మరోసారి – పంద్రాగస్టు ఆలోచనలు

రెండేళ్ళ క్రితం ఇలాంటి టపానే – పంద్రాగస్టు చింతన్ భైఠక్ లాగా రాసాను. ఇవాళ మళ్ళీ, అవే ఆలోచనలొస్తున్నాయి.

అసలు మనం స్వతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి?

-మొదట్నుంచీ, నా అభిప్రాయం ఒకటే : ఇది దేశం మొత్తానికీ పండుగ లాంటి రోజు కనుక. హిందూ,ముస్లిం,సిక్కు,క్రైస్తవ -ఇలా భిన్న సంప్రదాయాల్లో ఉండే పండుగల్ని ఆయా మతస్థులు ఎలా జరుపుకుంటారో, దేశ సంప్రదాయంలో ముఖ్యమైన ఈ పండుగనూ అలాగే ఆనందంతో జరుపుకోవాలి అని నాకు అనిపిస్తుంది. నాకెప్పుడూ అర్థం కానిది ఏమిటంటే – ఆ పండుగలప్పుడు పొద్దున్నే లేవడానికి, తలంటుకుని రెడీ అవ్వడానికి విసుక్కోని వ్యక్తులెందరో, పంద్రాగస్టు నాడు పొద్దున్నే లేచి – తయారై జెండా వందనానికి రమ్మంటే రారు (మా కాలేజీలో ఉండేటప్పుడు ఇది చాలాసార్లు గమనించాను.) మతంపై ఉన్న నమ్మకం, భయం, భక్తీ దేశంపై లేవనుకోవాలా? (తప్పు లేదు లెండి! దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా!) లేదంటే – ’లైట్’ తీస్కోవాలా?

-అలాగే, పెద్ద ఎమ్మెన్సీల్లో కొన్నింటిలో సెలవు దినం పంద్రాగస్టు. కనీసం జెండా వందనమన్నా చేస్కోవాలి కదా, అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ. నిన్న నా కజిన్ తో మాట్లాడ్తూ ఉంటే – ఏం చేస్తున్నావ్? అంటే ఆఫీసుకొచ్చాను అంది. ’శనివారమా???’ అన్నాను. ’ప్రస్తుతానికి రేపు ఇండిపెండెన్స్ డే కదా, ఆ ఏర్పాట్లు చేస్కుంటున్నాం’ అన్నది. ఇంతకీ, తను పని చేసేది ఒక విదేశీ బ్యాంకులో!! కానీ, నాకు తెలిసినంతవరకూ ఐటీ ఆఫీసుల్లో సెలవు ఇస్తారు – పంద్రాగస్టుకి (ఇవ్వాళ ఆదివారమనుకొండి, అది వేరే సంగతి!). చిన్నప్పుడు, మా స్కూల్లో అయ్యాక మా నాన్న కాలేజీలో కూడా జెండా వందనానికి వెళ్ళేవాళ్ళం. తరువాతి రోజుల్లో – మా అమ్మ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడూ (వయసు పెరిగేకొద్దీ – కాలేజీలో వెళ్ళేందుకు దూరం అనిపించి!)

-ఆ విషయానికొస్తే, నాలో దేశభక్తి పాలు చాలా తక్కువ. ఒకప్పుడు, ఎర్లీ టీన్స్ లో ’రక్షకుడు’ లాగా, నేను ’రక్షకురాలు’ అనుకునేదాన్ని కానీ, ఇప్పుడు నాకలాంటి ఆలోచనల్లేవు. ఏదో, దేశప్రయోజనాలకు భంగం కలిగించే రకం పనులు నేను చేయకూడదు అనుకుంటా తప్పిస్తే. అంతకుమించి నాకు దేశభక్తేమీ లేదని నా అభిప్రాయం. అయినప్పటికీ, పంద్రాగస్టు మన పండుగే – అన్న అభిప్రాయం ఇన్నేళ్ళలో ఎప్పుడూ మారలేదు – అదేమిటో గానీ.

ఏం చేయాలి? ఏం చెప్పాలి మన తరువాతి తరానికి?

-జెండా వందనమైతే చేయాలి 🙂
-మా కాలేజీలో రక్తదాన శిబిరం ఉండేది. ఏదో, మనం చేయగలిగే వాటిలో అత్యంత సులభమైనది, ఖర్చు లేనిది – అదే కదా! ఇక్కడ ’దేశభక్తి’ కాదు కానీ, ’మానవత్వం’ అనుకోవచ్చు.
-మీ పిల్లలకి – ఫ్రీడం స్ట్రగుల్ కథలు చెప్పొచ్చు (డ్రామా లేకుండా, నిజాలతో!!). ఒక గుంపు పిల్లలుంటే, చిన్న క్విజ్ లాంటిది పెట్టుకోవచ్చు. అప్పుడు కనీసం వాళ్ళకి – గాంధీ, నెహ్రూ లకు అవతల కూడా నేతలున్నారని తెలుస్తుంది. లేకుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో, మన ప్రభుత్వాల ’గాంధీ’ (ఏ గాంధీ అయినా సరే!) సైకోఫాన్సీలో, అసలు మరో పేరు కూడా తెలీకుండా పోతుంది కొన్నాళ్ళైతే!
-ఒక కొత్త పుస్తకం వెదకి చదవొచ్చు 😉 ఉదాహరణకి – దుర్గాబాయ్ దేశ్ముఖ్ జీవితచరిత్ర 😉 కానీ, ఈ ప్రముఖుల సంగతి పక్కనపెడతే, జనావళిలో అంతగా పేరు తెలీని నాయకుల కథలు వెదికి పట్టుకుని చదివితే భలేఉంటుందండోయ్. పిల్లలకైతే, అలాంటి పుస్తకాలు బానే ఉన్నాయ్. నా చిన్నప్పుడు ఓసారి శ్రీశైలంలోని ఒక మ్యూజియం వద్ద కొన్న పుస్తకాలు ఇప్పటికీ హైదరాబాదు వెళ్తే తిరగేస్తూ ఉంటాను.

ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతా!

Advertisements
Published in: on August 15, 2010 at 8:44 am  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/08/15/aig15-2010/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. Happy Independence Day…

 2. ఫర్వాలేదు, దేశభక్తి తక్కువుంది అని ఫీలవ్వాల్సిన అవసరమే లేదు. చాలా మందికి దేశం, దేశభక్తి గుర్తుకొచ్చేవి ఇండియా, పాకిస్తాను క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, లేకపోతే కార్గిల్ యుద్దాలు జరిగినప్పుడు. మిగిలిన సమయాలలో దేశభక్తిది ఎప్పుడూ వెనకసీటే. మిగిలిన స్వాతంత్ర సమరయోధులను గూర్చి పిల్లలకు పరిచయం చేయాలన్న అలోచన బాగుంది.

 3. కావలసింది దేశభక్తి కాదు దేశ ప్రజల క్షేమం మీద కాంక్ష, ప్రేమ.

 4. దేశభక్తి వున్నప్పుడే దేశం మీద కాంక్ష, ప్రేమ వచ్చేది !

 5. మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  శిరాకదంబం

 6. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
  నా వంతు ఆలోచనలు telugu4kiDs లో.

  “ఏం చేయాలి? ఏం చెప్పాలి మన తరువాతి తరానికి?”
  అని నువ్వడగడం బావుంది.
  నీ ఆలోచనలు పంచుకోవడం బావుంది.

  ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్న ఆవేశమూ నిజమే.
  అయినా చరిత్ర నేర్పే పాఠాలు నేర్చుకునే ప్రయత్నం మాత్రం ఆప కూడదు.
  రేపటి చరిత్ర ఈ నాటి మన కథే కదా.

 7. మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.

 8. Not trying to harm the progress, calm and peace of the Nation itself is ‘Deshbhakthi’. You are
  a patriot for sure.

 9. I really like this ” అప్పుడు కనీసం వాళ్ళకి – గాంధీ, నెహ్రూ లకు అవతల కూడా నేతలున్నారని తెలుస్తుంది” pretty much true

 10. చందమామ కథలు చదివినట్టు నాయకుల చరిత్రలు చదివినంతమాత్రానా పెద్దగా ఒరిగేదేమి ఉండదు…కాసెపు టైం పాస్ అవడానికి మించి. గాంధీ గారి అవతల నాయకులు ఉన్నారని పిల్లలు నేర్చుకోనే ముందు, అసలు గాంధీ గారి గురించి ఏమి తెలుసని మనకు. గాంధీ గారి పుట్టిన రోజు, కుటుంబ వివరాలు, ప్రచారంలో ఉన్న ఆయన ఫిలాసఫీలు నాలుగు బుర్రకెక్కించుకుని గాంధీ గురించి అంతా తెలిసిపోయిందని, గాంధీగిరి అంటూ ఓ రెండు సినిమాలు చూసేసి, నాలుగు పుస్తకాలు చదవడం మినహా మనకు ఏమి తెలీదు అని కూడా మనకు తెలీదు. పూర్తిగా తెలుసుకోవడానికి జీవిత కాలం సరిపోదు. ఆయనని ఒక వ్యక్తిగా కాకుండా, ఆ మనీషి ఆలోచనలనీ, అనుభవాలనీ ఒక మతం లా, ఒక తత్వం లా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే , మనం అనుభవిస్తున్న స్వాతంత్రానికి నిజం అర్థం తెలుస్తుంది…అప్పుడు ఈ పండగలేందుకో అన్న ఆలోచన రాదు. మంచి అంటే మంచి చేయడం అన్న అర్థం మానేసి, తప్పు చేయకపోవడమే మంచి అన్న పనికిమాలిన అర్థాలు కల్పించుకుని మనల్ని మనం మోసం చేసుకునే ప్రయత్నం కూడా జరగదు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: