మాటలు-మౌనాలు

[గమనిక: అసలు నేనేం రాద్దామనుకున్నానో, ఆ టైటిల్ ఎందుకు పెట్టానో, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. దాదాపు సంవత్సరం క్రితం రాసి ఆపేశిన డ్రాఫ్ట్ ఇది. మొన్నోరోజు చూసి, ఎంత సేపు ఆలోచించినా, ఎందుకు రాసానో తట్టక, చివరికి విసుగేసి, చివర్లో ఒక పేరా చేర్చి, ముగించేశాం అనిపించా. అదే ఇది. బహుశా, కథలా మొదలుపెట్టి ఉంటా కానీ, ప్రస్తుతానికి ఇలా ఆపేస్తున్నా!]

కసి, కోపం నేను ముందంటే నేను ముందని లోపలనుంచి బయటపడేందుకు తన్నుకుంటున్నాయి ఒకదాన్నొకటి. లోపల అవి తన్నుకుంటూ తన్నుకుంటూ, వాటి క్రింద ఉన్న భూమిని దున్నడం మొదలుపెట్టాయి – అది గతం. గతం లోని జ్ఞాపకాలన్నీ ముక్కలు ముక్కలుగా ఎగిరి పడుతూ,మెదడులోకి కొన్నీ, మనసులోకి కొన్నీ శరణాగతులై వచ్చాయి. శరణుకోరి వచ్చిన ఈ శకలాలే కాసేపయ్యేసరికి – దిశానిర్దేశం చేయడం మొదలుపెట్టాయి – మనిషికి.

లోలోపల పుట్టుకొస్తున్న నిస్సహాయత గాలాడక, అల్లాడుతూంటే, నిర్దాక్షిణ్యంగా దాన్ని బయటకు గెంటేశాయి – కొత్త అధికారాలు. దానితో, నన్ను లోపలికెళ్ళనివ్వండి, ఓ మూల ఎక్కడన్నా కూర్చుని ఏడ్చుకుంటా – అని బయట నుంచి దాని ఏడుపొకటి మొదలైంది.

ఈ గొడవల మధ్య సయోధ్య కుదర్చడం మెడడులేని మనసుకి అసందర్భమనిపించింది. అసంభవమనిపించింది. కానీ, ఈ మెదడుందే, దానికి అతితెలివి. తను కేకలేస్తే, భయానికి కసీ,కోపం,నిస్సహాయతా అన్నీ కిక్కురుమనకుండా పడుంటాయని ఊహించింది. దానితో ఉన్న బలాన్నంతా కూడదీసుకుని శరాఘాతాల్లా మాటలు వదలడం మొదలుపెట్టింది. కోపాల, కసుల, నిస్సహాయతలకి అవే ఆత్మఘాతాలౌతాయనీ, మరుక్షణం వాటికి మరణ ఘంటికలు మ్రోగుతాయనీ – ఊహించింది మెదడు. మెదడు దుడుకుతనం చూసి, నిజమే కాబోలని ఆశించింది మనసు.

దానితో, మౌనంగా దాచుకున్న తనలోని మాటల్నంతా తాను కూడా వదలడం మొదలుపెట్టింది. మాటలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డం మొదలైంది. కాసేపు నిశబ్దం. దానితో, విజయ గర్వంతో మెదడు – శక్తి కొద్దీ బయటికి గెంటేస్తోంది – ఇన్నాళ్ళూ లోలోన దాగిన మాటల్ని. కానీ, ఎంత సేపు ? మాటలన్నీ వెళ్ళి నేరుగా గోడలను ఢీకొంటున్నాయి. యుధ్ధాల్లో విరిగిన కత్తులకు మళ్ళే రక్తాలు చిందిస్తున్నాయి. కానీ, అక్కడికక్కడ మరణించట్లేదు. రక్తం చిమ్ముతున్న శరీరాల్తో ఫాట్మని మొహంపై కొట్టి…. వచ్చిన దారెంబడే మళ్ళీ వెనక్కెళ్ళి పోతున్నాయి. మనసంతా శవాల వాసన, మెదడంతా ఈ శవ ప్రవాహానికి తెగి పడుతున్న నరాల వేదనా ఆవరించాయి.

శవాల అలలతో కల జడివానై, మీద పడుతూంటే, తడిసిపోతున్నాని దుప్పటి ఇంకా బాగా కప్పుకున్నా. కప్పుకున్నా అనుకున్నా. పైకి లాక్కుని, కింద వణుకుతున్నా అని అర్థమైంది. ముడుచుకున్నా, మూడంకె వేసినా – మాటలు తగిలి తగిలి దెబ్బతీస్తున్నాయి. పైకి లేద్దామా అంటే, మౌనం కట్టి పడేసింది. తెరవలేక మూస్తున్న కళ్ళ మధ్య నుండి – చీకటిలో, స్టాండ్బై లో ఉన్న టీవీ పై మెరుస్తున్న చుక్క తప్పిస్తే, మరేదీ కనిపించలేదు.

Advertisements
Published in: on May 6, 2011 at 8:00 am  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/05/06/matalu-mounalu/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. గతం లోని జ్ఞాపకాలన్నీ ముక్కలు ముక్కలుగా ఎగిరి పడుతూ,మెదడులోకి కొన్నీ, మనసులోకి కొన్నీ శరణాగతులై వచ్చాయి.
  ———–
  మనస్సు గురించి సరీగ్గా చెప్పారు. కొంచం నా పోస్ట్ చదివి అది ఎంతవరకూ మనకి ఉపకరిస్తుందో చెప్పండి. ఉపయోగకరంగా వ్రాద్దామని.
  http://www.mytelugurachana.blogspot.com

 2. మీరు ఏ సందర్భంలో రాశారో, ఏ సన్నివేశంలో ఏ పాత్రకోసం రాశారో అర్థంకాలేదు! అయినా ఇందులోని భావాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.
  నన్ను బాగా ఆకట్టినవి ఈ రెండు!
  ………………..
  …లోలోపల పుట్టుకొస్తున్న నిస్సహాయత గాలాడక, అల్లాడుతూంటే, నిర్దాక్షిణ్యంగా దాన్ని బయటకు గెంటేశాయి – కొత్త అధికారాలు. దానితో, నన్ను లోపలికెళ్ళనివ్వండి, ఓ మూల ఎక్కడన్నా కూర్చుని ఏడ్చుకుంటా – అని బయట నుంచి దాని ఏడుపొకటి మొదలైంది.

  శవాల అలలతో కల జడివానై, మీద పడుతూంటే, తడిసిపోతున్నాని దుప్పటి ఇంకా బాగా కప్పుకున్నా. కప్పుకున్నా అనుకున్నా. పైకి లాక్కుని, కింద వణుకుతున్నా అని అర్థమైంది…..
  ………………..

  ఏదైన కథలో సన్నివేశానికి పొదిగించడమో, లేక ఒక పాత్రయొక్క నిస్సహాయత కేకగానో దీన్ని పలికిస్తే ఇందులోని భావాలకు ఇంకా బరువు పెరుగుతుందనిపిస్తుంది.

  కొన్ని lines పొయటిక్ గా కూడా అనిపించాయి!

 3. ఏం చప్పలేను. Just చప్పట్లు…..

  >>మనసంతా శవాల వాసన, మెదడంతా ఈ శవ ప్రవాహానికి తెగి పడుతున్న నరాల వేదనా ఆవరించాయి…..

  ఈ లైన్ నుండి ఒక different level కి వేల్లిపోయింది మొత్తం concept.

  Great Job!!

 4. బయటకు పడటానికి ఇష్టపడని, మనోగతమే ఇది. ఆర్టిఫిషియల్ లైఫ్ లో అప్పుడప్పుడూ…మనకే తెలియకుండా…అంతర్గతంగా ఉన్న భావాలు ఇలా బయటపడతాయని నాకనిపిస్తుంది. కథకన్నా….సహజమంటేనే బాగుంటుందేమో:) చివరిదాకా ఏకబిగిన చదివించేసిన ఈ మనోభావాలు మాత్రం నిజం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: