నిశ్యాలోచనాపథం-20

ఇద్దరు ఫ్రస్ట్రూలు రాస్కుంటే మాటలు రాలతాయి అని ఇదివరలో చెప్పాకదా… రాస్కుంటే రాలిన మాటలు వీళ్ళలో ఒకరు ఇక్కడ రాస్తారని కూడా ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. ముగ్గురు ఫ్రస్టూలు కలిస్తే? అసలు నాకు నిశీ తగిలాక ఇక ఎవర్నన్నా భరించగలను అని నేను ఫిక్సైపోయా. ఎలా? అంటే, నిశీ నన్ను భరించగలగడం చూసి. నన్నే భరించగలిగిందంటే, ఆమెని భరించడం ఇంకెంత కష్టం అనుకున్నారు… ఆమెని భరిస్తున్నానంటే…- నిజం! సర్లెండీ, విషయానికొస్తే, మన కా.పు. తో నడక మొదలెట్టాం కదా – ఐదు నిముషాలన్నా కాకుండానే అర్థమైంది – ఇతగాడు పరమ వీర జిడ్డని. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఇంత తీరిక దొరికిందట. ఖర్మకాలి, మేముండగా దొరికింది – ఇక చూస్కోండి, అసలు వదిల్తేనా? ఆగితేనా? అదో ప్రవాహం! ఇదనీ అదనీ లేదు. నాకంటే నాన్సెన్స్ మాట్లాడుతూంటే అవాక్కై చూస్తూ ఉన్నా. నిజం చెప్పొద్దూ, నాకు సెన్స్ కంటే నాన్సెన్సే బాగుంటుంది అనుకోండి – కానీ, మరీ ఇంత స్పీడా?

అదే అన్నాను – “అయ్యా! కాస్త జోరు తగ్గిస్తే, మేమూ అందుకుని…అందిస్తాము…” అన్నాను.
“వేగం మా వేదం” అన్నాడు దర్పంగా
“అది డ్యూటీలో ఉన్నప్పుడు.” చురకంటించింది నిశీ.
“వర్క్ ఈజ్ వర్షిప్” అన్నాడు అతను మళ్ళీ.
“వెన్ యు హావ్ వర్క్..అండ్ వెన్ యు ఆర్ వర్కింగ్” – నిశీ వదిలేలాలేదు.
“బాబూ, నేను నిన్ను మొదట మరియాదగా అడిగి, తర్వాత వయులెంట్ ఔతా, సైలెన్స్ వర్కవుట్ అవనప్పుడు. ఆవిడసలే తిక్క మనిషి. ఆడేస్కుంటుంది, తర్వాత నీ ఇష్టం” అని గొణిగా అతనితో.
ఏమనుకున్నాడో మరి – “సరే, నెమ్మదిగా వెళతాను.” అని తగ్గాడు. ఆ మనం చెప్పాలా ఏమిటి – తన వేగానికే కామా పెట్టించి లిఫ్ట్ ఇప్పించుకుని, కథ కూడా చెప్పించుకున్న నిశీ సామర్థ్యం గురించి అతనికి తెలీకనా!
“జోరు తగ్గివ్వమన్నది నడకలో మాత్రమే కాదు” – నిశి వ్యంగ్యంగా నవ్వుతూ అన్నది మళ్ళీ.
ఈవిడుంది చూశారూ – మూడొచ్చి, అవతలి మనిషిని ఆడుకోవాలనుకుంటే – అబ్బబ్బా! తల ఎక్కడ కొట్టుకోవాలో అర్థం కాదు – అలా వేధిస్తుంది.
“నిశీ, పాపం, ఎందుకాయన్ని ఏడిపిస్తావ్? అలవాటు లేదు కదా మందగమనం.” అన్నాను, ఆయన ఏడ్పు మొహం చూసి జాలేసి.

కా.పు హైప్రొఫైల్, నిశీ ఫైర్ ప్రొఫైల్. నేను మామూలుగా ఏ ప్రొఫైలైనా కూడా ప్రస్తుతానికి భిన్న ధృవాలైన ఈ ఇద్దర్నీ హ్యాండిల్ చేస్తూ శాంతియుత ప్రయాణానికి ఏర్పాట్లు చేసే మోడరేటర్ ప్రొఫైల్ లో ఉన్నా ప్రస్తుతానికి. నిజానికి, నా ఆలోచన ఏమిటంటే, ఇతగాడిని మాటల్లో పెట్టి, ఆ గోళీసైజు బైకుని, దాని తాలూకా ప్రొసీజర్ ని (దేవ భాషలో దాన్నే మంత్రమంటార్లెండి) కనుక్కుని, ఉడాయించాలని 🙂 ఎందుకంటారా? నాకు ఈ భూమ్మీద మనిషిలా జీవించడం బోరు కొట్టేసింది. వేరే జన్మల్లోకి మారడం నాకు తెలీదు. కా.పు. జాబ్ ప్రొఫైల్ నాకు బాగా నచ్చేసింది. ఎక్కడా బంధాలనబడే బంధనాల్లేకుండా, జాలీగా ప్రపంచం మొత్తం చుట్టేయొచ్చు కదా…

“నేనోసారి ఇలా బైకులో షికార్లు కొడుతూ అట్లాంటిక్ పై వెళ్తున్నానా….”
“అట్లాంటిక్ పై బైకులో ఎలా పోతారు?” – ఇంతలోనే అతన్ని తుంచేస్తూ నిశీ సందేహం వ్యక్తం చేసింది.
“నా బైకు కి ఈతొచ్చు”
“ఆ…వినేవాళ్ళం ఉన్నాం కదా, ఎన్నైనా చెప్తాళ్ళే.” – నిశీ గొణిగింది నాతో.
“అదేం? ఇందాకే చూశాం కదా, అతను అంత పెద్ద బైకుని గోళీ సైజుకి చేసి జేబులో వేయడం. దాంతో పోలిస్తే, బైకు నీళ్ళలో నడవడం వింతా? జెట్ స్కీయింగ్ చేసినట్లనుకో…” – నేనూ గొణిగాను.
ఈలోగా ఉన్నట్లుండి నిశబ్దం ఆవరించింది. మేమిద్దరం ఉలిక్కిపడి, ఒక పావుక్షణం ఒకరినొకరు చూస్కుని, రెండో పావుక్షణంలో కా.పు. వైపుకి చూశాము. మూడో పావు క్షణం పట్టింది – అతను కూడా మా ఇద్దర్నే చూస్తూ ఉన్నాడని అర్థమవడానికి. నాలుగో పావులో అర్థమైంది – అతని వాక్ప్రవాహం మా నుండి “ఊ…” లు లేక ఆగినందువల్ల పుట్టిన నిశబ్దం ఇదని.
“ఏమైంది?” అన్నాను నేను మెల్లిగా.
“నేనింత ప్యాషన్ తో చెబుతూ ఉంటే, మీ ఇద్దరూ అది పట్టించుకోకుండా… మొహమాటానికైనా ఊ కొట్టక…. కమాన్ గుసగుస అనుకుంటూ ఉంటారా?” అన్నాడు కా.పు. కోపంగా.
“అబ్బెబ్బే….” అని నేను అంటూ ఉండగానే…
“అబ్బెబ్బెబ్బే…. అదేం లేదు… మాకంత ప్యాషన్ లేదు వినేందుకు” కుండబద్దలు కొట్టినట్లు, “ఒరేయ్, నువ్వు పరమ జిడ్డువిగా!” అని తెలియజేస్తున్నట్లు అన్నది.

అయితే, లేక లేక దొరికిన బేరం కదా, అతను అంత తేలిగ్గా మాతో గొడవ పెట్టుకోదల్చినట్లు లేడు.
“పర్లేదు. నో ఇస్యూస్. మీకు వినేందుకు లేకుంటే మీరే చెప్పండి ఫస్టు. చెప్పండి….. ఎందుకిలా రాత్రుళ్ళు తిరుగుతూ ఉంటారు?”
అక్కడ పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది గొంతులో. ఎందుకంటే ఏం చెప్తాము చెప్పండి?
ఇద్దరం మాట్లాడలేదు. ఇద్దరికీ ఇప్పుడా టాపిక్ మాట్లాడి, మాటలు పడ్డం ఇష్టంలేదు మరి.
“చూశారా… మాట్లాడమంటే మాట్లాడరు. నేను మాట్లాడితే వినరు… ఎలా ఇలా అయితే?” అన్నాడు అతను పాపం దీనంగా.
“సర్లెండి. కానీండి..” అన్నాం ఇద్దరం నీరసంగా.
జగదీశ్ చంద్ర బోసు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తూ చెట్లకు మొక్కలకూ ప్రాణముందని చెప్పాడే…కాలానికి ప్రాణముందని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఏ ప్రయోగమూ చేయకుండానే, ప్రయాగకైనా వెళ్ళకుండానే … అంటే, అటు సైన్సూ కాదు, ఇటు ఆధ్యాత్మికతా కాదు – ఏదీ లేకుండానే కాలానికి ప్రాణముందనీ, అది ఇలా మమ్మల్ని వేపుకు తింటుందనీ అర్థమైంది మాకు. లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అంటే ఇదే కాబోలు.

“వేల ఏళ్ళు ఇలా పోతూ ఉంటామా…. ఒక్కోచోట మమ్మల్నే అవాక్కయేలా చేసే దృశ్యాలు చూస్తాము. అయినా, ఆగలేము. ఎవరితోనూ పంచుకోలేము. మా ఏవన్ కాలింగ్ ఏటూ సంభాషణలు ఎప్పుడో డ్యూటీలు మార్చుకునేటప్పుడు కానీ జరగవు. డ్యూటీ దిగాక డ్యూటీ ఎక్కే మధ్యలో కొన్నేళ్ళు ఇలా దేశదిమ్మరిలా తిరుగుతామా…. అప్పుడు కూడా ఎవరితోనూ మాటలు కలపము. ఎందుకంటే, మా వాలకం చూస్తేనే ఎవరూ మాట్లాడరు మాతో. పైగా, క్లియర్ గా నేను ఫలానా…..అని చెప్పుకోలేని దౌర్భాగ్యపు బ్రతుకూ, దిక్కుమాలిన ఉద్యోగమూ…”
“అదేమిటి అలా అంటారు? ఇప్పుడే మీ ఉద్యోగం గురించి ’హౌ రొమాంటిక్’ అనుకుంటూ ఉంటేనూ..” అన్నాన్నేను.
“నాకూ మీ ఇద్దరి వాలకమే అర్థమ్ కావట్లేదు.”
“అదేం?” అంది నిశీ విలాసంగా అక్కడున్న చెట్టు ఎక్కి, ఓ కొమ్మపై, మగధీర సినిమాలో యువరాణి లా కూర్చుని.
“అదేం? అంటే ఏం చెప్పేది? ఇదివరలో నాక్కాదు కానీ, నా కొలీగ్…ఇందాక్కనిపించాడే, అతనికి – ఇలాంటి అనుభవం ఐంది. ఎవడినో కెలికాడు. ఏం చేస్తున్నావంటే – కాలపురుషుడినని చెప్పాడు. అంతే, వాడు బూతు దండకం మొదలుపెట్టాడంట – నువ్వే నా జీవితం నాశనం చేశావ్ అని. నేను కాదు మహాప్రభో, నాకు కూడా మేనేజర్లున్నారు… అని ఎంత చెప్పినా వినకుండా కొట్టబోతే, పారిపోయాడట మావాడు.”
“ఓహో… మీది కూడా కార్పోరేట్ కల్చరా?” నిశీ అనుమానం.
“మాదే ఒరిజినల్” అతనిలో కించిత్ గర్వం.

“సరే, అయితే, జనానికి మీరంటే కోపమంటారు?” అన్నాన్నేను.
“కోపమే కాదు… వెటకారం కూడా. ఇంకోసారి ఇంకో కొలీగ్ కి జరిగిన అనుభవం: వీడెళ్ళి నేను కాపు ని అంటే, అవతల మనిషి ఎర్రగడ్డ నంబర్ కలిపేందుకు పబ్లిక్ బూత్ కి వెళ్ళాడంట. వీడు ఇంతలో పారిపోయి వచ్చేసాడంట. అప్పుడు ఆ బైకేస్కుని తిరుగుతు తిరుగుతూ మొత్తం మా కా.పు. కమ్యూనిటీ కి మొత్తం చిట్స్ లో ఈ కథలు పంచి, బివేర్ ఆఫ్ హ్యూమన్స్ అని జాగ్రత్తలు చెప్పారు.”
“మరి, నిశీ ఆపితే ఎలా ఆగారు?” – మళ్ళీ నేనే.
“ఆవిడా? మనిషనుకోలేదు, నిజం చెప్పాలంటే…” అపాలజెటిగ్గా గొణిగాడు అతను.
“నేనూ అనుకోలేదు లెండి మొదట్లో…” అన్నాను నేను, పర్లేదన్నట్లు.
“నేను ఇప్పుడు కూడా అనుకోవట్లేదు…” – అంది నిశీ, అదే దర్పం కొనసాగిస్తూ.
“నేను కూడా ఇప్పుడు అనుకోవట్లేదు… ఇద్దరి గురించీ” అన్నాడతడు.
“కరెక్ట్” అంది నిశీ.
విధి లేక నేను కూడా… “రెక్ట్ రెఖ్ట్” అన్నా.
అతను పెద్దగా నవ్వాడు.
-నిజం చెప్పొద్దూ..నాకిదంతా.. “కాలాన్నే నిలదీసి కలలకి ఇవ్వాలి ఎనలేని విలువని” అన్నట్లు ఉంది. కాలం తో సంభాషణ అంటే మాటలా?

ఓ క్షణం ఆపేసరికి….. “హసీనో బచ్ గయే!” అని ఆకాశవాణి ఫీలై నా చెవిలో కేకేసినట్లనిపించి, హమ్మయ్యా! అనుకున్నా. ఆకాశవాణీ ఈజ్ రాంగ్. సుత్తి వీరభద్రరావు కూడా బలాదూర్ కా.పు. ముందు. చెబుతా… చెబుతా…. నేను కూడా కా.పు. తో ఉండి ఉండి…. అసలు విషయానికి రావడానికి ఈ టపా మొత్తం పట్టింది. బెటర్ లక్ (మీకా, నాకా?) నెక్స్ట్ టైమ్….

Advertisements
Published in: on January 4, 2010 at 9:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/01/04/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%be%e0%b0%aa%e0%b0%a5%e0%b0%82-20/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: