శ్రవణానందం – ప్రతాపరుద్రీయం

ఈ మధ్య నాకు పాత రేడియో నాటకాలపై మోజు పెరిగింది. సురస, మాగంటి, ఈమాట – ఇలా పలు సైట్లలో వెదుకుతూ, వీలు చిక్కినప్పుడు వినడం మొదలుపెట్టేను. ఒక్కోదాని గురించి చిన్న చిన్న పరిచయాలు రాయడం ఈ శీర్షిక ఉద్దేశ్యం. ఇవాళ – ప్రతాపరుద్రీయం తో మొదలుపెడుతున్నాను.

కథ సంగతికొస్తే : ప్రతాపరుద్ర మహారాజుని మొఘలుల చెరనుండి అతని మంత్రి యుగంధరుడు కాపాడ్డం ఇందులో ప్రధాన కథ.

నా కామెంట్లు:
* ఒకసారి వినేందుకు నాటకం బాగుంది.
* ఏమిటీ…ఇది వేదం వెంకట్రాయశాస్త్రి రాసారా?? నమ్మలేకపోతున్నాను. భాష చూస్తే, మామూలుగానే ఉంది. ఇదివరలో ఇంట్లో ప్రతాపరుద్రీయం పుస్తకం చూసి, చదవబోయి, భయపడి, భంగపడి వదిలేసిన జ్ఞాపకమే! బహుశా, రేడియో అనుసరణలో తేడా ఉందేమో. అయినా, శాస్త్రి గారు శుద్ధ గ్రాంథికం రాస్తారనుకున్నానే!!
* గాత్రధారులు అందరూ చాలా బాగా ‘వినిపించారు’
* పేర్లు పరమ వెరైటీగా ఉన్నాయి: భేతాళరావు, యమధర్మరాజుశాస్త్రులు, విశ్వాసరావు, చెకుముకిశాస్త్రి అంటూ భలే పేర్లున్నాయి. అసలుకి నాకు, ఆ కాలం కథకి యుగంధరమంత్రి అన్న పేరు కూడా కాస్త వింతగానే అనిపించింది.
* కథ గురించి ఐడియా లేకుండా ఈ నాటకం‌ఫాలో కావడం కష్టం. కొంచెం అయోమయంగా అనిపించింది మధ్య మధ్యలో..ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలేదు.
* కథ ఎందుకోగానీ నాకు పెద్ద నచ్చలేదు. ఇన్నేళ్ళైనా ఎందుకు ఈ నాటకం వినాలో అర్థం కావట్లేదు. కొత్తగా నాటకాలు రావట్లేదా?
* ఈసారి ప్రతాపరుద్రీయం‌ టెక్స్ట్ చూడాలి – ఈ నాటకానికీ, ఆ అసలు నాటకానికీ ఎంత తేడా ఉందో, ఎంత పోలికుందో!
* అయితే, నాటకంలో ఒక వాయిస్ ఓవర్ ఉంటే బాగుండేది అనిపించింది. దృశ్యాలూ, నేపథ్యాలు మారినప్పుడు వాళ్ళ డైలాగుల బట్టి తెల్సుకోవాలే కానీ, వేరే మార్గాంతరం లేదు. I think its poor direction!

వినేందుకు ఇక్కడ, చదివేందుకు ఇక్కడా క్లిక్కండి.

Advertisements
Published in: on October 15, 2010 at 4:23 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/10/15/prataparudreeya/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. హ్మ్! ఇదా సంగతి?

  2. >>>”ఆ కాలం కథకి యుగంధరమంత్రి అన్న పేరు కూడా కాస్త వింతగానే అనిపించింది.”

    1. యుగంధరుడు అన్నది విష్ణు మూర్తి పేర్లలో ఒకటి.

    2. ఢిల్లీ సుల్తాన్ పట్టుకు పోతాన్… అంటూ తొలి తెలుగు డికెష్టను వెలగబెట్టిందితనేయని వినియుంటిని. బహుశా ఈ కథ గురించే అయి ఉంటుంది.

    3. చిన్నప్పుడు నాన్న యుగంధరుని సాహసాలు చెప్పేవారు. కాకపోతే ఆ యుగంధరుడు వేరు

  3. మేరు చెప్పిన ‘ప్రతాపరుద్రీయం’ గురించి నాకేమీ తెలియకపోయినప్పటికినీ, ఆకాశవాణి నాటికలు వినగలిగే వెబ్సైటుని తెలియజేసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు! 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: