వేటూరి స్మృతిలో కొన్ని నిముషాలు…

’గుండెపోటుతో వేటూరి మృతి’
-ఈనాడు వార్త, నిద్రపోబోతూ సగం మత్తులో చూసాను. ఉన్న మత్తంతా వదిలి – కళ్ళనీళ్ళు తిరిగాయి.
నాకేం సంబంధం అయినా? నేనెందుకు ఏడవాలి?
– మరి, వేటూరి పాటలేని జీవితం ఊహించుకోగలిగే విధంగా ఉంటుందా ఏం?

’గొడవేగొడవమ్మా చేయిపట్టే…’ అబ్బబ్బా! ఈయనేంటి ఇంత పచ్చిగా రాస్తాడు?
’గసగసాల కౌగిలింతా?’ – ఎంత బాగుందీ ప్రయోగం!
’చేరువైనా రాయబారాలే..చెప్పబోతే మాటమౌనం..’ – అబ్బ! ఎంతందంగా చెప్పారో!
’మేఘమాలనంటుకున్న ఆంటెనాలతో – మెరుపుతీగ మీటి చూడు తందనాలతో’ – తమాషాగా ఉందే
’చిలిపియాత్రలో చల్ చల్ చల్ చల్ జరుపమందిలే జంతర్ మంతర్’ – ఏమిటో ఈ భాష!
’ఈ దుర్యోధన దుశ్శాసన….’ – వింటూంటేనే ఆవేశం పుట్టేయదూ?
“అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగల చేమంతులే వాడిపోయే…
తన రంగు మార్చింది రక్తమే తనలో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పొయే…
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై ” – అక్షరమక్షరం ఎన్ని జీవితానుభవాల కలయిక?
-ఎన్నని తల్చుకునేది? ఎన్నిసార్లని అబ్బురపడేది? ఎక్కడ మొదలుపెట్టేది? ఎక్కడ ఆగేది?

ఈయనతో నా తొలి పరిచయం – వేటూరి అన్న పేరుతోనైనా, ఆయన పాటతోనైనా – ప్రతి తెలుగు వ్యక్తికి మల్లే – ఊహ తెలుస్తూనే జరిగింది. బహుశా ఊహ తెలీనప్పుడు కూడా పరిచయమేనేమో!! అక్కడినుండి జీవితంలో భాగమైయ్యాడు. ఇకపై వేటూరి కనబడ్డు….పాట మాత్రమే మిగిలింది…అన్న ఆలోచన ఎంత భయంకరంగా ఉందో…

“మనసు రాయి చేసుకున్నా మమత ఘోష మానకుంది
కళ్ళ నీళ్ళు దాచుకున్నా కలల బరువు తీరకుంది” (ఈపాట వేటూరిది కాదనుకుంటాను కానీ – ఇప్పుడు పదేపదే గుర్తొస్తోంది!!)
-నిజం!! వేటూరి పాటంత నిజం. ఇవాళ ఏడవని తెలుగువాడు తెలుగువాడేనా??

Advertisements
Published in: on May 22, 2010 at 11:47 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/05/22/rip-veturi/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. వేటూరి ఇంకో పాట వ్రాయడన్న ఆలోచన నన్ను కుదురుగా నిలువనివ్వట్లేదండీ 😦 వేటూరి నాకు ఆత్మబంధువు! ఎన్నని చెప్పుకోగలం ఆయన పాటలు?

 2. బ్లాగులు చదువుదామని మాలికను తెరిచన నేను ఈ శీర్షిక చూసాక కాసేపు నమ్మలేకపోయాను. ఇంత హఠాత్తుగా ఎలా జరిగింది. it’s really sad.

  సాహితి ప్ర్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయింది. such a wonderful person he was.
  May his soul rest in peace.

 3. సాహితీమూర్తికి శ్రద్ధాంజలి

 4. గొడవేగొడవమ్మా పాడు గుండే పాటే లేదంటే… 😦

  thanks for the article Sowmya gaaru!

  మొన్నెప్పట్నుంచో నా నోటిని పట్టుకు ఇంకా వదలని పంక్తులు:

  ప్రేమలు కోరే, జన్మలలోనే, నే వేచి ఉంటానులే…
  జన్మలు దాటే, ప్రేమను నేనై, నే వెల్లువౌతానులే…

  ఇందులో నాకు ఎన్ని అర్థాలు కనపడుతున్నాయో నేను చెప్తే గానీ ఎవరికీ తెలియదు.

  ఇపుడాయన మరణం వల్ల, సినిమాకున్న తప్పనిసరి పరిధుల కారణంగా మన జీవితంలోంచి వేటూరి పాటగా మారని కోణాలెన్ని మిగిలిపోయాయో అనిపించాలి నిజానికి; కానీ జీవితం వేటూరి చేత రాయించుకోలేని పాటలెన్ని మిగిలిపోయాయో అని తిరిగి దాని మీదే జాలేస్తుంది!

  “నువ్వులేవు నీ పాట వుంది” అని తృప్తి పడాలంతే!

 5. thank you soumaya gaaru chala baga rasaaru ila me blogulo vaarini gurtu chesukovadam nijanga harshaneyam,

  “vetoori kuripinchaavu maapay ni patala tholakari

  nenu andulo sedateeri cheraanu ni manasu dari

  ni maranam tho pagilindi naa gunde jaari

  telugu saahityamlo neku yevaru leru sari”

  thappulunte manninchandi aayanapay abhimanam inkolaa chatukolenu me blog ni ika roju chaduvutaanu thankoyu sowmya gaaru all the best

 6. sowmya garu veturi gari gurinche meru rasina article chala bagundi………

  “veenuvi vachhanu bhuvananiki

  gaalini pootanu gagananiki ………” ani manalanu vidiche vellina veetoori aatmaku santhi kalagalani koru kuntu …………………….

  tlvprasad

 7. 😦

 8. 30 days of blog silence in memory of Late Sri VETURI


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: