ఆముక్తమాల్యద నుండి ఓ పద్యం

నీకొచ్చిన తెలుక్కి ఆముక్తమాల్యదా? అని నోరెళ్ళబెట్టకండి – నేనుగా, టీకా తాత్పరాలిచ్చి -అది కూడా వేదం వెంకట్రాయశాస్త్రుల భాషలో కాక, మానవ భాషలో ఇస్తే కానీ – ఆముక్తమాల్యద గురించి ఆలోచించే సాహసమైనా చేయలేను. నాకెటూ అర్థం కాదు కనుక.

సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పుణ్యమా అని ’ఆముక్తమాల్యద-పరిచయం’ అన్న పుస్తకం నా చేతికందింది.

దాదాపు సగం పుస్తకం గడిచాక – కథనూ, అక్కడక్కడా చిన్ని చిన్ని పద్యాలనూ మనపై రువ్వాక, ఆముక్తమాల్యదలోని అందాలూ-అలంకారాలూ వివరిస్తూ, ఉత్ప్రేక్షాలంకార చర్చ మొదలుపెట్టారు మల్లాది హనుమంతరావు గారు (ఈ పరిచయ పుస్తకరచయిత). మొదటి పద్యం నుండే నాకు అద్భుతమైన ఊహలు – అనిపించడం మొదలైంది కానీ, ఇక్కడ ఉదహరించిన మూడో పద్యం చదవగానే – రాత్రి పదిన్నర దాటాక, పడుకుని పుస్తకం చదువుతున్న నేను – ఇలా లేచి, కంప్యూటర్ ఆన్ చేసి, బ్లాగుతున్నా అంటే అర్థం చేస్కోండి ఎంత ఉలిక్కిపడ్డానో!

పిడికెడు కౌను కొప్పు కని ప్రేమ త్రివక్ర సమాంగి చేసితే?
పిడికెడు కౌను కొప్పు పయిపెచ్చు గుణంబును కంటి అంచు ఏ
ర్పడగ నిజ త్రివక్రతయు పాపగ మ్రొక్కెడు నాన్ సుమాలిపై
జడిగొన అమ్ములీను హరి శార్‍ఙ్గ ధనుర్లత కాచు కావుతన్

(టైపోలను మన్నించండి)

దీని భావం: భాగవత కథలో: పిడికెడు నడుమూ, పిడికెడు కొప్పూ కలిగి, మూడు వంకరలున్న కుబ్జను సుందరాంగిగా చేశావు. నేను ధనుస్సును. నాకూ పిడికెడు నడుము ఉంది. నాకూ పైభాగం కొప్పులాగే ఉంది. నేనూ మూడు వంకర్లు తిరిగి ఉంటాను. ఇవే కాక నాకు గుణం ఉంది (అల్లెతాడును గుణం అని కూడా అంటారట) – మరి నా వంకర ఎందుకు తొలగించవూ? –  సుమాలి అన్న రాక్షసుడిపై విష్ణుమూర్తి బాణాల వర్షం కురిపిస్తుంటే ధనుస్సు వినమ్రంగా ఆయన్ని ప్రార్థిస్తున్నట్లు ఉందట!!

– రాయల వారికి శతకోటి సలాములు. ఉపమకి కాళిదాసు అని చదువుకున్నాను. ఉత్ప్రేక్షకు రాయలవారని అంటారట. అలంకారాలంటే ఏమిటో తెలుసు కానీ, అలంకారాలు వాడి మాయ చేయొచ్చని ఇవాళే తెలిసింది….

నా భాష బాగుపడే శుభదినాలకోసం ఎదురుచూస్తూ, ఈ టపా ముగిస్తున్నాను..

Published in: on March 19, 2010 at 11:05 pm  Comments (12)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/03/19/amuktamalyada-padyam/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

 1. good show – glad you discovered Amuktamalyada 🙂

 2. atlast …
  parledu mana telugu pillalu develop avtunnam
  there wont be one week in a month where my dad nags for not able to understand chandassu , padyams etc etc
  if only u were in hyd, u cud happily listen all those tatparyams from him. he will be glad to tell anyone but not to me :)(his complaint is i dont keep my mouth from asking doubts while he keeps telling eloquently )
  anyway…all the best for the beginning and hope u hang on till end

 3. @Kottapali: మీరు ఇదివరలో ఆముక్తమాల్యద గురించి మీబ్లాగులో తరుచుగా -అనువాదం/సమ్మరైజేషన్ ఏదో చేస్తా అని రాసినట్లు గుర్తు? అన్నట్లు, నాకో సందేహం – ఛందోబద్ధ పద్యాలను అనువాదం ఎలా చేస్తారు? దానిలోని సాధకబాధకాలేమిటి?
  ఎవరన్నా వివరించగలరా?

 4. సౌమ్య గారు, వేదం వారి పుస్తకం కానీ, మీరు చదివే పుస్తకం కానీ ఎక్కడ దొరుకుతుందో చెప్పలరు. నేనూ రాయల వారి అభిమానినే. (కొత్తపాళీ గారి అనువాదం కూడా ఇతోధికంగా సహాయ్ం చేసింది లెండి). వీలు కుదిరితే, ఆముక్త మాల్యదలో మాలదాసరి కథ (కొత్తపాళీ గారు అనువదించారు) చదవండి.

  మీకు ఇంకో సూచన. పద్యకవితను చూసి భయంతో వణికే మనలాంటి వాళ్ళకోసం ఈ మధ్య బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో, అజోవిభో వారు ఓ పుస్తకం విడుదల చేశారు. అందులోనూ రాయల వారి పద్యాలకు అందమైన వ్యాఖ్యానం ఉంది. దొరికితే చదవండి.

 5. Ravi gariki:
  వేదం వారి పుస్తకం DLI లో లభ్యం. అలాగే, ఈ పుస్తకం వావిళ్ళ ప్రెస్ వరనుకుంట…గత ఐదేళ్ళలో ఎప్పుడో పునర్ముద్రించారు అని ఈ పరిచయ పుస్తకం చివర్లో రాసారు.
  ఇక నేను చదువుతున్న పుస్తకం – cpbrownacademy.org సైటు లో ఆన్లైన్ కొనుగోలుకు లభ్యం.

  • i want to have vedam vari amuktha malyada with explanation and complete commentary May I know DLI where it is available.My e-mail id doctorvnsastry@hotmail.com Please come back with response

 6. చక్కటి పద్యం సౌమ్య గారు .ఈ పుస్తకం తప్పకుండ కొని ,చదివి తరించాలి. థాంక్స్ .

 7. ఇప్పుడు మీ భాషకి వచ్చిన ఢోకా ఏం లేదు 🙂

  మంచి పద్యాన్ని గుర్తు చేసారు! అవును ఇలాంటి ఊహలకి కల్పనలకీ రాయలు పెట్టింది పేరు. ఇంతకీ ఆ ధనుస్సు వక్రతను విష్ణుమూర్తి ఎలా తొలగిస్తాడు? ఎడతెగకుండా యుద్ధం చేసేటప్పుడు విల్లు అర్థ చక్రాకారంలోకి మారుతుందని వర్ణిస్తూ ఉంటారు. అంటే అంతగా వంచబడుతుందన్న మాట. అప్పుడా త్రివక్రత పోయినట్టే కదా! అంచేత ఎప్పుడూ అలా యుద్ధం చేస్తూ శత్రు సంహారం చెయ్యమని ఆ ధనుస్సు ఆకాంక్ష అని నాకు స్ఫురించిన భావం.

  “రణగొణ ధ్వని” అంటూ ఉంటాం కదా. అది నిజానికి “రణగుణ” ధ్వని. అంటే యుద్ధంలో వీరులు నిరంతరంగా బాణాలు వదులుతూ చేసే వింటినారి చప్పుడు.

 8. సౌమ్యా, నీటపా, దానిమీద వచ్చిన వ్యాఖ్యలూ, ముఖ్యంగా కామేశ్వరరావుగారూ, కొత్తపాళీవి మంచి పాఠాలు నామటుకు నాకు. ధన్యవాదాలు. – మాలతి

 9. తెలుగు బాష మీకున్న ఆసక్తికి మీరు పడుతున్న తపనకు ప్రత్యేక అబినందనలు. కస్తాపదేవరికే కదా ఎదుటివారి కష్టం తెలేసేది. అలాగే మీరు తెలియజేసిన స్పందనకి ధన్యవాదాలు.

  “భలే రాసారండీ….మీ ఆలోచనకి జోహార్లు…మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
  మీరడిగిన సందేహానికి జవాబు దొరికితే నాక్కూడా చెప్పండేం?”

  తెలిస్తే తప్పక తెలుపుతాను.

 10. > అన్నట్లు, నాకో సందేహం – ఛందోబద్ధ పద్యాలను అనువాదం ఎలా చేస్తారు?
  > దానిలోని సాధకబాధకాలేమిటి? ఎవరన్నా వివరించగలరా?

  see Velcheru Narayanarao and David Shulman’s books and articles.

  Regards,
  Sreenivas

 11. thanks for the suggestion. recently i purchased the book aamuktamalyada – parichayam. It helped a lot in understanding the original. when i read the original i could make out only 10 % of what is given in the parichayam book.
  Any more such books? (except vijaya vilaasam-hrudayollasana by tapi dharma rao garu.) Pl suggest


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: