పుస్తకం.నెట్ ఖాతాలో కలిగిన అనుభవాలు…

కొన్నాళ్ళుగా, పుస్తకం.నెట్ పుణ్యమా అని, ఆసక్తికరమైన వ్యక్తుల్ని కలవడం, ఆసక్తి కలిగించేంత అనాసక్తి కలిగించే దృశ్యాలను చూడ్డం జరిగింది. ఎప్పటికప్పుడు – దీని గురించి రాయాలి, అనుకోవడం – ఏం రాయాలి? అనుకుని ఆగిపోవడం – ఇలాగే గడుస్తోంది. అయితే, అడపాదడపా – ఎవరినన్నా కలిసినప్పుడో, ఏదన్నా సంస్థ చూసినపుడో – స్నేహితులకి చెబుతూ ఉంటే – ’వై డోన్ట్ యూ బ్లాగ్ అబవుట్ ఇట్?’ అని అడగడం ఎక్కువైంది. (అంటే, చాల్లే సోదాపు. అక్కడికెళ్ళి రాస్తే, మాకు టైం ఉన్నప్పుడు చదువుతాం – అన్నట్లు కూడా అని ఉండొచ్చు. కొందరు మాత్రం, నిజంగానే కన్సర్న్ తో అన్నారు). అలా ఎదుర్కున్న సందర్భాల గురించీ, కలిసిన మనుషుల గురించీ – ఈటపా…

మొదటగా, ఫిబ్రవరి నెల మూడో వారాంతంతో మొదలుపెడదాము. చెన్నైలో బాపూ-రమణలను కలిసే అదృష్టం కలిగింది. (ఇదిగో, ఇక్కడే మొదలైంది, ఏమిటీ, అన్ని కథల్రాస్తావు బ్లాగులో, దీని గురించి మాత్రం రాయవేం? అని). కలలోకూడా ఊహించని సందర్భం ఇది. అలాంటిది, వాళ్ళింట్లో ఒక రోజంతా గడపడం – కబుర్లు చెప్పడం, వాళ్ళ లైబ్రరీని అటాక్ చేయడం – అంతా కలలా ఉంది. నెలన్నరౌతోంది కనుక, నిముషం-నిముషం అకౌంట్ రాయలేను. అలాగే, అసలింతకీ ఏం రాయాలో కూడా తోచట్లేదు. ఒక మర్చిపోలేని అనుభవం అని మాత్రమే చెప్పగలను. అంత గొప్ప రచయిత అయిన రమణగారూ, అంత గొప్ప చిత్రాకారుడూ-దర్శకుడూ అయిన బాపు గారు, అన్నింటికీ మించి గొప్ప చదువరులైన వారందరూ – రెండు తరాల తేడా ఉన్నప్పటికీ, కొంత భయంతో మొదట బిగుసుకున్నప్పటికీ – చాలా స్నేహంగా మాట్లాడారు, సరదాగా తమ అనుభవాలను పంచుకున్నారు. ముళ్ళపూడి శ్రీదేవి గారు చాలా ఆప్యాయంగా ఆదరించారు – ఎన్నాళ్ళైనా ఇది మరువలేను. ఇది జరిగిన దాదాపు నెలరోజులకి నా చిన్నప్పటి స్కూలుకి, అప్పుడు పెరిగిన ఊరుకెళ్ళి అప్పట్లో చదివే,రాసే అలవాట్లను ప్రోత్సహించిన మా టీచర్లతో చెబితే, చాలా సంతోషించారు కూడానూ. (నేనిలా జీవితాంతం చెప్పుకుంటానేమో – నేను బాపూ-రమణలని కలిసానోచ్! అని). వాళ్ళింట్లో ఉన్నప్పుడే నేనూ-పూర్ణిమా అనుకున్నాం – ’ఇలా మనం ఇక్కడ ఇదంతా చేస్తున్నామని చెబితే, కథ చెప్తున్నాం అనుకుంటారేమో మన ఫ్రెండ్స్…” అని.

ఇక, కథ మార్చికొచ్చేస్తుంది.

కొత్తపల్లి’ టీం వారితో జరిపిన మెయిల్ సంభాషణలు, ’మంచి పుస్తకం’ వారిని కలవడం – ఇవి రెండూ కూడా మంచి అనుభవాలు. పూర్ణిమ మంచిపుస్తకం వారితో సంభాషణ గురించి పుస్తకంలో రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు. వీళ్ళిద్దరూ చాలా చిన్న టీంలు ఐనప్పటికీ, పరిస్థితులను ఎదుర్కోంటూ, విజయవంతంగా పని చేస్తున్న వైనం చాలా స్పూర్తి కల్గించేదిగా ఉంది. అలాగే, వీళ్ళ అనుభవాలు పంచుకుంటున్నప్పుడు  – పిల్లల సాహిత్యం గురించీ, పిల్లలకి ఎటువంటి పుస్తకాలు అవసరం, పిల్లల భాష, పిల్లలు కథలు రాసే పద్ధతి, అలాగే, పత్రిక-పుస్తకాలు ముద్రించడంలోని సాధకబాధకాలు – ఇలాంటి విషయాల గురించి ఎన్నోసంగతులు తెలుసుకున్నాము. అన్నింటికంటే ముఖ్యంగా – వీరి కమిట్మెంట్, ధైర్యం – ఇవన్నీ రాబోయే ఏళ్ళలో నాకు స్పూర్తి కలిగించే జ్ఞపకాలుగా ఉండిపోతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. (కొత్తపల్లి వారి గురించి పుస్తకం.నెట్లో..త్వరలో!)

ఆపై, ఆమధ్య ’ఏపీ ఆర్కైవ్స్’ కి వెళ్ళాము. అంత పెద్ద బిల్డింగ్ – సరిగ్గా వెల్తురు లేదు. నాకైతే, పాతకాలపు బంగళాలోకి వెళ్తున్న భావన కల్గింది. ఉన్నదానికి తోడు దుర్గంధం! ఒకరూములో సినిమాడిస్కులు కనబడ్డాయి. తుప్పుపట్టిన డబ్బాల్లో, నిర్లక్ష్యంగా వదిలేసినట్లనిపించింది. (మళ్ళీ, ఇదే చోట, పుస్తకాలు గట్రా భద్రపర్చుకునే పద్ధతుల గురించి రిసర్చి శాఖ కనబడ్డం ఐరనీ!). అక్కడి లైబ్రరీ ఒక అద్భుతం. కాసేపు లోపల తిరుగుతూ ఉంటేనే – ఎన్నో బయట కనబడని టైటిల్స్ చాలా కనిపించాయి. అబ్బురంగా చూస్తూ, మురిసిపోయాము. పుస్తకాలు అద్దెకి తీసుకునే సౌకర్యాల గురించి వివరంగా కనుక్కోవాలి. ఇస్తారనుకుంటాను. స్టాఫ్ మాత్రం చాలా కొ-ఆపరేటివ్ గా ఉన్నారు, సంస్థ మెయింటెనెన్స్ గురించి నాకంత సదభిప్రాయం కలక్కపోయినా. ఆసక్తి కలిగించేంత అనాసక్తి కలిగించిన విషయం – వీళ్ళు ఆ సినిమా డిస్కులని గాలికొదిలేసిన తీరే!

ఇక, అసలు ఎంటర్ ది డ్రాగన్ : ఏపీ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ ఇన్స్టిట్యూట్ – ఉస్మానియా యూనివర్సిటీ – గవర్నమెంటాఫీసంటే ఎలా ఉంటుందో – అందరూ చెబితే వినడమే కానీ, ఇంత రేంజి గవర్నమెంటు ఆఫీసు గాలి పీల్చలేదెప్పుడూ. ఇది స్వచ్ఛమైన, పదారణాల ప్రభుత్వ కార్యాలయం! మూడుపుస్తకాలకి బిల్లేయడానికి, ముగ్గురు వ్యక్తులూ, ఒక కాలిక్యులేటరూ కావల్సి రావడం ఒక ఎత్తైతే, లైబ్రరీని ఒకసారి చూస్తాం అన్న పాపానికి, మేము దాదాపు ఐదుగురు వ్యక్తులతో మాట్లాడి – ఊరికే చూడ్డానికే వచ్చాం, మాకే దురుద్దేశాలూ, కనీసం సదుద్దేశాలు కూడా లేవు – అని వాళ్ళని నమ్మించి, లైబ్రరీలోకి అడుగుపెట్టడానికి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది (అక్కడివారి బద్ధకం దీనికి కారణమని నా అభిప్రాయం!). మంచి పుస్తకాలు వేస్తే వేశారు గాక, నాకు మాత్రం చిరాకు పుట్టించింది ఈ అనుభవం. ఇదే…. బూందీలడ్డూలో చిక్కిన చిన్న రాయిలా, ఇన్ని అనుభవాల్లోకీ, అవుట్లయర్!

చివరగా, మొన్న శుక్రవారం నాడు, సి.యస్.రావు గారి ’టాక్స్ అండ్ ఆర్టికల్స్’ పుస్తకావిష్కరణకు వెళ్ళాము. ఇక్కడ మరో మర్చిపోలేని అనుభవం – అనుకోకుండా – అప్పాజోస్యుల సత్యనారాయణ గారిని (AVKF founder) కలవడం. జనరేషన్ గ్యాప్ వల్ల అసలు అఫెక్ట్ కాని వ్యక్తిలా ఉన్నారు :). ఈయనతో జరిపిన సంభాషణ కూడా అంత తేలిగ్గా జ్ఞాపకాల్లోంచి పోయేది కాదు. చాలా స్పూర్తివంతమైన వ్యక్తిత్వం, అని మళ్ళీ ఈయన్ని చూసి కూడా అనుకున్నాను. అమేజింగ్ మ్యాన్! అంత స్థాయి వ్యక్తి అయి ఉండి అంత సింపుల్గా ఉండటం కాక, మాలాంటి అమాయకపు జీవుల్తో అంత స్నేహంగా, అభిమానంగా మాట్లాడ్డంతో ఆయనంటే మరింత గౌరవం కలిగింది…

అవండీ – ఇటీవలి కాలంలో నాకు ’పుస్తకం.నెట్’ పుణ్యాన ఎదురైన అనుభవాలు. వెబ్సైటుకు థాంక్స్ చెప్పడం ఎంత వరకూ కామనో కానీ, నేను మాత్రం పుస్తకం.నెట్ కి థాంక్స్ చెబుతున్నా! 🙂 😉

Advertisements
Published in: on April 5, 2010 at 8:00 am  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/04/05/pustakam-net-experiences/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. నేను సౌమ్య కు థాంక్స్ చబుతను
  చాల మంచి విషయాలు మాకు తెలియపరచి నందుకు

 2. వావ్ అద్భుతమైన అనుభవాలు సౌమ్య గారు. పుస్తకం.నెట్ మంచి అనుభూతులను మీ సొంతం చేస్తుందనమాట 🙂

 3. good show

 4. Enviable post 🙂

 5. re: A.P.A and APGOML, I thought that the credit goes to someone else :-).

  Just kidding!

  Regards,
  Sreenivas

 6. @Srinivas garu:
  సవరణ: పుస్తకం.నెట్ తో పాటు, ఈ పరిచయాలను చేసిన వారికి కూడా నా ధన్యవాదాలు. 🙂

 7. pustakam.net lo vunna novels and books ekaadanunchi download chsukogalam.
  Thanks,
  Durga

 8. please…… Any body suggest me to write Telugu script in this box. Inspite of selected Telugu as my language Telugu items are appeared. But when I want to comment in this comment box only English is seen. please help me to write telugu in this box.

 9. I want to tell some thing about ORIENTAL MANUSCRIPT LIBRRY located in Osmania University campus. I have visited that library one year back. There I have seen how they preserve olden books. (taaTaaku granDhaalu) and how they are scanning them into the computor, Taking photos of the pages and preserve them. The Director of the LIbrary Dr. Tirumala Rao helped in this matter. I want to tell the full story in telugu. But I could not write in Telugu here. ( I know Telugu Type writing very well., but my computor dont know Telugu. please any body help me in this regard.

  I also felt very sorry to read the experience of Sowmya with this library. like wise the Archieves office is also worth seen who are interested. There is a small musium with olden coins, and other valuables which is worth seen.

 10. Ellanki,

  Please use lekhini.org to type in telugu. Or please mail me: purnima.tammireddy@gmail.com for further help.

  Thanks,
  Purnima


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: