పద్మ అవార్డులు… నా ముగ్గురు…

పద్మ అవార్డుల సంబరంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన అవార్డులు కొన్ని ఉన్నాయి – వాళ్ళకు అభినందనలు చెబుతూ ఈ టపా…

మొదట – లయ రాజు : హుమ్…. ఇన్నాళ్ళలో – అప్పుడప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని, ఈయనకిలాంటివి ఇవ్వరా? అని. నిన్న రాత్రి బీజింగ్ బైట్స్ రెస్టారెంట్లో కూర్చుని ఉంటే – “ఫైనల్లీ, పద్మ భూషణ్ ఫర్ ఇళయరాజా” అని ఎస్సెమ్మెస్. చూడగానే – వావ్! అనుకున్నా. వావ్! అని అరవాలనుకున్నా – కానీ, బాగోదని ఆగాను. ఆఖరులో వావ్ అని రెప్లై ఎస్సెమ్మెస్ పంపి శాంతించాను. అప్పుడప్పుడూ ఒకటనిపించేది నాకు – ఈయన వందలకొద్దీ సినిమాలకి సంగీతం ఇచ్చాడు కనుక, వాటిల్లో ఇన్ని మంచిపాటలుంటే – పర్సెంటేజీ పరంగా మామూలేనేమో – మిగితావారు ఇన్ని చేసుండరు, అందుకని వాళ్ళ దగ్గర్నుంచి ఇన్ని అద్భుతాలు వచ్చి ఉండవు అని. (ఇదెప్పుడో చాన్నాళ్ళ క్రితం లెండి – ఇళయరాజా తమిళ, కన్నడ, మలయాళ పాటల ఎక్స్‍ప్లోరేషన్ మొదలుకాకముందు. తరువాత్తరువాత అర్థమైంది – ఇళయరాజా..ఇసైరాజా… అని 🙂 నాకెంత ఆనందంగా ఉందో ఈ వార్త విన్నాక… అసలుకైతే, వాళ్ళింటి ముందు నిలబడి బొకేల డిస్ప్లే పెట్టాలని ఉంది. ఇలాగే ఇలాగే అవార్డులతో పాటు – మరిన్ని గొప్ప పాటలెన్నింటికో ఆయన ప్రాణమివ్వాలని….కోరుకుంటూ…
(అంటే, ఇటీవలి ఇళయరాజా పాటలు మునుపులా ఉండట్లేదని నా అభిప్రాయం. పాపం వాళ్ళ పరిమితులు వాళ్ళవనుకోండి, కానీ, నావి ’గ్రేట్ ఎక్స్‍పెక్టేషన్స్’. ఏం చేస్తాం!)

రెండు: అరుంధతీనాగ్: నాకీవిడ తో తొలి పరిచయం ’బిఖరే బింబ్’ ప్లే ప్రదర్శనలో. ఒక విధంగా అది ఏకపాత్రభినయం అనే చెప్పాలి – నాకు మొదటిసారి ఒక నాటకం చూసినందుకో ఏమో గానీ – అద్భుతం అనిపించింది. ప్రదర్శన ముగిసాక ఆవిడకి అందరూ పైకి లేచి నిలబడి మరీ కొన్ని నిముషాలు చప్పట్లు కొట్టారు. అలా, నా మనసులో అరుంధతీనాగ్ గురించి ఒక పాజిటివ్ ఫీలింగ్ మనసులో నిలిచిపోయింది. తరువాత ఒకట్రెండుసార్లు టీవీలో ఆమెని చూశా… బెంగలూరొచ్చాక అటుగా వెళ్ళిన ప్రతిసారీ – “రంగశంకర” కనిపిస్తే, ఆమెని తల్చుకున్నాను. మొన్నామధ్య ’పా’ సినిమాలో బమ్ గా చాన్నాళ్ళకి మళ్ళీ చూశాను. ఏమిటో, ఈవిడ గురించి తల్చుకున్న ప్రతిసారీ ఎవరో నా కుటుంబసభ్యులని తల్చుకున్నట్లు అనిపిస్తుంది. బహుశా, ఆమె సహజ నటి కనుక ఏమో. Actress-next-door looks అంటే ఈమెవే 😉 సో, సహజంగానే ఆవిడకి అవార్డ్ అనగానే ఇక్కడ నాకు సంతోషం..

మూడు: జోరా సెహగల్: తొంభై ఐదేళ్ళ పైచిలుకు వయసులోకూడా – ఆమె ఉత్సాహం చూస్తే, ఆ ఉత్సాహానికే అసలు అవార్డివ్వొచ్చు – దేశానికి స్పూర్తి కలిగించే ఉత్సాహం అని. రెండేళ్ళనాడొచ్చిన ’చీనీకం’ సినిమా నాటికి ఆమెకి తొంభై ఐదేళ్ళనుకుంటా – కాసేపు డాన్సు కూడా వేసింది అందులో అంటే – మనం తొంభై ఏళ్ళొచ్చేసరికి ఉంటామో లేదో – ఉన్న అలా ఐతే ఉండము ఖచ్చితంగా – అని మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు – ఆమె అంటే ఎంత గౌరవం కలగాలి? నాకు అందుకే ఆమె అంటే విపరీతమైన అభిమానం – సినిమాల పరంగా ఆమెని ఎక్కువ గమనించనప్పటికీనూ!

-అప్పుడప్పుడూ ఇలా అవార్డులూ గట్రా కూడా – సామాన్య జనుల్లో ఇలాంటి స్పందన కలిగించడం అవసరం అని నా అభిప్రాయం. ఎప్పుడూ అవార్డీలకీ, ప్రభుత్వానికీ ఆనందం కలిగిస్తూ ఉంటే రొటీన్ 😉

Advertisements
Published in: on January 26, 2010 at 8:07 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/01/26/padma-awards-2010/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. Nice post madam.

  2. మీ ముగ్గురు తో నేనూ ఏకీభవిస్తాను.

  3. Yes Ilaiya Raja is great.
    Today everybody is copying his tunes.

  4. చాలా బాగా చెప్పారు. మీరన్నవన్నీ నిజం.. ముగ్గురూ ముగ్గురే.. ఇళయరాజాగారి పాటలు ఈ మధ్యన పేరు చెప్పినా సరే ఆయన పాటలే అని నమ్మతగ్గవిగా ఉండటంలేదు.. ఎందుకో మరి???


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: