క్రికెట్ చూడ్డం మీద నాకంత ఆసక్తి లేదు. ఉన్న కాస్తా వయసు పెరిగే కొదీ తగ్గిపోతూ, ఇప్పటికి చాలా చల్లబడిపోయింది. కానీ, క్రికెట్ గురించి చదవడం, పాత తరం జ్ఞాపకాలను నెమరువేస్తున్న వారి రాతల్లో ఆటని, ఆటగాళ్ళనూ, వారి వ్యక్తిత్వాన్నీ ఊహించుకోవడం – గురించిన ఆసక్తి మాత్రం కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో చదువుతున్న క్రికెట్ పుస్తకం – రామచంద్ర గుహ రాసిన ’ది స్టేట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’. ఈ పుస్తకంలో మన దేశంలోని వివిధ జట్ల చరిత్రలూ, ఆటగాళ్ళ గురించిన కథలూ, రాం గుహ ఆల్ టైమ్ లెవెన్లూ, ఎన్నో సంఘటనల గురించిన వివరాలు – నిండి, చాలా ఆసక్తికరంగా ఉంది కానీ, ఇవాళ చదివిన కథ – వెంటనే స్పందింపజేసి ఈ టపా రాయిస్తోంది.
“సి.కె.నాయుడు” – పేరు మీరు వినని పక్షంలో ఈ టపా చదవకండి. కనీసం వికీ పేజీ అన్నా చదివాకే ముందుకు సాగండి.
(వికీలో స్టాట్స్, గుహా స్టాట్స్ కొంచెం వేరుగా ఉన్నాయి. ఐనా, అది మనకనవసరం ప్రస్తుతానికి)
నాయుడు గారి గురించి అప్పుడప్పుడూ ఇలాగే క్రికెట్ లిటరేచర్‌లో వినడమే తప్ప – నాకు వారి ఆట గురించి తెలిసిందేమీ లేదు. నిజానికి, క్రికెట్టు కంటే నాకు క్రికెట్టు కథలంటేనే ఇష్టం అని చెప్పా కదా – ఆటలోని మజా గురించి పట్టించుకోను అని చెప్పొచ్చు. విషయానికొస్తే, రాం గుహ – ఈ పుస్తకంలో సి.కె.నాయుడు గారి గురించి కొంత వివరంగా రెండు మూడు పేజీలు రాసారు. తద్వారా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలిసాయి. చదవగానే, నాయుడు గారికి అభిమానినయ్యాను. ఆయన ఎలా ఆడతాడో తెలీదు – చూడలేదు కూడా – అయినా అభిమానం. ఎందుకంటారా? చెబుతాను వినండి:
ఇరవై ఒక్కేళ్ళ వయసులో 1916 లో మొదటిసారి బాంబే క్వాడ్రాంగులర్ (అప్పటికింకా అది పెంటాంగులర్ కాలేదు)లో హిందూ జట్టు తరపున ఎనిమిదో నంబర్ ఆటగాడిగా ఆడారట. ఇక చివరి మ్యాచ్ ఎప్పుడు తెలుసా? 1956లో, అరవై ఒక్కేళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పినప్పుడు! విల్ఫ్రెడ్ రోడ్స్, డబ్య్లు జీ గ్రేస్ వంటి వారు క్రికెట్లో పొడవైన కెరీర్లు కలిగిన ఆటగాళ్ళని ఇదివరలో చదివాను. కానీ, ఈయన కెరీర్ వీళ్ళిద్దర్నీ మించిందట! ఆయన గురించి రాం గుహ చెప్పిన కొన్ని కథలు:
-1946లో నాయుడు గారు భారత జట్టుకు ప్రధాన సెలెక్టర్ గా ఉన్నరోజుల్లో, రంజీ ఫైనల్లో హోల్కర్ జట్టుకు ఆడుతూ రెండొందల పరుగులు చేసారట. ఈ ఇన్నింగ్స్ లో ఇరవై రెండు ఫోర్లు – ఆరున్నర గంటలు సాగింది. ఏముందీ? అంటారా? అప్పుడాయన వయసు అక్షరాలా యాభై ఒకటి!
ఇది జరిగిన పదేళ్ళకి ఆయన ఉత్తర్ ప్రదేశ్ జట్టు సారథిగా రాజస్థాన్ తో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు. అప్పటి రాజస్థాన్ జట్టులో ముగ్గురు టెస్ట్ జట్టు బౌలర్లు కూడా ఉండగా – నాయుడు గారు ఎనభై నాలుగు పరుగులు చేసి, రనౌటయ్యారట! అందులో – వినూ మన్కడ్ వేసిన ఒక ఓవర్ లో వరుసగా కొట్టిన రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి.
సీకే గారి స్టామినా గురించి మరో రెండు కథలు:
1. ఆయన ఆడిన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ గబ్బీ అలెన్ వేసిన బౌన్సర్ ఆయన గుండెల వద్ద బలంగా తాకితే, ఆయన అరిచిన అరుపు గ్రౌండంతా వినబడ్డదట. అప్పుడు కూడా, సాయానికని వస్తున్న వారిని వారించి, వెంటనే లేచి నిలబడి, తదుపరి బంతిని బౌండరీకి తరలించడమే కాకుండా – ఆ మ్యాచ్ లో ఎనభై ఒక్క పరుగులు కూడా చేశారట.
2. ఇది జరిగిన పదహారేళ్ళకి, ఆయనకి యాభై ఏడేళ్ళప్పుడు – హోల్కర్ జట్టు సీకే సారథ్యంలో బాంబేతో రంజీ ఫైనల్ కి సిద్ధమైంది. ఇన్నింగ్స్ మొదట్లోనే దత్తూ ఫాడ్కర్ వేసిన బంతి ఒకటి ఆయన నోటిని గట్టిగా తాకింది. ఊడిపోయిన మూడు ముందు పళ్ళ సంగతి పక్కకి నెట్టి, ఆట కొనసాగించారు సీకే. ఆయనపై గౌరవంతో వేగం తగ్గించిన ఫాడ్కర్ ను మందలించి… చివరికి ఆ ఇన్నింగ్స్ లో అరవై పరుగులు చేశారట. ఇది మూడు కారణాలకి నాకు గొప్ప విషయం అనిపించింది – ఒకటి, నాయుడు గారి వయసు; రెండు-ఆయన దెబ్బ; మూడు-అప్పటి ముంబై జట్టులో ఆరుగురు టెస్ట్ క్రికెట్ బౌలర్లు ఉన్నారట!! (Phadkar, Sohoni, Ramchand, Mankad, Gupte, Shinde)
-ఇవికాక, ఆయన గురించి మరిన్ని పిట్టకథలున్నై గుహా గారి వ్యాసంలో. అంతా చదివాక – నాయుడు గారికి వీరాభిమానినై, ఇలా టపా రాస్తున్నా అనమాట. క్రికెటర్ గానే కాక, వ్యక్తిగా, ప్రత్యేకం – అద్భుతమైన ఫిట్నెస్ ఉన్న వారిగా – ఆయనది ఎంతో స్పూర్తి వంతమైన జీవితం. ఈయన గురించి పుస్తకాలేమైనా వచ్చి ఉంటే, ఇక్కడ ఓ వ్యాఖ్య రాయగలరు. క్రికెట్ నాకు పరిచయం చేసిన అద్భుత వ్యక్తుల్లో నాయుడు గారిని చేర్చేసుకున్నాను ఇవాళ. 🙂
WoW! Thanks for introducing me to such a great cricket legend!
Indian Cricket vows to C.K.Naidu. Thank you Sowmya. Came to know more about this great legend.
I read Ram Guha’s book in a frnd’s home. But have nt got go it. Where will it be available?
Y don’t u write about that book in Pustakam? 😀
@G: I bought it in Crossword, Bangalore.
సౌమ్య గారూ !
నాయుడు గారి గురించి చిన్నప్పట్నుంచీ వినడమేగానీ క్రికెట్ మీద ఆసక్తి లేకపోవడం వలన ఆయన గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాను. ఆయన గురించి కొన్ని మంచి విషయాలు రామచంద్ర గుహ రాస్తే వాటిని మీరు మాకు అందివ్వడం బాగుంది. తెలుగు వాళ్ళ ప్రతిష్టను పెంచిన ఇలాంటి మహానుభావుల గురించి ఈ తరానికి తెలియడం చాలా అవసరం. ధన్యవాదాలు.
Very intriguing. This book is MUST READ for me now.
నాయుడు గారు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు మెయిన్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడో,ప్రాక్టీసు చేస్తున్నప్పుడో నాయుడూ బౌండరీ అని దారెంటపోయేవాళ్ళు అరిచినా,అటు చినవాల్తేరు వైపు వాళ్ళు అడిగినా,అరిచినా ఆ శబ్దం ఎటు నుంచి వస్తే అటువైపు ఒక సిక్సర్ కోట్టేవారని ఐతిహాసం వైజాగ్ లో 🙂
He is known for hitting the deliveries into Clock towers and the nearby parks
Really awesome ..i liked it. 🙂
[…] రాసిన వ్యాసం చదివాక నేను రాసిన టపా ఇక్కడ చదవొచ్చు). GA_googleAddAttr("AdOpt", "1"); GA_googleAddAttr("Origin", "other"); […]