రెండు డాక్యుమెంటరీలు

గత రెండ్రోజుల్లో ఏడుగంటలు డాక్యుమెంటరీ వీక్షణంలో గడిచింది.
ఒకటి – ఎవల్యూషన్ ఆఫ్ ఐ.టీ. అని నాలుగు భాగాల డాక్యుమెంటరీ. ఒక్కో భాగమూ ముప్పావు గంట.
రెండోది – ది ఎంపైర్ ఆఫ్ క్రికెట్ అన్న బీబీసీ డాక్యుమెంటరీ – నాలుగు భాగాలు, ఒక్కొక్కటీ గంట.

ఐ.టీ కథ చెప్పిన విడియో సంగతి కొస్తే –

మొదటి భాగం – బ్రౌజర్ యుద్ధాల కథ. నెట్స్కేప్ పుట్టుక మొదలుకుని మైక్రోసాఫ్ట్ బలవంతంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని హిట్ చేసిన కథ.
రెండో భాగం – సర్చ్. సర్చ్ ఇంజిన్ల రంగంలో కలిగిన మార్పులు, గూగుల్ పుట్టుకా, ఎదుగుదలా – దీని కథ.
మూడో భాగం – ఎక్కువభాగం డాట్ కాం బూం, ఆపై కుప్పకూలడం గురించి.
నాలుగో భాగం – సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వికీపీడియా వంటి క్రౌడ్ సోర్సింగ్ సైట్లు ఎదిగిన వైనం.
-ఇంతకీ, మొత్తంగా చూసేందుకు ఈ వీడియో బానే ఉంది కానీ, ముఖ్యమైన విషయాలు చాలా మిస్సైనట్లు అనిపించింది. నాన్-ఐటీ వాళ్ళకి బానే అనిపిస్తుందేమో కానీ, అసలు ఐటీ వారికి ఇది ఐ.టీ ఎదుగుదల లా అనిపించదు. అంటే, ఈ వీడియో కి ఆ టైటిల్ అంత నప్పలేదు అని మాత్రమే అంటున్నా. నాకు తోచిన కారణాలు:

1. అసలిది ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఎలా మొదలైంది, తొలినాళ్ళ ఐబీయం కథ, ఆపిల్ ప్రస్తావన – ఇలాంటివేవీ లేకుండానే డైరెక్టుగా మైక్రోసాఫ్ట్ కి వచ్చేస్తుంది.
2. బ్రౌజర్ వార్ అయ్యాక కూడా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని సవ్వాలు చేసే బ్రౌజర్లు పుట్టాయి. అసలు ఈ వీడియో మొత్తంలో కనీసం ఫైర్ఫాక్స్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు మరి!
3. మూడు గంటల్లో అవుట్ సోర్సింగ్ అన్న పదం కూడా వాడినట్లు లేరు. ఇంకేమి ఐటీ ఎవల్యూషన్ చెబుతున్నట్లూ?? అవుట్ సోర్సింగ్ అన్నది లేకుంటే, ఐటీ జనాల నోళ్ళలో ఇంత నానేదా అసలు?
4. అలాగే, ఐటీ అంటే అమెరికా ఒక్కటే అన్నట్లు చూపారు ఇందులో. ఇతర దేశాల్లోకి ఐటీ ఎలా చొచ్చుకుపోయిందో, ఆయా ప్రాంతాల నుండి ఏవన్నా పెద్ద కంపెనీలు ఎదిగాయా? అన్నది చూచాయగా అన్న చెప్పి ఉంటే బాగుండేది.
5. లినక్స్ అన్న పేర్ నామమాత్రంగా ప్రస్తావించారంతే!
6. వైరస్, యాంటీ వైరస్ అన్న పదాలు అసలు వాడినట్లు కూడా లేరు.

అసలింతకీ నా మానాన నేను అరుస్తూ పోతున్నాను… ఈ వీడియో నాలుగు భాగాలేనా? మరింకేమన్నా ఉండీ నేను మిస్సయ్యానా? నాలుగు అన్నట్లే గుర్తే! పైగా వికీపీడియా దాకా కూడా వచ్చేసారు! ఒక సమ్మరీ గా బానే పనికొస్తుందీ వీడియో. కానీ, నా దృష్టిలో ముఖ్యమైనవి కొన్ని మిస్సయ్యాయి, పైన చెప్పినట్లు.

ఎంపైర్ ఆఫ్ క్రికెట్:
ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేశం – ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇండియా – వెరసి నాలుగు భాగాల వీడియో ఇది. చాలా బాగా తీశారు. ప్రతి దేశం గురించీ చెబుతూ, అక్కడ క్రికెట్ పుట్టిన తొలినాళ్ళను మొదలుకుని నేటిదాకా (అంటే, ఈ వీడియో తీసిన నాటి దాకా) ప్రస్థానాన్ని ఒక గంట వ్యవధిలో చెప్పే ప్రయత్నం చేశారు. తొలినాటి క్రికెట్ జట్లు ఎలా ఉండేవి? క్రమంగా ఎలా మారాయి? చారిత్రక క్రమంలో జట్టు ఉత్తాన పతనాలు ఎలా ఉన్నాయి? ముఖ్యమైన ఘట్టాల మూల కారకులు ఎవరు? – ఇలా సాగుతుంది వీడియో. అలాగే, సామాజిక పరిస్థులు, క్రికెట్ ని ఒక జాతీయ ఆత్మగా చూడటం – ఇటువంటి క్రికెటేతర అంశాల గురించి కూడా చూపిస్తారు.

ఇవి చక్కని ఓవర్ వ్యూలు. సింహావలోకనం అంటారే – సరిగ్గా అలానే ఉన్నాయి. మిగితా దేశాల సంగతి నేను చెప్పలేను కానీ, ఇండియా వీడియో లో కుంబ్లే పది వికెట్లు తీయడాన్ని చూపించకపోవడం నేనెంతమాత్రమూ సహించలేకపోతున్నాను. అఫ్కోర్సు, గంట టైములో అన్నీ చెప్పలేరనుకోండి. ఏదేమైనా, ఈ నాలుగు భాగాలు మాత్రం నాకు చాలా నచ్చాయి. ఇతర దేశాల గురించి కూడా ఇలాగే చెబితే, ఎంచక్కా మనకి క్రికెట్ చరిత్ర గురించి ఒక ప్రాథమిక అవగాహన చక్కగా కలుగుతుంది.

ఇంతకీ ఈ రెండూ ఎక్కద దొరుకుతాయి అని నన్ను మాత్రం అడక్కండి. రెండోది బీబీసీ వాళ్ళది. మొదటిది డిస్కవర్ సైన్స్ వారిది అని మాత్రం గుర్తుంది. నేను నా తమ్ముడి ల్యాప్టాప్ లో చూసి, చూశా ;). ఎక్కడో ఏ యూట్యూబులోనో దొరక్కపోవు. ఆసక్తి ఉంటే ప్రయత్నించండి.

Published in: on December 29, 2010 at 6:31 pm  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/12/29/two-documentaries/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. Good post… 🙂

 2. sorry its not related to this post………

  hi sowmya gaaru…….. may i know ur domain in M.S( is it NLP or speech recognition)

 3. Hi sowmya,
  True MS student from Search (SIEL) anipinchukunnavu.
  Good analytical critics about IT documentaries.
  May be you should advice the official org, so that they can incorporate in the next run.

 4. పోనీ మీ తమ్ముడి లాప్ టాప్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి

 5. ఈ రెండు డాక్యమెంటరీల లింకులు ఉంటే ఇవ్వగలరా?

 6. “Empire of Cricket” programme details can be found here.
  http://www.bbc.co.uk/programmes/b00l319q/episodes/2009
  -but episodes as such are not viewable here I think. May be searching over torrents might help.

 7. In youtube I have found the “Empire of Cricket” programme viedios.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: