ఒక పెద్ద థాంక్స్ గివింగ్!

నా పేరుతోనూ ఒక పుస్తకం వచ్చేసిందోచ్!! (అనువాదకురాలిగానే అయినా కూడా!)
(వివరాలకు ఇక్కడ, మరియు ఇక్కడ చూడండి.)

పుస్తకంలో వివిధ కారణాల వల్ల వివరంగా థాంకులు చెప్పలేకపోయా కనుక, ఇప్పుడు ఇక్కడ….. 🙂

చేసిందొక్క అనువాదం – దానికి ఈ ధన్యవాదాలూ, అంకితాలు ఏమిటి? చోద్యం కాకుంటే? నువ్వేమన్నా ఒరిజినల్ రాసావా??? అంటారా? నాదొక రకం అల్పసంతోషం లెండి! ఆపై, అనువాదమైనా, అసలుదైనా – వీళ్ళంతా పూనుకోకపొయ్యుంటే, నేను పూర్తి చేసేదాన్ని కాదు. పైగా, మొదటిసారి నేను పాలు పంచుకున్నదేదో పుస్తకం విడుదలైంది. కనుక, వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపడం, సగటు జీవిగా నా కనీస ధర్మం అని నా ఉద్దేశ్యం. ఆపై, మీ అభిప్రాయం, మీ ఇష్టం.

మొదటగా- వెంకట్ గారు గానీ ఈ విషయం ఒకరోజు మెయిల్ లో తెచ్చి ఉందకపోతే, నేనసలు ఈ విధంగా ఆలోచించేదాన్నే కాదు. అంతే కాదు, రాసాక కూడా, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్, ప్రింటింగ్ టైములో ఆయన గడిపిన సమయం వల్ల కాకపోతే, ఆ పుస్తకం అసలు బైటకి వచ్చేదే కాదు. నేను రాయడం తప్పిస్తే, చేసిందేమీ లేదు – వివిధ విషయాలు నా బ్రతుకుని, సమయాన్నీ మింగేస్తున్నందువల్ల. కనుక, అందరికంటే ముందుగా నేను ధన్యవాదాలు చెప్పేది వెంకట్ గారికే.

తరువాత – మొదట్నుంచి ప్రతి వ్యాసాన్నీ ఓపిగ్గా చదివి, టైపోలు అవీ సరిచేసి, వాక్య నిర్మాణంలో సూచనలిస్తూ, వ్యక్తిగతంగా కూడా చాలా ప్రోత్సహిస్తూ వచ్చిన మాలతి గారికి – ఎన్నిసార్లి చెప్పనూ?? :).

నేను చరిత్ర తవ్వితే – మొదటిసారి నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మా ఆంగ్ల అధ్యాపకులు (నిజానికి మాకు టీచ్ చేయలేదు) చంద్రశేఖర్ గారు “ఉద్యమం” అన్న పత్రిక్కి కొన్ని అనువాదాలు చేయించారు (దాదాపు పదేళ్ళ క్రితం!). బహుశా, వెంకట్ గారు అడిగినప్పుడు ప్రయత్నించడానికి పూనుకోడానికి అప్పుడు ఆయన నన్ను నమ్మి చేయించిన అనువాదాలే కారణం ఏమో!! థాంక్ యూ సర్!

కొత్తపాళీ గారూ, అరి సీతారామయ్య గారూ – చాలా ఓపిగ్గా అన్ని వ్యాసాలూ చదివి, సలహాలూ సూచనలూ అందించారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

నవతరంగం టీం లో – మహేష్ గారూ, సత్యప్రసాద్ గారూ, ఆనంద్ వారాల గారూ: అందరికీ చాలా చాలా థాంక్స్… నేను గాలికొదిలేసినా – మీరు పట్టించుకున్నందుకు. ముఖ్యంగా మహేష్ గారిని ఎన్నిసార్లు వేధించి ఉంటానో!!!!

వీళ్ళు కాక, ప్రత్యేకం నేను రుణపడి ఉండే వ్యక్తులు కొందరున్నారు. వాళ్ళకీ పుస్తకం తో, అనువాదంతో సంబంధం లేదు. కానీ, నేను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేశానూ అంటే, రకరకాల కారణాల వల్ల వీళ్ళే కారణం.

పూర్ణిమ – మధ్యలో నేను ఒక సంవత్సరం పాటు అనువాదం ఆపేసి…చెయ్యనని మొండికేసి, ఒక్క ఇరవై ముప్పై సార్లన్నా పూర్ణిమ తో అని ఉంటా ఆ మాట ఆ సమయంలో. ప్రతిసారి విని, ఒక సారి నవ్వి, ఒకసారి “అలా కాదమ్మాయ్…కొనసాగించాలి” అని చెప్పి, ఒకసారి “ఆ సరే” అనేసి, ఒకసారి “ఏం చేస్తున్నావ్? ఎందాకా వచ్చింది?” అని ప్రశ్నించి – ఇలా రకరకాలుగా నన్ను లూప్ లో ఉంచిన పూర్ణిమ కి చాలా థాంక్స్.ఆ సరికి నేను “ఎవడు చేస్తాళ్ళేవోయ్! ఇవతల బ్రతుకు సమరాలు బోలెడున్నాయ్!” అనుకుంటూ వదిలేశా (అడిగే వాళ్ళు కూడా లేర్లెండి అప్పుడు!). తర్వాత ఓ శుభముహుర్తాన మళ్ళీ మొదలుపెట్టానంటే, బహూశా, సగానికి పైగా కారణం తనేనేమో!!

ఇక, నా నేస్తం స్వాతి, కజిన్ సింధు, శ్రీరాం – ముగ్గురూ వారి వారి పద్ధతుల్లో, కాన్షియస్గా, అన్ కాన్షియస్గా ఎంతో ప్రోత్సహించారు. వాళ్ళకి కూడా థాంక్స్.

ఇక, అసలు ఆన్లైన్లో నేనేం చేస్తూ ఉంటానో ఇంట్లో చెప్పను (వాళ్ళుగా తెలుసుకుంటే వేరే సంగతి). కానీ, మా అమ్మా, నాన్నా, తమ్ముడు – ఈ ముగ్గురితో గడిపిన నా జీవితం వల్లే నేను దీన్ని రాసి పూర్తి చేయగలిగాను అని నమ్ముతున్నా కనుకా, ఇప్పుడు నాన్నుంటే ఎంతో సంతోషించి ఉండేవారు అని కూడా నమ్ముతున్నా కానుకా, ఏం అనుకున్నా, అనువాదం చేసాను కాబట్టి లెక్క ప్రకారం ఇదే నా మొదటి పుస్తకం కనుకా (మీ టైం బాగోకుంటే, భవిష్యత్తులో ఎప్పుడో ఒరిజినల్తోనే దిగబడతా ఏమో, ఎవరికెరుక!!!), పుస్తకం వీళ్ళకి అంకితం ఇచ్చుకోవడం నా కనీస హక్కు అని కూడా నమ్మేస్తున్నా!

అనువాదాలు కూడా అంకితమిస్తారా? అని అడిగారు ఒక స్నేహితులు. నాకూ సందేహం కలిగింది అలా అడిగించుకున్నాక – అప్పుడేమో గూగుల్ చెప్పింది – చాలా మంది ఇచ్చుకున్నారూ అని! ఆ కాసేపట్లో, అయితే, నేనే మొదలా??? అని సంతోషిస్తున్న దాన్ని కాస్తా అర్రెర్రే! నేను నూతన సంప్రదాయానికి నాంది పలుకలేదే…అని చింతిస్తున్నా ఇప్పుడు :)))

అదీ సంగతి!!

అన్నట్లు, నేనేదో ప్రొఫెషనల్ అనుకునేరు. నాకూ కొత్తే కనుక – ఏమన్నా తప్పులుంటే, భవదీయురాలికి తెలియజేయండి. మీకు నచ్చితే, నవతరంగంలో ఒక వ్యాఖ్య వదలండి 🙂

పుస్తకం ఇవ్వాళే ఆవిష్కరించబడిందని, ఫంక్షన్ బాగా జరిగిందనీ వేగుల ద్వారా తెలిసింది.

మొదటి రివ్యూ రాసిన కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు!!

Published in: on June 14, 2011 at 2:28 am  Comments (14)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/14/%e0%b0%92%e0%b0%95-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6-%e0%b0%a5%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%97%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

14 CommentsLeave a comment

 1. Congratulations Nestam !!

  ఒరిజినల్ తో త్వరలో మా ముందు ఉండాలని కోరుకుంటూ … నీ నేస్తం 🙂

 2. Once again BIG congratulations!! 😀 And we’ll wait for your original book now! 😉

 3. అభినందనలు!

 4. హృదయపూర్వక అభినందనలు..

 5. Congrats Soumya!
  naako peddaaaaa treat kavali 🙂

 6. అభినందనలు!

 7. Nice. మళ్లీ ఒరిజినల్ పుస్తకం ఏదైనా రాసేయండి. నేను ఈసారి కూడా అందరికన్నా ముందు రివ్యూ రాసేస్తా..

 8. Congrats.
  భవిష్యత్తిలో మీనుండి మరో పుస్తకం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

 9. హృదయపూర్వక అభినందనలు.
  భవిష్యత్తిలో మీనుండి మరో పుస్తకం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

 10. Dear, Congratulations to you and to all the people behind making this possible. 🙂
  I wish you reach many more heights and am sure of it! 🙂
  Keep rocking!!

  Love

 11. congratulations!! keep it up

 12. congrats! why not ebook? its easy for us(abroad) to buy.

  http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/article2105274.ece

 13. Congratulations 🙂

 14. Thanks everyone!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: