హేతుబద్ధత – సాహిత్యం -సందేహం

నేను పుస్తకం.నెట్ లో తమ్మినేని యదుకులభూషణ్ గారు రాచమల్లు రామచంద్రారెడ్డి గారిపై రాసిన వ్యాసాన్ని చదివాకా, అప్పటికి చాలారోజుల ముందు నుంచి – ‘ఈ రారా అన్న అయన ఎం రాసాడు? ఎందుకు జనం అతన్ని కతినమైన విమర్శకుడు అంటారు?’ అన్న కుతుహలం ఉండేది, అది మరింత పెంచుకున్నాను. ఆతరువాత అక్కడే ఈ పుస్తకం ఈ-లంకె దొరికి, దాన్ని పీడీఎఫ్ లోకి మార్చుకుని, చదవడం మొదలుపెట్టాను.

‘కొల్లాయి గట్టితే నేమి’ గురించిన వ్యాసం తో మొదలుపెట్టాను – ఏమాటకామాటే చెప్పాలి – నాకు వ్యాసం తెగ నచ్చి, ఎలాగో ఒకలా ఆ పుస్తకం చదవాలి అని నిర్ణయించుకున్నా. పుస్తకం చాల బాగుంది, నేను చదివినంత వరకు – పుస్తకం లో విమర్శించిన రచయితలని నేను చదవలేదనుకోండి పెద్దగ, అది వేరే సంగతి – నాకు రారా గారి శైలి నచ్చింది అనాలేమో మరి -వ్యాసాలు బాగా ఆసక్తికరంగా ఉన్నాయి.

విషయానికొస్తే – ఒక స్టేట్మెంట్ దగ్గర కొంచెం సేపు ఆగాను – ఇలాంటివి ఇంకా ఉన్నాయి కానీ, ప్రస్తుతం ఇది నా టాపిక్:

“’జీవితాన్ని అర్థం చేసుకోడానికి మానవుడు చేసే ప్రయత్నంలో ఒక భాగమే సాహిత్యం (మరొక భాగం సైన్సు). ఒక దాన్ని అర్థం చేసుకోవడం అంటేనే దాని లోని కార్యకరణ సంబంధాన్ని తెలుసుకోవడం, దానిలోని హేతుబద్దతను గ్రహించడం. కనుక, జీవితం మానవునికి ఏమేరకు అర్థమౌతుందో, ఏమేరకు అర్థమైనట్లు భాసిస్తుందో, ఆ మేరకే జీవితం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. అనగా, హేతుబద్ధమైన జీవితమే సాహిత్యంలోకి ఎక్కుతుంది. అనగా, సాహిత్యం హేతుబద్దంగా తప్ప మరొక విధంగా ఉండజాలదు. సాహిత్యం మరీ హేతుబద్దంగా ఉంటున్నదని నిందించడం ఈ యుగపు మేధావుల అతితెలివికి మాత్రమే నిదర్శనం’”

– మరి, ఫాంటసీ సాహిత్యం -హేతుబద్ధంగా ఉండదుగా? (పోనీ, నాకు ఉన్నట్లు అనిపించదు) నాన్సెన్స్ ఫిక్షన్? (నాన్సెన్స్ ఫిక్షన్ కి తెలుగు పేరేమిటో!!)? అలాగే, మరి, అధివాస్తవికత -అది రేషనల్ గా అనిపిస్తుందా?

జీవితం మానవునికి ఏ మేరకి అర్థమైతే ఆ మేరకే సాహిత్యం లో కనిపిస్తుంది అంటున్నారు – కన్ఫ్యూజన్ ని సాహిత్యం లో వ్యక్తీకరిస్తారు కదా మరి – (అంటే, కన్ఫ్యూజన్ అన్న విషయం అర్థమైంది కదా… అనుకోవాలా??)

or..may be iam taking it out of the context!!

Advertisements
Published in: on March 4, 2010 at 4:19 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/03/04/hetubaddata-sahityam-sandeham/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. సాహిత్యంలోని హేతుబద్ధతకూ conventional rationality కి కొంత బేధం ఉంది.సాహిత్యమంటేనే అనుభూతిని కేవలం అనుభూతి మిగల్చకుండా కళగా మార్చడం.అలాంటి కళాసృష్టి చేస్తూనే ఒకవైపు భౌతిక లోకానికీ మరోవైపు కళాజగత్తుకూ విరుద్ధం కాని రీతిలో ఔచిత్యపోషణ చెయ్యడం.

    మీ టపాలోని “హేతుబద్ధత” definition కేవలం భౌతిక లోకానికి సంబంధించినదిగా అనిపిస్తోంది. మరి కళాజగత్తు హేతుబద్ధతని పరిగణలోకి తీసుకోకుంటే ఎట్లా? cause and effect (కార్యకరణ సంబంధం) యొక్క direct impact కేవలం సైన్సులో demonstrate చెయ్యగలం. కానీ జీవితంలో సాహిత్యంలో అంత సులువుగా ఇది జరుగుతుందా? కాబట్టి, సాహిత్యంలోని హేతుబద్ధత రచయిత భావభూమికకు సంబంధించినది మాత్రమే అనుకుంటాను.

  2. can u tell me how u downloaded that book. link in that article does nt seem to work for me..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: