నిశ్యాలోచనాపథం-22

[ఇరవై ఒకటో భాగం తరువాత…]

మొదట అవాక్కైనా – కాపు నిశి అన్న మాటలకి అనుమానమొచ్చి, ఒకసారి ఆమెని పరికించి చూశాడు.
“అరే! మీరా…నువ్వా… తమరా… ” అని ఇంకా ఏదో అనబోతున్నంతలో
“నా పేరు నిశి. అంత అవస్థ పడనక్కర్లేదు. నువ్వు అనొచ్చు.”
“కానీ, నువ్విలా? ఎలా?”
“నేనూ మీలాంటి దాన్నే!” నిశి సమాధానం
అప్పటికే కాస్త అయోమయంగా ఉన్న నేను ఇక ఉండబట్టలేక –
“ఏం జరుగుతోందిక్కడ? మీరిద్దరూ మామూలు మనుషులు కారని తేలిపోయింది. నన్ను మీరు మీలో కలిపేసుకున్నా కూడా, నేను కలిసిపోడానికి నేను మీలోని పాయని కాని. నా ప్రవాహం సెపరేటు. విషయమేంటో చెప్పండి”

మనమంతా చీకట్లో ఆకటితో పోరాడే
అస్వతంత్ర సైనికులమని
పెనుతుఫాను చేతుల్లో చిక్కుకున్న
త్రోవలేని నావికులమనీ
…………..
నాకు తెలుసు! నాకు తెలుసు!”

– “కానీ, నేను నీకంటే స్వతంత్రురాలిని. అయితే, నీకంటే ఎక్కువ త్రోవలేని,త్రోవ తెలీని దాన్ని”. అని నిశి ఉన్నట్లుండి బైరాగిని తల్చుకుని..నాతో అన్నది. వెంటనే కా.పు. వైపుకి తిరిగి – “నేను మరీ మీ అంత స్వతంత్రురాలిని కాదు. మీలా దారీతెన్నూ తెలిసి ప్రయాణం చేసేదాన్నీ కాదు” అని ఆగింది.
“అదెలా సాధ్యం? ఈ మూడో జాతి వారు కూడా ఉన్నారా అయితే? ఇన్నేళ్ళ ప్రయాణాల్లో ఎక్కడా తారసపడలేదే?” ఆశ్చర్యం వెలిబుచ్చాడు కాపు.
“ఎరక్కపోయీ వచ్చానూ..ఇరుక్కుపోయానూ…” – నా మనసు గొణుక్కుంటోంది.
“ఉన్నారేమో…నాకు తెలీదు…” – ఇంతలో నిశి జవాబు.
“తెలీకుండా ఎలా ఉంటుంది? నీ స్నేహితులెవరూ లేరా?” – నేనడిగాను.
“ఇది ముందే ఎందుకు చెప్పావు కాదు…ఇది మొదటే ఎందుకు చెప్పావు కాదు..” కాపు కూడా బైరాగినే జపిస్తున్నాడు.
“నాదో ప్రపంచం…అది నా సంగీతం… బ్రతుకే అగమ్యం…మమతే అపూర్వం…మనసే వితండం…విధితో విరోధం..ఎవరిది గెలుపో చివరికి తెలియునులే…” – నిశి అలా అంటూ ఉంటే, నాకు ఎస్పీబీ గళంలో ఇళయరాజా ట్యూను వినిపించింది నేపథ్యంలో.
“ఏమిటో, సరిగా చెప్పొచ్చుగా…” అన్నాన్నేను వీళ్ళిద్దర్నీ విసుగ్గా చూస్తూ.
“మేన్ ఫ్రం ఎర్త్ సినిమా అంటే నీకిష్టమని చెప్పావ్ గా ఓసారి, గుర్తుందా?”
“గుర్తులేకేం. ఇప్పటికీ ఆ సినిమా అంటే నాకిష్టమే. ఇప్పుడదెందుకు?” – చిరాగ్గా అన్నాను, అసందర్భ ప్రేలాపనలొక్కటే తక్కువ మనకిప్పుడు, అనుకుని.
“అతను జాన్ అయితే, నేను జేన్…”
“వాట్???” నోరెళ్ళబెట్టాను నేను. ఇంకోళ్ళు చెప్పి ఉంటే, కట్టు కథ అని కొట్టిపడేసేదాన్ని కానీ, నిశి చెప్పింది కనుక, నమ్మక తప్పట్లేదు.
“మరిన్నాళ్ళూ చెప్పలేదేం?” అన్నాను నేనే మళ్ళీ, కోపంగా.
“ఏముందక్కడ చెప్పేందుకు? నేనొక ఇటెంని అని నేనే చెప్పుకోవాలా?” నిర్లిప్తంగా అన్నది నిశి.
“ఇదెలా నమ్మమంటారు? ఇన్ని వేల ఏళ్ళుగా తిరుగుతున్నవాడ్ని, నాకసలు ఇలాంటి వారెవరూ కనబడనే లేదు. ఎలా నమ్మేది నేను?
“నిజంగా కనబడలేదా?” – వ్యంగ్యంగా నవ్వుతూ అన్నది నిశి.
“కనబళ్ళేదనే కదా అంటున్నా… ” అని విసుక్కుంటూ, ఏదో తట్టినవాడల్లే టక్కున ఆగాడు. “నువ్వు తప్ప…” అన్నాడు.
“అప్పుడు ఎలా ఉన్నాన్నేను?” అంది నిశి
“ఇప్పట్లాగే….” నసిగాడు అతను.
“జేన్…జేన్…” గొణుక్కుంటున్నాను నాలో నేనే. అంతా కలలా ఉంది…
“ఏదేమైతేనేం…ఇన్నాళ్ళకి నువ్విలా మళ్ళీ కనిపిస్తావనుకోలేదు…” – కాపు చనువు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు నాకనిపించింది.
ఈ దెబ్బకి నాకు అతని దగ్గర్నుంచి ఆ బండి లాక్కోవడమో, అతని ఎనర్జీ క్యాప్సుల్  తీసుకోడమో – ఈ ప్లాన్లపై ఆసక్తి తగ్గింది.

ఏం సాధించాలనీ? పోనీ అవి లాక్కున్నా, అట్లాస్ హెర్కూల్స్ మీద భారమేసి వెళ్ళిపోవాలనుకున్నట్లు, కా.పు. రెడీగా కావాలని అవి నాకిచ్చి పోయాడే అనుకుందాం – ఇక నా బ్రతుకు కా.పు. బ్రతుకే కాదూ? ముందైతే – ’మేన్ ఫ్రం ఎర్త్’ తెగ నచ్చాడు కానీ, నిశి నాకు పరిచయమైన మొదటిరోజు నాకు బాగా గుర్తుంది. నన్ను నేను అంత వైరాగ్యంలో ఊహించుకోలేను. రేప్పొద్దున్న ఏళ్ళ తరబడి చావులేక బ్రతకాలంటే, అదెంత చావు? బ్రతుకే చావైన చచ్చు బ్రతుకు ఎందుకు? ఇన్నాళ్ళకి నిశి బాధ అర్థమవడం మొదలైంది నాకు.  తనకెందుకు ఆత్మహత్యా వ్యామోహం ఎక్కువైందో తెలిసింది.

“ఏంటి ఆలోచిస్తున్నావు?” – నిశి, కాపు ఇద్దరూ ఒకేసారి అన్నారు.
“ఏమీ లేదు. మీమీ జీవితాలు ఎంత కష్టంతో కూడుకున్నవా…అని.” అన్నాను.
“అవునమ్మా…ఇన్నాళ్ళకి ఒకరన్నా గ్రహించారు…” అని కాపు గుమ్మడిలా మాట్లాడుతుంటే
“హహహహ” – అని నిశి పెద్దగా నవ్వింది.
“అదేం, అలా నవ్వావు? నీకింత వైరాగ్యం కలిగిందంటే, అందుకు కారణం – మరణం రాని ఈ జీవితం కాదా?” – అన్నాన్నేను.
“మరణం రాని జీవితం కాదు… జీవం లేని జీవితమే నా సమస్య.”
“తిక్కతిక్కగా మాట్లాడి మాట మార్చక” అన్నాన్నేను మళ్ళీ.
“నేనెక్కడ మార్చాను…అదే టాపిక్కులో ఉన్నాను. నాది వైరాగ్యం కాదు, కసి.”
“కసా?” అని పైకి అని.. మసేం కాదు, అని కసిగా మనసులో అనుకున్నాను.

“ష్…ఎవరో వస్తున్నట్లున్నారు…” – అన్నాడు కాపు ఇంతలో.
దానితో మేమిద్దరం వాదన ఆపి అతనివైపు కి చూసి, అతను చూపుతున్న వైపుకి చూశాము.

[తరువాయి భాగం – త్వరలో]

Advertisements
Published in: on March 26, 2010 at 8:25 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/03/26/nisyalochanapatham-22/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. Nenu chooshaanaa? choosinaa comment petta leda?
    ledaa choodaledaa?

    Emaindo mari. Really interesting turnings it is taking. Waiting for more. alaa ani hadaavidigaa emaa akkarledu lendi. Time pattinaa meeku veelainappude vraayandi.

  2. […] ఉంటారని నమ్ముతున్నా! ఇరవై రెండో భాగం ఇక్కడ చదవొచ్చు. నేనూ, నిశి, కా.పు. నిలబడి […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: