పాత ఇంగ్లీషు పాఠాల కథ!

బజ్జులో ‘టు సర్ విద్ లవ్’ మీద రాయడం పుణ్యమా అని, మనసు స్కూలు రోజుల నాటి ఇంగ్లీషు పుస్తకాలపైకి మళ్ళింది. కొన్ని గుర్తుండిపోయిన పాఠాలను తల్చుకుంటూ ఈ టపా!

బాగా చిన్నప్పటి నుంచీ వస్తే, ప్రైమరీ స్కూల్లో నాకు బాగా గుర్తుండిపోయిన పాఠాలు రెండు:
– గోవిందన్ అనే పిల్లవాడి కథ. గోవిందన్ అన్న పేరు గుర్తుండి పోయినట్లు (గోపాలనా?) కథ గుర్తు లేదు. ఏదో, రోడ్డుపైన ఒక గుడ్డివాడు వెళ్తూ ఉంటే, ఈ అబ్బాయి రక్షిస్తాడు అనుకుంటా . లారీ డ్రైవర్ న్యూ తమిళ్ అన్న వాక్యం గుర్తుండిపోయింది!! అప్పట్లో, నాకు ఈ పిల్లవాడు తెగనచ్చేశాడు. మూడు-నాలుగు తరగతుల్లోని పాఠం ఇది.
– నిద్ర పైన ఒక కవిత. నిద్ర వీథి చివర్నుంచీ‌నడిచొచ్చి పిల్లల్ని చేరుకుంటుందని సారాంశం. అప్పట్నుంచీ, చాలా పెద్దయ్యాక కూడా, నిద్ర పట్టనప్పుడల్లా, పాపం ఇంకా నడుస్తూ ఉందేమో అని ఎదురుచూస్తూ ఉండేదాన్ని!!
-ఆరో తరగతి లో పాఠం ఒకటి – రైతు అప్పు తీర్చడం ఎలా అనుకుంటున్నప్పుడు, రైతుని మోసం చేయాలని ఒకడొచ్చి, ఇద్దరం తలోకథ చెప్పుకుందాం – ఎవరన్నా పక్కనోడి కథని నమ్మలేదంటే – డబ్బివ్వాలని – ఇలాంటిదేదో పందెం కాస్తాడు. రైతు తెలివితోపందెం గెలిచి అప్పు తీర్చేసుకుంటాడు. “ట్రూ,ట్రూ,వెరీ ట్రూ” బాగా గుర్తుండిపోయిన డైలాగు!!
-అట్ ది థియేటర్ (ఇది రెండు సార్లు చదివినట్లు గుర్తు… స్కూల్లోనేనా…ఒక సారి ఇంటర్లోనా? అన్నది గుర్తు రావట్లేదు..) : థియేటర్ కు వెళ్ళిన తరువాత, ఎవరన్నా కథ ముందే చెప్పడం మొదలుపెడితే, ‘అట్ ది థియేటర్’ లా చెయ్యకు…అంటాను నేను ఒక్కోసారి..

పెద్ద క్లాసుల కథలు – నాకు తెగ నచ్చేసినవి..ఇప్పటికీ నచ్చుతున్నవి…

-ది న్యూ బ్లూ‌డ్రస్ : పూర్తిగా గుర్తులేదు కానీ, ఒక పేద అమ్మాయి స్కూల్లో‌మంచి బట్టలు లేకుండా అవమానపడుతూ ఉంటే, ఆ పిల్లకి కొత్త బ్లూ డ్రస్ కొనిచ్చే కథ.

-ఒక కథ పేరు గుర్తు లేదు… ఒక హోటెల్ గది చీకటిలో ఇద్దరు అపరిచితులు ఒక రాత్రి గడుపుతారు. ఒకరు ఇంకొకరితో తన కథ చెబుతూ, తన కొడుకు రైలు పట్టాల దగ్గర నిలబడి ఎవరూ చెయ్యూపట్లేదని దిగులు పడుతూ ఉంటాడని చెబితే, రెండో అతను తరువాతి రోజు అటుగా పోతూ, చెయ్యూపితే, ఆ పిల్లాడు మహా సంతోషిస్తాడు.

-విత్ ది ఫొటోగ్రఫర్ (స్టీఫెన్ లీకాక్??)
ఫొటోగ్రఫర్ ని ఎప్పుడు తల్చుకున్నా వెంటనే ఇది గుర్తొచ్చేస్తుండంటే‌మరి – వేరే చెప్పాలా??

-టు సర్ విద్ లవ్ (ఈ.ఆర్.బ్రైత్ వైట్)
నాకు బాగా నచ్చిన పుస్తకం …పాఠ్యాంశం చదివి పుస్తకం కూడా చదివేశానంటే, అది ప్రభావవంతం అనే చెప్పాలి మరి!

-మై స్ట్రగుల్ ఫర్ ఎడ్యుకేషన్ (బూకర్ టి.వాషింగ్టన్)
ఆయన అడ్మిషన్ కోసం ఎంత కష్టపడ్డాడో, తల్చుకుంటేనే చాలా స్పూర్తివంతంగా ఉంటుంది.

-ఇన్ సెలెబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ (క్రిస్టియన్ బెర్నార్డ్)
చివర్లో, ఒక బూజుపట్టిన బిస్కట్ ను ‘చూపిస్తూ’ దానిపై ఉన్న పంటి గాట్ల గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పిన వర్ణన ఎన్నాళ్ళైనా వెంటాడుతూనే ఉంటుంది!!

లీలగా పేర్లు మాత్రం గుర్తుండి పోయినవి:
Circus cat, Alley Cat
My Donkey Sally (James Thurber??)
సాల్మన్, వాసిలీ -వీళ్ళ కథ
ఆన్ సేయింగ్ ప్లీజ్ (ఇది స్కూల్లోనా? ఇంటర్లోనా?)

ఏమైనా, ఈ రచనలని పాఠ్యాంశాలుగా పెట్టిన వాళ్ళకి నా వందనాలు. ఆ మధ్య నా ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల ఇంగ్లీషు టెక్స్ట్ బుక్స్ కనిపించాయి అమ్మమ్మ వాళ్ళింట్లో. దుమ్ము మాత్రం దులిపి మళ్ళీ‌అక్కడే వదిలేశా. ఈసారి హైదరాబాదెళ్ళినపుడు అన్నీ ఓసారి తిరగెయ్యాలి.

మధ్య ప్రదేశ్ వారి పాఠ్య పుస్తకాలు నెట్లో ఉన్నాయి.మధ్య ప్రదేశ్ టెక్స్ట్ బుక్ కార్పోరేషన్ అట సంస్థ పేరు!! (http://mptbc.nic.in/)
మన ఏపీ వారివి ఎక్కడున్నాయో మరి!

ప్రస్తుతానికి ఠక్కున గుర్తొచ్చినవి ఇవి. కాస్త మెమరీని శ్రమ పెడితే, మరి కొన్ని మంచి పాఠాలు గుర్తొస్తాయేమో. వస్తే, మళ్ళీ రాస్తా!

Advertisements
Published in: on October 30, 2010 at 9:34 pm  Comments (19)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/10/30/old-english-textbooks/trackback/

RSS feed for comments on this post.

19 CommentsLeave a comment

 1. The night at the Hotel. Mr. Schwamm 🙂 Highly unforgettable character

 2. My donkey Sally… by Gerald Durrell. Also, the one named Charles is hilarious and a good piece on Child psychology, and alter ego

 3. Two of my personal favourites which aren’t part of your post:

  Run boy run – Story of Glenn Cunningham, an athlete who loses his elder brother and ability to walk in a fire accident and then goes on to be one of the top notch athletes. I love this story… etched in my memory

  And then there’s a Ruskin Bond story – a blind person traveling in train tries to flirt with a gal by acting as if he’s not blind. In the end gets to know she’s blind too.

  Thanks for a nostalgic post.

 4. Wow! Cunningham. I have seen his memorial recently. Am a great fan of his.

 5. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలను, పాఠాలను గుర్తుంచుకొని నేను కూడా టపాలు రాసుకున్నానండీ!. మధ్యప్రదేశ్ వారి వలె మన ఆంధ్రపదేశ్ లో కూడా పాత పుస్తకాలు దొరికితే బాగుండును. నాకు ఎంతో ఇష్టమైన మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకాన్ని పోగొట్టుకున్నాను.

 6. Indeed we must thank them for giving us great memories… The work for Eng texts those days was master class

 7. @Ramana,

  I have all the books including the supplementary readers 🙂

 8. @Geetacharya: Can you get me the Cunningham’s story scanned? PLEASE…

 9. Sure… ASAP 🙂

 10. @గీతాచార్య : నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నానండీ. మా ఇంగ్లీష్ పుస్తకాలలోని (6 వ తరగతి నుండి) పాఠాలు వేరు. మీరు చదువుకున్నది, నేను చదువుకున్నది వేరు సిలబస్ అనుకుంటా.

 11. నేను ఆరు నుండీ ఇంగ్లీషు మీడియం

 12. ‘Night at the hotel’, ‘In celebration of being alive’ are my personal bests.

  there are some other stories like the one by O Henry about a painter who dies after painting a leaf for his neighbor. And one more story in which a bus conductor forces a lady to get down for carrying her dog.

  the new blue dress లో అమ్మాయికి స్కూల్‌వారు కొత్త డ్రెస్ ఇచ్చాక తన ఇంట్లో, ఇంటి చుట్టుపక్కలవారి ప్రవర్తన మార్పు గురించి అనుకుంటా. అమ్మాయి కొత్త డ్రెస్ వేసిందని వాళ్లమ్మ ఇంటిని శుభ్రం చేస్తుంది. ఇది చూసి అమ్మాయి తండ్రి కొత్తగా సున్నం వేయిస్తాడు అది చూసి పక్కంటివాడు…..

  ‘With the photographer’ literally haunted. It was in my intermediate and Engineering too…

  Lesson about Henry David Thoreau, Wordsworth’s ‘Daffodils’ , Robert Forst’s ‘the road not taken’….

  ‘On saying please’ గుర్తురావడం లేదు….మంచి బుద్దుల గురించి చెబుతారు అదేనా..?

  >>Eng texts those days was master class<< ఇప్పటికి అవే పాఠాలు ఉన్నాయి గీతాచార్యగారు and if you can, could you please mail(npchary@gmail.com) me the titles of the lessons, even in installments would be OK…

  సౌమ్యగారు…..కామెంట్‌ రాద్దామనుకొని ఓ చిన్న పోస్ట్ రాసినట్టున్నాను…ఏమి అనుకోకండి మీరు గుర్తు చేసిన విషయాలు అలాంటివిమరి… 🙂

 13. I often think of my favourite lessons (stories) from my Eng text books. ‘To Sir, With Love’, ‘In Celebration of Being Alive’ are one of my favourites. Well, when are you coming to Chennai? (remember?)

 14. @Purnima:
  1)’The Girl on the train’ – is the Ruskin Bond story I guess. Yes…very touching story.

  2)Somehow, I remember ‘Run boy Run’ only vaguely

  @all others: That govindan/gopalan story is ‘A Brave Lad’ and in 3rd or 4th class 😛

  @Nagarjuna: I wrote this post only to invite such comments 😛 So, your nostalgia is welcome.
  @Geethacharya: I too want that scanned ‘Run boy Run’ 🙂

 15. నాకు గుర్తున్నవి “All about a dog” నాగార్జున చెప్పింది. ఇంకా “విత్ ది ఫొటోగ్రఫర్”, “మై స్ట్రగుల్ ఫర్ ఎడ్యుకేషన్”. ఈ లిస్ట్ లో లేనివి “ద బేంగిల్ సెల్లర్స్” పోయెమ్ సరోజినీ నాయుడుది తొమ్మిదిలో వస్తుందనుకుంట, ఇంకా షేక్స్పియర్ ది ఒక స్టోరీ ఉండేది “ద మర్చెంట్ ఆఫ్ వెనిస్” కావచ్చు. ఇంటర్ వరకు ఇవేగుర్తొస్తున్నాయి, డిగ్రీలో అయితే ఇంగ్లీష్ క్లాస్లో కూర్చున్న గుర్తు కూడారావట్లేదు…ప్లిచ్.

  ఏమైనా మళ్ళొక్కసారి మా ఇంగ్లీష్ మేడంని గుర్తుతెచ్చారు…. థేంక్స్.

 16. నాకు పాఠాల పేర్లు ప్రత్యేకంగా గుర్తు లేవు గానీ, కథలైతే అన్నీ గుర్తున్నట్టే ఉన్నాయి!! There were lessons about “Grooming” and “Poaching”!!!
  And there is a lesson which starts in a hospital telling about different patients to an author who worries about simple disorders of his!!
  This is the first time when I was made to know that I should pronounce Grand Prix as “gra:nD pri:” but not “gra:nD priks”!!
  I used to love supplementary readers more for the reason that they mostly have stories/tales!!

 17. aa pathapusthakallo madhuraksharaalu…yeppudu kallamundhe kanuvindhu chesthayi

 18. A Christmas Morning is also a wonderful one. The lessons that I like are:

  0. To Sir, With Love
  1. A New Blue Dress
  2. Run, Boy, Run
  3. A Night at the Hotel
  4. The Girl on the Train
  5. Plate of Gold (Poem)
  6. Cloud (Poem)
  7. Under the Greenwood Tree (Poem)
  8. Story of a Tailor (I do not remember the name… but has a great moral on the way we treat life’s lessons)
  9. The Gallows (Poem)
  10. The Creator (Poem)
  11. Pride and Prejudice
  12. Hound of Baskerville
  13. Adventures of Huckleberry Finn
  14. Merchant of Venice
  15. A lesson from Rabindranath Tagore’s biography
  (on how a cousin defined a poem, his cook, his mother’s attitude towards bunking school and specially the Open Air School concept)

  All time favorites are Celebration of Being Alive, Run, Boy, Run, and New Blue Dress, Christmas Morning and At the Theatre.

 19. Cute.
  ఆంగ్ల పేర్లని ఆంగ్ల లిపిలో రాసి ఉంటే బాగుండేది. ఒకటో రెండో అయితే పర్లేదుగాని డజన్లకొద్దీ పేర్లని తెలుగు లిపిలో చదవడం కష్టమయింది.
  మీరంతా నా తరవాతి జెనరేషన్ వారూనూ ఇంగ్లీషు మీడియం చదువుల వారల్లే ఉంది.
  దురదృష్టం కొద్దీ నాకు బళ్ళో చదువుకున్న ఆంగ్ల పాఠాలేవీ గుర్తు లేవు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: