కథ ఇట్లా ఉండాలె – కథ పై

బస్సులో కూర్చుని – కనుపర్తి వరలక్ష్మమ్మ గారి “కథ ఎలా ఉండాలె?” కు మాలతిగారి ఆంగ్లానువాదం – “The Charm of a cherished story” చదువుతూ ఉన్నాను. ఇదివరలో చదివినదే అయినా, ఈసారి చదివినప్పుడు దాని గురించి మరికాసేపు ఆలోచించాను. ఈ ఆలోచనల్లో నాకు రకరకాల సందేహాలు కూడా కలిగాయి. ప్రస్తుతానికి కథ గురించి చర్చల వల్ల ఇది నాకు నచ్చిన కథ. కనుక, ఈ కథ చదువుతున్నప్పటి అనుభవాలను పుస్తకం.నెట్ లో పంచుకోవాలనిపించింది.

కథ విషయానికొస్తే, ఇది ప్రధానంగా రచయిత అయిన భర్తకూ, అతని భార్యకూ మధ్య కథ అంటే ఎలా ఉండాలి అన్న విషయంపై జరిగిన చర్చ/వాదన. నా మటుకు నాకు కథ అయితే చాలా సహజంగా, ఇంట్లో జరుగుతున్నంత సహజంగా అనిపించింది. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండటం, మధ్యలో ఇంటి పనుల విరామాలు, చివర్లో నిద్రొస్తోందని చర్చ ముగియడం – ఇదంతా అతి సహజంగా ఇంట్లో జరిగే దానిలా అనిపించింది. ఎటొచ్చీ, కథకి నాటకీయత అవసరం అని చాలా బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉండే ఉంటారు – వాళ్ళకి ఇది అసంపూర్ణ కథ కావొచ్చు. కథ అన్నాక – ఫలానా టెంప్లేట్లలో ఏదో ఒకదానిలోకి ఒదగాలి – అని బలంగా నమ్మేవాళ్ళకి కూడా ఇది బహుశా నచ్చదేమో. కథల స్ట్రక్చర్ విషయంలో నేను అనార్కిస్టుని కావడం ఈ కథని స్వేచ్ఛగా ఎంజాయ్ చేసి, దీనిలో చెప్పిన విషయాల గురించి ఆలోచించడానికి ఉపకరించిందేమో.

“కథ” అన్నదాన్ని ఓ డెఫినిషన్లో ఇరికించడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఈ కథ చదివాక అసలు అర్థం కావట్లేదు. అందుకు ఈ కథ రూపం కారణం కావొచ్చేమో కానీ, ప్రధానంగా ఇక్కడ చర్చించిన విషయం కారణం. ఈ కథలోని కొన్ని వాక్యాలూ – నా ఆలోచనలూ:
” The stories that are just intended to make the reader laugh are insipid”
– ఇది చాలా అన్యాయం అనిపించింది నాకు. How can a comedy story be insipid? పైగా, కొన్ని కొన్ని మూడ్లలో ఉన్నప్పుడు హాస్యకథలు మనల్ని అందులోంచి బయటకు కూడా తేగలవు. రాసిన ప్రతి హాస్య కథా వందల సంవత్సరాలు నిలువకపోవచ్చు – కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోవచ్చు – కానీ, అది చదువరికి హాయినిచ్చినంతకాలం అది “ఇన్సిపిడ్” ఎలా ఔతుంది? హాస్యమంటే – నిజజీవితంలో జరిగే హాస్యం కానక్కరలేదా? రోజూవారీ జీవితంలో హాయిగా నవ్వుకునే సందర్భాలను తీసుకుని కథాంశాలుగా రాస్తే, ఎందుకు అవి ఇన్సిపిడ్ ఔతాయి?

’Every story must include a truth of ethical or scientific value. It is only then the writer’s effort is rewarded.”
– మళ్ళీ, ఎందుకు ఉండాలి? అన్నది నా సందేహం. కథ ఎందుకు రాస్తారు? అంటే “సాంఘిక ప్రయోజనం” అన్నది ఒకటేనా జవాబు? “హాస్యం” కూడా ఒక విధంగా సాంఘిక ప్రయోజనమే అలా అంటే 🙂 కథలో ఒక రకం జీవితాన్ని చూపించాలి అని రచయిత అనుకున్నాడు అనుకుందాం – చూపాడు అనుకుందాం. ఇందులో అన్నిసార్లూ సాంఘిక ప్రయోజనం ఉండాలి అని ఏముంది? – అలాగే, ప్రతి కథలోనూ ఎథికల్, సైంటిఫిక్ విలువలు ఉండాలి అని ఏముంది? మళ్ళీ “హాస్యాన్ని” ఉదాహరణగా తీసుకుంటాను. నేనో దిగాలుపడ్డ మనసుతో కూర్చుని ఉన్నప్పుడు ఏదో కథ చదివి, నవ్వుకుంటూ, చీరప్ అయితే, రచయిత కృషికి ఫలితం దక్కినట్లు కాదా?

’if the purpose of a story is only to provide a temporary pleasure, if love is the only theme, if you cannot write any better than that, and if the readers cannot enjoy anything better than that, then, I would say that both the writers and the readers are self-indulgent”
– “ప్రేమ” కథలు రాస్తే మాత్రం తప్పేంటి? ప్రేమ అన్నది మనుషుల్లో ఉండే సహజ రసం. కథల్లో సహజ రసాన్ని చూపడంలో అంత తప్పేముంది? తాత్కాలిక ఆనందం కల్పించేది కథ ఎందుకు కాకూడదు? అన్నది నా ప్రశ్న. కథకి ఏకైక లక్ష్యమే ఎందుకుండాలి? చాలా లక్ష్యాలుండి వాటిలో తాత్కాలికానందం ఒక కోణం ఎందుక్కాకూడదు?

“There are two kinds of stories—the best and the mediocre. The best stories are those, which contain style, freshness, clever descriptions, creativity, suitable rasa, and ethical values. Such stories will receive permanent status in literature; readers receive them well. They never become old.”
-ఇక్కడి వరకూ బానే ఉంది. కానీ, తరువాత:
“The mediocre stories will have all the elements but no moral values. These mediocre stories are also written in powerful and living language, do include fine descriptions, and the structure and characterization are not bad either. They may not be lacking in rasa; yet, they do not attain a permanent place in literature for want of a compelling moral value. These stories have served their purpose just by providing a momentary pleasure to the readers.”
అన్నారు. అంటే, కలకాలం నిలిచే కథల్లో తప్పితే మిగితా కథల్లో నైతిక విలువల్లేవనా? అసలు రెండే రకాల కథలు అని చెప్పేయడమే నాకు అన్యాయమనిపించింది. దానికి తోడు, కలకాలం నిలిచే కథల్లో తప్ప నైతిక విలువలు ఉండవంటే ఎలా? ఈ వ్యాఖ్యానాలన్నీ ఎలాంటి కథల్ని ఉద్దేశించి అన్నారో –
“In the name of nature, if you describe everything regardless of propriety, it turns into vulgarity. The reason the modern day stories are reprehensible is those descriptions. Description should not cross the line of propriety even if it were natural.”
-అన్న వర్ణన బట్టి తెలుస్తోంది కానీ, అలా ఆలోచించినా కూడా కథలు ఉంటే మొదటి కేటగిరీలో లేకుంటే రెండోదానిలో ఉండటం అసాధ్యం అనిపిస్తోంది. ఇంకొన్ని కేటగిరీలు అవసరం 🙂

“And then the third rate stories are those which are written without any talent; and often written in some foolish way; probably the writer gets excited at the sight of a woman and writes about her. Most of the stories now being published in Telugu magazines nowadays belong to this category.”

– నో కామెంట్స్. నాకు తెలీదు. చదివేవాళ్ళు అవి కూడా చదువుతారు కదా మరి! థర్డ్ రేట్ సరే – కానీ, వాళ్ళేమీ వచ్చి నేను ఫస్ట్ రేట్ అనరు కదా (అంటారా?)

చివర్లో భార్య మాటలన్నీ వింటూ ఉన్న భర్త : “A story could be a moral story like in sumati satakam or vemana poems. But it’s not smart to suggest that each and every story must fit into a paradigm of moral value. A story is like a flower. It must blossom freely and pleasurably or else it would lose its beauty and become insipid. To speak the truth, story writing is an artistic creation. And it is the duty of the connoisseurs of art to make sure that it serves a purpose” అంటాడు. వీళ్ళ చర్చలో ఉంటే మోరల్ స్టోరీ, లేకుంటే ఇమ్మోరల్ స్టోరీ అని రెండే రకాలు ఉన్నట్లు ఉన్నా కూడా నా దృష్టిలో అలా కాదు కనుక, నాకు ఈ వాక్యం చదువుతూ ఉంటే. “It must blossom freely and pleasurably ” అన్న భాగం చాలా కరెక్టనిపించింది.
“That’s good. If you ride on a moral high horse, and create only allegories, I don’t have to tell you about the outcome. People will be happy without reading them.”
ఔను నిజం ఔను నిజం! 🙂

నన్ను ఏళ్ళ తరబడి పట్టి పీడిస్తున్న సందేహం ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఈ కథలోని భార్య పాత్ర ద్వారా:
“I’m saying that only when you write stories with moral values, their worth heightens. And people will welcome them. Not only Telugu people but others also translate them into their languages and read them. Look at the stories of Tolstoy and Premchand. Aren’t they getting translated into Telugu? Why did they receive that kind of attention? “
-అంటే, మోరల్ స్టోరీలు తప్ప వేరే భాషల్లోకి అనువాదం కావా? అంటే, మన కథలు ఇతర భాషల్లోకి అంత విరివిగా అనువాదం కాకపోడానికి కారణం ఇదా? నాకు ఈ జవాబు అంత నమ్మదగ్గదిగా లేదు. వేరే భాషల్లోకి అనువాదాలయ్యే కథలన్నీ ఇలా గొప్ప విలువలున్నవేనా? అలా అంటే, “విలువలు” అన్న పదం కిందకి ఏమేమి వస్తాయి?

ఈ కథ చదివినప్పట్నుంచీ ఇవే సందేహాలు నాలో. అన్నింటికంటే సూటిగా తగిలినది ఈ చివరి వాక్యం!
ఎంతకీ తెగడంలేదు ఆలోచనలు.

ఎప్పుడో నలభైల్లో రాసిన ఈ కథ ఇప్పుడు చదివినా కూడా ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయంటే… ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు…

Advertisements
Published in: on August 17, 2009 at 2:35 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/08/17/katha-itla-undale/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. >> “’Every story must include a truth of ethical or scientific value. It is only then the writer’s effort is rewarded”

  I differ, too. సందేశాలివ్వటానికి కథలే అక్కర్లేదు.

 2. మూల సమస్య ఈ నిర్వచనాలదీ,సిద్ధాంతాలదీనూ!

  కథ ఒక erratic ఆలోచన ఎందుకు కాకూడదు? చలం. కథ ఒక స్వీయానుభవానికి విశ్లేషణ ఎందుకు కాకూడదు? గోపీచంద్. కథ ఒక జీవిత ప్రార్శ్వం ఎందుకు కాకూడదు? నామిని. కథ ఒక కుటుంబ ఘటన ఎందుకు కాకూడదు? కొకు.

  ఇన్ని కథకాని మహత్తరమైన కథల ఉదాహరణలు మనకుండగా ఇంకా కథల్ని నిర్వచిస్తామంటారేమిటి! నాన్సెస్!!!

 3. మీరు లేవనెత్తిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.
  పాఠకులు అనుభూతి చెందే ప్రతి కధా ఉత్తమ కధే. అది హాస్యమా, కరుణ, ప్రేమలతో నిండినదా, మానవత్వపు విలువలను చూపేదా, ఇంకా మరేదైనా అంశాన్ని స్ప్రుసించేదైనా అనుభూతి చెందగలిగితే చాలు.
  కధ ఇలా ఉండాలి అని నిర్వచించటం చాలా కష్టం.
  //’Every story must include a truth of ethical or scientific value. It is only then the writer’s effort is rewarded
  అవును, దీని కోసం కధే వ్రాయనక్కరలేదు. ఏదైనా వ్యాసం వ్రాస్తే సరిపోతుంది. రచయిత ఒక ప్రవక్త లాగ నీతి బోధ, కధ ద్వారా సూటిగా చేస్తే అది ఎక్కువమంది పాఠకులకు చేరదనుకుంటా.
  అదే కధలో అంతర్లీనంగా ఉండి, పాఠకులను ఆలోచింప చేయగలిగినపుడు అనుభూతితో పాటు సాంఘిక ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది.

  ఇక విలువలు అనేవాటిని కూడా నిర్వచించటం కష్టం. కొందరికి వ్యక్తి నియమాలు ముఖ్యం, కొందరు సమాజం కోసం తమ వ్యక్తిగత సుఖాన్ని కూడా త్యాగం చేస్తారు. ఇవి కాలంతో పాటు మారుతుంటాయి కూడా. విలువలు సాపేక్షమైనవి.

  పాఠకులను ఆలోచింపచేసేవే అత్యుత్తమ కధలు అని నేననుకుంటాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: