బెర్గెన్ చేరి రోజు ముగించేలోపు ఏం జరిగిందంటే….

నేనిప్పుడే డెన్మార్కు మీదుగా నార్వే లోని బెర్గెన్ నగరం చేరుకున్నాను. అయితే, దారిలో కలిగిన ఆసక్తి కరమైన అనుభవాలు అర్జెంటుగా బ్లాగాలనిపించి..ఇలా…రాత్రి ఒంటిగంటకు… 🙂

1) కోపెన్ హెగెన్ (డెన్మార్కు) ఎయిర్పోర్టులో ఒక షాపులో మంచినీళ్ళ బాటిల్ కొంటే – బోర్డింగ్ పాస్ చూపెట్టమన్నాడు :)))) (అక్కడ ఏం కొన్నా చూపెట్టాలని ఒక బోర్డుంది కానీ, మరీ నీళ్ళ బాటిల్ కి కూడా అడుగుతారు అనుకోలా!! కనీసం లిక్కర్ కొంటే అడిగినా….ఏదోలే, అనుకోవచ్చు!). నేను అంతకంటే అతి తెలివి ప్రదర్శించా. ఏ బోర్డింగ్ పాసు చూపెట్టాలి? ఇక్కడికి వచ్చినదా? లేక ఇంకాసేపట్లో ఎక్కబోయేదా? అని అడిగా ;). పాపం…. పైన్నుంచి కింద దాకా చూసి, చివరికి నేను చూపెట్టిన బోర్డింగ్ పాస్ చూసి ఒప్పుకుని, డబ్బివ్వమన్నాడు. పక్క షాపులో యూరోలు తీస్కుంటారు కానీ, ఇక్కడ తీస్కోరంట. మంచి నీళ్ళకి క్రెడిట్ కార్డుతో డబ్బు కట్టాల్సి వచ్చింది :))

2) నార్వే లోని బెర్గెన్ నగరం ఎయిర్పోర్టులో దిగి, కొంచెం నార్వే క్రోన్ల కోసం మషీన్ లో యూరోలు వేస్తే, అది నాకు దాదాపు నూటా యాభై క్రోన్ల విలువ ఉన్న నాణేలు రాల్చింది. “ఓహ్…సో..యూ ఆర్ రిచ్ నౌ!” అన్నాడు నా కొలీగ్. నవ్వాలా? ఏడవాలా? అంతకు ముందే నాకు పదిహేను యూరోల విలువ చేసే చిల్ల నాణేలు ఇచ్చారు ఇంకో చోట. చిల్లకొట్టు చెట్టెమ్మలూ, చిట్టయ్యలూ, చిట్టీమెషీన్లూ (రోబోలు!) అంతా నాకే తగుల్తున్నారేంటో!

3)మా హోటెల్కి వెళ్ళేందుకు బస్సెక్కాం నేనూ, నా కొలీగ్. బస్సులో ఒకరు ఎక్కి రైల్వే స్టేషన్ అని చెప్పి టికెట్ తీసుకున్నారు. బస్సు వెళ్టూ ఉంటే, స్టాపు వచ్చిన ప్రతిసారీ డ్రైవర్ మైకులో స్టాప్ పేరు చెబుతున్నాడు. అతను రైల్వే స్టేషన్ అన్నప్పుడు వాళ్ళు దిగి బయటకు వెళ్ళారు. ఇంతలో ఈయన బస్సు దిగి, ఎక్స్‌క్యూజ్ మీ! అని అరిచాడు. నేను ఏమైందో ఏంటో! అనుకుంటూ ఉండగా, వాళ్ళని పిల్చి, రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళాలి? ఎంతసేపు నడవాలి? అంతా వివరంగా చెప్పి పంపాడు!!

4) మా స్టాపూ వచ్చేసింది. దిగబోతూ, బస్సు టైం టేబుల్ అదీ అడుగుతూ ఉంటే – మీరు టూరిస్టులా? ఫలానా హోటెల్ కు వెళ్ళాలా? అని అడిగితే అవును అన్నాము. మాక్కూడా దారి చెప్పాడు.
-ఇవన్నీ జరుగుతున్నప్పుడు సమయం రాత్రి పదకొండు గంటల పైనే!!

5) పన్నెండయ్యింది హోటెల్లో దిగేసరికి. రేప్పొద్దున్నే ఎనిమిదికి ఒక చోట ఉండాలి. ఇప్పుడే వెదికి పెట్టుకుందాం అని నడిచి వెళ్ళాము. ఆ సమయంలో ఏంటీ? అంటారా? మొదటగా – ఇంకా వెలుతురు తగ్గలేదు. పైగా జనాలేమో తాగే వాళ్ళు తాగడం, తిరిగే వాళ్ళు తిరగడం – వీళ్ళకి రోజు ముగిసేలా లేదు!!! (చలికాలం లో చేయలేనిదంతా ఇప్పుడే చేసేలా ఉన్నారు!!)

6) బెర్గెన్ మాత్రం చాలా చాలా అందంగా ఉంది. పైగా చుట్టూ నీళ్ళు!!

యూనివర్సిటీలో మా వర్క్‌షాపు సోమవారానిక్కానీ మొదలవదు కానీ, ఇంతలోపే మనుషులు తెగ నచ్చేసారు నాకు! 🙂 పైగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు కూడానూ! (అఫ్కోర్సు, చూడబోతే, శాకాహారులకి కష్టం లా ఉందిక్కడ. దానికితోడు, భయంకరమైన ధరలు. ఐనా, పన్నెండింటికి, అదీ శనివారం, షాపులు తీసి ఉండడమే గొప్ప విషయం లెండి – జర్మనీని చూశాక ఇలాగే అనిపిస్తుంది!!)

-ఇవన్నమాట మొదటి కొద్ది క్షణాల బెర్గెన్ విశేషాలు!!

Advertisements
Published in: on June 19, 2011 at 4:35 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/19/before-i-sleep-today-at-bergen/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. so nice of you to have put in your experiences so soon. will wait for more.

 2. బాగున్నాయ్ మీ కబుర్లు!

 3. Oh you are on the land of midnight sun kadha 😛 Asalu janalu akkada padukuntaara leka year mothaniki kavalsindhi winter lone cover chesesthaara ?

 4. నైస్.. ఇంటరెస్టింగ్ గా ఉంది.

 5. Sounds very interesting! Will wait to hear more from Norway! 😀

 6. :)) అచ్చంగా నిజ original book in the making!! అభినందనలు ఇప్పుడే చెప్పేస్తున్నా.
  అన్నట్టు ఆ నాణేలన్నీ నింపుకోడానికి చాలినంత పెద్ద జేబులున్నాయా?

 7. నార్వేలో – ముఖ్యంగా బెర్గెన్‌లో – అంతా గొప్పగానే ఉంటుందికానీ, తిరిగొచ్చిన తర్వాత జేబు (/క్రెడిట్‌కార్డు) ఎంత తేలికయ్యిందో చెప్పండి 🙂
  ఎటూ దగ్గరలో వున్నారు కదా, 23వ తారీకున రాత్రి పన్నిండింటికి సూర్యుడి ఫోటో కూడా తీసి బజ్‌లోనో, బ్లాగులోనో పెట్టుకోండి.

  Have a pleasant time!

  Regards,
  Sreenivas

 8. @Madhuri, Sri, Krishnapriya, Madhuravani: Thanks.
  @Tinguranga: మొత్తానికి కావాల్సింది ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా!
  @Malathi garu: చిల్లులు పడుతున్నాయ్!
  @SrInivAs gAru: పెద్ద పెద్ద చిల్లులు పడుతున్నాయ్..కార్డుకి కూడా! 😛


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: