“Social Entrepreneur” అని ఎవర్ననాలి? -Part 2

మొన్నొక రోజు Social Entrepreneurship గురించి కలిగిన సందేహం గురించి రాసాను. తరువాత, కొన్ని రోజుల విరామం తరువాత మళ్ళీ ఆ పుస్తకం పట్టి, మరొకరి గురించి చదవడం మొదలుపెట్టాను. అప్పుడు కలిగిన ఆలోచనలు ఈ టపాలో.

ఈసారి తెలుసుకున్న వ్యక్తి – జెరూ బిల్లిమోరియా. ఆవిడ -1098 చైల్డ్ హెల్ప్లైన్ సంస్థ స్థాపించి, దేశంలోని ఎందరో పిల్లలకి అభయహస్తన్ని అందించిన వ్యక్తి. అంతే కాదు, ఈ సంస్థ ద్వారా, ఎక్కువో, తక్కువో – ఎంతో కొంత సంపాదిస్తున్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో. ఆవిడ గురించిన వివరాలకు ఇక్కడ చూడండి.

-ఈవిడ విషయానికే వస్తే, ఈ సంస్థ ద్వారా -సమాజంలో వచ్చిన మార్పు, దాని “స్కేల్” గురించి ప్రశ్నలకు తావే లేదు. అలాగే, ఈ సంస్థ ఎందరో పిల్లలకు సహాయం అందించడమే కాక, మరెందరికో ఉపాధి కూడా కల్పించింది. కనుక, ఆ కోణంలో ఇది Social Entrepreneurship అనే చెప్పాలి. అయితే, ముందు నుండి నా మనసులో ఉన్న అభిప్రాయం – వీటన్నింటితో పాటు సంస్థ స్వయం సమృద్ధి కలిగినదై ఉండాలని. కానీ, నాకు అర్థమైనంతలో, ఈ సంస్థకు వేరే చోట్ల నుండి నిధులు సమకూరుతున్నాయి. అది గమనించాకే, నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను.

పుస్తకం అట్ట వెనుక రాసినట్టే – “What a business entrepreneur is to the economy, the social entrepreneur is to the society” అని అనుకున్నా కూడా, డబ్బు సంపాదన కోణాన్ని నేను ’బిజినెస్’ కి మాత్రమే పరిమితం అనుకోలేదు. బహూశా, social entrepreneurship లో అసలు అదొక అంశమే కాదేమో అని ఇప్పుడనిపిస్తోంది. ఎందుకంటే, మొన్న చెప్పిన జావేద్ అబిదీ గారు నా దృక్కోణం నుంచి ఆక్టివిస్టు అనిపించినా కూడా, బిల్లిమోరియా గారు అసలు ఏ కోణంలోనూ నాకు -వాలంటీరు గానో, యాక్టివిస్టుగానో అనిపించట్లేదు. అసలు సిసలైన entrepreneur గా, మేనేజ్మెంట్ నిపుణురాలిగానే కనిపిస్తున్నారు. కానీ, నాకు అర్థమైనంతలో సంస్థకు ఒక రెవెన్యూ మోడెల్ అంటూ లేదు. అటువంటప్పుడు, నిధులు అనుకున్న సమయానికి అందకపోతే, ఈ ఎంటర్ప్రైజ్ పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న మాత్రం మళ్ళీ కలుగుతోంది.

ఇవి ఇలా ఉండగా, పుస్తకం చివర్లో ఇచ్చిన “resources” పేజీల్లో “Social Venture Capital Funds” అన్న పదం వాడారు. మరి, వాళ్ళేం ఆశించి క్యాపిటల్ ఇస్తారప్పుడు? ప్రతిఫలాపేక్ష లేని వీసీ ఉంటాడా? 🙂 లేక, అన్ని ప్రతిఫలాలూ ధనరూపేణా ఉండనక్కర్లేదా? లేనప్పుడు – ఈ సోషల్ వీసీలు ఏం ఆశిస్తారు? దీర్ఘకాలం అదే రంగంలో ఎలా కొనసాగుతారు?

ఎలా అనుకున్నా కూడా, బిల్లీమోరియా గారి కథనే తీసుకుంటే, మరి, ఆవిడ కనీసావసరాలతో బ్రతికేందుకన్నా డబ్బు అన్నది అవసరమే కదా. ఆవిడకి వేరే ఎదన్నా మార్గం ఉందేమో, నాకు తెలీదు కానీ, కెరీర్ గా social entrepreneurship ని తీసుకునే జీవులు ఉండరూ? కనీసం వారి కోణంలో అన్నా, ఆ సంస్థకు తనదంటూ కొంచెం ధనం ఉండొద్దూ? తన ఉద్యోగులకివ్వడానికైనా ఉండొద్దూ – లాభాల్లో తులతూగకపోయినా??

Advertisements
Published in: on February 8, 2011 at 7:40 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/02/08/social-entrepreneur-%e0%b0%85%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-part-2/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

 1. this topic is well discussed in wiki with examples.

  http://en.wikipedia.org/wiki/Social_entrepreneurship

  from the above link:

  “There are continuing arguments over precisely who counts as a social entrepreneur. Some have advocated restricting the term to founders of organizations that primarily rely on earned income – meaning income earned directly from paying consumers. Others have extended this to include contracted work for public authorities, while still others include grants and donations. This argument is unlikely to be resolved soon. Peter Drucker, for example, once wrote that there was nothing so entrepreneurial as creating a new university: yet in most developed countries the majority of university funding comes from the state.”

 2. From BBC- Forum website:

  Are social entrepreneurs heroes?

  Social entrepreneurs are mavericks and ruler breakers who take bold ideas from the world of business, and look for ways to improve the lives of many. But what does it mean to be a hero today? And are social entrepreneurs heroic? Is an ability to embrace risk a prerequisite for being a hero? Should the best social entrepreneurs merely facilitate our grass roots heroes in their quest. And how do you do that most effectively?

  Listen to the programme here:
  http://www.bbc.co.uk/programmes/p00fvly5#synopsis


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: