ఇది కథ కాదు మహాప్రభో!

నేను ఆయాసపడిపోయి, వొగుర్చుకుంటూ, శ్వాసకోస వ్యాధేమైనా వస్తుందేమో అని ఖంగారు పడిపోయి, రూముకొచ్చి, నా స్నేహితుణ్ణి పింగ్ చేసి, గత ఇరవై నిముషాల కథ చెప్తే – “అయితే, ఇంతలో కళ్ళు తెరిచావు..అంతా చీకటి, అంతేనా… అప్పుడప్పుడు కథలు భలే చెప్తావు గా” అన్నాడు. “నాన్నా-పులి” కథ గుర్తు రాలేదు నాకు. ఎందుకంటే, క్రియేటివిటీ ప్రదర్శించి అవధానం చేస్తున్నట్లు కథలల్లే రోజుల్లో నేను చెప్పే కాకమ్మ కథలన్నీ కాకమ్మ కథలని చెప్పే చెప్పేదాన్ని. మరీ సంగతి చెప్తూ ఉంటే నమ్మడేమిటీ అని..ఫొటోలు కూడా చూపించా. (ఇంకా కిందేముందో చూడక ముందు తీసిన ఫొటోలు లెండి!). ఇంతకీ, సంగతేమిటంటే –

ఆఫీసు నుంచి ఐదున్నరకే ఊడిపడ్డా. ఇక్కడ చూస్తే, ఎనిమిదిన్నరకు గానీ చీకటి పడదు. ఏడున్నర దాకా ఎలాగో ఇంట్లో ఉన్నా కానీ, ఆ పై బోరు కొట్టి, అలా నడుద్దాం అనుకున్నా. మామూలుగా, నేను కొండపైనుంటే, ఆఫీసు కింద ఉన్నట్లు అనమాట. రోజూ సాయంత్రాలు పైకి ఎక్కుతూ, నిముషాలు లెక్కేస్తూ వస్తూ ఉంటా. ఇవ్వాళ ఇంటి వెనుక వైపు కి వెళ్తే, అక్కడ కిందకి దిగేందుకు మెట్లున్నాయ్! సరే, దిగితే ఎటు వెళ్తామో చూద్దాము. ఒకవేళ ఇటు దిగి, మళ్ళీ అర్థ గోళం తిరిగి, మళ్ళీ ఆఫీసు రోడ్డు చేరి పైకెక్కేయొచ్చేమో, అనుకుని, దిగడం మొదలుపెట్టా. ఇదిగో, ఇదీ రోడ్డు.

అంటే, ఇంకా కింద చాలా ఉంది లెండి. కెమెరా కన్ను చిన్నది. కెమెరా -సెల్ ఫోను ది! తర్వాత, మధ్యలో, ఒక ఇల్లు కనిపించింది. దాని పక్కనే, దయ్యాల కొంపలాండిది ఒకటుంది. అబ్బో, నాకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లోనో ఎందులోనో అడవి చెట్లన్నీ నడుచుకుంటూ వస్తాయే, ఆ సీను గుర్తు తెచ్చింది ఈ ఇల్లు.

కాస్త భయమేసింది కానీ, ఇంకా వెల్తురుంది కనుక, పర్లేదు లే అనుకుంటూ, ముందుకు దిగిపోయా! ఇలా దిగేశానా, అక్కడ చూస్తే, మళ్ళీ ఇళ్ళూ గిళ్ళూ అన్నీ ఉన్నాయి..పెద్ద పెద్ద రోడ్లు, కార్లూ, మనుషులూ! ఇదేదో బానే ఉందిలే, అనుకుని, రోడ్డుపైకి దిగి నడవడం మొదలుపెట్టా. కాసేపలా నడుస్తూ ఉండగా, అనుమానం వచ్చింది..ఒకవేళ చివరికంటా వెళ్ళాక, అది మృత దారి (Dead End అనమాట!) అయితే ఎలాగు? అసలే చీకటి పడే వేళౌతోంది… అనుకున్నాను. వచ్చి వారం కాలేదు, భాష కూడా రాదు… ఎందుకొచ్చిన గోల, అనుకుంటూ, నేను ఒక గోడను ఆనుకుని నడుస్తున్నా కదా, అవతల ఏముందో అని తొంగి చూశా. గుండె గుభేల్మంది! స్మశానం!!! ఇక్కడ గానీ, ముందుకెళ్ళి, చీకటి పడిపోయాక ఇదే దారిన వెనక్కి నడవాల్సి వస్తే, ముందే నేను భయస్థురాలిని… ఇంక ఇల్లు చేరతానా?? అందుకని టక్కున వెనక్కి తిరిగి, మెట్లు ఉన్న మలుపుకి వచ్చేసి, హడావుడిగా పైకి ఎక్కేయడం మొదలుపెట్టా. ఒక ఐదు నిముషాలు ఎక్కాక, మెట్లేవీ? అని అనుమానం వచ్చింది. తల ఎత్తి చూస్తే, అక్కడితో ఆ దారి ఆఖరు. ఇళ్ళు ఉన్నాయి పైన!

పరుగెత్తుకుంటూ (నేను ఒక అడుగు వేసా అంతే. స్లోప్ ఉంది కనుక, పరుగులు అవే వచ్చేసాయ్!) మళ్ళీ కిందకొచ్చి, అప్పుడు గమనించా. సమాంతరంగా ఉన్న మరో రోడ్డుకి వెళ్ళిపోయా అని. నా రోడ్డును చూస్కుని ఎక్కడం మొదలుపెట్టా. ఇప్పుడు కొంతమంది మనుషులున్నారు రోడ్డు పైన. హమ్మయ్యా! అనుకున్నా. ఇక్కడే అనమాట, నా అలసట బాగా తెలిసొచ్చింది. నాకంటే పెద్ద వాళ్ళు కూడా ఎక్కుతూ పోతూ ఉంటే, నేను ఆయాసపడుతూ, నెమ్మదిగా, పైకి ఎక్కుతూ, ఇదిగో, మనుషులున్నారు అన్న దానికి సాక్ష్యంగా, ఈ ఫొటో తీశా –

అప్పుడే, ఇందాకటి స్కేరీ హౌస్ ని కూడా మరోసారి చూసి, తరించి, చీకటి పడుతూ ఉందని గమనించి, ఎందుకొచ్చిన గోలని, ఆదివారం పొద్దున్న వచ్చి చూద్దాం లెమ్మని, పైకి ఎక్కి, ఇంటికొచ్చేశా!! అదీ సంగతి!!!

Advertisements
Published in: on April 6, 2011 at 12:23 am  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/04/06/real-incident/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. ఇది కథ కాదు మహాప్రభో… ha ha టైటిల్ బాగుంది.
  స్కేరీ హౌస్, స్మశానం…. 🙂 ధ్రిల్లింగ్ గా ఉంది.

 2. చదివేవాళ్ళకు కూడా ఆ భయాన్ని కలుగజేస్తున్నారు!

  నాకు నచ్చిన కొన్ని వాఖ్యాలు..
  “..నేను చెప్పే కాకమ్మ కథలన్నీ కాకమ్మ కథలని చెప్పే చెప్పేదాన్ని.”
  “…మృత దారి (Dead End అనమాట!)…”
  Dead End కి ఇదివరకు ఎవరూ తెలుగు పదం రాసినట్టులేరు. బాగుంది మీ పదసృష్టి!

 3. Don’t roam around all alone in weird places 😛

 4. Vachina kothallo andarike jarige physical and mental fitness testla lantivi ee experiences…I am glad that you are going through the same…hehehehe…

 5. Hi Sowmya, Its been long time since i visited ur blog
  “…మృత దారి (Dead End అనమాట!)…” , “కెమెరా కన్ను చిన్నది” rocking words………..నిజంగానే నువ్వే తీసావ ఆ ఫోటోలు………..

 6. 😀 kevvvvvvvvvvvvv annamaata… cheekati padite niSii tODu raadaaa enti… nuvvu oorike bhayapa(pe)dataav sowmy… 😉

  Jokes apart – Take care.. 🙂

  btw – aa meTlu, daari, illu bhale unnaayi… lovely place… naakooo vaccheyyaalani undi!!!

 7. annatttoooo smasaanam episode adirindi… :))) edo cinemaa lo scene laaaa 😛


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: