ఏం పేరు పెట్టేది ఈ టపాకి?

(ఈ చరిత్ర ఏ సిరాతోనో నాకు తెలుసు…. ఈ కీబోర్డే దీని సిరా..కానీ, ఇలాంటి టపాకి పేరేం పెట్టేది? సిరా ఆచూకీ తెలిసింది… టపా కి నామకరణం మాత్రం చేతకాదు…. ఏం చేస్తాం…. బ్యాడ్ టైం!!)

“ఇదిగో, బుద్ధీ గిద్దీ ఉందా?”
“ఏయ్! ఎవరది? నాతోనే నా ముందే నిజాలు అడిగేస్తావా? కడిగేస్తాన్!”
“పోవోయ్! నీ గురించి నాకేం భయం! నేను లేకుండా నీకు వెంట్ ఏదీ?”
“బోడి బెదిరింపులు బోరు కొట్టేశాయి. కొత్త కథ ఏదన్నా చెప్పు”
“డిసెంబర్ మొత్తానికీ ఒకే టపా నీ బ్లాగులో… సిగ్గేయట్లేదూ?”
“యా…. వెరీ మచ్ సిగ్గింగ్…. సింగింగ్ ది సిగ్గింగ్ వోస్…” అన్నా, నేపథ్యంలో విషాద వాయులీనాల సౌండు మోగడం ఊహించుకుంటూ.
“ఈ మూడున్నరేళ్ళ మన అనుబంధంలో, ఏనాడన్నా ఇలా అయిందా?”
“ఆ ఒకట్రెండు సార్లు…నెల మొత్తానికీ రెండో మూడో టపాలు ఉన్నాయి…అంతే…”
“ఎప్పుడూ….?”
“ఓసారి సెమెస్టర్ పరీక్షలు…ఓ సారి పెళ్ళి”
“ఇప్పుడో?”
“ఏమో…”
“ఏం చేసి ఏడుస్తున్నావసలు?”
“ఏమో!”
“అసలు నువ్వు నన్ను చేరకపోడం నాకేం నచ్చట్లెదు. నీకు వేరే వ్యాపకాలెక్కువై, నాపై ప్రేమ తగ్గింది.”
“ఏమో…”
“ఇంకోసారి ఏమో అన్నావంటే – సృష్టిలో తీయని స్నేహాన్ని బాపురమణలు తీసినట్లు… నిన్ను నేను ఈ ప్లేసు నుంచి తీసేస్తా.”
“ఈ పోలికేం బాగోలేదే….”
“బాలేకున్నా విను. అనేసా కదా…”
“ఆ!….”
– అయ్యా! నాకూ ఉందోబ్లాగు! రెండ్రోజులుగా దులిపి పారేస్తోంది ఇలా ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు. బ్లాగు కూడా నా మీద లవర్లా దాష్టీకం చేస్తూ ఉంటే, ఏం చేసేది!😦

సంవత్సర కాలం ఈ రెండు వేలా తొమ్మిది – నేనేం చేసాను? అని ఆలోచిస్తున్నా – బ్లాగ్పరంగా – డెబ్భై పైనే టపాలు ఉన్నాయి – పర్లేదు. డీసెంట్ ప్రదర్శన🙂 అయినా, దీనికెంత ఆరాటమో చూడండి… బ్లాగులు కూడా తెలివిమీరిపోతున్నాయి…. డిమాండ్స్ చేస్తున్నాయి బ్లాగర్ల నుంచి. ఇంకా నయం – “ఈ టాపిక్ మీద టపా రాయి” అని కమాండ్ చేయట్లేదు. డిమాండ్ పర్లేదు కానీ, కమాండ్ ఉంటే, కమిట్ కావడం కష్టం కదా…

చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, కలిసిన మనుష్యులు, కలవని బంధాలు, స్నేహితుల మధ్య చిరుహాస్యాలు, ఎక్కడికక్కడ అడక్కుండానే పుట్టుకొచ్చే నాన్సెన్స్, కష్టమ్స్, నష్టమ్స్, కోపమ్స్, తాపమ్స్ – మిక్స్చర్ పొట్లం – జీవితం.

అక్కడక్కడా ఏమిటీ జీవితం అనీ, అక్కడక్కడా లైఫ్ హో తో ఏసీ (పోనీ కూలర్…) అని…. అక్కడక్కడా లైఫ్ క్యో హై ఏసీ (ఇక్కడ కూలర్ కాదు..హీటర్) అని… అక్కడక్కడా కోపం, అక్కడక్కడా నవ్వు… అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్క….. వద్దు… ఆపేస్తున్నా. నిజం! నిజంగా జీవితం మిక్స్చర్ పొట్లమే! కష్మిరీ పులావ్ లాంటిది కాదు….ఉగాది పచ్చడి లాంటిది. రెండూ మిక్స్చర్లు కావనుకోండి…. వాటి రుచి ఈ మిక్స్చర్ లో తగిలిందన్నమాట… దీని రెసిపీ ఎవరు చెబుతారో!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Published in: on December 30, 2009 at 9:37 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/12/30/2009bye/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. 🙂

    మీకుకూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సౌమ్యగారు.

  2. Happy new year Sowmya garu

  3. 🙂
    అమ్మో మీ బ్లాగుతో నా బ్లాగు స్నేహం చేసిందంటే నన్ను కూడా ఇలానే గడుసుగా నిలదీస్తుందేమోనండీ…అసలే నేను నెలకి ఒకటపా రాయటం కూడా కష్టమే…ప్రస్తుతానికైతే నా బ్లాగు నేను కూర్చోమంటే కూర్చొంటుంది..నిలబడమంటే నిలబడుతుంది…

    మీకు మీ బ్లాగు గారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు..:)

  4. happy new year

  5. ఛా.. ఛా..ఇహ బ్లాగులతో కూడా చివాట్లంటే నా బోటి వారు బతకడం ఎలా? నీతో నస పెట్టకుండా, ఇదే మాట ఈ బ్లాగు కానీ నాతో చెప్పుంటే, ఎంచక్కా “ఆమరణ నిరాహార దీక్ష” అన్న బోర్డు పెట్టేదాన్ని.. బ్లాగు గాంధీ ఫేంకి ఎదిగిపోయేది..😛

    Happy New Year to both you and your blog!🙂

  6. “న్యూ” సంవత్సర శుభాకాంక్షలు


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: