మొదటి సంవత్సరం పూర్తి చేస్కున్న పుస్తకం.నెట్

సరిగ్గా సంవత్సరం క్రితం పుస్తకం.నెట్ ను పరిచయం చేస్తూ ఓ టపా రాసాను ఇక్కడే. ఇప్పుడు, అప్పుడే సంవత్సరం నిండింది పుస్తకం కి..అనుకుంటూ ఈ టపా అన్నమాట.

అదే, సైటులో రాసినట్లు – నెలకి నాలుగైదు వ్యాసాలు పెట్టగలిగితే గొప్ప, అనుకుంటూ మొదలైంది. మొన్నే ఓ స్నేహితురాలితో మాట్లాడుతూ, పుస్తకం కి లక్షహిట్లొచ్చాయి అంటే, తను అన్నది – మీ పుస్తకం.నెట్ మొదలయ్యేముందు పోయినేడు ఓ సారి నాతో చెప్పావే, ఇలాంటి సైటు మొదలుపెట్టాలి అదీ ఇదీ అని… ఆ చాట్ అంతా మొన్నే చదివాను అని. ఆ తర్వాత నాకు కూడా ఆ టైంలో మా ఆలోచనలు ఎలా ఉండేవీ? అని అనిపించి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఇలా జీమెయిల్ తవ్వుతూ ఉంటే, సైట్ ఎలా ఉండాలి? ఇంట్రో టపా ఏం రాయాలి? ఏం పేజీలుండాలి? ఎవరెవర్ని సంప్రదించాలి? ఏం విభాగాలుండాలి? – ఎన్నో టుడూ లిస్టులు… ఒక నెల తర్వాత చూస్తే, మన దగ్గర బ్యాకప్ వ్యాసాలున్నాయా? లేకుంటే ఎలా? తర్వాత – ఫలనా వాళ్ళని ఎలా సంప్రదించి రాయించాలి? ఫలానా వాళ్ళని ఇంటర్వ్యూలు చేయాలంటే ఏం ప్రశ్నలు అడగాలి?
– ఆహా, ఈ సంవత్సరం పరమ ఆసక్తికరమైన అనుభవాలు పుస్తకం పరంగా.

ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలు చేసేందుకు వెళ్ళినప్పుడు మరీనూ. ఇప్పుడదంతా ఎందుగ్గానీ, బేసికల్లీ, మనమా నాన్స్టాప్ నాన్సెన్స్ కనుక, ఇలా మనుష్యులు తగిలే కొద్దీ నాకు మజా ఎక్కువైపోతుందని స్థూలంగా చెప్పవచ్చు. ఇక, మాకు వ్యాసాలు రాయరూ ప్లీజ్/మీర్రాస్తా అన్నారు, గుర్తుందా?/మరియాదగా రాస్తే మరియాదగా ఉంటుంది/జవాబివ్వకుంటే వదిలేస్తా అనుకున్నారా?/ – ఇలా రకరకాలుగా నడిచాయి నా నుండి వెళ్ళిన ఉత్తరాలు 🙂 అన్ని రకాల మెయిళ్ళకూ పాపం భయపడో, విసుక్కునో, జాలిపడో, కోప్పడో – జవాబులిచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరోవేళ వాళ్ళలో ఉంటే, వ్యాసం చదువుతున్నారు కనుక, నేనన్న “వాళ్ళ”లో మీరూ ఉన్నారు అని మీకు తెలుసు. వాళ్ళలో మీరు లేరు అనుకోండి, లేరు కనుక, వాళ్ళెవరో మీకు తెలియనక్కర్లేదు. సరే, సోదాపితే, ఇలా ఇలా ఈ కమ్యూనికేషన్లలో కొంతమందితో అప్పుడప్పుడూ హలో అని పలకరించుకునే పరిచయం ఏర్పడింది, నా అదృష్టం. కొంతమందికి కుదర్లేదు – అది వాళ్ళదృష్టం. కోతికొమ్మచ్చి చదివి చదివి, ఇలా డ్రిఫ్టైపోడానికి అలవాటుపడినట్లు ఉన్నా. పుస్తకం.నెట్ గురించి చెప్పడం మొదలెట్టాక, నేను మనుష్యులపై ఎలా దాడి చేస్తా అన్న టాపిక్, దానికి వారి స్పందనా – ఇదంతా అవసరమా ఇప్పుడు మనకి?

పుస్తకం.నెట్ లోకి నేను అడుగుపెట్టడం పచ్చి స్వార్థం. అంటే, బ్లాగులన్నీ సర్వే చేయడం కంటే, ఒక సైట్ లో పుస్తకాల గురించి ఉండేలా ఉంటే, మన బద్ధకపు ప్రాణానికి కాస్త తేలికౌతుంది కదా జీవితం అని. ఆ పరంగా ఇదో మంచి అనుభవం – అన్ని రకాల పుస్తకాల గురించీ ఒకటో రెండో వ్యాసాలు చదవగలిగాను. అలాగే, ఈ ఇంటర్వ్యూలు – లైబ్రరీలు, పబ్లిషర్లు, బుక్ షాపు వాళ్ళు, రచయితలు – ఎందరో రకరకాల రకాల మనుష్యుల మనోభావాలు తెలుసుకునే అవకాశం కలిగింది. కవిత్వం గురించి చాలా వ్యాసాలు కనబడతాయి గత మూడు నెల్ల వ్యాసాలు చూస్తే – ఇంత కంటెంట్ కవిత్వం గురించి నేనెప్పుడూ చదవలేదు… ఎందుకని అడక్కండి..అదంతే! (ఇదే విషయం గురించి ఇదివరలో కొంత విన్నవించుకున్నా… ఇక్కడ)

కొన్ని చెదురుమదురు సంఘటనల మినహా బంద్ ప్రశాంతంగా సాగినట్లు, ఒకటీ అరా స్పీడ్ బ్రేకర్లను మినహాయిస్తే, పుస్తకం లో ప్రయాణం కూడా హాయిగా అనిపించింది నాకు. ఇలాగే, ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నా కోరికేమిటంటే, సామాన్య పాఠకుడూ, సమాజంలో బాగా పేరున్న మరో పాఠకుడూ (అంటే, ఎక్స్ సీఎం కావొచ్చు- పెద్ద రచయితా కావొచ్చు, కానీ పుస్తకప్రియుడనుకోండి… సామాన్య పుస్తక ప్రియుడితో సమానంగా) -పక్కపక్కనే ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా తాము చదివిన పుస్తకాల గురించి రాస్కునే అభిప్రాయాలకి పుస్తకం వేదిక కావాలని.

హుమ్… హెవీ సెంటీలు మనకలవాటులేదు. కనుక, నేనింతకంటే రాయను.

పుస్తకం.నెట్ ముందుకు నడవడానికి మీ అందరి సహకారం ఇలాగే కొనసాఆఆఆగుతుందని ఆశిస్తూ – (హమ్మయ్యా! రాసేసా)…అనుకుంటూ… ముగిస్తున్నాను!
(హమ్మయ్య! అయిపోయింది…అనుకుంటూ మీరూ……కనిపిస్తూనే ఉంది లెండి వరస!!)

పూర్ణిమ చెప్పే కథ ఇక్కడ.

Advertisements
Published in: on January 1, 2010 at 9:00 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/01/01/%e0%b0%ae%e0%b1%8a%e0%b0%a6%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%82-%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%87/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. […] Post here Possibly related posts: (automatically […]

 2. Happy birthday babies! Keep up your spirits.

 3. congratulations….and celebrations…!!
  Happy new year!

 4. Happy New Year :)…
  Perseverance paid off… Heartiest Congratulations :)…

 5. Congratulations…

 6. “మరియాదగా రాస్తే మరియాదగా ఉంటుంది/జవాబివ్వకుంటే వదిలేస్తా అనుకున్నారా?/”
  సౌమ్య, ఇందులో నేను వున్నాను. మీరు అలా పట్టుబట్టి అడగకపోతే ఎప్పటికీ రాయం. ఇప్పటికీ కొన్ని రాయలేదు, ఇంకా వాగ్దానాలు గానే వున్నాయి.
  పూర్ణిమ టపా కూడా చదివాను.
  “ ఒక్కసారి కమిట్ చేయించడానికి కమిట్ అయ్యిన సౌమ్య మాట ఎవ్వరైనా వినాల్సిందే కాబట్టి “
  కదా పూర్ణిమ..

 7. @Varudhini, Trishna,Venu: Thanks.
  @Mahita: Rather, Impatience paid off 😉
  @Kalpana: :)) అంతా కలిసి నా గురించి లేడీ డాన్ ఇమేజ్ ఇస్తున్నారు కదా పబ్లిక్ కి 😉

 8. “ఇంత కంటెంట్ కవిత్వం గురించి నేనెప్పుడూ చదవలేదు” – :)ఒక సత్కార్యం తలపెట్టినప్పుడు ఫలశృతి అదే… మరింత నయనానందంగా, భావపూరితంగా పుస్తకం వర్థిల్లగలదనీ, మీఇద్దరికృషి ఫలప్రదం గాగలదనీ ఆశిస్తూ . –

 9. good show. keep up the good work.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: