సందేహానుమానము

’ఇలా రాస్తే చదువరులు ఏమంటారు? ఏమని వ్యాఖ్యానిస్తారు?’ – ఇలా ఆలోచించి నేనెప్పుడూ రాయలేదు కానీ, నిన్నట్నుంచి ఓసందేహం పట్టి పీడిస్తోంది.

మే 2008 లో ఈమాటలో ఓ కథ రాసాను – ’లింకన్ తో ఓ రాత్రి’ అని. అప్పట్లో, ఆ కథ కింద వచ్చిన వ్యాఖ్యల్లో చాలామంది లింకన్ పాత్రని కథలో పెట్టినందుకు కామెంట్ చేశారు. లింకన్ ఆత్మ గురించి నిజంగానే చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అని బొమ్మలతో సహా లంకెలు పెట్టినా కూడా వాళ్ళ మానాన వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నారు. దానితో విసుగొచ్చి వదిలేశా. ఆ తర్వాత మధ్యలో ఆ తరహా కథలేవీ – ’రాయలేదు’ … టైంపాస్ కి చాట్లలో చెప్పడమే కానీ. మళ్ళీ అలాంటి కథొకటి ఈమధ్య ఆగస్టు 2010 ’కౌముది’ లో వచ్చింది – దాని పేరు – ’టిపు, ఆయేషా,నేను’.

నిజానికి, ఈ రెండో కథకి రావాల్సిన విమర్శలు అవి – టిపు ఆత్మ గురించి కథలేవీ ప్రచారంలో లేవు కనుక.
ఏమిటో – అందుకే, అవతలి వాళ్ళు మన గురించో, మనం రాసిందానిగురించో… ఏమనుకుంటున్నారూ? అన్న విషయం గురించి అంత టెన్షన్ అనవసరమేమో అనిపిస్తోంది. ఏ నిముషానికి ఎవరి మూడ్ ఎలాగుంటుందో ఎవరూహించగలరు?

Advertisements
Published in: on August 3, 2010 at 10:52 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/08/03/%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b1%87%e0%b0%b9%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%ae%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. Will you plz give the link of that Lincoln story?

  2. Eemaata accepts reader comments and Koumudi doesn’t 🙂

  3. @Badri: Well, I allowed for comments on that story posted in Koumudi rite? 🙂 Even then, till now, no one commented on Tipu’s ghost.

  4. అవును కధ ఐనప్పుడు, టిప్పు ఐతేనేమి, లింకన్ ఐతే నేమి??
    అదెదో మీరు నిజంగా జరిగింది, ఇది కల్పన కాదు, దానికి పలానా వారే సాక్ష్యం అనేమీ రాయలేదుగా, దానిపైన రచ్చ ఎందుకో?

  5. @సౌమ్య, మీ వ్యక్తిగతబ్లాగ్ కి వచ్చి మరీ విమర్శిస్తారని అనుకోను. చూద్దాం ఎవరన్నా వస్తారేమో 🙂

    ఇంకో విషయం ఈ-మాటలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళల్లో చాలామంది ఆ సైట్ రెగ్యులర్ రచయితలు. వాళ్ళల్లో చాలామందికి వ్యక్తిగతబ్లాగులు లేవనుకుంటా. సో ఇక్కడికొచ్చే అవకాశం తక్కువ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: