నిశ్యాలోచనాపథం-12

పోయిన్సారి సూసైడ్ చేస్కోను అని ఆవిడగారు..అదే, మన నిశీనిస్ మాటిచ్చి వెళ్ళిపోయిందే కానీ, నాకు అప్పట్నుంచీ నిద్రలేదు. తను సూసైడ్ చేస్కుంటుందేమో అన్న బాధో, అసలు తనకి అంత సమస్యలేమున్నాయి? అన్న అనుమానమో (కుతూహలమా??), ఆమె చస్తానంటే నాకు ఏంటో? అన్న ప్రశ్నా… అసలు ఎవరన్నా ఎందుకు సూసైడ్ చేస్కోవాలి? చేస్కుంటే నాకెందుకు? చేస్కోకుంటే నాకెందుకు? ఎవరిష్టం వాళ్ళది – అన్న భావన ఒకవైపూ, “చా! ఒక మనిషి అలా చేయబోతోందని తెలిసి కూడా ఆపే ప్రయత్నం చేయవా?” అన్న భావన ఒకవైపూ.. ఇలా యమ యాతనగా ఉండింది. రాత్రుళ్ళు నిద్రే పట్టదే! పగలు ఆఫీసులో కూడా కునికిపాట్లు పడుతూ ఇవే ఆలోచనలు. ఓ నాలుగైదు రోజులు ఇలాగే మనసంతా గజిబిజిగా ఉండి రాత్రి గదిలోనే ఉండిపోయాను. ఆలోచనలు ఊడలమర్రిలా బైటకి చొచ్చుకొచ్చి నన్ను కట్టిపడేశాయి మరి.

ఆరోరోజుకి కాస్త తేరుకున్నాను. ఆవేశమూ, గందరగోళమూ, మనసులోని గజిబిజీ కాస్త చల్లబడ్డాయి. వీకెండని పగలు కాస్త విశ్రమించగలిగాను. దాంతో రాత్రి ఏసీపీ ప్రద్యుమ్న ను, అతని అమోఘ తెలివితేటల్నీ, అతని కవళికలనూ చూసేసి, తరించేసి ఇంట్లోంచి బయటపడ్డా (వివరాలకి: ఇక్కడ చూడండి) అదేమి వింతో కానీ, నాదీ, నిశి ది దారులెప్పుడు కలుస్తూనే ఉంటాయి. మేమిద్దరం సమాంతరంగా వెళ్ళే intersecting lines అని అనిపిస్తుంది నాకు ఎప్పుడూ 😉 కలిసి విడిపోడం, విడిపోయినట్లే ఉండి మళ్ళీ కలవడం మాకు అలవాటైపోయింది ఇప్పటికి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఎప్పట్లాగే, నాకు తను కనబడ్డది. “హహహ్హాయ్!” అని ఆవేశంతోనూ, ఆరాటంతోనూ ఒత్తి మరీ చెబుతూ తనవైపుకి వెళ్ళాను. “హెలో!” అన్నది. “పొలో!” అందామనుకుని తన ఫేస్ చూసి ఆగాను. కాస్త డల్గా అనిపించింది. కరువు బాధితురాలిలా ఉంది మొహం. కళ్ళు మాత్రం రెండు మూడు రోజులుగా పగలంతా నిద్రపోనట్లు ఉన్నాయి.

“హే! ఏమిటీ సంగతులు?” అన్నా.
“నువ్వేంటి నాలుగైదురోజులు కనబళ్ళేదు?”
“ఏదో హెల్త్ బాలేదు…”
కొన్ని క్షణాల మౌనం. దాంతో మళ్ళీ నేనే…
“అద్సరే కానీ, ఏంటి అలా ఐపోయావ్? సరిగా తింటున్నావా? సరిగా పడుకుంటున్నావా?” అన్నాను.
“ఏమో, నాకు ఆసక్తి తగ్గింది తినడం పై. నిద్రంటావా.. రాత్రంతా ఎవరో తరుముతున్నట్లు రోడ్లపై పరుగులు తీస్తూ ఉంటున్నాను…దేనికో అర్థం కావట్లేదు. పగలంతా నిద్ర మానేసి, ఎందుకా పరుగు? అని ఆలోచిస్తున్నాను. అందుకే కళ్ళు నీకు తేడాగా కనిపిస్తున్నాయి ఏమో…”
“మరి జవాబు తెలిసిందా? ఈ పరుగెందుకో అర్థమైందా?” అన్నాను.
“అదే తెలిస్తే, నేనిక్కడెందుకుంటాను? ఇప్పటికే ఫిలాసఫీ లెక్చర్లిస్తూ ఉండేదాన్ని.”
అప్పటిగ్గానీ నాకు ఆమె వేదాంతం అర్థం కాలేదు. “అబ్బో! ఫిలాసఫీ..మనకంత సీన్ లేదు. అర్థం కాదు.” అనుకుని, పైకి మాత్రం – “చూడమ్మాయ్! మానవ భాష అనేది తెలుసుకదా..అది వాడొచ్చు కదా!” అన్నా.

“నేను చెప్పాలనుకున్నది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకు తెలిసిన భాషే చాలట్లేదో, లేక ఈ సంఘర్షణలు ఏదో ఓ భాష పదాల్లో బందీ కావడం కుదరదో నాకు అర్థం కావట్లేదు. పదాలన్నీ గ్రహాల్లా నా చుట్టూ తిరుగుతున్నాయి. ఏది ఎంచుకుని చేతిలోకి తీసుకోవాలో తెలీక శూన్యంలో చేతులు చాపుకు నిలబడ్డట్లు అనిపిస్తోంది. నా వివేకానికి గ్రహణం పట్టినట్లు ఉంది”
“వివేకానికి గ్రహణం….. మైండ్ బ్లాకవడం అని మామూలు పోకిరీ భాషలో అనొచ్చుగా! నీకే వచ్చు మహా భాష!” చిర్రెత్తుకొచ్చింది నాకీ కవిత్వానికి అప్పటికే.
“సమస్యల వలయంలో ఉన్నప్పుడు భాషని కూడా అలా వలయంలా చేయడం సహజమే అని నాకనిపిస్తుంది. సింపుల్ సొల్యూషన్స్ నాకు నచ్చట్లేదు ఈ మధ్య” అన్నది దానికి కూడా.
“మూడింది ఈ పిల్లకి. పోయేకాలం!” అనుకున్నా కసిగా. ఇదే డైలాగు ఈవిడైతే ఓ ముప్ఫై లైన్లలో చిన్నగా చెప్పేసేదేమో!
“వదిలేయి నన్ను, ప్లీజ్! ఎందుకు నాకోసం రావడం, నాతో స్నేహం పెంచుకోడం? నాకు ఎవర్తోనూ మాట్లాడాలని లేదు.” అంది మళ్ళీ తనే.
ఇంతసేపు చిరాకు పుట్టినా మళ్ళీ తను ఇలా అనడంతో తన గురించి బెంగ కలిగింది. ఏమౌతోందీ మనిషి అని. తిక్కతిక్కగా మాట్లాడితే మనం మహా తిక్కగా మాట్లాడాలి కానీ, వదిలేసి పోతే ఎలా? అలా చేయకూడదు..అనిపించింది.

“అలా కాదు నిశీ! అసలు సమస్యేమిటో చెప్పకపోతే ఎలా అర్థమౌతుంది నాకు? నేనేదో దాన్ని పరిష్కరిస్తా అని కాదు, ‘నిద్రలేమి’ అన్న చిన్న సమస్యనే చూస్కోలేని నేను నీ సమస్య ఎలా అర్థం చేసుకుంటా? అనుకోకు. అర్థం చేసుకుంటానో లేదో వింటే కదా తెలిసేది.” -అన్నా. ఇంత సీరియస్ భారీ డైలాగులు మన మొహానికి సూట్ కావు అని తెలిసినా కూడా. అప్పుడు తను చెప్పడం మొదలుపెట్టింది.

(ఏం చెప్పిందో అది నేను మీకు వచ్చే ఎపిసోడ్ లో చెప్పడం మొదలుపెడతాను. హీహీ) 🙂

Advertisements
Published in: on July 23, 2009 at 11:10 am  Comments (9)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/07/23/nisyalochanapatham-12/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. Very Funny! Looking forward for the next posts in the series.

 2. ఈ చీకటి ఆలోచనల్లో కావాలని హాస్యాన్ని సృష్టిస్తున్నారా లేక ఇలా హాస్యం గానే అలోచిస్తారా?
  ఏమైనా మీ రచనల్లో సృజనాత్మకత ఉంది.

 3. @వెంకటరమణ: నా ఆలోచనాస్రవంతే మీకు నవ్వులాటైపోయిందనమాట 😉
  (Just kidding. no offence meant. ఈపాటికి మీకు నేను హాస్యంగా ఆలోచిస్తానో, హాస్యంతో ఆలోచిస్తానో…లేక హాస్యమే నన్ను ఆలోచిస్తుందో అర్థమైంది అనుకుంటా..హీహీ.)
  @Purnima: Look Look 😉

 4. రాను రాను కళ్లకి కట్టినట్టు వుంటున్నాయి దృశ్యాలు. నీకథనం నాకు చాలా నచ్చింది.తరవాతిభాగం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదిక్కుగా ఈ పయనం? ఏతీరానికి?

 5. సౌమ్య గారు. ఈ మధ్యనే మీ ‘నిశ్యాలోచనాపధం ‘ చివరి పోష్టులు చూశాను. ఆసక్తితో , మిగతా పాత టపాలను చదివాను. ఇవన్నీ చదివాక, నాకు పూర్తిగా అర్ధమవ్వలేదు. నాకు అనిపించిందేమిటంటే, రకరకాల అలోచనలకు, మానసిక అశాంతికి, కొంత కల్పన, కొంత హాస్యం జోడించి రాశారనిపిస్తుంది. అందుకే సందేహంతో అడిగాను.
  వ్యక్తిగత స్వేచ్చను కోరుకుంటే తప్ప ఇలాంటి అలోచనలు రావని నా నమ్మకం.

 6. @Malathi garu: I did not think about the end yet 🙂 Just going randomly. 😉
  @Venkata Ramana : You are right 🙂 Perfect 🙂

 7. సౌమ్య గారు, ఈ ‘నిశ్యాలోచనాపధం ‘ రచనల్లో నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. ధన్యవాదాలు.
  అశాంతి ని పారద్రోలటానికి నిరంతరం చేస్తూన్న ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. శుభమస్తు.

 8. నా నిద్రా సమయం సాధారణ పరిస్థితుల్లో 5:AM to 12:pm. ఈ నిశాచరత్వం కూడా కొన్నిసార్లు బాగుంటుంది. ఐడియాలు అప్పుడే ఫ్లో అవుతుంటాయి మరి.

  “మేమిద్దరం సమాంతరంగా వెళ్ళే intersecting lines అని అనిపిస్తుంది నాకు ఎప్పుడూ”

  LOL

 9. 🙂

 10. […] మీకు వివరంగా చెబుదామని. ఎక్కడ ఆగామూ పన్నెండో భాగంలో…. నిశీనిశ్ ఎందుకు ఆత్మహత్య […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: