వన్వే రోడ్లు ఎలా పుట్టాయంటే….

(గమనిక: ఇది చరిత్ర చెక్కిన కథ కాదు. నా కథ.)

మా కొత్తూళ్ళో రెండు వారాల బట్టీ నాకు బోలెడు అనుభవాలు కలిగాయి. వాటిలో రెంటిని గత రెండు టపాల్లో రాసాను. ఇప్పుడు సంగతేమిటంటే, నేనిలా ప్రతివీథికీ ఎవరో ఒక గొప్ప వ్యక్తి పేరును చూడ్డమూ, ఇంటికొచ్చి గూగుల్ చేయడమూ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉండగా, ఒక చోట Einbahnstrasse కనిపించింది. “ఓహో!” అనుకుంటూ ముందుకెళ్ళాను. అదేమిటో గానీ, గూగుల్ చేయలేదు. మరోరోజు మరో వైపున నడుస్తున్నప్పుడు Einbahnstrasse అని మరో బోర్డు కనిపించింది. అర్రే! ఆ రోడ్డు ఇక్కడ దాకా ఉందన్నమాట! అనుకున్నాను, గూగుల్ చేయలేదు. ఇలా ఇంకో రెండుసార్లు అయింది. అయితే, ఈ ఊరు గుండ్రంగా ఉంది కాబోలు అన్న ఆలోచన లీలగా కలిగిందనుకుంటాను కానీ, ఈ వీథి ఊరులో చాలా పెద్దది అని అర్థమైంది.

అయితే, మొన్నోరోజు ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పై కి.మీ. దూరంలో ఉన్న మరో ఊరు వెళ్తున్నప్పుడు బస్సులోంచి చూస్తే, మళ్ళీ Einbahnstrasse ఒకటి కనబడ్డది. కెవ్! అయితే, ఈయన మనూర్లోనే కాదు..పక్కూర్లో కూడా ఫేమస్సన్నమాట! ఎవరో, ఏమిటో, కనుక్కోవాలి, అనుకున్నాను.

పక్కూరు వచ్చానా, అవీ ఇవీ చూస్తూ, చరిత్ర తెలుసుకుంటూ ఉండగా, ఒక చోట రోడ్డు దాటుతూ ఉంటేనూ, Einbahnstrasse అన్న బోర్డు కనిపించింది. ఈయనెవరో, గొప్పవాళ్ళలో గొప్పవాడేమో అనుకున్నాను.నేను జర్మన్ కూడా తెలిసిన తెలుగు వారితో ఉన్నాను అప్పుడు. కనుక, కుతూహలం ఆగక, వెంటనే అడిగేసా – “అసలీయన ఎవరూ? ఎక్కడ చూసినా ఈయన పేరు తెగ కనిపిస్తోంది? (గాంధీ నగర్, నెహ్రూ నగర్ లాగా..అనుకుంటూ)” అని. అప్పుడు, నా స్నేహితురాలు పెద్దగా నవ్వి – “అది వన్వే రోడ్డు” అన్నది. (Ein=one, Bahn=way అని విడగొట్టుకోవచ్చేమో!)

ఒక రౌండు నవ్వులయ్యాక, Einbahn ఎంత పెద్ద స్వాతంత్ర సమరయోధుడు కాకుంటే ఆయన పేరు ఇలా ఊరు ఊర్నా పెట్టుకుంటూన్నారో, అసలు ఆయనే లేకుంటే, ప్రపంచానికి, ముఖ్యంగా జర్మనీకి – వన్వే రోడ్లే ఉండేవి కావేమో – అనుకుని, అంత గొప్పాయన గురించి తెలుసుకున్నందుకు మహా మురిసిపోతూ (అబ్బే, పబ్లిగ్గా చిన్నపిల్ల ముందు దొరికిపోయానే అని ఆ పిల్లకి సంగతి అర్థం కాకపోయినా మనసులో సిగ్గుపడుతూ)….

అలా ముగిసింది ఈ భాగం… ఎలా మొదలైనా కూడా!

Published in: on April 12, 2011 at 2:16 am  Comments (11)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/04/12/oneway/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. హహహ..సౌమ్యా.. నేనొచ్చిన కొత్తలో ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకీ జోకుని.. ఎవరో ఒకబ్బాయి కొత్తగా వచ్చిన రోజుల్లో మీ ఇల్లెక్కడ అని ఎవరో అడిగితేనూ.. Einbahnstrasse అని చెప్పాడంట. ఆ తర్వాతా నుంచీ అందరూ తెగ నవ్వుకునేవారంట అది గుర్తు చేసుకుని..:D నాకు Einbahnstrasse అని చూసిన ప్రతీసారీ ఈ జోకు గుర్తొస్తుంది.. 😉

 2. :))

 3. ha ha ha ha ha LOLLLLLLLLLL….

  మధురగారు నిజం చెప్పండి… ఇల్లు ఎక్కడని అడిగితే Einbahnstrasse అని చెప్పింది మీరే కదా :D:D:D:D:D

 4. Maradey .. comedy ante!

 5. 😀

 6. Gamanika Keev… 🙂 good post… :))

 7. 😀
  aithe ee saari autobahn chusinapudu inkoo post raayalevannamaata

 8. @ మంచు గారూ,
  నిజంగానే నేను కాదండీ.. నాకు కొత్తలోనే ఈ సంగతి తెల్సింది ఆ జోక్ వినడం ద్వారా.. లేకపోతే అలానే అనుకున్నా ఆశ్చర్యం లేదు.. 😉
  ఇంతకీ అన్నీటికి కంటే బాగా నవ్వు తెప్పించింది ఏంటంటే, ఆ అబ్బాయి అడ్రసు einbahnstrasse అనగానే, విన్నవాళ్ళందరూ .. అదే ఎక్కడా.. అని మళ్ళీ అడగడం.. ఆ అబ్బాయేమో పాపం అమాయకంగా మళ్ళీ అదేనండీ einbahnstrasse దగ్గర అని చెప్పడం.. 😀

 9. హహహహ్ సౌమ్య, మధుర….ఇద్దరూ ఇద్దరే….బలే నవ్వొచ్చింది. :))))

 10. :))))))

 11. Hahaha.Mukhayam ga last incident naku baga nachindi(Navochindi)..adventures of Hucklberry type lo unayi kada motaniki!! Liked them all 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: