కాఫీ…. కాఫీ… కాఫీ ఈ ఈ ఈ ఈ ఈ ఈ !!!!

పొద్దున్న లేవగానే కాఫీ వాసన పీల్చనిదే, వేడిగా సేవించనిదే, మరే పనీ చేయలేని అశక్తులు మనలో చాలా మందే ఉండి ఉంటారు. మరీ ఆ స్థాయికి నేనింకా ఎదగలేదు కానీ, తాగినా, తాగకపోయినా, కాఫీని ఒకసారి తల్చుకుంటా పొద్దున్నే. కాకపోతే, ఎలాగైనా రోజూ కొన్ని కప్పుల కాఫీ తాగుతూనే ఉంటా అన్నది వేరే విషయం! నిన్న ఉదయం జరిగిన సరదా సంఘటన ఒకటి చెప్పుకుందామని ఇప్పుడు నా తాపత్రేయం. (అని మొదలుపెట్టి ఈస్టర్ వెకేషన్ కి వెళ్ళిపోయా. కనుక, ఆలస్యంగా, ఇపుడు ముగిస్తున్నా కథని)

నేను ఒక వారం పది రోజులుగా ఫస్ట్ కాఫీ మానేసి పాలు తాగుతున్నా. ఆ మధ్య కాఫీ పొడి కొనబోయి పాలల్లో కలుపుకునే చాకో పౌడర్ కొనేసా లెండి – భాష తికమకలో పడి, కంఫ్యూజ్ అయిపోయి. మళ్ళీ రెండు కి.మీ. నడిచి వెనక్కివ్వాలి ….ఒకవేళ ఇచ్చేయాలనుకుంటే. ఇప్పుడెవడు నడుస్తాడు? పైగా, మనకి జర్మన్ రాదు, వాడికి ఇంగ్లీషు రాదు (వచ్చినా మాట్లాడలేదేమో, అది నాకు తెలీదు). అందువల్ల, బాగా ఆలోచించి, డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నా. ఒక కాఫీ మాఫీ చేసి, పాలు తాగుదాం అని! ఈ నిర్ణయం తెలిసిన నా శ్రేయోభిలాషులు అంతా అవాక్కైపోయారు. నువ్వు…. కాఫీ…బదులు..పాలు తాగుతున్నావా??? అని. ఇక్కడ విషయం ఏమిటంటే, నాకు కాఫీ అంటే ఎంతిష్టమో, పాలంటే అంత అల్లర్జీ అనమాట. ఒక కాఫీ కాస్తా రెండు కాఫీల మాఫీ అయ్యింది రెండ్రోజుల్లోనే – ఎందుకూ? అంటే, ఆ పౌడర్ డబ్బా ఏదో త్వరగా పూర్తి చేస్తే, కాఫీ సేవన మహా యజ్ఞం నిర్విరామంగా కొనసాగించవచ్చు కదా అని!

సరే, విషయానికొస్తే, నాకొక రొమేనియన్ స్నేహితురాలు ఉంది. పక్క పక్క గదుల్లో ఉంటున్నాము ఇక్కడ ఇద్దరం. అప్పుడప్పుడూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటాము. నేనన్నా, ఇన్స్టంట్ కాఫీ ని కాఫీ గా ఒప్పుకుంటాను కానీ (ఆట్టే ఇష్టం లేకపోయినా!), ఆవిడ దృష్టిలో ఇన్స్టంట్ కాఫీ అంటే కాఫీనే కాదు. సరే, నేను పాలు తాగడం గురించి తెలుసుకుని జాలి వ్యక్తం చేసింది. అలాగే, ఆఫీసు దగ్గర ఇన్స్టంట్ కాఫీ తాగుతున్నా అని కూడా జాలి పడింది. అలా, ఒకట్రెండు సార్లు, చక్కటి కాఫీ కూడా ఇచ్చింది. మాది కాఫీ స్నేహం అనమాట. అలా కాఫీ సేవిస్తూనే లోకాభిరామాయణం మాట్లాడుకుంటాము రోజూ.

నిన్న నేను వెళ్ళేసరికి తనింకా లేవలేదు. సరేలే అని, నా మానాన నేను పాలు తాగేసి, గదిలోకి వచ్చేసి, ఏదో పేపర్ చదువుతున్నాను (ఆన్లైన్లో). ఒక పది నిముషాలయ్యాక, “సౌమియా! సౌమియా!” అన్న కేక వినిపించింది.. మెట్లపై నుండి. నా స్నేహితురాలిది. అరే! ఏమైందీ? కింద పడిందా? వంటింట్లో నేనేమన్నా పాలో ఏదో మర్చిపోయి అలాగే వదిలేసి వచ్చానా? ఆమే ఏదన్నా చేసిందా? అనుకుంటూ గది బయటకు వచ్చా. అప్పటికే ఆమె మెట్లెక్కేసింది.
“నీ దగ్గర కాఫీ పౌడర్ ఉందా?”
“లేదు…. కానీ, ఈ మధ్య వాడట్లేదు కనుక, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఉంది కాస్త”
“నిజమా! ఏదో ఒకటి, నాకు అప్పిస్తావూ, ప్లీఝ్!”
“పర్లేదు..తీస్కో..దాందేముందీ…” అంటూ వంటింటికి వెళ్ళి, ఆ డబ్బా ఇచ్చా. ఇస్తూ గమనించా..పాపం అందులో ఒకసారికి సరిపడా కాఫీ ఉందంతే! ఈవిడ నక్క తోక తొక్కిందన్నమాట!
“మరి నీకెలా? ఇప్పుడు నేనిది తాగేస్తానే!”
“పర్లేదు లే, రేప్పొద్దున్నే ఊరెళ్ళిపోవాలిగా నేను. రాగానే కొనుక్కుంటాలే” అన్నాను, దానవీరశూరకర్ణలా మనసులో అనుకుంటూ…

“ఏమీ అనుకోవద్దూ. సారీ. నాకు కాఫీ తాగనిదే ఇల్లు కదలడానికి అవ్వదు. కాఫీ కొనుక్కోవాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి ఇప్పుడు. చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లెం యు సీ!”
“అయ్యో!, పర్లేదు. దట్స్ ఓకే. సరేలే, నువ్వు కానీ. నేను వెళ్ళొస్తా”
“నువ్వు చేసిన గొప్ప సాయం నీకు అర్థం కావడం లేదు”
“……” అని మూగగా నవ్వాను.
“నేనూ ఈస్టర్ కు ఊరెళ్తున్నా. రాగానే నీకు మంచి కాఫీ చేసిస్తా. నువ్వెంత ఉపకారం చేసావో! చాలా చాలా థాంక్స్… అసలు నాకు….”
“పర్లేదు. తట్స్ ఓకే. నేను సెలవులు ముగియగానే నీ కాఫీ కోసం ఎదురుచూస్తా, సరేనా?”
…. ఇలా అనుకుంటూ బై చెప్పేసుకున్నాము.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సంభాషణ మూలంగా జరిగినదేమనగా – ఒక్కసారిగా అంతసేపు కాఫీ జపం జరిగినందుకు కాబోలు.. నా వ్రతం సంగతి దేవుడెరుగు… సాయంత్రం ఇంటికి వస్తూ వస్తూ, కాఫీ పొడి కొనుక్కొచ్చి, చక్కటి, చిక్కటి ఫిల్టర్ కాఫీ చేసుకుని, తాగా! ఆహా, నా కాఫీ! అనుకుంటూ… :))

Advertisements
Published in: on April 25, 2011 at 3:35 am  Comments (13)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/04/25/kaphi-kaphi-kaphi-i-i-i-i-i-i/trackback/

RSS feed for comments on this post.

13 CommentsLeave a comment

 1. పొద్దున్న లేవగానే కాఫీ వాసన పీల్చనిదే, వేడిగా సేవించనిదే, మరే పనీ చేయలేని అశక్తులు మనలో చాలా మందే ఉండి ఉంటారు. …………

  నేనున్నా ఇక్కడ! రోజూ మూడు కప్పులు తప్పక తాగాల్సిందే!

  కాకపోతే ఇప్పుడు (న్యూట్రిషనిస్టు సలహా ప్రకారం) తాగినప్పుడల్లా అరకప్పు చొప్పున మొత్తం ఒకటిన్నర కప్పుకి తగ్గిపోయింది క్వాంటిటీ!

  అదీ ఫిల్టర్ కాఫీ మాత్రమే!

  మొత్తానికి ఈ కాఫీ ఎవడు కనిపెట్టాడో గానీ…!

 2. హాయ్ సౌమ్యా..నేను మీ బ్లాగ్స్ చదువుతుంటాను..చాల ఆలోచింపచేసేవి గ వుంటాయి..ఎప్పటి నుండో కామెంట్ పెడదాం అనుకుంటూ వున్నా…ఇవాల్టికి నా బద్ధకం లోంచి బయటికొచ్చి కామెంటుతున్న..నేను ఈ మధ్యే తెలుసుకున్న కాపీని వదలటం చాల కష్టమైన పని అని…క్రితం వారం అ౦తా తాగ కు౦డా వుందం అని అనుకుంటే అన్ని నన్ను టెంప్ట్ చేసే స౦దర్భాలే..మా కొలిగు ఒకావిడ నన్ను తోడు రమ్మని starbucks lo కూర్చో బెట్టి౦ది. అక్కడ వాసన కి నా సామి రంగ..ఎందుకు మానెయ్యాలి కాఫీ అనిపించింది. ఇక ఆ పైన earth day అని starbucks వాళ్ళు ఫ్రీ కాఫీ అన్నారు మల్లి శుక్రవారం. ఏదైనా మనం నిగ్రహం గ వుండాలి అనుకుంటే ఇంకా మనల్ని ఆ వైపు కి లాగుతున్నట్టే వుంటుంది. మొత్తానికి ౬ రోజులైంది. బానే వున్నా..ఇన్ని రోజులు తాగకుండా ఉన్నందుకు ఒక మంచి కాఫీ నాకు నేనే ప్రెసెంట్ చేసుకొని పండగ చేసుకుందాం అని అనుకున్తన్న రేపు ;))

 3. మీలాంటి కాఫీప్రియులే! 🙂
  http://kothavakaya.blogspot.com/2010/12/blog-post_12.html

 4. ఇదేదో కాఫి వ్యాసం అని తెలియగానే చదవడం ఆపేద్దామ అనుకున్న. సరేలే అని పూర్తి చేస్తే ఆ రోమేనియన్ ఫ్రెండ్ విచిత్రంగా అనిపించింది. ఆమె కాఫికోసం అలా నాలుకకోసుకోవడం ఆశ్చర్యమేసింది…

  After all coffee కోసం ఇంత తపన పడేవారుంటారా ప్రపంచంలో? నేనైతే అసలు నమ్మలేకపోతున్నా! అదోరకమైన చేదు; చేదుంటే పర్లేదు, మంచి సువాసనైనా ఉందా అంటే అదికూడా లేదు. మన ఊర్లో కాఫి గ్రైండ్ చేసే షాపులముందు నడిచినా ఆ వాసనకే నాకు పొట్టలో తిప్పేస్తుంది. అంత చిరాకు!

 5. “After all coffee కోసం ఇంత తపన పడేవారుంటారా ప్రపంచంలో? నేనైతే అసలు నమ్మలేకపోతున్నా! అదోరకమైన చేదు; చేదుంటే పర్లేదు, మంచి సువాసనైనా ఉందా అంటే అదికూడా లేదు. మన ఊర్లో కాఫి గ్రైండ్ చేసే షాపులముందు నడిచినా ఆ వాసనకే నాకు పొట్టలో తిప్పేస్తుంది. అంత చిరాకు!”………

  భాస్కర్ గారూ, అచ్చు ఇవే ఫీలింగ్స్ నావి కూడా. నా మనసులో మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. కానీ మన బేచ్ వాళ్ళు చాలా తక్కువండీ ప్రపంచంలో. కాఫీనేమైనా అన్నామంటే మనల్ని వాయించేస్తారు, అందుకే నేను వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటాను. 😀 ఏదో మీరిక్కడ గట్టిగా బల్లగుద్ది చెప్పేసరికి సంతోషమేసి నేనూ గొంతు కలిపుతున్నా! 😛

 6. సౌమ్య గారు(టపా రాసిన సౌమ్య కాదు; పైన కామెంట రాసిన సౌమ్య),
  మన బేచ్ సంక్య తక్కువా, ఎక్కువా అన్నది కాదు పాయింట్ మనం నెగ్గుతామా లేదా అన్నది పాయింట్(ఏదో పంచ్ ప్రయత్నం 😉

  కాకినాడకి కాజాలు, భాగ్యనగరానికి పుల్లా రెడ్డి, తిరుపతికి వెంకన్న, బెజవాడకి దుర్గమ్మ, గుంటూరుకి మిరపకాయల్లాగా చెన్నైకి కాఫీ. అట్టిది చెన్నైలో పుట్టిపెరిగి కాఫి తాగని నీవళ్ళ చెన్నైకే అవమానం అంటారు! పుట్టిన ఊరికి అవమానం తెచ్చిపెట్టకూడదని తాగే సాహసం చేసి విఫలం అయితిని…

 7. హహహ్హ భాస్కర్ గారూ పంచ్ అదిరింది 🙂 నన్నూ అలాగే అంటారండీ….కాఫీ తాగని నువ్వేం సౌత్ ఇండియన్ వి తీసి పరేస్తారు. అలాగంటున్నారు కదాని నేనూ తాగ ప్రయత్నించా, అబ్బే గొంతు దిగితే కదా.

  by the way పైన కామెంటు రాసిన sowmya నేనూ ఒకటే. వేరు వేరు అనుకోకండి.

  (మనలో మన మాట…ఈ సంభాషణ చదువుతున్నవారంతా ‘కాఫీ హేటర్లూ…మీకు టేస్టు తెలీదు’ అని మన మీద ఎవరైనా ఒక టపా రాసేస్తారో ఏమిటో!) 😀

 8. ఆ. సౌమ్య గారూ,
  నిజమే! ఈ కాఫీ ప్రియులు, కాఫీ హేటర్ల మీద ఒక టపా రాసినా రాస్తారు! ఏం చేస్తాం? తాగుడు అలవాటు అలాంటిది మరి 😉

  నా కామెంటు చదివాక Sowmya V.B ఏమన్నారో ఆ buzzలో పెట్టాను చదవండి.

 9. coffee lenappudu tappani, tappinchukoleni paristhitulalo TEA tagutunnappudu Sowmya ela untundo evaranna chusara…? heheheh… neenchusaanooochhhhhh….:)

 10. హాయ్ …!
  పొద్దున్నే “శుభోదయం” అని అన్ని దేశాల,ప్రాంతాల,భాషల వారిని ప్రేమగా పలకరించే నా పేరు” కాఫీ”.
  ఒక్కసారి కళ్ళుమూసుకుని నాపేరు పలకరించండి… ఎంత అందమైన, వీనులవిందైన శబ్దం
  “కాఫీ..ఈ…ఈ”. ఇక, నా అందం చూడండి నా పేరుతోనే ఒక రంగు” కాఫీ కలర్”.

  శతాబ్దాలుగా(దాదాపు 15th century ) ఖండాంతరాలు గ నా సొగసు ను పొగడని వారు లేరు.రాజులు,రాజ్యాలు,ప్రజలు,అందరు
  నాకు దాసోహం.

  ఇంత కాలం గా ఎందరికో మంచి రుచిని, ఉత్సాహాన్ని,ఉత్తేజాన్ని ఇచ్చానే కాని, నిజం గా ఎవ్వరి ఆరోగ్యాన్నైనా దెబ్బతీసానా… …
  నాతో స్నేహం చెయ్యండి, నన్ను ప్రేమించండి, అంతే కాని నాకు “addict ” అయ్యి మీ ఆకలిని పాడుచేసుకోకండి
  (అతిసర్వత్రా వర్జియేత్ కదా… …)

 11. Coffee..Coffee when ever i hear that word i remember the spelling “KAUPHY” said by naresh in some movie..

 12. మ(మీ)రొకరున్నారన్నమాట! కాఫీ ని పలవరించి ప్రేమించేవాళ్ళు. ఇన్స్టంట్ కాఫీ కి, ఫిల్టర్ కాఫీ కి తేడా తెలిసిన వారూను. హమ్మయ్య! మీకు కాఫీలాంటి పోస్టొకటివ్వనా చదవడానికి. ఇదిగో!

  http://kothavakaya.blogspot.com/2010/12/blog-post_12.html

 13. హ్హహ్హాహ్హా.. చూళ్ళేదు ఇందాకా. మా ఆ. సౌమ్య ఇచ్చేసిందా నా పోస్టు వాయినం. బాగుంది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: