విద్యావ్యవస్థలో విప్లవం తేగల “ఈపాడ్ లు”

సాంకేతికాభివృద్ధి ఎందుకు? అన్న ప్రశ్న నాకు కలిగినప్పుడల్లా నాకు నేను చెప్పుకునే సమాధానం, నేను బలంగా నమ్మే సమాధానం – మనిషి మేధస్సును అర్థం చేసుకునేందుకు కాదు, మనిషి బ్రతుకు సులభతరం చేయడానికి – అని. ఇది సరైన అభిప్రాయమా? కాదా? అన్న చర్చ పక్కన పెడితే, ఇటీవలి MIT Technology Review వారి ఇండియన్ ఎడిషన్ జులైనెల సంచికలో ఒక వ్యాసం చదివాను. “సాంకేతికాభివృద్ధి ఇందుకు” అనిపించింది. ఇదొక్కటే ఉదంతం అని నా ఉద్దేశ్యం కాదు. కానీ, ఇలాంటి ఉదంతాలకి నా వంతు ప్రచారం నేను కల్పిస్తే, మీ వంతు ప్రచారం మీరు చేస్తే, వారికి ప్రోత్సాహంగా ఉండటమే కాదు. ఏదో చేయాలనుకుని, చేయలేక, నిస్పృహతో పరిస్థితుల్ని నిందించే వారికి మేలుకొలుపుగానూ, సాంకేతికతను జన బాహుళ్యానికి మేలు చేకూర్చడానికి ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించే వారికీ ప్రోత్సాహకరంగా ఉంటుందనిపించింది.

విషయానికొస్తే – పాఠశాలలో చెప్పే పాఠాలను ఈ-పాడ్ అనబడు ఐపాడ్ తరహా పరికరం సహాయంతో విద్యార్థులకి అందించడం. ఇది మొదట అమెరికాలో అమెరికన్ విద్యార్థులకే మొదలైనా కూడా, ఈ వార్తాంశం ఇది భారద్దేశంలోని ఓ మారుమూల పల్లెకి దీన్ని ఎలా చేర్చారు, దాని వల్ల పిల్లలకి కలిగిన లాభమేమిటి? అన్న విషయం గురించి చెప్పింది. ఇది సోలార్ పవర్ తో నడుస్తుందట. వివరాలు ఆ వ్యాసంలో ఉన్నాయి.

“ePod is set to bring about a renaissance in the way education is administered and managed, especially in rural and government schools with inadequate infrastructure.”
“The impact of this technological innovation will be felt few years from now when millions of Nagarajs get to take home their ePODs. “

-ఈ ప్రయత్నం విజయవంతంగా మన దేశంలోని పాఠశాలల్లో – ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆచరింపబడితే, మన విద్యావ్యవస్థలో మార్పు రాగలదేమో. అలాగే, ఎక్కువ మందిని చదువుకునే దిశగా లాగగలదేమో.

Published in: on July 28, 2009 at 10:30 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/07/28/epods-for-education/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. “ఈ పాడ్ “, పిల్లలను ఆకర్షించి స్కూల్ వరకు రప్పించగలదేమో కానీ, వాళ్ళళ్ళో సృజనాత్మకతను, అలోచనను పెంపొందించగలదంటారా? కొంత మానసిక పరిపక్వత వచ్చాక ఉపయోగిస్తే పర్వాలేదు కానీ, మరీ చిన్నప్పుడే అంటే ఏకీభవించలేకుండా ఉన్నాను.

 2. @Venkat:
  నా ఉద్దేశ్యంలో పిల్లల్ని స్కూల్ కి రప్పించడం కంటే కూడా ఈ ఈపాడ్ ల ఉపయోగం ఇంకోటి ఉంది. పాఠాలను తమకి కావాల్సినప్పుడు, కావాల్సినన్ని సార్లు, మళ్ళీ మళ్ళీ వినవచ్చు కదా! కాస్త నెమ్మదిగా నేర్చుకునేవారికి, క్లాసులో ఒకసారి చెప్పి వదిలేస్తే అర్థం కాక అయోమయానికి గురయ్యేవారికి – ఇది ఎంత ఉపయోగకరమో ఆలోచించండి 🙂

  సృజనాత్మకత – ఈపాడ్లతో సృజనాత్మకత ఏ విధంగా సాధ్యమంటారు? నాకు అర్థం కాలేదు. From what I understood, what were put on EPods were not “interactive lessons”.

 3. నేను ‘ఈ పాడ్’ తో, సృజనాత్మకత సాధ్యమనలేదు. అది వాడటం వలన పిల్లల్లో ఆలోచనా శక్తి నశిస్తుందన్నాను. ఉపాధ్యాయుడు ఎదురుగా నిలబడి, ప్రశ్నలు వేస్తూంటేనే వాళ్ళళ్ళో ఆలొచనా శక్తి పెరుగుతుందని నా నమ్మకం.
  మీరన్నట్లు ఈ పాడ్ తో చెప్పిన పాఠాలను మళ్ళీ మళ్ళీ వినటానికి ఉపయోగ పడొచ్చు.

  “ఈ పాడ్” ని వాడటం బదులు, బోధనా విధానాల్లోనే మార్పులు తీసుకు రావాలి. ఈ పాడ్ వినియోగం ప్రాధమిక విద్యలో ఉండకూడదనుకుంటునాను.

 4. వెంకట్ గారికి:
  >>అది వాడటం వలన పిల్లల్లో ఆలోచనా శక్తి నశిస్తుందన్నాను.
  – నాకు ఇంకోలా అనిపిస్తోంది. ఇది నిజంగా జరుగుతుందో లేదో చెప్పలేను. పిల్లలు క్లాసులో సరిగ్గా వినకపోయినా, ఇంటికెళ్ళాక మళ్ళీ ఈపాడ్ లో విన్నాక, సందేహాలు కలగొచ్చు. తరువాతి రోజు క్లాసులో కాసేపు నిన్నటి క్లాసు పై చర్చ సెషన్ పెట్టుకుంటే, పిల్లలు-టీచర్లూ – ఇద్దరి ఆలోచనా శాక్తీ పెరుగుతుందేమో కదా….

  బోధన పద్ధతుల్లో మార్పు కీ, ఈపాడ్ కీ సంబంధం లేదనిపిస్తుంది నాకైతే. ఈపాడ్ ను క్లాస్‌రూం కు ఆల్టర్నేటివ్ అన్నట్లు మొదలుపెట్టలేదు కదా…

  ప్రాధమిక విద్య లో… ఎనిమిది తొమ్మిది ఆ తరగతుల వారి పై ప్రయోగించినట్లు ఉన్నారు..

 5. ఈ-పాడ్ లాంటి పరికరాలను పాఠశాలలో ప్రవేశపెట్టే ముందు

  ఏది తేలిక పద్ధతి అని కాకుండా ఏది నాణ్యమైన పద్ధతి అని ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకోగలం.

  పిల్లల శారీరక, మానసిక పరిణతికి సరి అయిన బీజాలు ఈ పాఠశాల స్థాయిలోనే పడాలి.

  ఈ-పాడ్ విధానం పిల్లల మానసిక శక్తిని పెంచేదిగా కాక, వారికి తేలికగా పాఠాలను నేర్పించేదిగా మాత్రమే తోస్తున్నది.

  ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి: రోజూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎక్కువదూరం సులువుగా ప్రయాణించాలంటే బైకే మంచిది. అలా బైక్ ని ఎంచుకున్న వారు ఆరొగ్యానికై జిమ్ములకి వెళ్తున్నారు.

  అలాగే ఈ-పాడ్ ప్రయోగం వల్ల పిల్లలు ఏమి కోల్పోతున్నారో… ఏమి పొందుతున్నారో… తెలుసుకుని, ఆ కోల్పోయే వాటికి తగిన ప్రత్యామ్నాయాలు ఆలోచించి ముందడుగు వేస్తే ఈ-పాడ్ “ఈ-కాలానికి” మంచి ప్రయోగమే అవుతుంది.

  ఏది ఏమైనా పిల్లలు మాత్రం ప్రయోగ వస్తువులు కాకుండా చూసుకోవాలి.

  మంచి విషయంపై ఆలోచింప చేసినందుకు ధన్యవాదములు 🙂

 6. sowmya:

  ee essay original link ivvagalaraa?

  afsar

 7. @Afsar garu:
  Link is there in the post. Anyways, here it is:
  http://www.ciol.com/News/News-Reports/Solar-powered-ePOD-to-revolutionize-education/13709122200/0/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: