ఒక చిన్న పేరడీ

వాకింగ్ చేస్తూ ఉండగా సెల్ ఫోన్ మ్యూజిక్ ప్లేయర్ లో ఈ పాట మొదలైంది. వింటూ ఉండగా, ఎప్పుడూ లేనిది నవ్వు రావడం మొదలైంది. ఎందుకూ? అంటే, ఒక పక్క అక్కడ పాటొస్తూ ఉంటే, నా మెదడులో ఒక పేరడీ పుడుతోంది మరి. సరే, ఇంటికొచ్చి, పేరడీ తయ్యారు చేద్దాం అనుకుంటే ఏముందీ? పేరుకి నాలుగు నిముషాలైనా, ఆ పాటలో ఉన్నవి ఆరు లైన్లే! వాటినే ఒక్కోదాన్నీ రెండు మూడు నాలుగైదు సార్లు పాడారు. సరే, అయినప్పటికీ, మనం పేరడీ చెప్పేద్దాం! అనుకున్నా. ఫలితమే ఈ బ్లాగు టపా. నేను రాసిందానికి నేనే టీకాతాత్పర్యం కూడా రాసా బ్రాకెట్లలో :)) అసలు పాట ప్రేమ వెలసింది అంటూ ప్రేమ దిస్ దట్ అని సాగింది కనుక, ఇది రివర్సు లో సాగుతుంది. తను విరిగినా, మనసును విరగ్గొడుతున్నా, వదలని ప్రేమ అనమాట ఈ ప్రేమ. ఇక చదవండి:

ప్రేమ నిలచింది మనసులోనే శోక దేవతలా
నిప్పు కురిసింది మనసు నుండి, పెద్ద దండనలా!
(ప్రేమకి సజీవ దహన కాండ , పాపం నిష్కారణంగా మనసు బలైంది కాబట్టి దండన అనమాట.)

ప్రేమలో ఉంటే చీకటైనా వెలుతురేనంటా
దెబ్బతిన్నాకా జననమైన మరణమేనంటా

బ్రతుకు సంద్రాన్నీ మింగివేసే పడవ ఈ ప్రేమా
తెలివి తప్పించి, మత్తులోనే ఉంచునీ ప్రేమా

ఏ పాటో చెప్పుకోండి చూద్దాం! 😉 ఇదే పాటో నేను చెప్పనక్కర్లేదుగా! “శ్రుతి తప్పింది!” అంటారా? మరేం పర్లేదు.

Advertisements
Published in: on January 28, 2011 at 10:18 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/01/28/%e0%b0%92%e0%b0%95-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b0%a1%e0%b1%80/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. నీరాజనం అనే సినిమాలోది అనుకుంటా ఈ పాట! పాట రాసింది ఎవరూ? ఆ సాహిత్యం వింటుంటే (పేరడీ కాదు, ఒరిజినల్..)తప్పకుండా డబ్బింగ్ రచయితై ఉంటాడనిపిస్తోంది. “అంటా ” అంటా” అంటూ సాగేవి డబ్బింగ్ తెలుగు పాటలే.

  కానీ ఓపీ నయ్యర్ సంగీతం ముందు ఆ సాహిత్యం ఎంత చెత్త ఉంటేనేమి అన్నంతా బాగుంటాయి ఈ సినిమాలో పాటలు. (చాలా పాటలు సిమిలర్ గా ఒకే ట్యూన్ తో ఉన్నట్లు అనిపిస్తాయికూడా)

  హార్మోనియం ఈ స్థాయిలో వాడిన (ఇంటర్ లూడ్స్ లో) వాడిన పాటలు తెలుగులో చాలా తక్కువ! ట్యూను బాగుంటుంది కానీ….

  ఆ సాహిత్యానికి ఈ మాత్రం పేరడీ ఉండాల్సిందే! :-))

 2. వాకింగ్ చేస్తూ….??? !!!!!

  • Walking చేస్తూ పాటలు వినకూడదాండీ? 🙂

 3. నీరాజనం లోని పాటలు చాలా బావుంటయి. మళ్ళా మళ్ళా వినాలనిపించే tunes.

 4. సంద్రాన్నీ మింగివేసే పడవ –size disparity!!

 5. @Sri Ram above:
  Haven’t you heard of the story of Matsya Avatar of Vishnu? 🙂

  Anyways, the original line went something like this:
  “kadali eda paina padava laga kadile ee prema” or some such thing.
  -so, I continued from there and said, it might be just a boat, but it can finish off the sea 🙂

 6. – … it might be just a boat, but it can finish off the sea :)- well said! :p.

 7. you post are so nice.
  let me know more about you..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: