చిన్నస్వామి స్టేడియం నుంచి – ఒకరోజు ఆలస్యంగా రిలే

నాకు క్రికెట్ గురించి చదవడం లో ఉన్న ఆసక్తి క్రికెట్ చూడ్డంలో ఉండదు. ట్వంటీ ట్వంటీ కూడా నాలో కుతూహలం కలిగించలేకపోయింది -ఏం చేస్తాం? అప్పుడెప్పుడో ’99 ప్రపంచకప్ తరువాత నేనెప్పుడూ‌క్రికెట్ సరిగ్గా కూర్చుని చూసినట్లు లేను. ఇప్పుడైతే, అసలు ఎప్పుడో ఏ పూర్ణిమ వంటివారో ఐదునిముషాలకోసారి స్కోరు చెబుతూ‌ఉంటే, కుతూహలం కొద్దీ క్రిక్ ఇన్ఫో తెరవడమే తప్ప, అసలు మ్యాచ్ అవుతున్నదన్న విషయం కూడా తెలీదు నాకు! అలాగే, మొన్న శనివారం‌నాడు, ‘అర్రె! టెస్ట్ మ్యాచ్ బెంగళూరులోనేనా!’ అన్న రియలైజేషన్ వచ్చింది. అది కాస్తా – ‘ఓహో, బెంగళూరులోనా..’ అనేస్కుని, నా పనిలో నేను పడేదాకా వచ్చేశాక, హితులు, స్నేహితులూ, సన్నిహితులూ -అంతా క్రికెట్ ఫ్యానుల మయం కనుక, స్కోర్లూ అవీ తెలుస్తూనే ఉన్నాయి. నేను చూడకపోయినా కూడా. అలా, అలా నాలుగోరోజు వచ్చేశాక, ఇంటికెళ్ళేసరికి – ‘రేపు చిన్నస్వామీ స్టేడియం కి వెళ్దామా?’ అన్న ప్రపోజల్. నేనెప్పుడూ క్రికెట్ చూడ్డానికి స్టేడియం కి పోయింది లేదు. అయినా కూడా నాకేం‌కుతూహలం కలుగలేదు. అసలు క్రికెట్ మ్యాచ్ ఇంట్లో కూర్చుని చూడ్డం ఉత్తమం అని నా అభిప్రాయం. అందులోనూ అప్పట్లో ఎల్బీ స్టేడియం బైట పోలీసులకూ, వీక్షకులకూ జరిగే గొడవల గురించి తాటికాయంత అక్షరాల్తో వచ్చేవి పేపర్లలో. అవి చూసి చూసీ, ఏం పోతాం లే స్టేడియంకి అనుకునేదాన్ని. ఇప్పట్లో సరేసరి – మనం ఇంట్లోనే చూడమూ…ఇక స్టేడియమా 🙂

సరే, బుధవారం వచ్చేసిందా, బుద్ధి గా ఆఫీసుకొచ్చేశా పొద్దున్నే. పని చేస్కుంటూ ఉండగా, డ్రామా మొదలు. మొదట ఆసీస్ అవుటయ్యారు.
పూర్ణిమ : ఏమిటీ, ఇంకా ఇక్కడే ఉన్నావ్? అన్నది. నేను: ఒంటిగంటకు బయలుదేరతాను అన్నాను. ఇంతలో సెహ్వాగ్ అవుట్. మనవాళ్ళు ఆలౌటైపోయినా ఆశ్చర్యం లేదు – అని ఒక కామెంటు. నాకు బీపీ రైజయింది. మ్యాచ్ లాస్ట్ బాల్ దాకా వెళ్ళాలి – అనుకున్నాను. అలా అలా, కాసేపయ్యాక: ఒంటిగంటకెళ్తే ఏం మిగల్దేమో, పన్నెండున్నరకి పోదాంలే – అనుకున్నాను. ఇంకాసవుతూ‌ఉండగా – పూర్ణిమ వచ్చి – ‘ఇంకాసేపు ఇక్కడే ఉంటే, స్టేడియం కి వెళ్ళి అక్కడ గ్రౌండ్ కీపింగ్ స్టాఫ్ తో మాట్లాడొచ్చు’ అన్నది. దానితో, ‘చ! పన్నెండున్నర వద్దు…పన్నెండుకి వెళదాంలే..’ అనుకున్నాను. అప్పుడు సమయం పదకొండు పైన ఒక పది నిముషాలై ఉంటుందేమో.

పదకొండూ‌ఇరవై ఔతూ ఉండగా, పూర్ణిమ అప్డేట్స్ వల్ల కావొచ్చు, ఫైనల్లీ నా పాత క్రికెట్ అభిమానం గుర్తొచ్చి కావొచ్చు – ఒక్క ఉదుటున – బై చెప్పేసి, సీట్లోంచి లేచి, హెల్మెట్ తీసుకుని బయటపడ్డా. అర నిముషంలో బయటకొచ్చేసి, బండి స్టార్ట్ చేస్తూ, అవతల వైపు ఫోన్ చేసి – ‘నువ్వూ త్వరగా వచ్చేయ్! ఇంకాసేపుంటే చూసేందుకేం‌ఉండదు’ అని ఆర్డరేసి, వెళ్ళిపోయా. అక్కడికెళ్ళాక, ఓ ఇరవై నిముషాలు మహా యాతన. అవతల మనిషి రాడు. లోపల కేకలు ఎక్కువైపోయాయి. ఫోరా, సిక్సా, అసలేం లేకుండా మెక్సికన్ వేవా… ఏమీ అర్థం కావట్లేదు. స్కోరు తెల్సుకోవాలని పూర్ణిమ కి కాల్ చేస్తే – ‘స్టేడియం దగ్గర ఉన్నది నేనా? నువ్వా?’ అంది. ఫైనల్లీ, శ్రీరాం వచ్చేసి, మేమిద్దరం లోపలికి అడుగుపెట్టి, సెక్యూరిటీ‌గట్రా అయ్యాక ఓ ప్లేసు వెదుక్కుని కూర్చున్నాం. పుజారా, టెండుల్కర్ ఆడుతున్నారు.

ఇదివరలో ఈడెన్ గార్డెన్స్ లో టెస్ట్ మ్యాచ్ చూసిన శ్రీరాం: ఇదేమిటి, స్టేడియం ఇంతచిన్నగా ఉంది? చిన్నస్వామి అంటే‌చిన్నగా ఉండాలా? -అన్నప్పుడు మొత్తం స్టేడియం ఓసారి కలియచూశాను. పెద్దదే! అయితే, ఈడెన్ గార్న్స్ దాదాపు లక్షమందిని భరించగలదట! నాకు క్రికెట్ చూడ్డం తొలిసారి కానీ, స్టేడియం తొలిసారి కాదు. అయినప్పటికీ, ఇంత నిండుగా ఉన్న స్టేడియం చూడ్డం ఇదే తొలిసారి. ఇవి చూస్కుంటూ దిక్కులు చూస్కుని సెటిలయ్యేలోపు కనీసం ప్లేయర్స్ పేర్లన్నా తెలియాలి కదా – అనుకున్నాను. మన బ్యాట్స్మెన్ – ఉన్నది సచిన్, పుజారా -ఇద్దరే కనుక, సచిన్ కాని మనిషి పుజారా అని గుర్తుపట్టేశా‌;) కానీ, ఆసీస్ టీం లో నాకు తెల్సిన ఏకైక మనిషి పాంటింగ్ (నేనింకా ఆ కాలంలో‌ఉన్నాననమాట!!) ఇంకా, క్లార్క్, హస్సీ, కటిచ్ – వీళ్ళ ముగ్గురి పేర్లు తెల్సు కానీ, మొహాలు గుర్తు లేవు. మిగితా జనాభా పేర్లు కూడా తెలీవు. అంపైర్ బిల్లీ బోడెన్ ఉన్నాడని మాత్రం గమనించేశా‌:) కనుక, మొదట ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, ఒక్కోళ్ళ ప్రొఫైల్స్ ఏమిటి? ఎవరిది మొదటి మ్యాచ్? ఎవరికన్నా ఒక ప్రత్యేక లక్షణం వంటిది ఏదన్నా స్టైల్ స్టేట్మెంట్ ఉందా – శ్రీరాం ట్యుటోరియల్ సెషన్ ఐంది… (ఇప్పుడు మొత్తం గుర్తు లేదనుకోండి) అంతా అయ్యి కొంచెం కుదురుకుని సీరియస్గా చూడ్డం మొదలుపెట్టానో లేదో – పాపం పుజారా అవుట్. అప్పుడే నాకు టీవీ రీప్లేల విలువ తెలిసింది 🙂

ద్రవిడ్ వస్తున్నప్పుడు ఇక్కడ కేకలు చూడాలీ… వర్ణనాతీతం. పెద్ద ఫాలోయింగే! 🙂
ఒకానొక కాలంలో, ద్రవిడ్ రంజీల నాటి నుండీ‌నేనతని ఫ్యాన్ను. ఆ గతం గుర్తొచ్చి, నేనూ ఆవేశపడి ఎదురుచూశాను. మళ్ళీ‌సచిన్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడూ…మేమంతా అరుచుకుంటూ, మెక్సికన్ వేవుల్లో కొట్టుకుపోతూ చూశాము. అంతా బానే ఉంది కానీ, చివరి పది నిముషాలు అరగంటలా అనిపించాయంటే నమ్మండి! ఏమాత్రం ఆసక్తిలేదు నాకు వెళ్ళే ముందర. ఏవో, అవతల మనటికెట్ కూడా బుక్కైపోయింది… కనుక వెళ్ళాలి… ఇలా ఉండింది నిన్న పొద్దున్న నా ఆలోచన. కానీ, సమయం గడిచేకొద్దీ – పూర్ణిమ అప్డేట్ల వల్లనైతేనేమీ, గతకాలపు జ్ఞాపకాల వల్లనైతేనేమి, సహజసిద్ధంగా భారతీయకుండే క్రికెట్ అభిమానం నా అంతరాంతరాలలో దాక్కుని నిద్రపోతున్నదల్లా బయటకొచ్చేయడం వల్లనైతేనేమీ – వెళ్ళి చూసేశాను. అలా వెళ్ళి, ఇండియా గెలవడం, సీరిస్ చేజిక్కించుకోవడం చూశాను!

స్టేడియం సంగతికొస్తే – జనం ఎవరూ అదుపు తప్పినట్లు అనిపించలేదు. అది టెస్ట్ మ్యాచ్, అదీ విన్నింగ్ మ్యాచ్ కావడం వల్ల కావొచ్చు. కానీ, కిందకి వెళ్తూ‌ఉంటే మాత్రం భయంకరమైన దుర్గంధం. అలాగే, నేను ఆవేశపడిపోయి, స్టేడియం పైన్నుంచి , కిందెలా ఉంటుందో‌అని చూస్తే, కిందంతా పేపర్ ప్లేట్లు వగైరా చెత్త! కానీ, ఇంతమందికి పార్కింగ్ ఏర్పాట్లవీ బానే చేశారని చెప్పాలి!

ఏమైనా, టెస్ట్ క్రికెట్ లో‌ఏదో ఉంది. నాకు తెగ నచ్చేసింది ఈ అనుభవం. అయితే, అన్ని టెస్టులూ ఒకలా ఉండవనుకోండి, అది వేరే సంగతి. అందునా, ఏమారితే, టీవీల్లో రీప్లేలు ఉంటాయి. స్టేడియంలో‌ ఉండవుగా (అంటే, ఆ టీవీ స్క్రీన్ మా వైపునే ఉంది లెండి, కనుక, మేము చూడలేము. అవతలి పక్క వారు చూడగలరు. అన్యాయం కదూ!). కానీ, ఒక టెస్టు మ్యాచ్ కి ఇంతమందొస్తారనీ, స్టేడియం నిండిపోతుందనీ ఊహించలేదు. మ్యాచ్ అనంతరం ధోనీ కూడా అదే అన్నాడు. పైగా, ఇలాంటి చోట్ల టెస్ట్లు తరుచుగా జరగాలని రికమెండ్ చేశాడు కూడానూ.

నా తంటాలేవో పడి, నా సెల్లు కెమెరా తో కొన్ని ఫొటోలు తీశాను (ఒక్కదాంలోనూ మొహాలు కనబడవులెండి!) వాటిలో రెండు ఇక్కడ: ఒకటి: ద్రవిడ్ బ్యాటింగ్, రెండోది:‌టీబ్రేక్ తరువాత అందరూ మళ్ళీ గ్రౌండ్ లోకి వస్తున్న దృశ్యం.

Published in: on October 14, 2010 at 4:17 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/10/14/testmatchview/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. నిజంగానే ప్రత్యక్ష ప్రసారం లాగా రాశారు. క్రికెటంటే ఏమీ ఇష్టంలేని నాక్కూడా బాగుంది.

 2. స్టేడియంలో క్రికెట్ చూసే అవకాశం నాకెప్పుడొస్తుందో 😦

  ఇప్పుడు హార్డ్ కోర్ క్రికెట్ అభిమానులకి ఒక ప్రశ్న : మొదటి ఫోటోలోని బౌలర్ ఎవరు, అది ఎన్నోఓవర్ ఎన్నోబంతి, ఆ బంతికి ఎన్ని పరుగులు వచ్చాయి ?

 3. దేవుడుని పూజారిని కలిసి ఆడేప్పుడు చూసారన్నమాట.. వావ్..

  మంచి క్రికెట్ మాచ్ చూస్తే వచ్చే ఆ ఇది, World series గానీ, NBA గానీ మరేమి చూసినా రాదు – అంతే.

 4. Darn impressed by the no. of times “పూర్ణిమ” was repeated. But that no way means that I’m compromising on the two subs you owe me. No way! 🙂

  Test cricket isn’t called *Test* Cricket for no reason. It is truly a test of characters – be it the players, be it the umpires or be it characters. And yes, it isn’t very entertaining for beginners, but when you put in enough effort to understand the nuances of the sport, you’d experience terms like “bliss”, “exhilaration”, “unbound joy”.

  You were talking about the reception Dravid received. Ha! Had the situation been li’l more crunch and Dravid had got out, there would have been a silence in the stadium, where even the word “varnaanaateetam” can’t come to your rescue. It would be *that* deafeningly loud.

  I guess, it’s in your blog that I posted a comment.. Rahul leaving a delivery alone shows the beauty of Test Cricket.

  And about reading about cricket rather than watching it.. try this one. First watch it. And then relive it when you’re reading. There are fewer joys in world than watching a top-notch Test cricket match.

  And to all those people who say Tests or cricket in general is boring – No sport could have lived for more than century and more, bring out superheros out of ordinaries, give a chance to celebrate human spirit and touch so many lives, if its only dull or boring or non-entertaining. Cricket has its own charm, it’s up to individuals to find out what it is.

 5. Now I am jealous! :(… U watched the match in the stadium? With India winning the series and that too a clean sweep? that too against Australia? Oh well.. I am truly jealous !!! 😦

 6. వావ్!!
  ఎవరో వెళ్లక వెళ్లక వెళ్ళి ఉంటారు అందుకే దేవుడు కరుణించి
  India won the match after 15 yrs in Bangalore.. Great feet

  Watching Sachin it self a great feeling
  Winning for india No Words!!

  Badri
  అది 37వ ఓవర్ మొదటి బంతి
  johnson ద్రావిడ్ కి వేస్తున్న బంతి ఒక్క రన్ కూడా రాలేదు

  he left alone & paine collects it.

 7. ఎప్పుడో భూంపుట్టక ముందు bad city లో సచినేసిన నూటెనభైయ్యారు పెయింటింగులని చూసిన నోస్టల్జియాలోకి నెట్టేశారు.

  >>>”గతకాలపు జ్ఞాపకాల వల్లనైతేనేమి, సహజసిద్ధంగా భారతీయకుండే క్రికెట్ అభిమానం నా అంతరాంతరాలలో దాక్కుని నిద్రపోతున్నదల్లా బయటకొచ్చేయడం వల్లనైతేనేమీ –”

  ఇడ్లీ వడా క్రికెట్! – అదేదో రాసేస్తే బాగుంటుందేమో 😀

 8. Lucky Sowmya! 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: