ఇదో పాట..ఇదో బాధ…ఇదో సౌఖ్యం… వెరసి అవ్యక్తానుభూతి…

ఎప్పుడు తల్చుకున్నా, అలా తల్చుకుంటూ కాసేపు ఆ ఆలోచనల్లో ఉండిపోయేలా చేస్తాయి కొన్ని. అది – పుస్తకమైనా, పుస్తకంలోని పాత్రైనా, వాక్యమైనా, ఒక పదునైన మాటైనా, ఒక ఘాటైన చూపైనా, ఒక మంచి పాటైనా, ఒక వ్యక్తైనా, ఒక బంధమైనా, ఏమైనా. తక్కిన విషయాలను అటు పెడితే, సంగీతానికి-పాటలకి ఉన్నంత వెంటాడి వెంటాడి వేధించే తత్వం మిగితావాటిలో ఉండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. రోజంతా ఒకే పాటను గుర్తు తల్చుకుంటూ, ఒక్కోసారి రోజుల తరబడి గడుపుతూ – ఉక్కిరిబిక్కిరౌతూ – ఇదంతా అందరికీ అనుభవమేగా! అలా నన్ను ఎప్పటికప్పుడు వెంటాడుతూ, ఆశ్చర్యపరుస్తూ, ఉద్వేగానికి గురిచేస్తూ, అనుభవిస్తున్న ఒత్తిడిని గట్టిగా అరిచి బయటకు తరమాలి అనిపించేంత భావన కలిగించి – అదే, అక్కడ నన్ను నిస్సహాయంగా వదిలేసి (ఎంతైనా అరవలేను కదండీ పబ్లిక్ లో)- ఆగిపోయే పాటొకటుంది.

’రుద్రవీణ’ సినిమాలో – ’ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం’ అన్న పాట. నాకెందుకు ఇష్టం అంటే చాలా కారణాలున్నాయి:
– ప్రధానంగా ఆ పాట లిరిక్స్.
-ఈ పాటలో సంగీతం మూడు మూడ్స్ లో ఉంటుంది కదా… (ఒంటరిగా… పార్ట్ ఒకటి. చెప్పాలని ఉంది… పార్ట్ ఒకటి. నేను సైతం …పార్ట్ ఒకటి.) ఒక్కోటీ వచ్చే కొద్దీ పదాల, భావోద్వేగాల తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది… నాకు ఆ మారే పద్ధతి ఇష్టం.
-సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం. ఈ సినిమాలో రెండు మూడు పాటలు నాకు ఆ సందర్భంలో వచ్చినందుకే నచ్చాయి…
-ఇక – పాట ఈ మూడు మూడ్లలో పాడిన విధానం.

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందాఁ.. సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కదాఁ. గుండెబలం తెలిసేది
దుఃఖానికి తలవంచిటే తెలివికింక విలువేది

– ఇలా చెప్పడం వల్ల దిగులు తగ్గదు, మనకీ తెలుసు. అయినా చెబుతాం…. మనకెవరన్నా చెబితే, అబ్బ చా! అనుకుంటాం. అబ్బబ్బ చా! అనుకుని ఇంకోళ్ళకి ఇదే చెబుతాం…

మంచైనా..చెఢ్ఢైనా పంచుకోను నేలేనాఁ.
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానాఁ..
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి..

– ఇది కూడా ఇందాకటిలాగే. ఎవరన్నా మన దగ్గరివారు ఇలా బాధపడుతూ మాట్లాడక మౌనంగా ఉంటే కోపం వస్తుంది. అదే ఇలా నిష్టూరంగా అంటాం ఏమో… నేను ఎవరితో అన్నా అన్నప్పుడు నాకేం అనిపించదు కానీ, ఎవరన్నా నాతో అంటే అనిపిస్తుంది – “చెప్పుకోలేక… చెప్పుకోలేఖ…. చదువుకో…” అని. “కావాలంటే రాసిస్తా” అని అదైనా చేయగలనేమో కానీ, నోరువిప్పి చెప్పుకోలేకపోవచ్చు. సో, అది ఏకాంతమైన చింత కాదేమో అప్పుడు. అప్పుడు పంచుకోను వీలు లేని చింతే ఏమో. అయినా, అసలు ఏకాంత చింతలంటూ ఉంటాయంటారా? సకలకాంతల గొడవల్లో దూరితే, ఏ-కాంత చింత? అని ప్రశ్నించుకోవాల్సినంత కన్ఫ్యూజన్ వస్తుందనుకోండి, అది వేరే విషయం.

గుండెల్లో సుడులు తిరిగే కలత కధలూఁ.
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !

-చెప్పాలని ఉంది! చెప్పాలని ఉంది! 🙂 కొంచెం పేస్ పెరిగింది కదూ పాటలో…. అలాగే, కొంచెం బైటపడ్డం మొదలెట్టాడు మన చిరంజీవి…

కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అనిఁ
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకినీఁ..

– హుమ్…. ఎందుకోగానీ, ఈ మాటలు విన్న ప్రతిసారీ, మనసేదోలా ఐపోతుంది నాకు. పదే పదే అవే వాక్యాలు వినబడుతూ ఉంటాయి. చిరంజీవి నాతో ఏం మొరపెట్టుకోలేదనుకోండి… కానీ, ఆ ఫీలింగ్ కలుగుతుంది…

పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం

– బహుశా ఇప్పటి తరంలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ బానే ఉంటాయి అనుకుంటా… జనరేషన్ గ్యాప్ – పెద్దలు పిల్లల ఆశయాలపై రేషన్ విధిస్తే…వాళ్ళు ఇలాగే వాపోతారేమో. వాపోయి –

బ్రతుకు పుస్తకం లో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటాఁ…

– అని అనుకుంటారేమో. “ఇంజినీరింగ్ చదివి ఎంబీయే చేసి బ్యాంక్ లో చేరడానికి ఇంజినీరింగ్ చదవడం దేనికీ?” – త్రీ ఇడియట్స్ లో అమీర్ ఖాన్ ఇలాంటిదే ఏదో అంటాడు. బ్యాంక్ ఉద్యోగంలో చేరిపోయాక అది మానేసి రైటర్ గా సెటిల్ అయ్యాడంటే ఏమంటారో. ’జర హట్కే, జర బచ్కే… యె హై లైఫ్ మేరి జాన్..’

సరే, బ్యాక్ టు పాయింట్:

ఈ పాటలో ఈ వాక్యం దాటాక ప్రధాన పాత్ర ఫ్రస్ట్రేషన్ ను చాలా బాగా ఆవిష్కరించారనిపిస్తుంది.
కళ్ళు ఉన్న కబోదిలా..చెవులు ఉన్న బదిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడా..కరువాయెను నా స్థానం

……
నిలువునా నన్ను కమ్ముతున్నాయి..
శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి..ఈ అపశృతి సరిచెయ్యాలి

…….
జనగీతిని వద్దనుకుంటూ..నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను..కలవరింత కోరను నేనూ

– ఈ ఆలోచనా పద్ధతి నాకు నచ్చింది.

ఇక్కడ “నేను సైతం…” అంటూ మొదలయ్యాక, వెనుక అంత ఉధృతితో శివుడి జటాజూటం నుండి గంగని వదిలేస్తే మన గతేమౌతుందో శివుడు డమరుకం మ్రోగిస్తూ చూస్తున్నట్టు – ఆ జోరేమిటో… అందులో చిక్కుకుని ప్రతిసారీ నేను విలవిలలాడ్డం ఏమిటో!!

అదొక బాధ….అదో సౌఖ్యం. బాధే సౌఖ్యం అనే భావన నేను రానివ్వనక్కర్లేదు. అది నిజంగా సౌఖ్యమే. నిస్సహాయతనూ, నిస్పృహనూ – ఈ బాధ మంటల్లో కాల్చేయొచ్చు, రేపొచ్చి మళ్ళీ తగలేయొచ్చు. ఎంచక్కా రోజూ మన విసుగునీ, అసహనాన్నీ ఈ పాట వింటూ, దానితో పాటు మన మనసుని కదం తొక్కిస్తూ ఏరోజుకారోజు నాశనం చేస్కుని, ప్రశాంతంగా జీవించొచ్చు… నిజం! అసలైతే ప్రత్యేకం వినను కూడా విననక్కర్లేదు. తల్చుకోగానే, అలా నా శరీరం ఆపాదమస్తకమూ ఈ పాట ప్లే అయిపోయి వింటున్నంత ఆవేశం కలుగుతుంది మరి! 😉

పాట యూట్యూబ్ లంకె ఇక్కడ.

Advertisements
Published in: on January 16, 2010 at 7:32 pm  Comments (8)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/01/16/nenu-saitam/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. పాట పరిచయం బాగుంది .

 2. చాలా బాగారాశారు. నిజమే లిరిక్ ను అనుసరించి పాట మూడ్ మరియూ పేస్ మారడం ఈ పాటను మరింతగా మనసుకు హత్తుకునేలా చేస్తుంది.

 3. చక్కటి పాటకు బహుచక్కటి పరిచయం. ఇళయరాజా/సిరివెన్నెల/బాలు త్రయం వీరికి తోడు శ్రీశ్రీ నిప్పులు చిమ్మే అక్షరాలు- ఇక చెప్పేదేముంది. అందుకే మన తెలుగు చిత్రానికి, పాటకు, సంగీతానికి జాతీయ గుర్తింపు లభించింది. ఇక అన్నిటి కన్నా మా మెగాస్టార్ చిత్రమాయె! చాలా రోజులకు పి.ఎల్. నారాయణ ‘గాత్రం’ కని/వినిపించారు. ఆయనన్నా, ఆయన వాచకం అన్నా నాకెందుకో చాలా ఇష్టం, అభిమానం.ఇన్ని అనుభవింపజేసిన మీకు నా వెయ్యిన్నొక్క నెనర్లు.

 4. అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

  http://telugusimha.blogspot.com/

 5. చాలా చక్కటి పాటకి బహు చక్కటైన వ్యాఖ్యానం రాసారు మీరు. ఈ పాట నాక్కూడా చాలా చాలా ఇష్టం 🙂

 6. “చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !” is one of my favorite songs.
  And what can I say about SriSri’s “నేను సైతం…”, these lyrics haunt me for days at a time.

  Thanks for such a nice post.

 7. అబ్బ, పాటల్ని గురించిన టపాలన్నీ ఇంత చక్కగా ఉంటే ఎంత బాగుణ్ణు?

 8. మొదటి పేరాగ్రాఫ్ మాత్రం చాలా చాలా………. చాలా బావుంది సౌమ్యా!! Great job!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: