ఇవెక్కడి ఎత్తులో!!

శనివారం పొద్దున్నే నేను ఒక మహా పాద యాత్రకు శ్రీకారం చుట్టాను. అంటే, ముందు చుట్టలేదు. తర్వాత చుట్టాల్సి వచ్చింది. నేను, నదీ తీరంలో కూర్చుని, పుస్తకం చదువుకుందామని పైనున్న మా ఇంటి నుండి కిందకు దిగడం మొదలుపెట్టా. మామూలు రోడ్డులో పోకుండా, కొత్త దారి వెదుకుతూ వెళ్ళి, ఇక్కడి ఓల్డ్ సిటీ అనదగ్గ డౌన్ టౌన్ ప్రాంతం మోజులో పడిపోయి, అక్కడక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఒక రెండు గంటలు తిరిగా. ఆపై, ఫొటోల తాకిడికి సెల్లు అలిసిపోయి, మొరాయించబోతే, దాని చార్జింగ్ కోసం, కాసేపు విరామం ఇచ్చి, ఆఫీసు గదికి వెళ్ళా.

అదీ అయ్యాక, ఒక టర్కిష్ రెస్టారెంటు వాడిని శాఖాహార వంటల గురించి ఆరా తీసి (అబ్బో! శాఖాహార పరిరక్షణ అన్న కథ మళ్ళీ చెబుతా లెండి..పెద్ద కథే!), ఫలాఫెల్ తిని (మళ్ళీ రేపొచ్చి కూడా ఇదే తినాలి, అనుకుని), నది ఒడ్డున నడక మొదలుపెట్టా. ఈసారి, అలా నడుస్తూ నడుస్తూ, చాలా ముందుకెళ్ళి, స్టూట్‌గార్ట్ రోడ్ అని బోర్డ్ కనబడ్డంతో, దేశాలు పట్టి పోతున్నానేమో అని భయపడి, ఇప్పుడీ వచ్చిన దారిని వెనక్కి పోకుండా, నది ఆవలి పక్కకి వెళ్ళడం ఎలా?? అని ఆలోచిస్తూంటే, ఒక బ్రిడ్జి కనబడ్డది. వందేళ్ళనాటిది. అది దాటితే, మరో కొత్త ప్రపంచంలో పడ్డా!

ఇక్కడ నేను రోడ్డుపై నడుస్తున్నానా – ఎటు తల తిప్పినా పైకి, పైకి, పైపైకి – ఇళ్ళపై ఇళ్ళు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. చిన్నప్పుడు కర్నూల్లో ఉన్నప్పుడు మేడపైకెక్కి చూస్తే, జగన్నాథ గట్టుపై ఉన్న చెట్టుమీద చెట్టు కనబడ్డట్లు!! (ఇదిగో, ఈ ఫొటో ఒక ఉదాహరణ)

అలాగే, నడుస్తూ ఉండగా, నా కళ్ళు ఇక్కడ ఆగాయి.

అదిగో, అక్కడికి వెళ్ళాలి. అది చూస్తే ఏదో చరిత్ర ఉన్నట్లే ఉంది..ఏమిటో…అనుకుంటూ కాస్త ముందుకు నడిస్తే, మెట్లు కనబడ్డాయి. ఎక్కడం మొదలుపెట్టా. కొంతదాకా ఎక్కాక, ఆ భవనం కనబడ్డది. చూడబోతే, ఇది రెసిడెన్షియల్ ఇల్లు లాగే ఉంది. దీని పైన ఒకాయన సెల్లు మాట్లాడుతూ కనబడ్డాడు. ఓసారి కిందకి చూశా.

అబ్బో! చాలా ఎత్తే ఉంది. కింద కారు చూసారూ, ఎలా చిన్నదైపోయిందో! అసలుకి ఆ కారు ఉన్న రోడ్డే నది పై ఉన్న బ్రిడ్జి కంటే ఎత్తులో ఉంది. ఇప్పుడు ఈ భవనం చూస్తే ఇంతెత్తులో ఉంది. దీని పైన ఇలాంటిదే మరో భవనం ఇంకా ఎత్తులో ఉంది. ఏమిటో!! సరే, నేను నిలబడ్డ స్థలం నుండి చూస్తే, ఇళ్ళ కప్పులే తప్ప, నది జాడే కనబడలేదు!

సరే, ఇంకా పైన ఇళ్ళున్నాయ్. ఎక్కుదామా? అనుకున్నా గానీ, ఆల్రెడీ ఇదే ఇంటికి దాదాపు మూడు కి.మీ. దూరం. ఇంతసేపట్నుంచీ నడుస్తున్నా. ఇదంతా నడిస్తే, నన్నెవరన్నా దొర్లించుకుంటూ తీసుకుపోవాల్సి వస్తుందిక ఇంటికి, అని భయపడి మెట్లన్నీ దిగేసా. కొన్ని అడుగులు ముందుకి నడిస్తే, కాస్త కీందకి చూస్తే, ఇదిగో, నదీ, దాని ఒడ్డున ఉన్న రెస్టారెంటు, వెనక నేను చేరాల్సిన మెయిన్ రోడ్డూ! హమ్మయ్యా! మళ్ళీ దార్లో పడ్డా! అనుకున్నా.

రోడ్డున పడ్డాక, కాసేపు నడిచి (కాసేపు నీరసిస్తున్నానేమో అని అనుమానపడి), ఇల్లు చేరుకున్నా అనమాట. ఇవ్వాళ ఇతరత్రా చాలా డిస్కవరీలు చేసినా కూడా, ఇదొక్కటి మాత్రం ప్రత్యేకంగా చెప్పాలనిపించింది. ఈ ఊరేంటో – దీని ఎత్తుపల్లాలేమిటో! అని ఆశ్చర్యపోయేలా చేసినందుకు… 🙂

Advertisements
Published in: on April 17, 2011 at 1:25 am  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/04/17/ivekkadi-ettulo/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. అద్భుతంగా ఉన్నాయి నీ పాదయాత్రలూ, చిత్రాలూ. అన్నట్టు నాక్కూడా ఫలాఫెల్ చాలా ఇష్టం. నువ్వు అది కనుగొన్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంతకీ మామూలు రోడ్డుమీంచి, లేదా మీ ఆఫీసునించి మీఇల్లు ఎలివేషను చూపించు ఓ ఫొటోలో. నాకు మహా ఆసక్తిగా ఉంది 😛

  2. భలే ఉంది సౌమ్యా మీ పాదయాత్ర! అల్లదిగో ఆ రెండో ఫొటోలో కనపడుతున్న కార్నర్ ఇంట్లో పై____న ఉంటే బాగానే ఉంటుందేమో గానీ రోజూ ఎక్కి ఇంటికి వెళ్ళాలంటే ప్రాణాలు కడబడతాయ్. అందుకే ఒక రోప్ వే పెట్టించుకోవాల్సొచ్చేలా ఉంది.

    మీ వూళ్ళో నది కూడా బాగుంది

  3. @Malathi garu: ముందు రాసిన టపాలో చూపించా కదా ఎలివేషన్. అదే, నా హారర్ వాక్ గురించి రాసినపుడు 🙂

  4. @Sujatha garu: వాళ్ళు కార్లలో తిరుగుతారు కదా. ఆట్టే తెలీదేమో. నా బోటి నడకప్రియులకే ఇబ్బంది 🙂

  5. adbhutham.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: