శ్రవణానందం 2 – భాగ్యనగరం

ఆమధ్య హైదరాబాదెళ్లినపుడు – ఇంట్లో నార్లచిరంజీవి – ‘భాగ్యనగరం’నాటకం చదివాను. బాగుండింది. మరీ మళ్ళీ‌మళ్ళీ చదవాలి అనిపించలేదు కానీ, ఒక్కసారికి బాగుండింది. ఎక్కడికక్కడ సంభాషణలు చాలా బాగా నచ్చాయి, అలాగే బాపూ బొమ్మలు అంతకంటే నచ్చాయి. పుస్తకానికి నాలుగైదారేడు ముందుమాటలున్నాయి 😉 బహుశా, చిరంజీవి గారి మరణానంతరం వేసిన ముద్రణ అనుకుంటాను. ఈ పుస్తకంపై పాజిటివ్ అభిప్రాయమే ఉండటంతో‌మాగంటి.ఆర్గ్ సైటులో ఆడియో నాటకం‌కనబడగానే, వినడం మొదలుపెట్టాను. చాలా చాలా నచ్చింది నాకు.ఆ అనుభవం ఇదీ!

కథ: అందరికీ తెలిసిందే! భాగమతి-కుతుబ్ ప్రేమకథ.

నా వ్యాఖ్యానం:
* మొదట వచ్చిన పాట నాకు తెగ నచ్చింది (ఈ పాట పుసకంలో ఉందా? చూసినట్లు గుర్తు లేదే… చూసి పాట అని తిప్పేసానేమో…సినిమాల్లో పాటలొస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు!)
* ఒక్కొక్క గాత్రధారీ అద్భుతంగా చెప్పారు డైలాగులు! వీళ్ళూ‌అని ఎన్నలేనంత నచ్చారు నాకు అందరూ. భాగమతి అక్క , అమీర్ – ఇద్దరూ‌ బాగా గుర్తుండిపోయారు… చదివినప్పుడూ, విన్నప్పుడూ.
* డైలాగులు చాలా బాగున్నాయ్!
* కథ చదువుతున్నప్పుడు హీరో కి చంద్రహారంలో రామారావు, హీరోయిన్ కి అనార్కలి లో అంజలీదేవీ గుర్తొచ్చారు. కానీ, నాటకం‌వింటున్నప్పుడు ఆ గొంతులు ఆ ఇమేజ్ కి మ్యాచ్ కాలేదు 🙂
* అమీర్ పాత్ర డైలాగులు సరదాగా ఉన్నాయి.
* గంట నాటకంలో ఒక్క క్షణం కూడా బోరు కొట్టదు!
* సంగీతం‌ అదీ, చాలా బాగా అమరింది. కరెక్టుగా పుస్తకం చదువుతున్నప్పుడు కదలాడే భావాలే, నాటకం వింటున్నప్పుడూ‌కదలాడాయ్!‌:-)

మొత్తానికి, రేడియో రాకింగు. ఇప్పుడైతే మనకి రేడియో అంటే‌ డీజే లాగా పాటలు మారుస్తూ, ప్లే చేస్తూ ఉండిపోతోంది కానీ, ఒకప్పుడలా కాదన్నమాట!
మాగంటి.ఆర్గ్ వారికి నా ధన్యవాదాలు!

ఈ నాటకాన్ని ఇక్కడ వినండి.

Advertisements
Published in: on October 17, 2010 at 8:00 am  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/10/17/sravananandam-2-bhagyanagaram/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. నార్ల చిరంజీవి గారి “భాగ్యనగరం” మూల రచనలో పాటలు, కవితలూ ఉన్నాయి 🙂

  2. @Ranjani garu: అదే, నేను ఆ మొదటి పాట పేజీ తిప్పేసినట్లు ఉన్నా. కవిథలు – చదివినట్లు గుర్తుంది కానీ, నాకు పదాలు అవీ గుర్తులేవు లెండి. కొన్ని హిందీ-ఉర్దూ…కొన్ని తెలుగు.. ఇలా కవిత్వం చదివాను అందులో.

  3. మొత్తానికీ ఆ రచనలని మీరు Winపిస్తున్నారు 😀

  4. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ…………

    – SRRao

    శిరాకదంబం


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: