మూడు పాటలూ, నేనూ

ఇదెక్కడి గోలండీ బాబూ – పగలంతా నా తలలో తిరిగి తిరిగి, దాన్ని తినేసి, ఆఖరుకి నన్నొదిలేసి వెళ్ళిపోయింది – ఏదా? అదే…గోల. నేను గోల చేయలేదు…గోలే నన్నేదో చేసి వెళ్ళిపోయిందంటున్నాను. మనిషి గోల చేస్తాడు కానీ, గోల మనిషినేం చేస్తుంది అంటారేంటి మళ్ళీ? నన్ను ఏదో చేసిందంటే నమ్మరేం? మీదెక్కడి గోలండీ బాబూ!

మీకంటే నేనే నయం ప్రశ్నలేసి చంపుకోకుండా విషయం కనుక్కునే ప్రయత్నం చేశాను. ఇంతకీ ఈ గోలెక్కడిదో అర్థం అయింది చివరకి…కానీ, ఏమిటో, ఎందుకో, అర్థం కాలేదు. లేదంటే – అసలదేమిటో అర్థమైంది కానీ, ఎక్కడిదో, నా దగ్గరికెలా వచ్చిందో అర్థం కావడంలేదా? ఏమిటో – నాకేమర్థం కావడంలేదో కూడా నాకర్థం కావడం లేదు 😦

మొన్నామధ్య ఓరోజు లేవడం లేవడం – “ఆంఖోంకీ…గుస్తాకియా…” పాటతో లేచాను. పాట మ్రోగుతోంది తల్లో. తల్లో ఏం ఆన్ చేస్కున్నానో లేస్తూ లేస్తూ – అది నాకు తెలీదు. సరే, పాట వస్తోందా, మధ్యలో మ్యూజిక్ వినబడ్డాక నాకేదో తేడాగా అనిపిస్తోంది. తేడా ఏంటో అర్థం కాదు. పాట మధ్యలో మ్యూజిక్ రాదా ఏంటి? అని మళ్ళీ నన్ను నేనే వెటకరించుకుంటున్నా (అద్దంలో మిటకరించుకుని చూశా కూడా) (ఆర్యా! ఈ రెండు పదాలు మదీయ పైత్య ప్రేలాపనలని గమనించగలరు). ఇలా ఇది ఓ పదిసార్లు ఐంది. ఆ పాట మొదలవడం, “ఆంఖోకీ ……” వరకు మళ్ళీ వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యూజిక్ వినబడ్డం. ఇలా ఇలా అయ్యాక, కాసేపటికి, అ మ్యూజిక్ తర్వాత భాగం వినబడ్డం మొదలైంది.

“పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు… రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో…”
“ఒహొ హొ హొ..ఒహొ ఒహొ ఒహొ…”
అబ్బబ్బా! ఏమిటీ మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ. ఇంతసేపటికి ఏదో లైను వినబడ్డది అనుకుంటూ ఉంటే, మళ్ళీ అదే సంగీతం. ఎక్కడిదీ పాట “ఆంఖోంకీ….” మధ్యలో?
అనుకుంటూ తడబడుతూ ఉండగానే – “అమ్మ బ్రహ్మదేవుడో!” అంటూ ఈ పాట కొనసాగింది.
“ఓహో!” ఇలా వచ్చారా తల్లీ!” అనుకున్నాను మన ఆత్మాసీత గురించి.

అవి రెండూ అలా మైండులో తిరుగుతూ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే, ఏదో ఓలా పని కానిచ్చుకుని, ఆఫీసుకని బయలుదేరాను. బెల్ సర్కిల్ దగ్గర పెద్ద జాం. సరే, అలా ఆకుపచ్చ విప్లవం కోసం ఎదురుచూస్తూ ఉంటే, ఓ పక్క ఉన్న గందరగోళంతోనే గజిబిజిగా ఉంటే, ఇక్కడ కొత్త గందరగోళం! “ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది!” అట. నాకెక్కడ తీరికా ఇప్పుడు ఏం తెలిసిందో తెలుసుకునేందుకు, గ్రీన్ లైటొచ్చేస్తేనూ!

ఆఫీసుకొచ్చేసాక – మళ్ళీ, “లాలాలాలా లాలల లాలా…”
“మోహాలే… దాహాలై… సరసాలే… సరదాలై… ”
“ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది!”
ఏంటి తెలిసేది? నాకు గందరగోళం వల్ల చిరాకెక్కువై కూడా ఆవేశం కలుగుతోంది. అయినా, గందరగోళం దేనికో తెలియట్లేదు. మరి ఏమిటది తెలిసేది ఆవేశం వల్ల? ఆకాశం ఏనాటిదో తెలుస్తుందా? అనురాగం ఏనాటిదో తెలుస్తుందా?

“ఏం మాట్లాడుతున్నావసలు? తల్లో హెడ్డుందా? మోకాళ్ళలో ఏమన్నా నొప్పులా?”
“ఏయ్! ఎవర్రా అది? నాతోనే వెటకారమా?”
“నీతో ఏమిటి? నువ్వేమన్నా పెద్ద ఇదా? అసలు నీకూ, నాకూ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.”
(ఎందుకన్నా మంచిదని, ఎందుకొచ్చిన గోలని) “నేనే నక్కని” అనేశాను.
“హహహహ”
“అద్సరే, నవ్వులు ఆపి, తమరెవరో సెలవిస్తారా?”
“నేనా? నీ మనసులో తిరుగుతున్న పాటలన్నింటిలో ఉన్నదాన్ని.”
“అన్నింటిలో ఉన్నదేమిటి? సంగీతం, సాహిత్యం. రెండింటిలో మీరెవరండీ?” ఈసారి నేను నిజంగా నక్కనే అని అర్థమైపోయి, వినయంగా అడిగాను. అలాగే, అలా మాటల్లో పెట్టి సదరు ఆకాశవాణి డిటైల్స్ మొత్తం తెలుసుకుందామని నక్కజిత్తుల వేషాలు కూడా వేయడానికి రెడీగా ఉన్నాను.
“రెండూ కాను”
“మరి?”
“వాటి కలయికను”
“ఓహో! మరైతే, ఇలా గలగలమంటూ బిలబిలమంటూ పాడుకుంటూ వచ్చేసి నన్ను ముంచేస్తే, నా గతేం కాను?”
“చూడు, నా బతుకునిండా రాళ్ళు. పాడకుంటే ఎలా ?” – అన్నది ఆ గొంతుక, ఇస్మాయిల్ గారు అన్నట్లే!
“రాళ్ళా?” అన్నా నేను నోరెళ్ళబట్టి.
“గలగలమన్న శబ్దం ఎక్కడిదనుకున్నావ్?”
“అది తెలీయకే కదా ఈ గోలంతానూ!” విసుగ్గా అన్నాను.
“ఎక్కడిదంటే…”
“భూల్ జా…. ఇన్ యాదోంకో తూ భూల్ జా…” ఫోను!
పగటిపూట, ఆఫీసులో, కలా! ఏమిటి చేసేది ఇప్పుడు?”
“కాలాన్నే నిలదీసి కలలకి ఇవ్వాలి వెలలేని విలువను.”
-అబ్బా! మళ్ళీ మొదలు!!!

(నా తల్లో జరిగే కథ నాకర్థం కాదు. అసలు నేనేం మాట్లాడుతున్నానో ఈ ఆకాశవాణికర్థం కాదు. ఆ ఆకాశవాణి కథేంటో నాకర్థం కాదు. నాకెందుకు ఏదీ సరిగా అర్థం కాదో కూడా నాకే అర్థం కాదు. నేనెందుకిలా రాసి రాసి చంపుకుతింటానో మీకర్థం కాదు. మనసెందుకు నాకు సర్రియలిజం ఎక్కువైందేమో అనుకుంటోందో… మీరెందుకు నా బ్లాగును అదోలా చూస్తున్నారో…ఈ రాతేమిటో… ఏవిటో! ఏవీ అర్థం కావట్లేదు. 😦 )

Advertisements
Published in: on October 21, 2009 at 9:34 pm  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/10/21/me-3songs-madness/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. Em parledu … doctor deggariki vellu .. goli billalu istadu … goli mingesi .. manchi nillu taagi ..10hrs paduko .. taggipotundi le

  😀

 2. బాగుంది.
  // ఆర్యా! ఈ రెండు పదాలు మదీయ పైత్య ప్రేలాపనలని గమనించగలరు
  చివరకు మిగిలేది – జగన్నాధం లా . 🙂
  //నా తల్లో జరిగే కథ నాకర్థం కాదు.
  ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది ఈ మాట. అసలు ఆలోచనను ఏ భాష పట్టుకోగలదు కనుక! 🙂

 3. its really good post. i enjoyed a lot keep it up..
  కేక పెట్టించావ్ సౌమ్య

 4. extremely well done.
  Keep it up and you’d be writing prose like Henry Miller and poetry like “Mo” 🙂

 5. ఏవిటో…..మీరేం రాసారో, నేనేం చదివానో…! అసలు ఇది ఏం భాషో, తెలుగు లా కనబడే వేరే భాషేమో.. అది చదివి తెలుగనుకుని ఇక్కడ చదివాను అనుకున్నది నాకు అర్థమయ్యింది అనుకుంటున్నానేమో… కానీ తెలుగు లా కనబడే ఈ నాన్-తెలుగు లో రాసిన దానికర్థం వేరే ఏమో…. ఇప్పుడు నే రాసేదానికి కూడా నాన్-తెలుగు లో వేరే అర్థం ఏదైనా ఉందేమో!! ఏమో!! 😀

  Jokes apart…. “ఆర్యా! ఈ రెండు పదాలు మదీయ పైత్య ప్రేలాపనలని గమనించగలరు” – హహహా..
  కుళ్ళబొడిచారనుకోండీ. ఇలాంటిదే నాకు చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఒక పాట పాడుకుంటు, మధ్యలో ఎక్కడో వేరే ట్యూన్, వేరే సాంగ్ లోకి జంప్ అవ్వటం!! ‘ఆ పాటలన్నిటిలో ఉన్నదాన్ని’ – అంటే “రాగం” ఏమో అని నాకో వెధవ అనుమానం. ఇక్కడ ఎవరైనా సంగీత విధ్వాంసులు ఉంటే వాళ్ళే తీర్చాలి ఈ సందేహం. అలా కాకుండా… “అప్రాష్ఠురాలా…అసలు సంగీతం గురించి… ” etc etc. అంటూ శంకరాభరణం శంకర సాస్త్రి లా తిడితే ఏం చెయ్యలేం మరి!! 😛 ట్రై చెయ్యండి.

 6. మీకేమైందో నాకర్థమయిందోచ్.

  ఈ (http://drbr1976.blogspot.com/2009/10/blog-post.html) టపాలో డాక్టర్కు అయినదే మీకూ అయింది

  …ఫీస్ పంపిస్తే మందు రాసి ప్రిస్క్రిప్షన్ పంపిస్తాను.

 7. 🙂 @All :p


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: