నిశ్యాలోచనాపథం-11

నిశీనిశ్ ఆత్మహత్య అన్నది. ఎందుకూ అని విషయం తెలుసుకునేలోపు ఫోనొచ్చి ఆమె ఎగిరిపోయింది. దానితో ఆపేసాను మొన్నామధ్య (ఇక్కడ.)

తాను వెళ్ళిపోయిందే కానీ, నా ఆలోచనల నిండా నిండిపోయింది. పగలైనప్పటి నుండీ రాత్రెప్పుడౌతుందా అని ఎదురుచూస్తూ గడిపాను. అన్నట్లు, నిశీకి ఫోనుంది కదా – మనం నంబర్ కనుక్కుని ఉండాల్సింది కదా, అనిపించింది. నేను కాసేపు అటూ ఇటూ తిరిగినా కూడా మనిషి కనబళ్ళేదు. దానితో నాకు అనుమానమొచ్చింది – ఏమన్నా చేస్కుందేమో అని. భయమేసింది. కానీ, ఇంతలో తను కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాను.
“హల్లో… ఏమిటంత టెన్షన్ గా ఉన్నావు?”
“ఏడ్చినట్లే ఉంది. సూసైడ్ అదీ ఇదీ అని వెళ్ళిపోయావ్ గా నిన్న. ఆ మాత్రం టెన్షన్ ఉండదా?”
“అంటే, నేనొస్తూ ఉంటే చూసి నేనా, దయ్యమా అర్థం కాలేదా?” (వెధవ నవ్వొకటి!)
“పోవమ్మా! ఏదో ఫ్రెండువి కదా అని దిగులు పడితే, నువ్వూ నీ చీకటి హాస్యాలూనూ!”
“సారీ, సారీ…ఇంకోసారి అనన్లే…”

“సర్లే, ఏమిటీ నిన్న సూసైడూ సీసైడూ అని ఏవేవో అన్నావు?” డైరెక్టుగా టపిక్ లోకి వచ్చేస్తూ అన్నాన్నేను.
“చేస్కోవాలనే అనుకున్నా కానీ, ఎలా? అన్నది అర్థం కాలేదు. పొద్దున్న కూడా కాసేపు గూగుల్ సర్చ్ కొట్టాను. కాసేపు కెలికాను కానీ, నాకు కావాల్సిన సమాచారం దొరకలేదు.”
(దిక్కుమాలిన ఇంటర్నెట్. ప్రద్దానికీ ఇదోటి తయారైంది.. అని మనసులో తిట్టుకుంటూ…) “నీ తలకాయ. సమస్యుంటే సూసైడ్ చేస్కోడమేనా? అలా ఐతే, ప్రపంచంలో అందరూ ఏదో ఓ టైంలో చస్తారు.” అన్నా కోపంగా.
“ఔను, అందరూ ఏదో ఓ టైంలో చస్తారుగా.”

“గొప్ప తెలివి చూపావులే. నా ఉద్దేశ్యం అందరూ ఆత్మహత్యలు చేసుకుని ఉండాల్సిందని.”
“ఎవరూ చేస్కోలేదని నేను చేస్కోకూడదా? ఎవరూ పుట్టించనిదే మాటలెలా పుడతాయి? ఎవరో ఒకరు దారి చూపనిదే ఆ దారి జనాలకి ఎలా తెలుస్తుంది?” అంది తను, చిద్విలాసంగా నవ్వుతూ.
“నీకేంటి దారి చూపిన దేవత అని చరిత్రలో నిలిచిపోవాలనుందా? దానికి వేరే మార్గాలున్నాయి. ఇలాంటి దిక్కుమాలిన మార్గాలకన్నా మంచి మార్గాలే లేవా?”
“నేనేం దొంగతనాలు చేస్తున్నానా? మర్డర్లు చేస్తున్నానా? అంత చెడ్డపనేం కాదే ఆత్మహత్య?”
“ఎవరన్నారు చెడ్డపని కాదు అని?”
“ఎవరన్నారు మంచిపని కాదు అని?” – ఎదురు ప్రశ్నించింది.
“మంచి పనికాదు అనలేదు అంటే మంచి పని అనా?”
“చెడ్డపని కాదు అనలేదు అంటే, చెడ్డ పని అనా?” – మళ్ళీ అదే మొండితనం.

ఇలా తల తిక్కగా మాట్లాడేసరికి నాకు ఏం అనాలో తోచలేదు. ఏదో కాస్త ఆ దారి మళ్ళిద్దామని:
“కనీసం అది చట్టరిత్యా నేరం అని తెలీదా?”
“నేనే పోయాక అది నేరమైతే నాకేంటి, ఘోరమైతే నాకేంటి?”
“నువ్వు ఇలా చేస్తే, మీవాళ్ళ సంగతేంటి..ఎంత బాధపడతారో ఆలోచించావా?”
“నీకసలు నా కథా కమామిషూ ఎప్పుడన్నా చెప్పానా? నాకు నా అన్నవాళ్ళెవరూ లేరు.”
“నేనేమీ కానా?” కాస్త కోపం వచ్చేసింది ఆ పాటికి నాకు. ఇన్నాళ్ళ పరిచయాన్ని ఒక్కమాటలో తేల్చేసినందుకు చాలా బాధ కలిగింది.
“అమ్మాయ్! నేను చస్తే ఓ రోజు బాధపడతావ్..రెండ్రోజులు పడతావ్.మూడోరోజుకి నీ బ్రతుకు నువ్వు బ్రతకవూ? అసలే నేను లేకపోతే చావు తప్ప వేరే మార్గం లేనివారుంటారే… వారికి చావాలన్న కోరిక లేకుంటే నేను చావను. ఎందుకంటే, నా చావు వల్ల వల్ల వాళ్ళ చావు ఇష్టం లేకున్నా చావాల్సి వస్తుంది కనుక.”
(అబ్బో! ఎన్ని చావులున్నాయో ఈ వాక్యంలో! అనుకుని..పైకి మాత్రం)
“బాగుందమ్మా, మంచి విశాల హృదయం అనమాట” అన్నా వ్యంగ్యంగా.

“నువ్వెలా అనుకున్నా ఇది నా అభిప్రాయం”
“నాకు నీ అభిప్రాయం నచ్చలేదు” అన్నా పళ్ళు కొరుకుతూ.
“నిన్ను చేస్కొమ్మని నేను అనలేదు కదా. నా ఇష్టమొచ్చింది నేను చేస్కుంటా”
“చంపుతా ఇంకోసారి అన్నావంటే”
“అదేకదా నాక్కావలసింది కూడా!” అన్నది తను
సరిగ్గా అప్పుడే మళ్ళీ – “ఆజ్ పురానీ రాహో సే…” అని మొదలౌతున్నప్పుడు గబుక్కున నిశీ చెయ్యి గట్టిగా పట్టేస్కున్నా.
“వదులు, వెళ్ళాలి. ఫోను.”
“నా అన్నవాళ్ళే లేనప్పుడు ఫోనెక్కడిది?”
“నీలాంటి స్నేహితులే. కాకుంటే, పగలు నేను బ్రతికున్నానా లేదా చెక్ చేసే స్నేహితులు.”
“నీ వాలకం చూస్తే వాళ్ళకీ అనుమానం వచ్చుంటుంది. నువ్వు పగలేం చేసావో అని నేను వర్రీ అయినట్లు, వాళ్ళు నువ్వు రాత్రేం చేస్తున్నావో అని వర్రీ అయి ఉంటారు.”
“ఏంటో, ఈ కన్సర్న్ కు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు.” అన్నది దిగులుగా.
“చాల్లే వెధవ దిగులూ నువ్వూనూ!”
ఇంతలో, ఫోను మళ్ళీ మ్రోగింది.
“అమ్మాయ్! ఫోనులొస్తున్నాయంటే పగలౌతోందని అర్థం. నేనెళ్ళిపోవాలి…” బ్రతిమాలుతున్నట్లు అనింది నిశి.
“అయితే, మన చర్చ తెమిలి, నన్ను నీ ఆత్మహత్యకి ఒప్పించేదాకా నువ్వేం చేయనని మాటివ్వు” అన్నా.
ఆశ్చర్యం! మాటిచ్చి కదిలింది. తను వెళ్ళిన దిశలోనే చూస్తూ ఉన్నా…తనై ఫాలో ఔదాం అనుకుంటూ ఓ అడుగు ముందుకేశాను. ఇంతలో మా అమ్మొచ్చి దుప్పటి లాగేసి, టైమైపోతోంది లే లెమ్మని..లేపేసింది 😦

Advertisements
Published in: on July 11, 2009 at 8:03 pm  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/07/11/nisyalochanapatham-11/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. సూసైడూ – సీసైడూ: Interesting to toy with!

  చీకటి హాస్యాలూ – ఈ మధ్యకాలంలో చదివే పుస్తకాల వల్లనేమో, నాకు హాస్యం పుట్టడానికి చీకటి చాలా అవసరం అనిపిస్తోంది. ఇదో..ఇది చూడు:

  Perhaps I know best why it is man alone who laughs; he alone suffers so deeply that he had to invent laughter.
  Friedrich Nietzsche

  Laughter is invented. Few invent it more often than others and they are supposedly, the “happy” people.

  Interesting post! Would love to see where is this all going.

 2. Very racy. So, dark humor in darker times. Eh? 🙂 ఈసారి ఒక స్మైలీనే ఉంచారే?

  “నేను లేకపోతే చావు తప్ప వేరే మార్గం లేనివారుంటారే… వారికి చావాలన్న కోరిక లేకుంటే నేను చావను. ఎందుకంటే, నా చావు వల్ల వల్ల వాళ్ళ చావు ఇష్టం లేకున్నా చావాల్సి వస్తుంది కనుక.”” Funny.

  The narration is racy. ThankQ for coming quickly sis.

 3. @గీతాచార్య: గమనించనేలేదు..ఈసారి స్మైలీలు లేవని. అయినా, ఆత్మహత్యల గురించి చర్చిస్తున్నప్పుడు ఇటు పది వాక్యాలూ, అటు పదివాక్యాలూ నవ్వరాదు. నవ్వామంటే మనల్ని అనుమానిస్తారు. 😉

 4. బాగానే వుంది. మంచి స్నేహితురాలే దొరికింది. నాక్కూడా కాస్త ఎడ్రెస్ ఇద్దూ. నాకూ ఇలాటి ఆలోచనలే అస్తమానం 🙂

 5. “ఆత్మహత్యల గురించి చర్చిస్తున్నప్పుడు ఇటు పది వాక్యాలూ, అటు పదివాక్యాలూ నవ్వరాదు. నవ్వామంటే మనల్ని అనుమానిస్తారు.”

  మొత్తం టపా ఒక ఎత్తు, ఇది మాత్రం ఒక ఎత్తు. కేకో కేక!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: