నిశ్యాలోచనాపథం – 15

ఆరోజలా శ్రీశ్రీ, కృష్ణశాస్త్రీ ఇద్దరూ కనబడ్డట్లే కనబడి, మాట్లాడినట్లే మాట్లాడి – చెప్పీ చెప్పక మా సమస్యలతో కబుర్లాడి, మొదట దృశ్యమై కనబడి, తర్వాత అదృశ్యమైన సంగతి చెప్పాను కదా. తరువాత మేమిద్దరం (అదే, నేనూ, నిశీ) విడిపోయాము. పగలౌతూ ఉండటంతో. కానీ, నిశీ అంత ఎనర్జెటిగ్గా ఉండగలదని నేను ఊహించలేదు. ఎప్పుడూ ఏడుపు మొహమేస్కుని ఉండటమే కానీ, ఆరాత్రి శ్రీశ్రీ ని చూడగానే తనలో ఎంత ఉత్సాహం కనిపించిందంటే, నేనింకా పూనకమొచ్చేస్తుందేమో అని భయపడ్డాను. సరే, విడిపోయాక ఈసారి కాస్త నిశ్చింతగా ఉన్నాను. ఈ మూడ్లో ఉండగా ఆత్మహత్యల వైపుకి మనసు మళ్ళదేమోలే అని. మా ప్రోటోకాల్ ప్రకారం ఎస్సెమ్మెస్లు, ఫోన్లు చేస్కోము కనుక రాత్రి కోసం ఎదురుచూస్తూ గడిపాను. నిజం చెప్పొద్దూ – నాకు పెస్సిమిస్టులంటే పరమ అసహ్యం అయినా కూడా , నిశీ స్నేహాన్ని వదులుకోలేకపోతున్నా. నిశీ ఎంత నిరాశతో మాట్లాడినా, తను నాకు నచ్చుతూనే ఉంటుంది.

నిజానికి, ఇపుడు నాకు మహా ఉత్సాహంగా ఉంది. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రుల హాంగోవర్ లో ఉన్నా. ఇవాళ ఎవరు కనిపిస్తారో? అని ఎదురుచూస్తున్నా. అయినా, తెలుగువాళ్ళే కనబడాలా ఏంటి? ఆర్కేఎన్ కనబడొచ్చుగా, టాగోర్ కనబడొచ్చుగా… అనుకుంటూ ఈలేస్కుంటూ వస్తున్నా. ఆ వైపు నుండి నిశీ వస్తోంది. “నిశీ!” అంటూ ఎదురెళ్ళాను.
“ఓహ్! హాయ్!” – అంది నీరసంగా.
“ఏమిటీ.. ఒంట్లో బాలేదా?” అన్నాను. కానీ, మనసులో బాలేదేమో అని అనుమానమొచ్చింది. ఇన్నాళ్ళ పరిచయంలో ఎప్పుడూ చూస్తున్నదేగా అని.
“హా.. కొంచెం నీరసంగా అనిపిస్తోందిలే. పగలు సరిగా పడుకోలేదు.” అంది నిశి.
“ఏం?”
“అదే, వాళ్ళతో మాట్లాడాము కదా… ఆ కవితావేశాలను అనుభవించి నాకూ ఆవేశం వచ్చేసిందిలే. ఆరోజు నేనిల్లు చేరేసరికే నాలో రకరకాల భావాలు కలగడం మొదలుపెట్టాయి.”
“అంటే?” అన్నాను….అర్థం కాక.
“ఆ రాత్రికీ నాలోని కొత్త ఆలోచనలకూ సరిగ్గా లంకె ఎక్కడో నేను చెప్పలేనుకానీ, ఆ రాత్రే ఈ ఆలోచనలకి కారణం అని మాత్రం చెప్పగలను.”
“ఏ ఆలోచనలకు?”

“నాకు ఆరోజు నుండి కొన్ని ప్రశ్నలు – నేను జీవితాన్ని ప్రేమించాను. జీవితం నన్ను మోసం చేసింది. కానీ, అందుకోసం నేను ఎందుకు ఆత్మహత్య చేస్కోడం?” అని ఇంకేదో చెప్పబోతూ ఉండగా –
“హమ్మయ్య! ఎప్పుడంటావా అని చూస్తున్నా. ఈ బుద్ధి నీకెప్పుడొస్తుందో అనే నా ఎదురుచూపుకూడానూ..” అన్నా ఆనందంగా.
“చెప్పేది పూర్తిగా విను. నా ఆత్మహత్యకు నేను చెప్పిన కారణాలు అర్థరహితం అనిపించాయే కానీ, ఆత్మహత్య చేస్కోను అనట్లేదు కదా…”
“అంటే?” అన్నాను అవాక్కై.
“నన్ను నేను అర్థం చేస్కోడంలోనూ, అవతలి పార్టీని అర్థం చేస్కోడంలోనూ కొంత దారి తప్పాను అప్పట్లో. ఇప్పుడు సరైన కారణాలు తెలుస్తున్నాయి నాకు. బహుశా అప్పటికి కూడా సరైన కారణాలు నా సబ్ కాన్షస్ మైండ్ కు తెలిసుంటాయి. కానీ, నేను కాన్షస్ గా ఉన్నప్పుడు అది అన్కాన్షస్ అయి ఉంటుంది కదా…”
ఇన్ని -షస్ లు విని నాకు గందరగోళం మొదలైంది.
“ఏమిటో…అంతా అయోమయం, గందరగోళం…ఏం మాట్లాడుతున్నావో…” అన్నా.
“ఎజ్గాక్ట్లీ! ఎజ్గాక్ట్లీ! నా మనసు కూడా ఇలాగే గందరగోళంలో, అయోమయంగా మాట్లాడింది అప్పుడు…దానితో నేను కూడా అలాగే ప్రవర్తించాను. కానీ, కారణాలు ఏవైనా, సబ్కాన్షస్ మైండులో అసలు ఆలోచన ఉందే, అది మాత్రం బైటపడిపోయింది ఆపాటి ఆలోచనలు…” అని ఇంకా ఏదో చెప్తూ ఉండగా, నాకు తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించి –
“ఇప్పుడు నీ ఆలోచనలు నీకు క్లియర్గా ఉన్నాయి కదా…” -అన్నా.
“పక్కా!” అన్నది తను.
“అయితే వదిలేయి. నీకు క్లియర్ అయితే చాలు. ఎలా క్లియర్ అయ్యాయో కాదు… ఇప్పుడు అవేంటో చెప్పు. ఈ కాంప్లికేటెడ్ కన్వల్యూటెడ్ వివరణ నేను భరించలేకపోతున్నాను” అన్నాను నిర్మొహమాటంగా.

“సరే, అదంతా వదిలేస్తే, నాకు జ్ఞానోదయం అయింది ఒక విధంగా.”
“ఏమని?” అన్నా, ఓ పక్క ఇప్పుడే ఉపన్యాసమిస్తుందో..అని భయపడుతూనే.
“బ్రతకడానికి ప్రేమ అన్నది సరిపోతుంది అనుకుంటూ ఉండేదాన్ని. కానీ, అది పూర్తిగా కరెక్టు కాదని అర్థమైంది.”
“మరీ బాగుంది. ప్రేమొక్కటే సరిపోతుందా? కాస్త బాధ్యతాయుతంగా ఉండటమూ, బ్రతకనేర్చిన తనమూ, డబ్బూ… అదృష్టమూ… అన్నీ కావాలి కదా బ్రతకడానికి… ఏ ఒక్కటి లేకున్నా బ్రతుకంత సులభమేమీ కాదు…” – అన్నాను ఈమాత్రం తెలీదా…అన్నట్లు ధ్వనిస్తూ.
“బ్రతకడానికి అదొక్కటే పట్టుకుని వేళ్ళాడితే సరిపోదు. ఇప్పుడు నేనూ ఒప్పుకుంటున్నాను. కానీ, బాధపడ్డానికి మాత్రం సరిపోతుందని అర్థమైంది.” అన్నది బాధగా.
“నాకర్థంకాలేదు” అన్నాను చిరాగ్గా.
“ప్రేమ బ్రతకడానికి సరిపోదు అని అర్థమయ్యాక, ఓసారంటూ ప్రేమించాక ఇక దాన్ని వదిలించుకోడం తెలీక – జీవితాంతం ఆ బాధలో బ్రతకడానికి ప్రేమ బాగా సూటవుతుందని చెప్తున్నా” అన్నది నిశీ మళ్ళీ.
“ఓహో…” అన్నాను జ్ఞానోదయం అయినట్లు. నిజానికి నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ, ఈ నిశీని వివరణ అడిగే కొద్దీ ఆ వివరణే అసలు విషయం కంటే క్లిష్టంగా ఐపోతుందని అనుభవపూర్వకంగా తెలిసింది కనుక ఊరుకున్నాను.

“సో, నే చెప్పొచ్చేదేమిటంటే… ఆత్మహత్య విషయంలో నా అభిప్రాయాలు మారలేదు. కానీ, ఎవరన్నా అడిగితే చెప్పే కారణం మారుతోంది..” అన్నది.
“మా-రు-తోం-దా?” అన్నా…అర్థంకాక.
“యస్. అంటే, కారణాలు సరిగ్గా ఫ్రేం చేసే ప్రాసెస్ లో ఉన్నా ఇప్పుడు.. అందుకే మారుతోంది అంటున్నా… సరే, మారబోతోంది అనాలేమో కదా…”
“అంటే?” అన్నా.
“ఇపుడు నీకు చెప్పినా అర్థంకాదు.”
ఎస్కేపవడానికి ఈ డైలాగుకంటే తేలికైన మార్గం లేదు. “నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేస్కోవట్లేదు…వదిలేయి” అన్నట్లు అనిపించింది నాకు. “మరెప్పుడు చెబుతావ్?” అన్నా.
“నేను మరింత స్పష్టంగా జవాబెలా ఇవ్వాలో తయారు చేస్కున్నాక.”
“ఇప్పుడేంటి? సూసైడ్ కరెక్టే అంటావ్ ఇంతా చేసి?” అన్నా.
“నేను చేస్కోడానికి నేను నిన్ను సమాధానపరిచే జవాబు ఇవ్వగలను అని అంటున్నాను.”
“ప్రేమించడాలు, అవి విఫలం కావడాలు… చస్తా అనడాలు… ఇదో ఫ్యాషనైపోయింది” – కోపంగా అన్నాను.
“నా కారణం విఫల ప్రేమ అని నువ్వు అపార్థం చేస్కుంటున్నావు. జ్ఞానోదయం అని నేను స్పష్టం చేస్తున్నా!!” తను కూడా కోపంగా అన్నది. తన కోపం ఇదివరలో చూసిన జ్ఞాపకం లేదు నాకు.

మనుషులు రైజయ్యే కొద్దీ వాళ్ళని రైజింగ్ స్టార్లు చేయాలన్న నా కోరిక మరింత బలీయమౌతూ ఉంటుంది.. అందుకే తనతో – “నువ్విలా అడ్డగోలుగా మాట్లాడితే, ఎవరికీ అర్థం కాదు. అసలు నీకు మాట్లాడ్డం చేతకాదేమో అని నా అనుమానం” అన్నాను.
“ఈమధ్య ఓ స్నేహితురాలు నాకు చాలా మాటలొచ్చని అన్నదే!” అంది నిశి అనుమానంగా.
“ఆవిడో అమాయకపు ప్రాణి ఐ ఉంటుంది లే.” అన్నాను. నిశీ కోపం తెచ్చుకోకుండా ఉందేమిటి ఇంకా అనుకుంటూ.
“సరే, నన్ను కాస్త ఆలోచించుకోనీ….ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా కారణాలు చెబుతాను..” అంటూ ఆవలి వైపుకి పరుగెత్తింది.
నేను తనని చూస్తూ, ఏమిటో ఆ కారణం..అని ఊహించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా, ఎప్పటిలాగే శ్రీముఖాలతో మెలుకువొచ్చింది!

Advertisements
Published in: on September 7, 2009 at 11:15 am  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/09/07/nisyalochanapatham-15/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. Very funny!

  “ప్రేమ బ్రతకడానికి సరిపోదు అని అర్థమయ్యాక, ఓసారంటూ ప్రేమించాక ఇక దాన్ని వదిలించుకోడం తెలీక – జీవితాంతం ఆ బాధలో బ్రతకడానికి ప్రేమ బాగా సూటవుతుందని చెప్తున్నా”

  hahhahahaa… this case is out of hand, nothing much can be done. There is a creature which inflicts pain on to itself and then rues about the pain. When the pain starts subsiding it hurts itself afresh and rues again. Sounds such a stupid creature. But humans have “love” to put the entire blame upon.

  I know the above is a rant! No offense meant to Nisi, I was just making a point she is human! 😛

  Superb narration, smooth flow and yeah, points well made.

  Looking forward for the rest of the parts.

 2. “ప్రేమ బ్రతకడానికి సరిపోదు అని అర్థమయ్యాక, ఓసారంటూ ప్రేమించాక ఇక దాన్ని వదిలించుకోడం తెలీక – జీవితాంతం ఆ బాధలో బ్రతకడానికి ప్రేమ బాగా సూటవుతుందని చెప్తున్నా”

  Wah waaaah…
  wah waaaah..!!! 🙂

  బ్రతకటానికి కావల్సిన వాటి లిస్ట్ అనంతం. కావాల్సినవి సమకూరే కోద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. రివర్స్ లో.. బ్రతకలేకపోవటానికి, బ్రతుకు దుర్భరం చెయ్యటానికి కావాల్సిన లిస్ట్ చా..లా.. చిన్నది.

  ఉదా: రోగం నుంచి ఒక జీవిని కాపాడాలంటే బోలెడాన్ని మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. అదే పోవటానికి ఒక్క చిన్న సీసా విషం చాలు.

  అన్నిటికంటే ముఖ్యం గా… బ్రతకటానికైనా ,చావటానికైనా… ఆ మాటాకొస్తే దేనికైనా… మనిషికి “సంకల్పం” ముఖ్యం. ఏమంటారు?

 3. అన్నట్టు నిశీ గారి ఆలోచనా విధానం చూస్తుంటే నాఖు ముచ్చాటేస్తుందండీ. అనుకున్నది గుడ్డిగా ఫాలో అయిపోకుండా అందులో తర్కాతర్కాలు [correct?] ఆలోచించటం.. బాగుంది. నేను ఆమె ఫాన్ అయిపోయేలా ఉన్నా… 😀

 4. “బ్రతకడానికి ప్రేమ అన్నది సరిపోతుంది అనుకుంటూ ఉండేదాన్ని.కానీ, బాధపడ్డానికి మాత్రం సరిపోతుందని అర్థమైంది”…
  “ప్రేమ బ్రతకడానికి సరిపోదు అని అర్థమయ్యాక, ఓసారంటూ ప్రేమించాక ఇక దాన్ని వదిలించుకోడం తెలీక – జీవితాంతం ఆ బాధలో బ్రతకడానికి ప్రేమ బాగా సూటవుతుందని చెప్తున్నా”
  Well said,Well written 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: