ఏప్రిల్ 23 – ఎస్.జానకి పాటల లూప్

ఏప్రిల్ ఇరవై మూడు – ఎస్.జానకి పుట్టినరోజు అని నాకు తట్టేసరికి సగం రోజు గడిచిపోయింది. ఆపై, గూగుల్ బజ్ లో బెజవాడ ఫణీంద్ర గారు ఆవిడ్ని తల్చుకున్నారు – అది చదువుతూ ఉంటే – ఇటీవలి బిజీ జీవితం పుణ్యమా అని తీరిగ్గా దుప్పటి కప్పుకుని నిద్దరోతున్న నా పాత అభిమానం ఉలిక్కిపడి లేచింది – ఎవరో తలపై కుండ నీళ్ళు కుమ్మరించినట్లు. అప్పుడే రెండు గంటల బస్సు ప్రయాణం, ఆపై మరి కొద్ది గంటల తేడాలో పన్నెండు గంటల బస్సు ప్రయాణం వెంట వెంటే ఉన్నాయి కదా – జానకమ్మ గొంతు వింటూ బడలిక లేకుండా చూస్కుందాం అనుకుంటూ – కొన్నాళ్ళుగా తెరవని ఎస్.జానకి తెలుగు సీడీలు రెండూ, ల్యాప్టాప్ లోనే ఉన్న త్యాగరాజ కీర్తనలూ -హడావుడిగా ఎంపీత్రీ ప్లేయర్ లోకి కాపీ చేస్కుని బైట పడ్డాను.

నేను అంత రాండంగా పెట్టుకున్నానా, వరుసగా వింటూంటే – వావ్! అనుకోకుండా ఉండలేకపోయాను. అంత వైవిధ్యం విన్న కొద్ది పాటల్లో! ఇప్పుడు నేను విన్న వరుస లోనే కొన్ని పాటల్ని మళ్ళీ తల్చుకుంటూ ఈ టపా.

(గమనిక: ఫొటోల కర్టసీ – బెజవాడ ఫణీంద్ర గారు. వారికి అనేకానేక ధన్యవాదాలు!)

సిరిమల్లెపూవా – నాకు ఇది మొదట తమిళంలో పరిచయమైంది కానీ…. ఇప్పుడు తెలుగులోనే వింటున్నా..ఇదైతే మనకి బాగా అర్థమౌతాయి కదా పదాలు 🙂

కళ్ళలో ఉన్నదేదో – నేనీ సినిమా ఎప్పుడూ పూర్తిగా చూడలేదు. ఈపాట కూడా ఎప్పుడూ పూర్తిగా వినలేదు. ఇప్పుడు మొదటిసారి పూర్తిగా విన్నాను. బాగుంది.


తొలికూడి కూసిందిరా మావా తెల్లారిపోతుందిరా…
– అదనమాట – పై రెండూ విన్నాక, మధ్యలో ఇది విని, కింద ఉన్న మరో రెండింటికి చేరాను.

ఎవరేమన్ననూ
-“ఎవరేమన్ననూ..తోడు రాకున్ననూ..ఒంటరిగానే సాగిపోరా…నీ గమ్యం చేరుకోరా..” – అని ముందు ఎంకరేజ్ చేసి పంపేశాక,

నీకేలా ఇంత నిరాశ
“నీకేల ఇంత నిరాశ…నీ కన్నులలో కన్నీరేల…అంతా దేవుని లీల..అంతా దేవుని లీల ….ఆశనిరాశలు దాగుడుమూతల ఆటేలే…చీకటి కొంత వెలుతురు కొంత, ఇంతే జీవితమంతా….నీమదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం….” – అని కన్సోలేషన్. బాగుంది 🙂 ఎవరో హమ్ చేస్తూంటే వినడమే కానీ, ఈ రెండు పాటల అసలు వర్షన్ వినడం ఇదే మొదటిసారి.

సూరీడు పువ్వా – అంతఃపురం సినిమాపాట. నాకు ఈపాటంటే చాలా ఇష్టం. కానీ, మంచి మూడ్లో ఉన్నప్పుడు మాత్రం వినను – అంత విషాదంగా ఉంటుంది మరి! “ఆకాశమే మిగిలున్నదీ…ఏకాకి పయనానికి…” ఇటువంటి వాక్యాలు ఆపాటలో, ఆ గొంతుకలో వచ్చినప్పుడు మాత్రం – ఎంత మంచి మూడ్లో ఉన్నా కూడా, విషాదం ఆవరిస్తుంది నన్ను. అందుకే మామూలుగా మూడ్ బాలేనప్పుడు తప్ప ఈ పాట విననన్నమాట.

-ఏదో అనుకున్నాను కానీ, పై పాటల్ని ఇప్పుడు చూస్తూ ఉంటే, భలే ఉన్నాయ్! నెమ్మదిగా మూడ్ డౌన్ ఔతూ వచ్చినట్లు లేదూ!!

శివదీక్షాపరురాలనురా – ఇదండీ అసలు ఈ లిస్టు మొత్తంలో నన్ను ఒక ఇరవై నాలుగ్గంటలు వెంటాడిన పాట. ఈ లిస్టులో, మొదటిసారి విన్న పాట ఇదే అనుకుంటాను. ఎందుకో చెప్పలేకపోతున్నాను కానీ – తెగ నచ్చేసింది నాకీ పాట. ఆ నేపథ్య సంగీతం, దాని ట్యూన్లో సాగే జానకి గాత్రం, ఆ స్లో ఫ్లో – వెరసి పిక్ ఆఫ్ ది డే చేసేసాయి ఈ పాటని. ఈపాట గురించిన కథ గూగుల్ చేస్తే తెలిసింది – ’ఘనం సీనయ్య’ – గురించి.

“1704-31 మధ్యకాలంలో వున్న ఘనం శీనయ్య అసలు పేరు వంగల శీనయ్య. ఇతడు మధుర రాజైన విజయరంగ చొక్కనాథుని మంత్రులలో ఒకడు. ఇతని రచన “శివదీక్షాపరురాలనురా” సంగీతసభల్లో బాగా వ్యాప్తిపొందింది. ఇందులో వ్యాజస్తుతి వుండటం వల్ల ఇటు శైవుల అటు వైష్ణవుల మెప్పునూ పొందింది. “సీతాకళ్యాణం” (1934) చిత్రంలో ఈ గీతాన్ని ఉపయోగించగా, “పూజాఫలం”లో మొదటి చరణం వరకూ “ప్రేమ” సినిమాలో హాస్యగీతంలో పల్లవి వరకూ ఉపయోగించారు. “సీతాకళ్యాణం”లో రావణుని కొలువులో రంభచేత అభినయం పట్టించిన ఈ గీతం రావణుడు వైష్టవద్వేషి కావడం వల్ల సందర్భోచితంగా రాణించిందని మల్లాది రామకృష్ణశాస్త్రి అభిప్రాయం.” (లంకె ఇక్కడ)

ఆ పై పరుచూరి శ్రీనివాస్ గారు చెప్పిన కథ:

“The song was recorded by quite a few number of artists. The earliest recording I have is from 1920s, sung by “Miss Adilachmu” (sic)”of Mysore”. Though she sings it elaborately – its a 6 min recording – she also skips the aforementioned stanzas. My favourite is Shanmuga Vadivu’s (mother of M.S. Subbulakshmi), singing the song while playing Veena.Divine!! There are a couple of Naagaswaram recordings by stalwarts like T.N. Rajaratnam Pillai et al. That 20 sec bit of R. Balasaraswati in “prEma” (1952) is also a great delight to hear.”

Here are the three stanzas that are never sung:
1. పంచాక్షరి జప సీలనురా! కూకిపలుకులను వినజాలనురా!
కొంచెపు వగలు నేనెంచనురా! మ్రొక్కుదు రుద్రాక్ష సరులు త్రెంచకురా

2. అజ్జు చూచి చన్ను లదమకురా! నా సెజ్జ గొలుసు బట్టీ గదియకురా
బుజ్జగించను పసికోలనురా! కెమ్మావి నొక్క భక్తురాలనురా!

3. మోము మోమును బట్టి జేర్చకురా! నీ నామము తోడ బూతి గూర్చకురా!
వేమరు తోడ బిక్ష వేడకురా! బోపరా మన్నారు రంగ మల్లాడకురా!


సద్దుమణగనీయవోయ్
– పైపాట వినగానే, ఈపాట వింటే ఎలా ఉంటుందంటారు?? 🙂 బస్సులో ఉన్నా కనుక సరిపోయింది కానీ, పెద్దగా నవ్వేసి ఉందును. ఈపాట సంగీతం రమేశ్ నాయుడు గారని ఈనెల ఈమాటలో ఆయనపై పరుచూరి శ్రీనివాస్ గారు రాసిన వ్యాసం చూస్తే తెలిసింది.

నీలీలపాడెద దేవా – ’సద్దుమణగనీయవోయ్…’ తరువాత ఈపాట!! నిజం చెప్పొద్దూ – భక్తి పాటల్లో అదేదో అపీల్ ఉంటుంది. అభక్తశిఖామణులైన నాలాంటి వారికి కూడా నచ్చేస్తాయి ….

సెప్టెంబర్ మాసం – ’నీలీల పాడెద….దే…వా…’ అని అది ఆగగానే…’సెప్టెంబర్ మాసమ్…..’ అని డించక్..డించక్ డాన్సు కళ్ళ ముందు కదలాడితే??

-ఇవి సైన్ కర్వ్ లాగా… పైన సా..కింద రీ అన్నట్లు….. extremes!

(ఇక్కడి నుండి కొన్ని త్యాగరాజ కీర్తనలు వచ్చాయి- నాకు శాస్త్రీయ/అశాస్త్రీయ – ఏ సంగీతంతోనూ పరిచయం లేదు. విని ఆనందించడానికి, కనీసం – ఇవి విని ఆనందించడానికి ఆ అజ్ఞానం అడ్డురాలేదు.)

బాలా కనకమయ –
రారా మా ఇంటి దాక –
నిన్నే నెర నమ్మినాను రా –
ఎందుకు దయరాదురా –
దయరానినీ దాశరథీ –
తలచినంతనే నా తనువేమో –
– వరుసగా త్యాగరాయ కీర్తనలు వచ్చాయి. త్యాగరాయ కీర్తనలను రెండర్థాలతో అన్వయించుకోగల సౌలభ్యం నాకున్నది కనుక, ఇలాంటి పాటలంటే ప్రత్యేకాభిమానం నాకు. ’తలచినంతనే నా తనువేమో ఝల్లుఝల్లనేరా…’’దయరానీ…’ పాటలో ’కనుగొనానందమై కన్నీరు నిండెనే రామా..’ అన్న వాక్యాన్ని నాలుగుసార్లు నాలుగురకాలుగా పాడే విధానం అంటే నాకు చాలా ఇష్టం. మొదటి సారి విన్ననాటి నుంచి గత వారాంతం వరకూ ఒక వందసార్లన్నా విని ఉంటానీపాటను. ఇన్నిసార్లలోనూ – ’కనుగొనానందమై’ నిస్సందేహంగా ఈపాటలో నా అభిమాన భాగం.

నగుమోము గనలేని
– త్యాగరాయ కీర్తనె కానీ, నా కథ కాస్త చెప్పాలి. ’నగుమోము..’ మొదటిసారి విన్నది ’అల్లుడుగారు’ సినిమాలో యేసుదాసు గొంతుకలో. మొదటిసారి బాగా ఇష్టపడ్డది భానుమతి గారి గొంతుకలో. ఆపై మధ్యలో – ఇద్దరు ముగ్గురు పూర్తి ’శాస్త్రీయ’ గొంతుకల్లో విన్నాను. అంటే – నా ఉద్దేశ్యం – సినిమేతర పాటలని మాత్రమే!

సినిమాల్లో వచ్చే శాస్త్రీయం తప్ప, నాకు ’ప్రైవేట్ ఆల్బమ్స్’ నచ్చవని నిర్ధారించుకుంటున్న సమయంలో, నా చిన్నప్పటి ఫేవరెట్ – ఈ క్యాసెట్ (ఈ త్యాగరాయ కృతులన్నీ జానకి గారి గొంతులో ఒకే క్యాసెట్లో విన్నాను మొదటిసారి – బహుశా ఒక పదిహేను పదహారేళ్ళప్పుడు కాబోలు) – కి ఎంపీ౩ వర్షన్ కనబడ్డది ఆన్లైన్ లో. దానితో, అప్పటికి ’నగుమోము’ మోజులో ఉన్న నేను, జానకి గారి గొంతులో ’నగుమోము’ విన్నాక, అద్దంలో నా నగుమోముగన్నాను. 🙂 అలా వంద సార్లు రీప్లే చేసినా వింటూ ఉండిపోగలను – అనిపించే పాటల్లో ఇదొకటి.

అలా మిగితా పాటలు కూడా విన్నాను. మొత్తం జాబితా విప్పడం దేనికని ఇక్కడికి ఆపేస్తున్నా 🙂

Advertisements
Published in: on May 10, 2010 at 9:22 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/05/10/april232010/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. 1940’s లో “శివదీక్షాపరురాలనురా” మా తాత గారింట్లో గ్రామ ఫోన్ రికార్డు పెట్టుకుని వినే వాణ్ని. అర్ధమయితే తెలిసేది కాదు గాని గామఫోను పిచ్చ.అందరి ఇండ్ల లోను ఉండేవి కావు అవ్వి. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

 2. super post! delectable feast! 🙂

  నాకింకో పాట నిన్ననే గుర్తొచ్చి మళ్లీ ఇపుడు రాగం మర్చిపోయాను. “అలకపానుపు ఎక్కనేలా…” అనేదో సాగుతుంది. సినిమాపేరు “శ్రీవారి శోభనమో”, “…పెళ్లో” గుర్తురావటం లేదు. గొప్ప పాట అనను గానీ, ముసలమ్మ గొంతుని భలే పాడుతుంది, ఏ ఇన్‌హిబిషన్స్ లేకుండా. అసలదే జానకి గొంతులో నాకు నచ్చేదేమో. She can be endearingly frivolous.

 3. వందసార్లు వినేంత నచ్చినదాని విషయంలో తప్పు వ్రాస్తే యెలా!
  ‘కనుగొన నానందమై’ అన్న చరణం ‘తలచినంతనే నాతనువేమో’ కీర్తనలోనిది కాదు.

  “దయరాని దాశరథీ” కాదు “దయరానీ దాశరథీ”


  శేషతల్పశాయి.

  P.S. Ignore the previous comment

  • శాయి గారికి: సరిచేశాను. తెలిపినందుకు ధన్యవాదాలు. దయరానీ – గూగుల్ తప్పిదం అనుకుంటాను. నేను ఆంగ్లం లో dayarani అని ఇస్తూ ఉంటాను ఆ transliterator కు. కనుగొనానందమై – మాత్రం పక్కా నిర్లక్ష్యం! 🙂

 4. Very nice article

 5. nagumOmu jAnaki gAru pADArA? recording unTE ivvarU? please?

  • Srini garu: Mailed the song to the ID u mentioned for commenting.

 6. Thank you very much! I knew all the other songs you mentioned in that album from our old tape at home, but it didn’t have this one. Very nice to hear in jAnaki’s voice, with all the sangatulu.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: