ఒక కన్నడ డీవీడీ షాపులో…

ఇవాళ ఇంటిదగ్గర సీడీ షాపులో ఆసక్తికరమైన సంఘటన.
(అతను కన్నడలో, మేము ఇంగ్లీషులో మాట్లాడుతున్నాం అనమాట)

షాపువాడు: ఏం కావాలి?
మేము: ’ఆప్తరక్షక’
అతను: లేదు.
మేము: ఎప్పుడొస్తుంది?
అతను: మినిమం సంవత్సరం పడుతుంది.
మేము: :O సినిమా డీవీడీ రావడానికి సంవత్సరమా??
అతను: పైరేటెడ్ వి వస్తాయేమో – మేము కన్నడ సినిమాలు పైరేట్ చెయ్యము.
మేము: మళ్ళీ :O, ఆపై, ’నైస్! వెరీ నైస్!’ అని వచ్చేశాయి మాటలు.
….నిజానికి, అంత స్పష్టంగా ఒక డీవీడీ షాపు వాడు తన భాషలో పైరసీని ప్రోత్సహించను అని చెప్పినందుకు ముచ్చటేసింది. ఇంతలో…
అతను: (కించిత్ గర్వంతో, నవ్వుతూ) – మేము కన్నడ సినిమాలను పైరేట్ చెయ్యము. బ్లూ ఫిల్ములను ప్రోత్సహించము.
మేము: గ్రేట్….
అతను: కొత్త కన్నడ డీవీడీలొచ్చాయి చూస్తారా? (అని..రవిచంద్రన్, ఉపేంద్ర ఎట్సెట్రా…సినిమాల డీవీడీలు ఇస్తూంటే, భయమేసి..)
మేము: నోనోనో… వి సా ఆప్తమిత్రా రీసెంట్లీ…సో..వాంటుసీ ఇట్స్ సీక్వెల్….దట్సిట్..’ (అనేసి, ఒక తెలుగు సీడీ తీస్కున్నాం.)

-మొత్తానికి చాలా ఆనందమేసింది. అయితే, ఐరనీ, ఈ షాపు దాటిన వంద మీటర్లకి – రోడ్డుపైన పైరేటెడ్ సినిమా సీడీలు అమ్మేవాడు కనబడ్డాడు.
(మరి, వాళ్ళు కన్నడ చిత్రాలు అమ్ముతారో లేదో, నేను ఎంక్వైరీ చేయలేదు😉 )

Published in: on August 14, 2010 at 9:30 pm  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/08/14/in-a-kannada-dvd-shop/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. అంత లేదండోయ్ ఒక్క కన్నడ సినిమాలు మాత్రమే పైరేట్ సిడిలు అమ్మరు మిగతా అన్ని భాషల సినిమాల పైరసీ ఏ మాత్రం అడ్డంకి లేకుండా సాగుతుంది బెంగళూరు లో, ఒక రకంగా చెప్పలంటే పైరసీ సిడి లకు బెంగళూరు హబ్ లాంటిది.

    • వెంకట్: నేననేదీ అదే… కన్నడ చిత్రాలను పైరేట్ చేయము అన్న నిర్ణయం చాలా మంచి విషయం. వేరే భాషల సంగతి – వాళ్ళ పర్స్పెక్టివ్ లో అనవసరమే కదా. ఆంధ్రాలో తెలుగు సినిమాలు పైరేట్ చేయొద్దు అంటే షాపులవారు అంటే వింటారా?

  2. మెజెస్టిక్ లో దొరకని పైరేటెడ్ డీవీడీలున్నాయా? రైలెక్కాక కూడా పల్లీలో బఠానీలో అమ్ముతున్నట్లు డీవీడీలు అమ్మేవాళ్ళు కేటలాగు తో సహా వెంటాడిన రోజులున్నాయి. కాంబినేషన్ డీవీడీలు ఇచ్చటి ప్రత్యేకత!

  3. సౌమ్య గారు, అంధ్రా లో ఆ మాత్రం తెలివి ఏడిస్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది లెండి.కాని ఒక్క సంగతి పర భాషా చిత్రాల పైరసీ అడ్డుకోవడం మనకు అవసరమా కాదా అన్నది ఒకరి విగ్నత( ఈ ‘గ్నా’ ఎలారాయాలో ?) పైన ఆధారపడి ఉంటుంది. పక్కవాడి కొంప తగలబడి పోయినా పర్లేదు మనం బాగా ఉంటే చాలు అన్న ఆలోచన అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు, తమిళ్ చిత్రాలతో పోలిస్తే కన్నడ సినిమాల మార్కెట్ చాలా తక్కువ కాబట్టే వెరే రాష్ట్రాలలో అసలు ఆ సినిమాలను పట్టించుకోరు పైరసీ చేయరు.
    ఇంకో కోణం లో ఆలోచిస్తే గుడ్డి కన్న మెల్ల మేలన్నట్టు కన్నడ సినిమా పరిశ్రమను బతికించడానికి వీళ్ళు ఇంత గట్టిగా కష్టపడటం అభినందించదగ్గదేమో?

  4. ఆ షాపు వాడు మీ ముందు కొంచెం బిల్డప్ ఇచ్చినట్టున్నాడు😉

    మెజెస్టిక్ ఎదురుగా వున్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఇవన్నీ అమ్ముతారు.

    జెనరల్ గా, కన్నడ సినిమాలకు మర్కెట్ తక్కువ వుంటుంది. థియేటర్ లోను, పైరసీ లోనూ!

    • @All: ఇక్కడివారు కొందరితో ఈ విషయం ప్రస్తావిస్తే – కన్నడ సినిమాలను పైరసీ చేయని విషయాన్ని వాళ్ళు కూడా అన్నారు. మార్కెట్ తక్కువ, పైరసీకూడా గిట్టుబాటవ్వదు అన్న విషయాన్ని వదిలేస్తే, వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి తోడ్పడుతున్నారు కదా. వాళ్ళ కోణంలో – ఇతర చిత్రాల పైరసీవల్ల కన్నడ చిత్ర పరిశ్రమకి ఒరిగే లాభమూ, నష్టమూ ఏమీ లేదు. కనుక, వాళ్ళు చేసినా పర్లేదనుకుంటున్నారో ఏమిటో మరి.

      హైదరాబాదుతో పోలిస్తే, ఇక్కడ పైరేటెడ్ సీడీలు ఫుట్పాత్ పై అమ్మేవారు ఎక్కువగా కనిపించారు నాకైతే. వీథికొకళ్ళన్నా కనిపిస్తూ ఉంటారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: