంది.

  స్కాండినేవియా దేశాలలో (ప్రపంచంలోనే) అవినీతి (కరప్షన్) అతి తక్కువగా ఉంటుందని అంటారు. నిజానికి, ఈ మధ్యే ఒకట్రెండేళ్ల క్రితం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు, నార్వేని అతి తక్కువ అవినీతి వున్న దేశంగా గుర్తించారు. ప్రస్తుతం న్యూజీలాండు, సింగపూరూ మొదటి, రెండవ స్థానాల్లో వుండగా – నార్వే పదో స్థానంలో వుంది. (ఎదగవలసిన ఎత్తులని సూచిస్తూ మనం 87 వ స్థానంలో వున్నాము).

  అక్కడ అవినీతి లేమి మీకేమైనా ఎదురయిందా?

  అభినందనలు.

 5. Blog అంటే మనం రోజు వెళ్ళి అప్‌డేట్ చూసుకొని చదివేది… న్యూస్ పేపర్ అంటే రోజు మన ఇంటికి వచ్చి చదవమని బ్రతిమిలాడేది 🙂

 6. @Tinguranga: థాంకండీ!, మీ అమూల్యమైన సలహాకు 😛 😛 😛
  @chinnamayya: రెండు మూడు రోజులుండి పొయ్యే టూరిస్టులకి అవెక్కడ కనిపిస్తాయి? అని రాయబోతూ ఉండగా, ఇవ్వాళే వర్క్షాపులో కలిసిన ఒక స్లోవేనియన్ ఆవిడ చెప్పినది గుర్తొస్తోంది. వాళ్ళ ఫ్రెండెవరో ఇండియాలో పదిహేనురోజులున్నాడంట. ఇంతలోనే, దేనికో లంచం కూడా ఇచ్చాడంట :))
  @Viswanath: :)))


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: