రెండు పాటలు…

కొన్ని పాటల్ని టైమ్లెస్ క్లాసిక్స్ అంటారు. ఎన్నాళ్ళైనా, ఎప్పుడు విన్నా, ఎప్పుడూ విన్నా, బోరు కొట్టవని. మరి కొన్నుంటాయి – పాతికేళ్ళ క్రితం విని అప్పటి యువత ఎంత ఉద్రేకపడిఉంటారో – ఇప్పుడూ మనం అంతే ఉద్రేకపడతాం. నా దృష్టిలో అవీ టైమ్లెస్ క్లాసిక్సే. అయితే. అవి దేశంలో పరిస్థితుల వల్ల, మన ఖర్మ కాలి, క్లాసిక్కులయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. అలాంటి రెండు పాటలు – ఒకటి రెండు మూడ్రోజులుగా వెంటాడుతూంటే, ఇంకోటి ఓ స్నేహితుడు ఇప్పుడే గుర్తు చేశాడు. వాటి గురించే ఈటపా.

మొదటిది: “నాంపల్లి టెషనుకాడి రాజాలింగో…” పాట ఇక్కడ.
-ఇదెప్పుడో చిన్నప్పుడు – ఎస్.పీ.శైలజ,మనో ఒక ఈటీవీ ప్రోగ్రాం యాంకరింగ్ చేసేవారు. అందులో శైలజ గారు పాడితే విన్నాను. అయినా, లిరిక్స్ పెద్ద పట్టించుకోలేదు. మొన్నామధ్య మా తమ్ముడి బజ్ లో వీడియో చూసాక, అవాక్కయ్యాను. వీడియో చూస్తున్నప్పుడు విన్నాను – లిరిక్స్. అంతే – రెండ్రోజులుగా – ’రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగా’ – అని చెవుల్లో గింగురుమంటూనే ఉంది! రకరకాల అర్థాలతో!!

“తిందామంటే తిండీ లేదు ఉందామంటే ఇల్లే లేదు
చేదామంటే కొలువూ లేదు పోదామంటే నెలవు లేదు”

-హూమ్, ఏమీ మారలేదన్నమాట దేశం అయితే! ఇప్పటికీ, ఇలా పాడుకునే పరిస్థితుల్లో ఉన్న వారు ఎందరో! అయితే, ఈ సినిమా వీడియోలో చిన్నపిల్లాడి చేత ఇదంతా చెప్పించడం కాస్త ఎక్కువైందనిపించింది లెండి.

“గుక్కెడు గంజి కరువైపాయె బక్కడి ప్రాణం బరువైపాయె
బీదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టే సీకటి శెట్టి “

-Rich are getting richer. Poor, poorer!

“లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె”

-నిజమే, ఐరనీ! అసలుకే, పైగా, ఎంత కురచైతే, అంత కాస్ట్లీ కూడా ఉంటాయిగా బట్టలు 🙂

“ముందు ఒప్పులు వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన సామి”
-ఇది మాత్రం నాక్కూడా అనిపిస్తూ ఉంటుందెప్పుడూ. తప్పులు చేసేవాళ్ళు (ఓకే, నాకు తప్పు అనిపించినవి) చేస్తూనే ఉంటారు… బానే ఉంటారు. పాపం, మంచిగా, మెతగ్గా ఉండే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు -కలికాలం, కలి మనుషులు, కలి దేవుడు! :p

-ఆ ’ఎర్రమల్లెలు’ సినిమా నేను చూడలేదు కనుక, ఈపాట ఏ సందర్భంలో వస్తుందో నాకు తెలీదు. అయితే, ఒక చిన్నపిల్లవాడు ఇది పాడ్డం అనవసరం అని మాత్రం అనిపించింది. ఏదేమైనా, its a very disturbing song, visually. (అక్కడ ఒంగోలు స్టేషన్ చూపిస్తూ, నాంపల్లీ టేషన్..అంటాడెందుకు, ఇంతకీ?)

రెండో పాట: ’ఆకలిరాజ్యం’ లోని ’సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్..’
ఈపాట వచ్చినప్పుడూ, ఇప్పుడూ కూడా – ఇలా ఫీలయ్యే యువత పెద్ద శాతంలోనే ఉంటారని నేననుకుంటూన్నా.
ముఖ్యంగా –
“డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్‌”

“చదవెయ్య సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్‌”

-డిల్లీ కాకుంటే, హైదరాబాదు, బెంగళూరు, ముంబై :ఏదో ఒకటి…ఐటీ ఉద్యోగాలను వదిలేస్తే, ఇప్పటికీ ఇదే పరిస్థితి లేదూ??
’ఈ దేశంలో చదివేకొద్దీ దానికి తగ్గ ఉద్యోగం దొరకడం కష్టం’ – అని ఎన్నోసార్లు ఎంతోమంది అనగా విన్నాను, నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను కూడా. పైగా, అప్పుడు రిసెషన్ టైంలో చదువు ముగించుకున్నానాయె!

“మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా ”

“బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా”

-ఔను నిజం! ఔను నిజం! అని ఎలుగెత్తి అరవాలనిపిస్తోంది నాకైతే. మంచుకొండ కరిగిపోదూ – ఇలాగే కొనసాగితే? ఆల్రెడీ ఇన్నేళ్ళు కరిగింది. ;). నాకైతే, ఈ లైన్లు చూస్తూంటే – ’మా తాతలు నేతులు తాగారు..’ తరహాలో మాట్లాడే వ్యక్తులు బాగా గుర్తొస్తున్నారు!

“సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా”

-నిజం, నిజం! మళ్ళీ నిజం! పెళ్ళి -పిల్లలు – సంసారం – వీటికి ఇచ్చినంత ప్రాముఖ్యం చాలామంది ఉద్యోగానికో, తమకాళ్ళ మీద తాము నిలబడ్డానికో ఇవ్వరని అనిపిస్తోందీమధ్య నాకు. అంటే – తమ సంతానం ఉద్యోగం చేయకున్నా ఊరుకుంటారేమో కానీ, పెళ్ళి చేస్కోను అంటే ఊరుకోరేమో – నిజానిజాలు నాకు తెలీవు కానీ, కొంతమంది మాట్లాడుతూంటే ఇదే భావన కలుగుతుంది నాకు.

“ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెయ్‌ బ్రదర్‌”

-బహుశా, బలవంతాన ఇంజినీరింగ్ చదువుల్లో పడ్డ చాలామంది మనసులో అనుకుంటూ ఉండొచ్చు. అలాగే, సాఫ్ట్వేర్ లో లేనందుకు పెళ్ళి సంబంధాలు సరిగా రావట్లేదని వాపోయేవారూనూ. 😉

అన్నింటికంటే – నన్ను వెంటాడే లైను –
“స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్‌”
-మనకి ప్రతీదీ ఓ సెలెబ్రేషనే! వ్యక్తిగతంగా, నాకు రెంటిలోనూ చేసే డబ్బు ఖర్చు నచ్చదు. అలాగని, నేనేం ఆపలేననుకోండి – నా సంగతికే ఆపలేను, వేరే వాళ్ళదాకా ఎందుకు? అయినప్పటికీ – ఆ ఒక్క వాక్యం చాలదూ – బోలెడు కథ చెప్పడానికి మన గురించి?

కొన్ని ఎప్పటికీ తరగని విలువను కలిగి ఉంటాయి – అంబికా అగరబత్తిలా, ఎంటీఆర్ వారి ఇన్స్టంట్ ఫుడ్స్ లా – ఏళ్ళు గడిచినా, ’హౌ ట్రూ’ అనుకుంటూనే ఉంటాము…. అదృష్టమో, దురదృష్టమో గానీ. అదనమాట సంగతి! అసలుకైతే, ఇలాంటివే ఎన్నోపాటలు ఉన్నాయనుకోండి…ఇప్పుడు ఇవి తల్చుకోవాలనిపించిందంతే!

Advertisements
Published in: on August 6, 2010 at 2:49 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/08/06/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. Extremely pleased by the fact that this time around you gave due credit to your brother’s efforts 😛

 2. అపుడపుడూ నన్ను వెంటాడే పాటలలో ఈ రెండూ కూడా ఉంటాయ్. బాగా రాశారు. ఇటువంటి టైంలెస్ లిరిక్స్ రాసిన రచయితలు నిజంగా అభినందనీయులు, వాళ్ళ పేర్లు కూడా తలచుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో.

  సాపాటు ఎటూ లేదు ఆత్రేయగారు అనుకుంటా మొదటి పాట సాహిత్యం ఎవరిదో నాకూ తెలియదు మరి.

 3. మరి మూడో పాట ఏది? రెండీటి గురించే రాసారు.. మీ స్నేహితుడు చెప్పిన పాట? అప్పట్లో “నాంపల్లి టేసనుకాడీ” పాట తెగ మోగుతుండేది ఎక్కడ చూసినా (చివరకు శ్రీరామ నవమి పందిళ్ళలో కూడా :-)) “సాపాటూ ఏటూ లేదు” ఆత్రేయ గారు రాసినా శ్రీ శ్రీ గారు రాసిన ఫీల్ వస్తుంది.. ఎర్ర మల్లెలు లో పాట రాసింది ఎవరో ’ప్రభు’ అట. చిమటా మ్యూజిక్ వారి సైటూ లో చూసా. రెండు సినిమాలు 81 లోనే విడుదలయ్యాయి.

 4. ఈ పాటల గూర్చి మిగతా చర్చ లోకి వెళ్ళను కానీ,నాంపల్లి టేసన్ కాడీ..పాటకు నర్తించిన అబ్బాయి…ఆ సినిమా నిర్మాత సినిమా నటుడు మాదాల రంగారావు కుమారుడు.ఆయన ఇవ్వాళ యూ యస్ లో డాక్టర్,కొన్ని సినిమాల్లో కూడా ఈ మధ్య నటించారు.

 5. “నాంపల్లి…” పాట రాసింది వంగపండు ప్రసాద్. ఈ పాట మాల్గాడి శుభ ప్రైవేటాల్బంలో ముందు వచ్చింది.

 6. నాంపల్లి స్టేషన్ పాట ఉన్న ఎర్రమల్లెలు సినిమా నేను చిన్నప్పుడు TVలో చూశాను. ఆఆఅ పాటకి ముందు “ఒంగోలు స్టేషన్ కాడ చూసినా, నాంపల్లి స్టేషన్ కాడ చూసినా బిచ్చగాళ్లే” అని విలన్ అంటాడు. అందుకే ఆ పాటలో ఒంగోలు స్టేషన్ చూపించారు.

 7. After reading the intro in the first paragraph, the first song that came to my mind was ’ఆకలిరాజ్యం’ లోని ’సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్..’ 🙂
  Thanks for reminding of these wonderful albeit sad classics. Your commentary on the situation is insightful. There is so much to be told about our society’s obsession with marriage and procreation.
  And by the way, it’s not just IT that’s providing livelihoods to people. Manufacturing, construction, retail, telecom are probably providing employment to many more people than IT field. Overall our economy is doing much better than it used to be in the 80s. Even in rural areas the situation is much better these days. But of course that doesn’t in anyway mean that the sad reality captured so beautifully by these songs has ceased to be true. It is said that the number of desperately poor people has actually increased over the years while the percentage of poor people in the overall population has come down. That must have something to do with us being ‘సంతాన మూలికలం’. Recently I came across a TOI article that claimed that there are more rich people in India than poor people. We are making progress but not fast enough to catch up with our spectacular reproduction rate.

 8. తాత్వికమైన పాటలు పిల్లలమీద చిత్రీకరించడం తెలుగులో కొత్తేమీ కాదు. అందులో ఎబ్బెట్టూ ఏమీలేదు – ఆపాటలో ఉన్నవి ఆ పిల్లల సొంత ఆలోచనలనుకుంటేతప్ప. అలాగే ఒంగోలు స్టేషన్ దగ్గర నాంపల్లి స్టేషన్ గురించి పాడ్డంలోనూ వింత ఏమీ లేదు. పాటలో ఉన్న మాటలకి మక్కికి మక్కీ సన్నివేశం సృష్టించక్కర్లేదు. జానపదబాణీల్లో ఇలాంటి పల్లవుల్ని లిటరల్ గా ఎవరూ తీసుకోరుగాని, ‘నాంపల్లిస్టేషనుకాడి రాజాలింగో’ అంటే నాకు ముందు గుర్తొచ్చింది అసెంబ్లీలోని మన ‘రాజులు !

 9. బాగుందండి . ఈ నాంపల్లి స్టేషన్ కాడ పాట ఈ మద్యనే తెగ గుర్తొస్తోంది నాకు .


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: