నా శాకాహారిత్వం కథ

అదొక కథ. విషాదం కాదు. ఆనందం కాదు. కానీ, నేను మాత్రం ఒక్కొక్కప్పుడు నవ్వా. ఒక్కొక్కప్పుడు తిట్టుకున్నా. ఒక్కొక్కప్పుడు ఏలా స్పందించాలో తెలీక తెల్లబోయి చూశా. టూకీగా చెప్పాలంటే, నెళ్ళాళ్ళలో నా శాకాహారానుభవాలు అలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే,

అసలు ఇక్కడికి వచ్చే ముందు నుంచే నన్ను చాలా హడలగొట్టారు – తినడానికి ఏం ఉండదు నీకు. కనీసం ఎగ్గైనా తిను (తింటా అని చెప్పాక కూడా!). కుక్కర్ కంపల్సరీ. వెజిటేరియన్ అంటే నమ్మేయకు, వాళ్ళ డెఫినిషన్ వేరు. అదీ ఇదీ, ఏదో, ఏదేదో -అని. సరేలే, అంతంత మంది వెళ్తూ ఉంటారు కదా. వీళ్ళలో శాకాహారులుగానే బ్రతుకుదాం అని నిర్ణయించుకున్న మనుషులే ఉండరా? అన్న ధీమా నాది. వచ్చాక మొదటి రోజే, నా కొలీగ్ ఒకామె వీగన్ అని తెలిసింది. దానితో, నేను రిలాక్సైపోయా. పాల తాలూకా ప్రాడక్ట్స్ కూడా తీసుకోరు కదా వీగన్స్ అంటే. ఈవిడే బ్రతగ్గా లేంది, మనకేం భయం లేదు అనుకున్నా :)) ఇప్పటి దాకా బోరు కొట్టకుండా రకరకాలు ట్రై చేశా అనుకోండీ, అయితే, వెజిటేరియన్ అన్న భావం గురించి ఇక్కడ రకరకాల అభిప్రాయాలు ఎదురయ్యాయి.

వచ్చిన మొదటి/రెండో వారంలో, ఒక రొమేనియన్ స్నేహితురాలితో గెస్ట్ హౌస్ లో సంభాషణ జరుగుతోంది. ఆమె నేను ఈ దేశానికి కొత్త కనుక, ఎక్కడెక్కడ ఏమేం దొరుకుతాయో చెబుతూ ఉండింది. అలా చెబుతూ ఉండగా, నేను క్యూరియాసిటీ కొద్దీ – వెజిటేరియన్ ఎక్కడ బాగుంటుంది? అన్నా. ఏదో చెప్పినట్లుంది కానీ, ఎక్కువ ప్రశ్నించలేదు. మరొక రోజు, చేపలతో ఏదో వండుకుంటూ ఉండగా నేను కిచెన్ లోకి ఎంటర్ అయ్యా. అప్పుడు నాకది చూపిస్తూ, యూ కాన్ ట్రై దిస్ అని, దిస్ ఈజ్ ఫిష్ అన్నది. నేను, నేను ప్రవర చెప్పుకున్నా మళ్ళీ… నేను శాకాహారిని అని.
“అయితే, చేపలు కూడా తినవా?”
“తినను. మాంసం ఉండేవి ఏవీ తినను”
“వీగన్ వా?”
“కాదు.”
“ఎందుకు వెజిటేరియన్ వి?”
“పుట్టుకతో అంతే. మా ఇంట్లో తినరు”
“ఎందుకు?”
“అదీ….మరీ…అదీ…. ఇండియాలో కొందరు అలా ఉంటారు.”
“అయితే, జన్మలో ఇప్పటివరకూ తినలేదా?”
“లేదు”
“బట్…హౌ డిడ్ యూ గ్రో అప్??”
(నిజానికి, ఆకారంలో నేనే ఆమె కంటే పొడుగ్గా, బలంగా కనిపిస్తాను)
-ఇదిగో, ఇలా పెరిగాను. బానే బలంగా ఉన్నానుగా…అని నవ్వాను.
“అదిసరే, కానీ, మాంసం తినకుంటే, మరి కావాల్సినంత బలం ఎలా వస్తుంది? అయినా, తినడానికన్నా ఏముంటాయి అసలు?”
ఇక్కడ, ఇండియాలో నాలాంటి జీవులు చాలామంది ఉంటారు కనుక, వెజిటేరియన్లు బ్రతికేందుకు, తినేందుకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే, అప్పటికి శాంతించింది ఆమె. అప్పటి దాకా, ఖంగారు – పాపం ఏం తింటారో వీళ్ళు అని!
********************************

మరోరోజు, సూపర్ మార్కెట్లో: అప్పటికింకా డిక్షనరీ కొనుక్కోలేదు. బాగా ఖచ్చితంగా మాంసం లేదని నిర్ధారణ చేసుకుని గానీ తినే పదార్థం దేన్నీ కొనడం లేదు. అనుమానం వస్తే, షాపు వాళ్ళనో, లేకుంటే, సిగ్గు పడకుండా తోటి కస్టమర్లనో అడిగి కనుక్కోవడమే. ఇలా, ఒకటి కొందామని వెనుక ఇంగ్రీడియెంట్స్ చూస్తూ ఉంటే, అంతా వెజిటేరియన్ అన్నట్లే అనిపించింది. కొనేద్దామా? అనుకుని, సందేహం కలిగి, ఒకాయన్ని అడిగా. ఆయన, ఒక క్షణం దాన్ని చదివి – “ఓహ్, ఇది శాకాహారమే. ఇందులో ఏం లేదు. జస్ట్ నూనెలో మాత్రం చికెన్ ఉంటుంది. అంతే. దిస్ ఈజ్ వెజిటేరియన్” అన్నాడు. నాకు ఒక పక్క నవ్వు. ఒక పక్క అయోమయమూ. ఆయనకి థాంక్స్ చెప్పి దాన్ని యధాస్థానంలో ఉంచేశాను. నూనెలో చికెన్ ఏంటో అర్థం కాలేదు కానీ, బహుశా యానిమల్ ఫాట్ ఏమో అని ఊరుకున్నాను.

డిక్షనరీ కొన్నాక, ఈ బాధ తీరిపోయింది. టైం పడితే పట్టిందని, ప్రతి చోటా ఆగి, నాకు నేనే కంఫర్మ్ చేసుకున్నా. ఇలా నాలుగైదుసార్లు చేసేసరికి పేర్లు తెల్సిపోయాయి.
*********************************

అసలు బయట రోడ్డున పడి తిర్గుతున్నప్పుడు ఆకలేస్తే, మహా అనుమానం నాకు – ఏం తినాలా? ఎక్కడ తినాలా? అని. టర్కిష్ వారి వంటల గురించి తెలుసుకున్నాక, ఆ అనుమానం మాట మర్చిపోయా అనుకోండి, అది వేరే విషయం.
**********************************

ఇంకోరోజు…మా యూనివర్సిటీ మెస్ లో రోజు ఒక వెజిటేరియన్ మెనూ ఉంటుంది. వాళ్ళని నమ్మి సాధారణంగా నేను అసలు అక్కడ ఏం వండుతున్నారూ? అన్నది పేర్లు కూడా చూడకుండా తినేస్తూ ఉంటా. బానే ఉంటాయి అన్నీనూ. ఇలా ఉండగా, ఒక శుక్రవారం నాడు ఇలాగే తింటూంటే, అన్నీ తీపి పదార్థాలే. విరక్తి వచ్చింది -అంత తీపి తినలేక. నా కొలీగ్ తో చెబుతూ ఉంటే, “ఐ థాట్ ఇండియన్స్ లైక్ స్వీట్స్” అన్నాడు. ఇలా మొత్తం భోజనం స్వీట్లు తినడం అన్ని ప్రాంతాలా ఇండియన్స్ కీ అలవాటు ఉండదు మహానుభావా! అని చెప్పాక, అందరూ కాఫీ తాగుతూ ఉంటే, నేను మాత్రం ఒక మింట్ నములుతూ కూర్చున్నా – ఆ తీపి పోవడానికి. ఆవేళ్టి నా లంచ్ ని గమనించిన మరో కొలీగ్ – “ఎందుకంత కష్టపడ్డం? ఆ రెండో మెనూ తినుండొచ్చు కదా?” అన్నాడు.
జవాబుగా నేనేమో – “మొదటగా, నాకు ఐటెంస్ పేర్లు తెలీవు కనుక, అవి స్వీట్లు అని తెలీవు. రెండోది – నాకు అంత చాయిస్ లేదు కదా. వెజిటేరియన్ మెనూ ఇదొక్కటే, సలాడ్స్ కాకుండా.”
“లేదు. రెండో మెనూ కూడా వెజిటేరియనే. ఫిష్ మాత్రమే ఉంది.”
“ఫిష్ వెజిటేరియన్ ఎలా ఔతుంది?” అన్నాన్నేను.
“ఎందుక్కాదు?”
“అది మాంసం కాబట్టి.”
“ఓహో, ఐతే, ఫిష్ మాంసం అనమాట.” అని నవ్వాడు అతను.
(ఇక్కడే, నేను బెంగాలీనై ఉంటే, ఈ చింత లేకపోవును కదా అనిపించింది..హీహీ)

ఈ ముక్కే ఫ్రాన్సు లో ఉన్న ఒక స్నేహితురాలితో చెబుతూ ఉంటే, “వాళ్ళే నయం. గ్రీకు వాళ్ళైతే చికెన్ కూడా మీట్ కాదంటారు. వాళ్ళకి బీఫ్, పోర్క్ ఇలాంటివే మీట్ అట” అన్నది, తన గ్రీక్ కొలీగ్ తో జరిగిన సంభాషణల మూలాన కాబోలు!

***************************
ఇంకోరోజు, ఒక రష్యన్ కొలీగ్ లంచ్ చేస్తూ చేస్తూ, ఉన్నట్లుండి – “సోమ్యా, డు యూ ఈట్ కౌ?” అన్నది.
నాకు ఒక క్షణం పట్టింది ఏమడిగిందో అర్థం కావడానికి. ఇంతలోపు మరో కొలీగ్ – “తను వెజిటేరియన్.” అన్నది.
అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి -“కానీ, మామూలుగా ఇండియాలో తినరనుకుంటాను కదా. మీకేదో మతసంబంధిత కారణాలు ఉంటాయంట కదా.”
“నాకు సరిగ్గా తెలీదు కానీ, ఎక్కువగా తినరు ఇండియాలో” అని చెప్పాను. (అయితే, బానే తింటారేమో అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది. దున్న బిరియానీ అని బెంగళూరులో పలుచోట్ల చూశాను)
******************************

ఇక, సరికొత్త అనుభవం ఏమిటంటే – నిన్న పైన చెప్పిన రష్యన్ కొలీగే, నన్ను మామూలుగా అడుగుతూ ఉండింది – నాకు ఇక్కడ ఎలా ఉందీ? ఫుడ్ అదీ సూట్ అయిందా? వగైరా వగైరా. నేను జవాబు చెబుతూ, మొదటి ఒకట్రెండు వారాలూ శాఖాహారాన్ని కనుక్కోడానికి కష్టపడ్డా అనీ, తరువాత అలవాటైందనీ చెప్పాను. దానికి ఆమె –
“అయితే, ఎన్నాళ్ళ దాకా నువ్వు వెజిటేరియన్ వి?” అని అడిగింది.
ఇన్ని అనుభవాల్లో, బాగా నవ్వు వచ్చింది ఇక్కడే. కానీ, తమాయించుకుని, నేను మొదట్నుంచీ అంతే. అన్నా.
“ఎందుకు?”
“ఎందుకూ అంటే…. పుట్టుకతో అంతే నేను….”
“అంటే, మీ అమ్మా, నాన్నా కూడా అంతేనా?”
“అవును.”
“అంతకు ముందు కూడా అంతేనా?”
“ఆ, తరతరాలుగా అంతే.”
“బట్ వై?”
“అదీ, మరీ…. ఇండియాలో కొందరు అలాగే ఉంటారు” (షరా మామూలే!)
ఇదిగో, ఇక్కడే ట్విస్ట్. ఈ అమ్మాయి ఇది విని ఊరుకోలేదు.
“ఎందుకు అలా ఉంటారు?”
“ఎందుకూ అంటే… కొందరు ఇండియన్స్ శాకాహారులుగా ఉంటారు.”
“అదే, ఎందుకు? ఎందుకలా తరాల తరబడి ఉంటారు?”
“అదీ, మరీ…” అని కాసేపు నసిగి, “ఇండియాలో, కొన్ని జాతుల మనుషులు అలా శాకాహారులుగా పెరుగుతారు… అక్కడ కులం అంటారు…” నాకు ఆసరికే పరమ ఇబ్బందిగా ఉండింది ఇది చెప్పడం.
“అవును, దీని గురించి విన్నాను. అక్కడ ఏదో ఒక హైరార్కీ ఉంటుందంట కదా. పై స్థాయిలో ఉన్నవాళ్ళు కింది స్థాయి వాళ్ళని అణిచేస్తారంట…”
(అబ్బో!! ఇలాంటి విషయాలు మాత్రమే బయటకి వ్యాపిస్తున్నాయ్ అనమాట!)
“మరీ అలా ఉండదు ఈ కాలంలో..”
(ఇలా ప్రశ్నలు వేస్తూ పోయి, చాలా విషయాలు చెప్పాల్సి వచ్చింది.)
చివర్లో…
“అయితే, కొంతమంది ఇండియన్స్ జీవితాంతం శాకాహారులుగా ఉంటారా?”
“అవును. అలా ఉండాలన్న నియమం ఏమీ లేదు. తినేవాళ్ళు తింటారు. కొందరలా ఉండిపోతారంతే.” అన్నాను, వీలైనంత సౌమ్యంగా (సౌమ్యని కదా!)
*********************************
ఇదంతా రాయడం మొదలుపెట్టాక, దాదాపు ఐదేళ్ళ క్రితం జరిగిన అనుభవం గుర్తొస్తోంది. అప్పట్లో, ఐ.ఐ.ఐ.టీ లో చేరిన కొత్తల్లో, ఒక మలేషియన్ స్టూడెంట్ కూడా చేరింది. అనుకోకుండా, మెస్సులో ఎదురెదురుగ్గా కూర్చున్నాము. నేను, అత్యుత్సాహంతో ఎంక్వైరీ మొదలుపెట్టా – ఇండియా ఎలా ఉంది? వెదర్ సూట్ అయిందా? ఫుడ్ అదీ ఎలా ఉంది? అనుకుంటూ.
ఈ అమ్మాయి – “ఇక్కడ మెస్సులో మీట్ సర్వ్ చేయరా?” అనో, ఏదో అడిగింది.
“లేదు.” అని చెప్పా.
“మరి నీకేం ఇబ్బంది లేదా?” అని అడిగింది.
“లేదు. నేను మీట్ తినను.” అన్నా.
“పోర్క్ కూడా తినవా?” అంది. ఆరోజు కలిగినంత ఉలికిపాటు మరెప్పుడూ కలుగలేదు :))
ఆరోజు కూడా ఇదే కథ నడిచింది – మీ అమ్మా నాన్నా తింటారా? వాళ్ళ పేరెంట్స్ తింటారా? ఎందుకు తినరు? అని. అయితే, ఈ అమ్మాయి కి క్యూరియాసిటీ తక్కువ కనుక, అసలు నా ఫ్యామిలీ లో ఎవరూ తినరు అని చెప్పగానే వదిలేసింది. :))

********************
ఇతి, వార్తాహ.

Advertisements
Published in: on April 30, 2011 at 6:32 pm  Comments (45)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/04/30/1055/trackback/

RSS feed for comments on this post.

45 CommentsLeave a comment

 1. So True!!
  మీర్రాసినట్లుగా చాలా లాటిన్ అమెరికన్ దేశాల్లో, చికెన్ ని మీట్ అన్నట్లుగా పరిగణి౦చరు. నేను మెక్సికోలో ఓ ఆర్నెల్లు వెలగబెట్టినప్పుడు, నా టీమ్ మె౦బర్ తమిళ్ ఒకమ్మాయి ఉ౦డేది. శుద్ద శాకాహారి, ఎగ్ కూడా తినేది. ఏదైనా ఆర్డర్ చేసేప్పుడు, నా కార్నే, నా పోయో..ఇట్లా లిస్టు చదివిన తర్వాత కూడా, పాప౦ ప్రేమతో, మన౦ పప్పు కూరలో, రుచి కోసమ్ టమాటనో, స్పైనాచో కలిపినట్లుగా ఆ అమ్మాయికి, ఏదో ఒక మీట్ పైన చల్లి పట్టుకొచ్చేవారు. కొన్ని సార్లు తెలీకు౦డా తినేసి౦ది కూడా 🙂

  నేను చికెన్ తి౦టాను, కాని నాక్కూడా గట్టి దెబ్బ తగిలి౦దోసారి, దానితో నేను౦డే షెరాటన్ లో పొద్దున్నే కా౦టినె౦టల్ ఫుల్ బ్రేక్ ఫాస్ట్ కుక్ దగ్గర ఉ౦డి, ఒక లావాటి, పొడుగాటి ఎగ్ ఆమ్లెట్ ని దగ్గరు౦డి, అ౦దులో ఏ చికెన్, బేకన్, వేరే మీట్ ముక్కలు కలవకు౦డా జాగ్రత్తగా తయారుచేపి౦చుకొని, పొట్ట ని౦డా తినేవాణ్ణి, మళ్ళీ రోజ౦తా ఆకలేయకు౦డా! అప్పటికీ వాడు నన్ను ఆట పట్టి౦చేవాడు, ఐ లైక్ యూ సో మచ్, కొ౦చె౦ మీట్ వేసుకో ప్లీజ్, అ౦టూ..మనమేదో ఇ౦కొ౦చె౦ గో౦గూర పప్పు వేసుకో౦డి బావు౦టు౦ది అన్న టైప్ లో.

  అవునూ, మీరున్న ప్రా౦త౦లో సబ్ వే లేదా, ఉన్నా వెజ్జీ పాట్టీ, వెజ్ సా౦డ్విచ్ దొరకవా

 2. oops..తమిళ్ అమ్మాయి ఎగ్ కూడా తినేది కాదు

 3. పంది డెలికసీలు కూడా తినరా? పంది శాఖాహారం. చేపలు జల పుష్పాలు.

 4. నాకూ ఇవే కష్టాలు! USAలో ఉన్నపుడు ఎక్కడికెళ్ళినా వెజిటేరియన్ అంటే నా కోసం ఫుడ్ తయారు చేయడం కష్టమైపోయేది. మెక్ డొనాల్డ్స్ లో ఫింగర్ చిప్స్ కూడా వెజిటేరియన్ నూనెలో వేయించరని విన్నాను. ఒకసారి స్టీమ్ రైస్ అని చైనీస్ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇస్తే, చికెన్ స్టాక్ లో వండిన రైస్ ఇచ్చారు. ఆ వాసనకి అనుమానం వచ్చి తిరస్కరించాను!

  అపాటినుంచీ కుమార్ గారు చెప్పినట్టు బయటికెళ్తే చాలు సబ్ వే నా ప్రాణమైపోయింది. వెజ్జీ డిలైట్లు తిని బతికేసేదాన్ని. ఆ దెబ్బకి సబ్ వే నా ఫేవరిట్టై కూచుంది. ఇక్కడ కూడా!మా ఇంటి పక్కనే ఉంది!

 5. Hmm, you need to specifically tell them not to use any meat/chicken stock …

  When i order fried rice, I order “Veggie fried rice, no chicken, no eggs, no mushrooms” :)))))))

  But my best order so far has been in KFC … “One chicken burger with no chicken” 😛

 6. BTW They DONT use “lard” in McDonalds fries- they went totally veggie after someone sued them.

 7. “One chicken burger with no chicken” :-))

  మా తమ్ముడు ఒకడు అసలు కారాలు తినలేడు. మా ఇంటికి వచ్చినపుడు అన్నం వడ్డిస్తూ “కొంచెం ఆవకాయ వడ్డించనా” అంటే..”ఊ…కారం లేకుండా” అన్నాడు.

 8. Please
  1. Google for ’10 questions about hinduism’ and read the PDF
  2. http://www.himalayanacademy.com/basics/tenq/

  If you know the facts then you won’t be apologetic about your roots/culture/customs 🙂

 9. true…naaku same anubhavam, nenu sannaga untaanu kaabatti, meeru meat thinaru kabatti sannaga untaraa, meat thinu lavu avuthaavu ani salaha ichaaru 🙂
  e caste system nenu simple ga “india lo knowledge class, merchant class, warrior class, service class” ani divide chesaru ani cheptha, knowledge class ki kevalam knowledge ne main, anduke meat thinaru ani cheptha

 10. I too had same problem and exactly found the same solution, if I had to eat out, I will go to subway and nothing else. Ofcource, I now can manage with bread and jam. But this oil containing animal fat is new for me. Did not know it.
  One interesting thing. when I started first I was seeing a lot of pizaas with Pepperoni as topping. when I asked my friends what it could be, they said that it could be a topping based on pepper. I googled it later and since then maintaing minimum 1 mile from it.

 11. @Kumar: సబ్వే ఉందండీ. నేనింకా వెళ్ళలేదంతే. అయినా, రోజూ సబ్స్ తినలేము కదా. ఎప్పుడో ఒకప్పుడు మన ఇంట్లో మన ఫుడ్ సంగతి చూస్కోవాలిగా :))

  @Latha: I wonder how that comment is relevant to my post. I am not exactly sure if my reasons for vegetarianism are because of some apologetic feeling abt culture etc :P.

  @Lalitha: “knowledge class ki kevalam knowledge ne main, anduke meat thinaru” – Wrong signals!!!

  @Siva: “Peperoni”, in Germany is a capsicum variety. “Pepperoni” is ofcourse… Pigmand Fraued’s vegetarian dish 🙂

 12. హిందూఇసం అనే కాదూ చాలా మంది బై చాయిస్ వెజి టేరి యన్సు ఉన్నారు.
  ఏ రేస్తోరెంట్ లో నయినా అమెరికా అయితే వెజిటేరియన్ చేసి ఇమ్మంటే చేసి ఇస్తారు.రీసెంట్ గ చేయించుకుని తిన్న చోట్లు, హవాయీ హిల్టన్, హోనలులు రివోల్వింగ్ రేస్తోరంట్, సియాటి లేక్ ఫ్రంట్ సి ఫుడ్ రేస్తోరంట్ మొదలయినవి.మీటు లేకుండా పాస్తా చెయ్యమని అడిగితే చేసి పెడతారు. WebMD వాళ్ళు నాకు ఈ-మెయిల ఒకటి పంపించారు అది క్రింద ప్రింట్ చేస్తున్నాను. గుడ్ లక్.

  Vegetarian Diet: A Healthy Choice
  The vegetarian diet is a healthy lifestyle followed by more than 4 million Americans. Compared to the general population, the typical vegetarian has a lower body mass index (BMI), lower cholesterol, reduced risk of type 2 diabetes, and reduced risk of coronary artery disease. Sound promising? Let WebMD point you toward some of the most nutritious and satisfying vegetarian foods.
  http://www.webmd.com/diet/slideshow-vegetarian-diet?ecd=wnl_alt_043011

 13. chala bagundi andi 🙂

 14. vallu mimmalani enduku mee vallu nonveg tinaru ani adigite… ma religion lo devudu vere praanulani badha pettakudadu ani cheputaru so devuniki puja chesi priests tinaru, valla lo puttinanduku tinam memu vere animals ni badha pettadam istam leka ani cheppavacheme.. naku kuda ilanti questions chala vachayi, ide answer cheppanu

 15. నా బాధ కూడా ఇలాటిదే. నేను మష్రూములు, ఉల్లిపాయలు, గార్లిక్ కూడా తిని ఛావను. ఓ సారి ఆఫ్రికాలో టీమంతా కలిసి బయటకెళ్ళాం. మధ్యాహ్నం ఎండ. నైలునది పక్కన ఢాబా లాంటిది ఉంది అక్కడ ఆగాం. నేనూ ఇంకొకడు నది చూసి ఒళ్ళూ పై తెలీకుండా మునిగి జలకాలాడి వచ్చాం. ఆకలి కరకరలాడుతూంది. అక్కడ యువకుడు నేను శాకాహారినంటే అదేదో ప్రపంచపు ఎనిమిదో వింతలాగా ఆశ్చర్యపడ్డాడు. ఉన్న పదిమందిలో నేనొక్కణ్ణే శాకాహారిని. ఆ రోజు ఇక శాకాహారత్వానికి విడాకులిచ్చి చేపలు, ఉల్లిపాయలు లాగించాను.

  కొరియాకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళూ నన్ను చూసి ఒకటే నవ్వు! అక్కడా ఓ రెండు మార్లు తెగించి మాంసాహారం తినవలసి వచ్చింది.

 16. నాలా మనుషుల్ని అమాంతంగా భోంచేసేసేవారు ఇక్కడ లేరా?

 17. @Chandana: సరిగ్గా ఇలాంటి సమాధానం చెప్పకూడదనే నా అవస్థ అంతానూ!! నాకు ఇండియాలో వెజిటేరియన్లు ఉంటారు అని చెప్పాలని ఉంది కానీ, కొన్ని కులాల వాళ్ళే ఉంటారు అని చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే, అది వర్తమానంలో అసత్యం కనుక.

 18. బయటి ప్రదేశాలు సంగతి సరే!

  మన ఇండియా లో, బెంగళూర్ లో ఇలాంటి శాఖాహారం దొరకని ప్రాంతం ఒకటుంది అంటే నమ్ముతారా?
  ఆ ఘనత వహించిన ప్రాంతం మన బ్రిగేడ్ రోడ్.
  అయిదేళ్ళ క్రితం ఫ్రెండ్స్ తో కలిసి ఒకాదివారం సరదాగా రోడ్లు కొలిచే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మన లెక్క లో సరదా గా గడపడం అంటే బయటికెళ్ళి తినడమే అన్న ఒక దుర్మార్గమయిన భ్రమ లుండేవి మాకు. ఇంట్లో తినకుండా తెలియని ప్రదేశాలకెళ్ళడం ఎంతపొరపాటో మొదటిసారిగా, అవగాహనకొచ్చింది నాకు. మధ్యాన్నం మూడయినా ఒక్క వెజ్ రెస్టారెంట్ కనిపించలేదు. నా ఇద్దరు ఫ్రెండ్స్ నాన్ వెజిటేరియన్స్. నేనేమో నాన్వెజ్ రెస్టారెంట్స్ లో మంచినీళ్ళు సైతం తాగలేను.ఆ గ్లాసులకి ఎక్కడో ఏదయిన అంటుకొని ఉంటుందేమో, సమయానికి నాన్వెజ్ అట్లకాడ దొరక్క వెజిటేరియన్ అట్లకాడ తో చికెన్ ముక్కలు తిరగేసి ఉంటాడేమో అన్న వెధవ అనుమానం. నాకోసం వాళ్ళు తినకుండా…. ఆరోజంతా అలా ముగిసిందనుకోండి.

  ఇప్పుడిక బిసినెస్ మీటింగ్స్, కాన్ఫెరెన్స్ లయితే ఉపవాసమే. చెన్నై లోనూ, నోయిడా లోను ఎర్ర బస్సు మొహమేసుకొని లో మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవల్సిన ఇబ్బంది పడలేక, హాయిగా ఏ ఫ్రూట్స్ తిని గడిపెయ్యడమే.నాతో బిసినెస్ మీటింగ్లంటే ఒకటికి రెండుసార్లు అలోచిస్తారు వెన్యూ డిసైడ్ చెయ్యాలంటే… పాపం.

 19. mari emi cheppanu, rajO gunam ani cepthe, mallii dannii explain cheyyaali ga, so knowledge kavali anukune vaalla manasu control lo undaali ani cheptha 🙂

 20. రవి గారూ, అవునండీ, పూర్తి శాకాహారులైతే ఇబ్బందే! మొదటి సారి ఇండియా దాటి వెళ్తున్నపుడు ఎయిరిండియా విమానంలో వెజిటేరీయన్ అని చెప్తే చాలక, హిందూ వెజిటేరియన్ అని చెప్పాం మేము.ఏషియన్ వెజిటేరియన అంటే చేపలు శాకాహారం కింద వడ్డిస్తారని చెప్పారెవరో! మా వారి ఫ్రెండ్ ఒకాయన కోపం వస్తే నన్ను ‘యూ, వెజిటేరియన్” అని విసుక్కుంటుండేవాడు!

  ఎక్కడికి బయటికి వెళ్ళినా నా జాగ్రత్తలో నేనుండేదాన్ని! లేదంటే సబ్ వే ని శరణు కోరడం

 21. r గారు, బెంగళూరు బ్రిగేడు రోడ్డు మొదట్లో పెట్రోలు బంకు పక్కన బృందావన్ అన్న హోటలు ఉంది.

 22. ఇక్కడ తమతమవ్యథలు చెప్తున్న వారికో ఉపశమనం లాంటిది లేక ఇది చదివాక అబ్బే మనదేం పెద్ద ఇబ్బందుల్లే అనిపించొచ్చు.మాకు బాగా తెలిసిన ఒక ముస్లిం ఉద్యోగి ఒకావిడ ఉన్నారు ఇక్కడే వైజాగులో,ఆమె పూర్తి శాఖాహారి.సో బంధువులిళ్ళలో యేశుభాశుభకార్యక్రమాలకు ఈవిడ వెళ్ళలేరు,వెళ్తే తినలేరు వెళ్ళాల్సొస్తే(తినాల్సొస్తే)వట్టి పెరుగు అంతే ఆమె ఆహారం.అన్నిటికన్నా బాధాకరం యేమంటే పెళ్ళాడితే భర్త(శాఖాహారి కొరకువెదికి దొరక్క)అతగాడికి ఎక్కడ మాంసాహారం వండాల్సొస్తుందో అన్న భయంతో పెళ్ళాడలేదు.్

 23. I believe Vegitarianism has nothing to do with Brahmin and Visya castes, it is more personal preference. Sage Agastya as a guest of demon Ilu, ate mutton offered. During vedic time brahmans used to eat meat. Vegitarianism was promoted by Buddha and Mahaveer that might have influenced some groups to turn into vegitarian.
  Reasons cited by some traditionally vegies turning into non-veg look funny & hipocratic. They just pose to be traditional and make us convince that they were no other alternative than to eat fish/meat/beaf. My suggestion to such hippocrites(nonveg eating veg castes) is be bold and eat whatever you feel like, unless it is something non-eatable! How it matters what you caste is and what you eat? but what you are up to that may matter.

 24. ఈ విషయం మీద ఓ టపాకి సరిపడా వ్యాఖ్య రాయొచ్చేమో.
  సౌమ్యా, టపాలో రక రకాల సన్నివేశాలు ఇలా గుర్తు చేసుకోవడం, వ్యాఖ్యానించిన వారు వారి అనుభవాలు గుర్తు చేసుకోవడం బావుంది.

  శాకహారం తినడం మన దేశంలో కులాలని బట్టి ఉంటుందన్నది ఒప్పుకోవడంలో తప్పేంటి? We were born into the society with its good and bad and each one of us is dealing with it the way they seem fit for themselves. కొందరు మాంసం అలవాటు చేసుకుంటున్నారు, కొందరు శాకాహారం పాటిస్తూ కొద్దిగా సడలిస్తున్నారు, కొందరు చాలా స్ట్రిక్టుగా పాటిస్తుంటారు. ఎవరి నమ్మకాలు, కారణాలు వారివి.
  కోడిగుడ్డు తినను కానీ కేకు తింటాను. మాంసం తినాలని అనిపించనే అనిపించదు. ఆకలి కొద్దీ పొరపాటున meat తో ఇచ్చినా అది తీసేసి బర్గర్ తిన్నానొక సారి. తింటున్నంత సేపూ అలవాటు లేని పని కనుక కష్టంగానే ఉండాలి. తప్పు అనిపించడం చిన్నప్పటి మాట. టీకాలలో మందులలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నిషిద్ధాలని తీసుకుంటూనే ఉన్నాము.
  ఆవులకి కూడా మాంసం తినిపిస్తారని తెలిసినప్పుడు జీర్ణించుకోవడం కష్టం అయ్యింది. నాకు ఇష్టం లేదు కానీ చాలా మంది ఇష్టంగా తినే marshmallow లో జంతువుల చర్మం, ఎముకల నుంచి తీసిన పదార్థం వాడతారు.
  ఈ మధ్యనే పూర్తి శాకాహార భోజనం కావాలని అడిగి తెప్పించుకోవలసి వచ్చింది. గుడ్డూ, చేపలు కాక చికెను కూడా మాంసం కాదనుకుంటారని అప్పుడే తెలిసింది. Chef మాత్రం ఆకులూ అలములూ, కంద మూలాలనే చాలా రుచికరంగా వండి సెర్వ్ చేశారు నా కోసం.
  మాతో ఉన్న వారు మాంసం ఎందుకు తినరని అడిగారు. అది నా ఎంపికా లేక రిలీజియన్ కోసమా అని అడిగారు. family thing అని చెప్పాను. తినకూడదు కాబట్టి తినవా అని మళ్ళీ అడిగితే, నాకు తినాలని అనిపించదు, మాంసం తినకపోవడం కన్నా తినడమే నాకు కష్టం అని చెప్పను. మొత్తానికి ఈ మధ్య అడిగిన విదేశీయులు అంతా విన్నాక శాకాహారం తినడం ఆరోగ్యకరమైన జీవన శైలి అని మెచ్చుకుని ముగిస్తున్నారు.
  ఇది latest అనుభవం. ఇంతకు ముందు ఎత్తి పొడుపులూ, అది చాందసవాదం అనేలా మాట్లాడడం, మాంసం తినకపోవడం చాలా గొప్ప అని అనుకోవడం అన్ని రకాలూ రుచి చూశాను. (అవన్నీ రాస్తేరెండు టపాల పొడవౌతుంది.)
  ఇంకో మాట, దున్న మాంసం, ఆవు మాంసం ఒకటి కాకపోవచ్చు. చిన్నప్పుడూ సిపాయిల తిరుగుబాటులో ఆవు పంది మాంసాలు తిరుగుబాటుని ఎలా trigger చేశాయో చదువుకున్నా, నాకు మన దగ్గర మాంసం తినే వాళ్ళు కూడా బీఫ్ తినరని తెలియదు. బీఫ్ అంటే అది అని కూడా తెలియదు. కొందరు విదేశాలకొచ్చాక తింటారు కూడా, అది వారి స్వవిషయం. మాంసాహారుల్లోనూ పలు రకాలు. ఇవి కాక kosher, హలాల్ వంటి constraints కూడా ఉంటాయి మాంసం తినే వారిలో మతాన్ని బట్టి, ఎవరి పట్టింపులు ఎంతవరకో అన్న దాన్ని బట్టి.
  ఇవన్నిటికంటే నేను ఎప్పుడూ ఊహించని నా స్వంత కష్టం – పిల్లలకు ఫుడ్ ఎలర్జీలు ఉన్నాయని, అవి ఎంత తీవ్రంగా ఉండవచ్చో తెలియదు కనుక పల్లీలు, నట్స్ ఇంట్లోనే ఉంచుకోండా ఉండాల్సి రావడం. ఎప్పుడైనా రుచి పుడితే వాళ్ళనుంచీ దాచుకుని తినడం.
  ఇన్ని constraints మధ్య పిజ్జా, టాకో (no meat), ఏ నూనెలో వేయించినవైనా fries, సబ్వే, బయట తినాలనుకున్నప్పుడు మాకు ఆపద్బాంధవులు. ఒకప్పుడూ ఆ నూనె గురించి మాంసం కన్నా ఏ ఎలర్జెన్లో కలుస్తాయన్న భయం ఉండేది. ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుని ప్రయత్నిస్తున్నాము.

 25. @Lalitha G: మనలో కొంతమందికి శాఖాహారం కులం వల్ల అలవాటయింది అని చెప్పడంలో నాకు సమస్య లేదు. అయితే, ఫలానా కులం వాళ్ళు ఫలానా కారణానికి మాంసం తినరు, ఆ కులం పెద్ద గొప్పది అని చెప్పడం లోనే నా సమస్య. నాక్కాస్త కులవ్యతిరేకతలో చాదస్తం ఎక్కువ. అందుకే ఆ ప్రస్తావన తేకుండానే వివరించాలని చూస్తున్నాను. నేనిలా కులం అన్న అంశం తేగానే – వీళ్ళు వెంటనే – “అయితే, కాస్ట్ హైరార్ఖీ ఉంటుందంట కదా..ఉన్నత కులాల వాళ్ళు మాంసం తినరా?” అని అడిగారు. అదే నాకు చిరాకు పుట్టించే అంశం. నా దృష్టిలో అదో అపోహ. తినేవాళ్ళు తింటారు…ఇష్టం లేని వాళ్ళు తినరు. కొంతమంది అలవాటు కాకుండానే పెరుగుతారు – ఇలా చెబుతున్నాను ఎవరన్నా అడిగితే. ఈ చివరి వారి గురించి ఎందుకు? అన్నప్పుడు మాత్రమే నేను కులం ప్రస్తావన తేవాల్సి వచ్చింది. కానీ, ఇక్కడ వ్యాఖ్యల్లో చాలామంది “శాఖాహారం” అన్న విషయం కన్నా “కొన్ని కులాల్లో శాఖాహారం” అన్న విషయాన్నే పట్టుకున్నట్లు ఉన్నారు 🙂

  కులం గురించి మాట్లాడ్డానికి నా బ్లాగు వేదిక కాదు అని రాయబోతూ ఉండగా, మీ వ్యాఖ్య వచ్చింది 🙂

 26. Somwya, thats what I said. Don’t pull caste by saying it as religious/caste restriction. Say it as your personal preference. I agree with you.

 27. I thought that in my comment too kulam was not a significant part 🙂 No?
  I explained various kinds of restrictions I have come across including among other religions and the newest religion of health conciousness. I shared where all hidden meat could be.

  To me personally, the scare of allergic reactions which ranges from caution to panic is the most serious restriction. Like somone asked a neighbor to cut a tree that bore nuts because of high risk of allergy to their kid. It is a very sensitive issue too when a school has to debate on banning peanuts from lunch. A lot of kids eat PBJ while some are highly sensitive to even air borne allergen.

  At the same time, I know what hell I went through and have to go through even now to explain why I have to be so careful about food I give to my kids, mostly with family members.

  This allergy thing was completely new to me and I once even thought it was an excuse for avoding some foods. But I respected their wanting to avoid anyway.

  Also, I had difficulty discussing religion, caste system etc. too. But then I realised that it is not my doing. This thought came to me just when I was writing my first comment. I thought we should forgive ourselves for that system which we are born into and are froming and changing ideas about as we grow up. It is a fact and if I am not able to explain it to others it is because of our own unexpressed guilt for being born into it. Since my difficulty to explain these things, I have been expanding my own knowledge about them and confronting myself as to what my real beliefs are and why.

  My question was, is it necessary to feel guilty? We are continuing something that is, if at all, only healthy.

  I liked your post and the discussion because it helped me find these expressions. If it went against what you wanted to convey, I sincerely apologise.

 28. @Lalitha G: My bad!
  నేను రాద్దాం అనుకుంటూ ఉండగా, మీర్రాసిన వ్యాఖ్య, కొంతవరకూ నా ఆలోచనలనే చెప్పింది. అందుకని అలా రాసా! 🙂

  Sorry for the misunderstanding 😛

 29. I guess it was me who misunderstood:( Anyway thanks for helping me express.

 30. @లలిత గారూ ఎల్లర్జీ నిజంగా ఉంది. అది ఉన్నవాళ్లకే తెలుస్తుంది. శరీరతత్వం బట్టి వుంటుంది. శాఖాహారం అయినా మాంసాహారం అయినా కొత్తగా మారినప్పుడు జాగర్తగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.

 31. నేను అయితే ఉన్న ౧౦ రోజులు asian shop కెళ్ళి కూరగాయలు తెచ్చుకుని ఉడకబెట్టుకుని తినే దాన్ని సౌమ్య..ఎంత కష్టమో నాకు అర్దమైంది అప్పుడు…

 32. Hi sowmya garu,

  I am a veggie and I personally believe in this “If I can eat something alive, I can eat it dead.” I cannot eat animals alive so I wont eat them dead. Some people may ask are you not killing plants when you go for leafy vegetables and stuff. I still give them the same answer- I can eat any leaf or vegetable alive, so I eat them dead (cooked).

 33. sowmya , kavya telugulo manchiga rastunnaru

 34. desalu pattukoni tiragadam enduku tindi dorakaledani edvatam enduku

 35. @KK: I choose not to respond.

 36. Chinaలో పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ వాడే నూనె కూడా జంతు సంబంధమయినదే. ఒక వారం పాటు ఏమీ తినకుండా, ఏం అడగాలో తెలియకుండా కేవలం పాలు, నీళ్ళు తాగి బ్రతికిన తరవాత ఒక మహానుభావుడు చైనీస్ లో vegetablesని Shuchai అంటారని చెప్పాడు.అలా అడిగితే ఉడకబెట్టిన తామర తూళ్ళు(lotus roots), Broccoli నా మొహాన పారేసి వింతజంతువుని చూసినట్లు చూసేవాళ్ళు 😦

 37. 🙂

  • కొత్తావకాయ నా చ్చాలబుంది మీ పేరు……….

 38. Germany is killing me…first nenu ikkadaki vachchina 3 days ki..naku kallalo neellu thirigayi food kosam. i am non-veg, except Thu and Sat….chala issues…avi cheppalante..nenu kuda oka blog start cheyyali lendi..leave it..

 39. Why should you eat vegetarian food?

  నేనేర్చినంతవరకూ :

  ఆయుర్వేదం మనం తినే ఆహారాన్ని మూడు రకాలుగా విభజించింది. స్థూలంగా – సత్వ, రజో మరియు తమో గుణ ప్రథానములు అని ప్రతిపాదించింది.

  అతి తీవ్రమైన భౌతిక శ్రమ చేసేవారికి “తమో” గుణప్రథానమైన ఆహారాన్ని ప్రతిపాదించింది. కానీ దానివల్ల మేథోశక్తి కుంటుపడే అవకాశమున్నదనీ, సూక్ష్మ బుధ్ధికి విఘాతం కలిగే అవకాశాలు చాలా ఎక్కువనీ ప్రతిపాదించింది. కానీ ప్రతిగా, భౌతికబలం ఎక్కువగా ఉంటుందని ప్రతిపాదించింది.

  ఇక భౌతిక శ్రమా, బుధ్ధిబలాలూ రెండూ అవసరమైన వారికోసం రజో గుణప్రథానమైన ఆహారాన్ని ప్రతిపాదించింది.

  ఇక పూర్తిగా బుధ్ధిబలమే కావాలనుకునే వారికోసం సత్వ గుణప్రథానమైన ఆహారాన్ని ప్రతిపాదించింది. వీరికి శారీరిక శ్రమ లేకపోవటం చేత, మిగిలిన రెండు గుణాలలో ఏ ఆహారం తిన్నా ఉపయోగాలకన్నా ఇబ్బందులే ఎక్కువని ప్రతిపాదించింది. శాకాహారం – సత్వ గుణప్రథానమైనదిగా చెప్పబడింది.

  ఆథునిక పరిశోథనలు కూడా నేను గమనించినంతవరకూ వీటికి చాలా వరకూ సరిపోతున్నాయి – ఒక్క సాత్విక భోజనం వల్ల బుధ్ధి బలం పెరుగుతుందన్న విషయాన్నే ఇంతవరకూ ఎవరూ అబద్ధమనో నిజమనో నిరూపించినట్లుగా నేను వినలేదు. మిగిలిన వాటికి తగిన పరిశోథనా ఆథారాలున్నట్లుగా కనబడుతోంది.

  ఇక్కడ మరొక చిత్రమేమిటంటే – సాథారణంగా దుంపలు ఆయుర్వేదప్రకారం శాకాహారం కాదు అని చదివాను. అయితే, మూలం చదవలేదు.

  ఒకటి, ఈ ప్రతిపాదనలు నాకు నచ్చాయి. పైగా, నాకూ, నేను చేసే పనికీ, అందులో ఉండే భౌతిక శ్రమకీ మాంసాహార భోజనం అనవసరం. దానివల్ల హానే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఇంకా ఇక్కడ చెప్పటానికి చోటు చాలని ఇతరత్రా కారణాల వల్లా, నేను శాకాహారినే.

 40. ‘దున్న బిరియానీ అని బెంగళూరులో పలుచోట్ల చూశాను’
  దొన్నె (ದೊನ್ನೆ ) బిరియాని, దున్న (ದುನ್ನ ) కాదు .

  • Thanks Murali garu! అయితే, అది ఒక ప్లేట్ బిరియాని అనా! నేనిన్నాళ్ళూ దున్న అనే అనుకున్నా!

 41. @ఆదిత్య: ……….ఈ బ్లాగ్ సృష్టికర్తకు నా ధన్యవాదాలు,అంతర్జాలంలో తెలుగు అబిమానుల కొరకు ఒక మంచి బ్లాగ్ నడుపుతున్నందుకు, అందరి వాదనలు చాలా బాగునాయ్,ఈ బ్లాగ్ సృష్టికర్త మర్రిని కొత్త టపాలతో మామ్మల్ని అలరిoచాలని కోరుకుంటున్నాను.

 42. (అయితే, బానే తింటారేమో అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది. దున్న బిరియానీ అని బెంగళూరులో పలుచోట్ల చూశాను)….
  పైన మురలి గారు చెప్పినట్టు అది దొన్న్నే బిర్యాని … దొన్నే అంటే బిర్యాని అంటే ఒక ప్లేటు బిర్యాని కాదు అండి సౌమ్య గారు… ఇస్తరాకులతో / పనస ఆకులతో ఒక గిన్నే ( దొన్నే ) ఆకారంలో చేసిన వాటిలో మనకి బిర్యాని సెర్వ్ చెస్తారు అందుకని దొన్నే బిర్యాని అంటారు …

  • ఆయన దొన్నె అని చెప్పాక అర్థమైందండి. ప్లేటు బిర్యాని అంటే… ప్లేటులో పెట్టీ ఇచ్చేది మాత్రమే అన్న అర్థంలో రాయలేదండి నేను. దొన్నె ఆకారంలో చేసినా, ఎలా చేసినా…అది ఒక ప్లేటు బిర్యానికి సమానంగానే కదా ఇచ్చేది..అందుకని అలా అన్నా. (ఉదా: ప్లేటు పానీపూరి అని చెప్పి ఇలాగే దొన్నెల్లో పెట్టి ఇచ్చే బళ్ళు ఎన్ని లేవు? ఒక ప్లేటు ఇడ్లిని కాగితంలో చుట్టి ఇవ్వరూ? – ఇలా వాడాను నేను ప్లేటు బిరియానీ అన్నది.)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: