పారిస్ లో ఒక తాళాల వంతెన

ఒక పక్షం రోజుల క్రితం ప్యారిస్ వెళ్ళినపుడు, నేనూ, నా స్నేహితుడూ నగర సంచారం చేస్తూ ఉండగా, అతను నాకొక వంతెన చూపించాడు. దూరం నుంచి చూస్తే, సేన్ నది కింద ప్రవహిస్తోంది.. లాంచీలు తిరుగుతున్నాయి. పైన ఈ వంతెన – గుట్టలు గుట్టలుగా జనాలు. వంతెన తాలూకా సరిహద్దులు మెష్ లాగా అనిపించాయి.

అయితే, నా స్నేహితుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాక కానీ అర్థం కాలేదు ఆ వంతెన ప్రత్యేకత. నేను మెష్ అనుకున్నది – కొన్ని వందల తాళాల గుత్తుల సమాహారం!

వీటి వెనుక కథేమిటంటే – ఇక్కడ ఈ బ్రిడ్జిపై తాళాలేసి, చెవులు నదిలో పారేస్తారట ప్రేమికులు. ఆ చెవి ఎవరికీ దొరకనంత వరకూ (వాళ్ళొచ్చి ఆ తాళం కప్ప విప్పనంతవరకూ!) వీళ్ళ ప్రేమ నిలుస్తుందని వాళ్ళ నమ్మకమట (మనమే అనుకున్నా! అందరూ ఇంతే అనమాట!!) ఇక, ఇలాంటి కథ చెప్పాక, అక్కడ ఉన్న తాళాల గుత్తులను చూశాక, మనకి కుతూహలం ఆగదు కదా. నా మానన నేను బ్రిడ్జిపై నడిచి పోకుండా, ఆ తాళాల గుత్తుల్ని స్టడీ చేశా కాసేపు :))

సెక్యూరిటీ లాకులు కొన్ని. డబుల్ సెక్యూరిటీ లాకులు కొన్ని. పెదాల ముద్రలున్న తాళాలు ఉన్నాయి. ఎస్.ఓ.ఎస్. అని రాసున్న తాళం కూడా ఉంది (నిజం!! ఎంత ప్రమాదకరమైన ప్రేమో పాపం!). అలాగే, పాత కాలపు తాళంకప్పలు మొదలుకుని, అత్యాధునికమైనవి దాకా చాలా ఉన్నాయి. తాళానికి పైతాళం వేసిన అతిజాగ్రత్త కూడా ఉంది. ఇక, కొన్నింటిపై ఉన్న క్యాప్షన్స్ ఆకట్టుకున్నాయి. మచ్చుకి కొన్ని – (ఇరవై ఏళ్ళు పైబడ్డ ప్రేమలు)
“L+A, 1991-2011” అని రాసుండింది ఒకదానిపై.
“1978-2011 Locked together in love forever”
“1965 to Infinity” (!!!దాదాపు యాభై ఏళ్ళ ప్రేమ. గొప్పే!)
“కీత్ అండ్ స్టేసీ – 25 ఇయర్స్”
-ఇలాంటి క్యాషన్స్ తో పాటు, “మనమెప్పుడూ కలవకపోయినా, ఐ విల్ మిస్ యూ” అన్న ఒక తాళం కనబడ్డప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగింది.

ఇంకొన్ని రకాల తాళాలు (పాపం ఆ రెండు పెదాలనీ ఎంత పకడ్బందీగా బంధించారో చూడండి!) –

నేను ఇదంతా చూసింది మే ఇరవై న. అంతకు ముందురోజే వేసిన తాళాలు కూడా కొన్ని కనబడ్డాయి. అంటే, జనం ఇంకా అలా తాళాలు వేస్కుంటూనే ఉన్నారనమాట. 🙂 అయినా, ఇక్కడ ఈ ప్రహసనం ఈ మధ్య కాలంలోనే మొదలైందంట లెండి. కనుక, పర్వాలేదు. కొన్ని దేశాల్లో చాలా కాలం నుంచీ ఉందట!

నాకు బ్రిడ్జి పేరు గుర్తులేదు కానీ, గూగుల్ సర్చ్ బట్టి, “Pont des Arts” అని ఊహిస్తున్నా.

ఇంతకీ, వీళ్ళదో వెర్రి అనుకుని, అలా అనుకోడం, దాని గురించి రాయడం నా వెర్రి, అనుకున్నా.
కానీ, నాలా చాలామంది రాసినట్లున్నారు! ఇదిగో, యూ.కే. నుంచి వచ్చే “ది ఇండిపెండెంట్” పత్రిక ఈ బ్రిడ్జి పై ఉన్న తాళాలు తొలగించాలన్న ప్యారిస్ మునిసిపల్ అధికారుల ఆలోచనల గురించి రాసిన వ్యాసం. ఇదిగో, ఒక ఫ్రెంచి పత్రికలో దీని గురించే, మంచి ఫొటోలతో మరో వ్యాసం.

(అన్నట్లు, నా బ్లాగుకి 400 టపాలు అయ్యాయోచ్!!)

Advertisements
Published in: on June 6, 2011 at 7:00 am  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/06/lovelock-bridge-paris/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. 😀

 2. links to references are missing.

 3. @chavakiran: There are links wherever I decided to put some.
  So, look carefully 😛

 4. సో, మనుషులు ఎక్కడైనా మనుషులేనంటారు! 😉 😀
  Congratulations for the 400th post! Keep going! 🙂

 5. చాలా బాగుందండి తాళాల వంతెన.
  అభినందనలు మీ బ్లాగుకి 400 టపాలు అయ్యినందుకు అలాగే ఇంకా మరెన్నో టపాలు రాయాలి మీరు.

 6. ఆహా చాలా ఆసక్తికరమైన నమ్మకం 🙂 ఎక్కడైనా ఒక్కటే నమ్మకాలు అంటారు బాగుందండీ మీ పోస్ట్ 🙂 నాలుగువందల టపాల మైలు రాయి చేరుకున్నందుకు అభినందనలు 🙂

 7. పక్షం క్రితం Seoul Tower వెళ్లినప్పుడు ఇలాంటిదే చూశా..నమ్మకాలేమో గాని …పక్కన Shopలో తాళాల అమ్మకాలు బాగున్నాయి..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: