పుస్తక భాండాగారాల వేటలో..

పుస్తకం.నెట్ కోసమని జూన్ నెలలో పుస్తకాల షాపులకు బానే తిరిగాము. ఆ తరువాత ఆన్లైన్ లో కూడా జల్లెడ పట్టడం మొదలుపెట్టాము. ఒక విధంగా, ఈ నెలలో చేసిన ఈ ఇంటర్వ్యూలు నాకు పూర్తి కొత్త అనుభవం. అసలు ఇవి ఎందుకు చేయాలనిపించింది? అంటే ఏం చెప్పేది? నాకు కథలు వినడం అంటే ఇష్టం. చదవడం అంటే కూడా ఇష్టమే కానీ, మనుషుల్ని కదిలించి, వారి నోటి నుండి వారి కథలు వినడం – నథింగ్ బీట్స్ ఇట్. 1997 లో మన స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళైనప్పుడు నాకు తెలిసిన అరవైల్లో ఉన్నవారినందరినీ ఇలాగే బగ్ చేసిన విషయం ఇంకా గుర్తుంది. సరే, మనం విన్న కథలే ఇంకా చాలా మందికి కూడా ఆసక్తికరంగా అనిపించవచ్చు అనిపించి – అలా ఈ ఇంటర్వ్యూలు చేయడం, మాటామంతీ కార్యక్రమంలో నేనూ భాగం పంచుకున్నాను.

హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ళుగా ఉన్న కదంబి, ఏ.ఏ.హుస్సేన్, విశాలాంధ్ర, అబిడ్స్ మార్కెట్ వారితో మాట్లాడటం చాలా మంచి అనుభవం అనే చెప్పాలి. ఎప్పుడూ షాపులకి వెళ్ళడం, పుస్తకాలు తీస్కోడం రావడమే కానీ, వాళ్ళ తరపు కథ వినలేదు. పుస్తకం.నెట్ నాకు ఆ అవకాశం కలిగించిందన్నమాట ఇన్నేళ్ళకి 🙂 ఆమధ్య ఆఫీసు లో ఒక సంస్థ పిల్లల పుస్తకాల ప్రదర్శన పెట్టగానే, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు పిల్లల పుస్తకాల ముద్రణ గురించి ఎన్నో సంగతులు తెలిసాయి. అలాగే, యూఎస్ లోని కాంటన్ పబ్లిక్ లైబ్రరీ గురించి రచ్చబండ గుంపులో అనుకుంటా, ఓ వేగు చదివి, దాని ద్వారా వారిని ఈమెయిల్ ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు కొత్త అనుభవం. మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళకి భారతీయ భాషల పుస్తకాలను పంపే డీకేఏజన్సీస్ వివరాలు కనుక్కుని వారితో కూడా సంభాషించడం – అక్కడ్నుంచి మళ్ళీ కొత్త సంస్థల గురించి తెలుసుకోడం – కొత్త ప్రపంచం కనిపించింది నాకు. నా చదువు, పని- ఇవి కాకుండా బయటి ప్రపంచంలో ఇంత మందితో ఇలా సంభాషించిన దాఖలాలు లేవు నాకు గత నాలుగైదేళ్ళలో.

పుస్తకం.నెట్ లో నేను పైన చెప్పినవి, మరికొన్నీ – ఇక్కడ చదవొచ్చు, నాలాగా మీకు జ్ఞాపకాల కబుర్లపై ఆసక్తి ఉంటే.

Published in: on July 2, 2009 at 2:41 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/07/02/on-interviews-at-pustakam-net/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. Very nice to see such book lovers. And BOL for ur future steps.

    పుస్తకం గురించిన కథలు చాలా ఉన్నాయి. ఎన్నో సంగతులున్నాయి.

    “హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ళుగా ఉన్న కదంబి, ఏ.ఏ.హుస్సేన్, విశాలాంధ్ర, అబిడ్స్ మార్కెట్ వారితో మాట్లాడటం చాలా మంచి అనుభవం అనే చెప్పాలి.”

    Recently I too had a similar experience with a small scale book vendor about his experiences, when I was in Hyd. I have a lots of info abt the book vendors of Moore Market of Madras. Those people around the Chennai central have a lots of interesting stories to tell. మనకి ఇనే ఓపిక ఉండాలే కానీ.

    Hats-off to your efforts. I wish all success to you all.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: