Prarambha

కొన్నాళ్ళ క్రితం “ఎయిడ్స్ జాగో” ప్రాజెక్టులో భాగంగా నాలుగు లఘుచిత్రాలు వచ్చాయి – Blood brothers, Positive, Migration, Prarambha. వీటి దర్శకులు వరుసగా – విశాల్ భరద్వాజ్, ఫర్హాన్ అఖ్తర్, మీరానాయర్, సంతోష్ శివన్. ఈనాలుగూ మీరానాయర్ బ్యానర్ మీరాబాయ్ ఫిల్మ్స్ , బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఆవాహన్ అనే స్వచ్ఛంద సంస్థా కలిసి రిచర్డ్ గెరె ఎయిడ్స్ ఫౌండేషన్ కోసం తీసినవి. ఇదివరలో ఓసారి చూసాను (అప్పట్లో దీన్ని ఎక్కడో ప్రస్తావించినట్లే గుర్తు…ఇప్పుడు ఎక్కడ చెప్పానో గుర్తు రావట్లెదు.. :(). అప్పట్లో “బ్లడ్ బ్రదర్స్” నన్ను చాలా ప్రభావితం చేసింది. రాత్రి WorldMovies ఛానెల్ లో “ప్రారంభ” చూశాను. ఇదివరలో ఇది పూర్తిగా చూడలేకపోయాను. ఇప్పుడు చూశాక, పబ్లిసిటీ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను 🙂

కథ: ఓ ట్రక్ డ్రైవర్ – ఓ చిన్న పిల్లాడు – ఎయిడ్స్ – ఇదీ కథ. ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మని వెదుక్కుంటూ ఈ ట్రక్ డ్రైవర్ ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆమెని గురించి తెలుసుకోడానికి వెళ్తే, ఆమె ఎయిడ్స్ వల్ల హాస్పిటల్లో ఉందని తెలుస్తుంది. తర్వాత – మన పిల్లాడికి ఎయిడ్స్ ఉన్నందువల్ల స్కూల్ నుంచి అతన్ని పంపేశారని తెల్సుకున్న ట్రక్ డ్రైవర్ అతన్ని ఎలాగన్నా అదే స్కూల్లో మళ్ళీ చేర్పించాలని ప్రయత్నించి, ఎయిడ్స్ గురించి అవగాహన ఉన్న ప్రిన్సిపల్ ద్వారా, అలాగే, తన ప్రయత్నాలు తాను చేసి, ఇతన్ని స్కూల్లో చేర్పించడం, పిల్లలు ఇతన్ని తమలోకి మళ్ళీ కలుపుకోడం తో ఈ లఘు చిత్రం ముగుస్తుంది.

నిజానికి, ఈ సీరీస్ లో – “బ్లడ్ బ్రదర్స్” తో పోలిస్తే, నాకు ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. మనుషులంటే చిరాకు పెరుగుతున్నందుకేమో గానీ – నిజంగా అంత అర్థం చేస్కుని ఆ పిల్లాడ్ని మనుషులు ఆదరించి ఉండేవారంటే నాకు నమ్మడం కష్టం. తోటి పిల్లలు అతన్ని దగ్గరకి తీస్కోడాన్ని నమ్మడానికి ఏమీ అబ్జక్షన్ లేదు నాకు – పిల్లల్లో ఇంకా మనుష్యజాతి లోని చెడు కలిసుండదు కనుక. ఏదేమైనా కూడా, ఈ చిత్రం నన్ను కదిలించినంతగా మిగితా చిత్రాలు కదిలించలేకపోయాయి. దాన్ని సెంటిమెంటనండీ, నన్ను సెంటిమెంటల్ ఫూలనండీ … ఏదన్నా అనండి – ఈ కథలో వాస్తవికత ఎంత శాతం ఉంది? అన్న నా అనుమానం ఓ పక్క ఉన్నా కూడా – It touched me deeply. కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆ పిల్లవాణ్ణి చూస్తూ ఉంటే.

అన్నట్లు మర్చిపోయా : ఇక్కడ ట్రక్ డ్రైవర్ ప్రభుదేవా, ప్రిన్సిపాల్ – బి.సరోజాదేవి, పిల్లాడి నాన్నమ్మ జయంతి, మొదట్లో కనబడ్డ కాల్ గర్ల్ – రమ్య : స్టార్ మూవీ అనమాట 🙂 నేపథ్య సంగీతం కూడా నాకు చాలా నచ్చింది. మూడ్ కి తగ్గట్లు మారుతూ ….

తప్పక చూడవలసిన చిత్రం. ఓ పది నిముషాలుంటుందేమో – ఎక్కువ సేపు ఉండదు. నేడే చూడండి.


Prarambha (The Beginning)

Advertisements
Published in: on December 2, 2009 at 9:00 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/12/02/prarambha/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. నవతరంగం లో వున్నాయండి ఆ లంకెలు ….

 2. @Jatardamal: ఔనండీ, నేను కూడా మొదట అక్కడే చూశాను వీటిగురించి.

 3. hai friends
  nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
  ee link lo choosi me comments teliyajeyandi.

  http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

 4. thnx for introducing these movies

 5. baagundi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: