చెప్పలేను!!

ఇందాకే మధురవాణి గారి బ్లాగులో ఈ టపా చూశాను. పాతదే అనుకోండి, నేనిప్పుడే చూశాను. చూడగానే, మదీయ మర్కట మానసం ఆవేశానికి గురై, తన గోడు చెప్పుకుంది. అదే ఇది.

మరేమో, ఆలస్యం చేద్దామని ఎంతకష్టపడ్డా తొందరగా లేచేసే నన్ను చూసి నాకే ఎందుకు నవ్వొస్తుందో చెప్పలేను
దరిద్రుడు బంగారం పట్టుకుంటే అది ముగ్గురాయయినా ఎందుకు నవ్వొస్తుందంటే చెప్పలేను
గంటల తరబడి మెదడు తినేస్తున్న వాడి మొహం చూసి కిసుక్కున ఎలా నవ్వగలవంటే చెప్పలేను
అమ్మో, అమ్మమ్మో ఇంకొకరో మాటల్తో తలంటుతూ ఉంటే, నవ్వే వెధవ నవ్వుకి కారణం చెప్పలేను
టెన్షన్ తో చచ్చిపోతున్నప్పుడు, ఎదురుగుండా వచ్చే విచిత్ర వేషధారిని చూసి ఎలా నవ్వుతావంటే చెప్పలేను.
జరిగేదొకటైతే ఎప్పుడూ ఇంకోలా అర్థం చేస్కుని నవ్వుకున్తావేంటి? అని అడిగితే బదులు చెప్పలేను.
ఎందుకు ఎప్పుడు చూసినా ఇహిహి అంటూ ఉంటావు? అని ఏ ఎక్స్ కసిరినా… ఇహిహి తప్ప వేరేమీ చెప్పలేను
“ఐ టోల్డ్ యూ నాట్టు లాఫ్”…చిన్నప్పుడు టీచర్ కసిరినా బుద్ధి ఎందుకు రాలేదు అంటే, చెప్పలేను.
కన్నీళ్ళని ఏకధాటిగా మింగుతూ ఉన్నా, తుంటరి పనొకటి గుర్తురాగానే ఎందుకు నవ్వొస్తుందంటే చెప్పలేను
నువ్వొఠ్ఠి నాన్సెన్సు మనిషివి – అనగానే చిరుమందహాసమెందుకు? అంటే చెప్పలేను.
మాకు నవ్వెందుకు రాదంటే ….మీకు నవ్వెందుకు రాదో నాకు తెలీదు కనుక సమాదానం చెప్పలేను
నీకెందుకు నవ్వంటే, అంతకంటే తెలీదు కనుక, దానికీ జవాబు చెప్పలేను
“నా చిన్ని, ‘చిలిపి’ మనసు చిరుస్పందనలకి కారణమేమని బదులివ్వగలను.!?”

(చెప్పి మరీ రాసినా, నవ్వగలిగినందుకు మధురవాణి గారికి ధన్యవాదాలు)

Published in: on May 20, 2011 at 7:34 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/05/20/%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. Hihihi… i belong to the same club!🙂 Keep smiling!

  2. 😀😀😀😀

    మీ కవిత చూసి ఎందుకలా నవ్వుతున్నావంటే నేనేమని బదులివ్వగలను!?😉

  3. ఇది నేను చూడలేదే! భలే రాసిందే మధుర, ప్రతొక్కళ్ళమూ ‘అవున్నిజవే” అనుకునేలా!

  4. !“ఐ టోల్డ్ యూ నాట్టు లాఫ్”…చిన్నప్పుడు టీచర్ కసిరినా బుద్ధి ఎందుకు రాలేదు అంటే, చెప్పలేను.!
    సూపర్ అండి బాబు..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: